‘రైతు బంధు’కు సర్వం సిద్ధం | All Set For Rythu Bandhu Scheme In Telangana | Sakshi
Sakshi News home page

‘రైతు బంధు’కు సర్వం సిద్ధం

Published Wed, May 9 2018 4:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

All Set For Rythu Bandhu Scheme In Telangana - Sakshi

రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

సాక్షి, కరీంనగర్‌: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గురువారం లక్షమంది రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధు పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. రైతుల ఆర్థిక ఇబ్బందులు తీర్చడంతో పాటు ఆత్మహత్యలు నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సంకుచిత బుద్ది, కురుస పార్టీలే ఈ పథకాన్ని విమర్శిస్తున్నాయని, వారికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. రైతు రాజ్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామని ఈటల తెలిపారు.

కాగా, రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీ, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీ చేయనున్నారు. హుజూరాబాద్‌లో ఈ కార్య‌క్ర‌మం ఉదయం 10 గంటలరే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా ఉద‌యం 11.15 గంట‌ల‌కు అన్ని జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ఎకరాకు రూ. 4 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్‌బుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కనిష్ఠంగా గుంట భూమి కలిగిన వారికి కూడా ఈ పథకం కింద సాయం అందించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement