
సాక్షి, నల్లగొండ: దేశంలోనే వ్యవసాయరంగం దశాదిశ మార్చే విధంగా తెలంగాణ నిలవబోతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుబీమా పథకం చరిత్రాత్మకమైనదని తెలిపారు. బీమాతో 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, అనుకోకుండా రైతు మరణిస్తే 10 రోజుల్లోనే కుటుంబానికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందిస్తాం. ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయి. దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.