Penagalur
-
ఈ మాస్టారు అలా వచ్చి.. ఇలా వెళ్తాడు
సాక్షి, పెనగలూరు(కడప) : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్న సామెతను పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజం చేస్తున్నారు. కళాశాలను నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రతి రోజూ 12గంటలకు రావడం 3 గంటలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహకం వల్ల కళాశాలలో క్రమశిక్షణారాహిత్యం లోపిం చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఆలస్యంగా వస్తున్న ప్రిన్సిపల్‌ను సోమవారం ప్రపంచ మానవహక్కుల సంఘం పెనగలూరు మండల అధ్యక్షుడు ఎం. విశ్వనాథరెడ్డి ప్రశ్నిం చారు. రైలుకు వస్తాను... రైలుకే వెళ్తాను. నేనొచ్చేది అంతే... అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన సమాధానం చూస్తే కళాశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రిజిష్టర్‌లో సంతకం చేసేందుకు మాత్రమే ఏదో ఒక సమయంలో వస్తున్నట్లు అర్థమైపోతోంది. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి తెలిపారు. -
ఎంత పరీక్ష పెట్టావు తల్లీ...
సాక్షి, పెనగలూరు: పెనగలూరు మండలం కొం డూరు పంచాయతీ ఉప్పరపల్లెకు చెందిన ఓర్సు పెంచలమ్మ, తండ్రి రమణయ్య దంపతులకు ఏకైక కుమార్తె కావేరి. ఒకే కుమార్తె కావడంతో తల్లి దండ్రులు అపురూపంగా పెంచారు. ఎంతగానంటే కుమార్తె పరీక్షకు వెళుతున్నా వదిలి పెట్టలేనంతగా. పరీక్షల నేపథ్యంలో పెనగలూరు మోడల్‌స్కూల్‌కు ప్రతిరోజూ వచ్చి పరీక్షరాసి వెళుతోంది. ఏకైక కుమార్తె కావడంతో తల్లి తోడుగా వచ్చేది. రోజూ లాగానే కావేరి బుధవారం కూడా పరీక్షకు ఇంటినుంచి బయలుదేరింది. నీవు వచ్చేంతవరకు ఎదురు చూస్తుం టానమ్మా అని చెప్పి బడిబయట ఓ చెట్టుకింద కూర్చుంది. పరీక్షరాస్తున్న సమయంలో తల్లి అనంతలోకా లకు వెళ్లిపోయింది. చెట్టుకింద కూర్చున్న పెంచలమ్మకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షరాసి అనంతరం బయటకు వచ్చిన కావేరి విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, రాజంపేట: కువైట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ అధ్యక్షుడు ఇలియాస్, కువైట్ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ, బీసీలు శనివారం కువైట్‌లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన భువనగిరి సుబ్బయ్య, రేవూరు రాజగోపాల్, రేవూరు రామచంద్రయ్య, తాళ్లపాక శేఖర్, పోలూరు ప్రభాకర్, జోరోపల్లె శివయ్య తదితరులతోపాటు వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలంలోని తిరుమలరాజుపేటకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ జననేత జగన్మోహనరెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. ప్రస్తుత పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరిన సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నిరంతరం ప్రజల కోసం పడుతున్న తపన తమను ఆకర్షించిందన్నారు. ఆయన సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ చూడవచ్చన్నారు. పార్టీలోకి చేరేందుకు అవకాశం కల్పించిన బాలిరెడ్డి, నరసారెడ్డి, మహేశ్వరరెడ్డి, గోవిందు నాగరాజు, బీఎన్ సింహాలకు కృతజ్ఞతలను తెలిపారు. -
మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్
పెనగలూరు: మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతనికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలంలో చోటు చేసుకుంది. నడిమి సిద్దవరం గ్రామానికి చెందిన కోనేటి సుబ్బన్న, గంగమ్మల ఏకైక పుత్రుడు హరినాథ్(22) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు తల్లిదండ్రులు వయో వృద్ధులు కావడంతో చదువు ఆపేసి రాజంపేటలో షూమార్ట్‌లో పనిచేస్తున్నాడు. మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బయట ఉన్న తల్లిదండ్రులు గదిలోకి Ðð ళ్లి చూడగా వెళ్లగా చార్జర్ పట్టుకుని అలానే నిలబడి ఉన్నాడు. వెంటనే కింద పడిన కుమారున్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. లేకలేక కలిగిన కుమారుడు కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
పెళ్లికొడుకు పరారీ
రాజంపేట రూరల్: పెళ్లికుమారుడు బోగా బాలాజీ పరారీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ కందల నరసింహులు ఆదివారం తెలిపారు. పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లెకు చెందిన బోగా బాలాజీ, కడప శంకరాపురానికి చెందిన ఓ యువతికి ఈ నెల 7న నిశ్చితార్థ కార్యక్రమం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బ్రహ్మంగారి ఆలయ కల్యాణ మండపంలో వారి వివాహం జరగాల్సి ఉందన్నారు. శనివారం రాత్రి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లికొడుకు బంధువులు లాంఛనాలతో బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారన్నారు. అక్కడ నిర్వహించిన రిసెప్షన్ అనంతరం పెళ్లికుమారుడు బోగా బాలాజీ కనిపించకుండా పోయాడన్నారు. పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తన కుటుంబాన్ని అవమానపాలు చేయడానికే పెళ్లికుమారుడు, అతని తల్లిదండ్రులు, అన్నవదినలు, అక్కాబావలు ఇలా చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.