అక్కడ ఏం జరుగుతుందో?
- కేజీబీవీ విద్యార్థినులకు రిమ్స్‌లో చికిత్స
- తల్లిదండ్రుల ఆందోళన
- అంతానటనే అంటున్న పీవో
గార: మండలంలోని శాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌవుతుంది. బుధవారం ఐదుగురు విద్యార్థినులు శ్వాసకోశ సమస్యలతో అస్వస్థతకు గురికావడం, రిమ్స్‌లో చికిత్స పొందడం తెలిసిందే. దీన్ని మరువకముందే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరో 10 మంది విద్యార్థినులను సిబ్బంది108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది.
వారందరికీ చికిత్స చేసి గురువారం పాఠశాలకు తీసుకువచ్చారు. అయితే విద్యార్థినుల పేర్లు చెప్పేందుకు సిబ్బంది మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పటికి అధికారులు మేల్కొని గురువారం మధ్యాహ్నం వారితో సమావేశం నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల పీవో అమరావతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇంటికి వెళ్లేందుకే నటిస్తున్నారన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడామన్నారు.