‘చెప్పుకోలేని బాధ’పై కలెక్టర్‌కు నోటీసులు
- జారీ చేసిన బాలలహక్కుల పరిరక్షణ కమిషన్
- ‘చెప్పుకోలేని బాధ’ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు
- డిసెంబర్ 20లోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మూత్రశాలలు లేక విద్యార్థినులు ఎదుర్కొంటున్న వైనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కళాశాలలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై ఆందో ళన వ్యక్తంచేసింది. బుధవారం ’సాక్షి’లో ’చెప్పుకోలేని బాధ’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించి వివరణ ఇవ్వాల్సిం దిగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నోటీసులు జారీచేసింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి గల కారణాలపై డిసెంబర్ 20లోగా తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మూత్రశాలలు సరిగాలేని కార ణంగా విద్యార్థినుల ఆరోగ్యంపై ఏమైనా ప్రభా వం చూపిందా.. అనే విషయాన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఏళ్ల తరబడి మూత్రశాలలు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కదిలిన అధికార యంత్రాంగం
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మూత్రశాలలు లేక పడుతున్న అవస్థలను కళ్లకు కట్టినట్లు ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచు రితమైన ’చెప్పుకోలేని బాధ’ కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. జిల్లాలో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ’స్వచ్ఛ మిషన్’ చేపట్టారు. 4 రోజుల క్రితమే జిల్లాలోని హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 48 గంటల్లో 336 మరుగుదొడ్లు నిర్మించేలా చర్య లకు ఉపక్రమించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో టారుు లెట్లు లేక విద్యార్థినులు పడుతున్న అవస్థలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పరిస్థితిని వెంటనే చక్క దిద్దాలని మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్‌సింగ్ నాయక్‌ను ఆదేశించారు. ఆయన కూడా బుధవారం ఉదయం 10 గంటలకే కళా శాలలోని మూత్రశాలలపై ఆరా తీశారు. మరు గుదొడ్లకు అవుట్‌లెట్ లేకపోవ డంతో తలెత్తిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మూత్రశా లలకు నీటి సౌకర్యం కల్పించాలని సూచిం చారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించా లని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.