కూకట్‌పల్లి (హైదరాబాద్): ఇంటర్ చదువుతున్న ఓ బాలిక చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...భాగ్ అమీర్ ప్రాంత వాసి అయిన షాగోలు దివ్య (17) స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం దివ్య ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. అయితే, రాత్రి అయినా తిరిగి రాకపోయే సరికి సోమవారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక అదృశ్యం అయినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.