సాక్షి, పెనగలూరు(కడప) : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్న సామెతను పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజం చేస్తున్నారు. కళాశాలను నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రతి రోజూ 12గంటలకు రావడం 3 గంటలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహకం వల్ల కళాశాలలో క్రమశిక్షణారాహిత్యం లోపిం చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఆలస్యంగా వస్తున్న ప్రిన్సిపల్‌ను సోమవారం ప్రపంచ మానవహక్కుల సంఘం పెనగలూరు మండల అధ్యక్షుడు ఎం. విశ్వనాథరెడ్డి ప్రశ్నిం చారు.
రైలుకు వస్తాను... రైలుకే వెళ్తాను. నేనొచ్చేది అంతే... అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన సమాధానం చూస్తే కళాశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రిజిష్టర్‌లో సంతకం చేసేందుకు మాత్రమే ఏదో ఒక సమయంలో వస్తున్నట్లు అర్థమైపోతోంది. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment