‘అప్పుడే కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుంది’ | Muppavarapu Venkaiah Naidu Talks In Delhi Programme Over Agriculture | Sakshi
Sakshi News home page

‘వ్యవసాయరంగం ఆవిష్కరణలపై దృష్టి సారించాలి’

Published Tue, Aug 18 2020 7:21 PM | Last Updated on Tue, Aug 18 2020 7:24 PM

Muppavarapu Venkaiah Naidu Talks In Delhi Programme Over Agriculture - Sakshi

వెంకయ్య నాయుడు(ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో ఆవిష్కరణలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్‌ ఇన్నొవేటివ్ అచీవ్‌మెంట్స్ - 2020 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాల వేదిక ద్వారా మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సంద్భరంగా పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడం, ప్రాసెసింగ్, రవాణా తదితర అంశాల్లో వినూత్న పద్ధతుల దిశగా పరిశోధనలు సాగాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం, నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా సూచించారు. విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యతనివ్వాలని, అప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలకు.. తద్వారా కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. (చదవండి: ఉపరాష్ట్రపతిని కలిసిన సోమువీర్రాజు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement