Girls College
-
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం' 7 వేల ఎస్జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్‌లో నియమించనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు. కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన -
తెలంగాణే నంబర్ వన్
► అందుకోసం సీఎం కేసీఆర్ కృషి ► కళాశాల ఏర్పాటుకు సత్యసాయి సంస్థ ముందుకు రావడం అభినందనీయం ► మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ► కొండపాకలో సెమీ యూనివర్సిటీకి శంకుస్థాపన ► పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీలు కొండపాక: దేశంలోనే తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టేలా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొండపాక శివారులోని ఆనంద నిలయం ట్రస్టు వృద్ధాశ్రమం ఆవరణలో సత్యసాయి సేవా సంస్థ, ప్రశాంత బాలమందిర్ ట్రస్టు (పుట్టపర్తి) ఆధ్వర్యంలో రూ.50 కోట్లతో ఇంటర్మీడియట్ బాలికల కళాశాల (సెమీ యూనివర్సిటీ) నిర్మాణానికి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పాతూరి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి వల్ల కొండపాక శివారులో బాలికల కళాశాల ఏర్పాటుకు సత్యసాయి సేవా సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలన్న ఆలోచన సత్య సాయి సేవా సంస్థకు పుట్టడం కొండపాక ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. తల్లిదండ్రులు లేని వారు అనాథలు కారన్నారు. ఆడ పిల్లలకు భగవంతుడే తల్లిదండ్రులన్నారు. ఏడాది లోపల ఇంటర్మీడియట్ విద్య అమలులోకి వచ్చేలా సేవా సంస్థ ముందుకు సాగుతుందన్నారు. విద్యతోపాటు వృత్తి విద్యాకోర్సులు కూడా ప్రవేశపెడతారన్నారు. సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి నర్సింహ్మమూర్తి మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో విద్యాలయాలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. మహా వృక్షమై ఫలాలను అందిస్తుంది. సత్య సాయి ట్రస్టు వారు ఏర్పాటు చేస్తున్న బాలికల కళాశాలలు మొక్క నుంచి మహా వృక్షాలై భవిష్యత్తులో మంచి ఫలాలు అందిస్తుందని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడం వల్ల సమాజం ఉన్నతంగా వెలిగిపోతుందన్నారు. తల్లిదండ్రులకు సేవ చేయని వారు శిక్షార్హులు.. తల్లిదండ్రులకు సేవ చేయని వారు శిక్షార్హులని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు. తల్లిదండ్రుల దీవెనలు సంతానానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. సత్యసాయి సేవా సంస్థ దూత మధు స్వామి మాట్లాడుతూ.. సమాజంలో మంచి వ్యక్తులను తయారు చేయడం కోసమే పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థ పని చేస్తుందన్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రసంగించగా, అనంత నిలయం ట్రస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘చెప్పుకోలేని బాధ’పై కలెక్టర్‌కు నోటీసులు
- జారీ చేసిన బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ - ‘చెప్పుకోలేని బాధ’ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు - డిసెంబర్ 20లోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మూత్రశాలలు లేక విద్యార్థినులు ఎదుర్కొంటున్న వైనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కళాశాలలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై ఆందో ళన వ్యక్తంచేసింది. బుధవారం ’సాక్షి’లో ’చెప్పుకోలేని బాధ’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించి వివరణ ఇవ్వాల్సిం దిగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నోటీసులు జారీచేసింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి గల కారణాలపై డిసెంబర్ 20లోగా తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మూత్రశాలలు సరిగాలేని కార ణంగా విద్యార్థినుల ఆరోగ్యంపై ఏమైనా ప్రభా వం చూపిందా.. అనే విషయాన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఏళ్ల తరబడి మూత్రశాలలు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కదిలిన అధికార యంత్రాంగం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మూత్రశాలలు లేక పడుతున్న అవస్థలను కళ్లకు కట్టినట్లు ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచు రితమైన ’చెప్పుకోలేని బాధ’ కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. జిల్లాలో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ’స్వచ్ఛ మిషన్’ చేపట్టారు. 4 రోజుల క్రితమే జిల్లాలోని హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 48 గంటల్లో 336 మరుగుదొడ్లు నిర్మించేలా చర్య లకు ఉపక్రమించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో టారుు లెట్లు లేక విద్యార్థినులు పడుతున్న అవస్థలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పరిస్థితిని వెంటనే చక్క దిద్దాలని మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్‌సింగ్ నాయక్‌ను ఆదేశించారు. ఆయన కూడా బుధవారం ఉదయం 10 గంటలకే కళా శాలలోని మూత్రశాలలపై ఆరా తీశారు. మరు గుదొడ్లకు అవుట్లెట్ లేకపోవ డంతో తలెత్తిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మూత్రశా లలకు నీటి సౌకర్యం కల్పించాలని సూచిం చారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించా లని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. -
అక్కడ ఏం జరుగుతుందో?
- కేజీబీవీ విద్యార్థినులకు రిమ్స్‌లో చికిత్స - తల్లిదండ్రుల ఆందోళన - అంతానటనే అంటున్న పీవో గార: మండలంలోని శాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌవుతుంది. బుధవారం ఐదుగురు విద్యార్థినులు శ్వాసకోశ సమస్యలతో అస్వస్థతకు గురికావడం, రిమ్స్‌లో చికిత్స పొందడం తెలిసిందే. దీన్ని మరువకముందే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరో 10 మంది విద్యార్థినులను సిబ్బంది108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది. వారందరికీ చికిత్స చేసి గురువారం పాఠశాలకు తీసుకువచ్చారు. అయితే విద్యార్థినుల పేర్లు చెప్పేందుకు సిబ్బంది మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికి అధికారులు మేల్కొని గురువారం మధ్యాహ్నం వారితో సమావేశం నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల పీవో అమరావతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇంటికి వెళ్లేందుకే నటిస్తున్నారన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడామన్నారు.