
'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా...
నెల్లూరు: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు... వాటిపై ఆందోళన అనవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలిపారు. ఓ వేళ ఆ అసెంబ్లీ ఫలితాలు తారుమారైన కేంద్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరు - నెల్లూరు నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేశారు.