ఎంత పరీక్ష పెట్టావు తల్లీ... | Mother Dies At Daughter's SSC Examination Center | Sakshi
Sakshi News home page

ఎంత పరీక్ష పెట్టావు తల్లీ...

Published Thu, Mar 21 2019 10:45 AM | Last Updated on Thu, Mar 21 2019 10:45 AM

Mother Dies At Daughter's SSC Examination Center - Sakshi

మృతి చెందిన పెంచలమ్మ

సాక్షి, పెనగలూరు: పెనగలూరు మండలం కొం డూరు పంచాయతీ ఉప్పరపల్లెకు చెందిన ఓర్సు పెంచలమ్మ, తండ్రి రమణయ్య దంపతులకు ఏకైక కుమార్తె కావేరి. ఒకే కుమార్తె కావడంతో తల్లి దండ్రులు అపురూపంగా పెంచారు. ఎంతగానంటే కుమార్తె పరీక్షకు వెళుతున్నా వదిలి పెట్టలేనంతగా. పరీక్షల నేపథ్యంలో పెనగలూరు మోడల్‌స్కూల్‌కు ప్రతిరోజూ వచ్చి పరీక్షరాసి వెళుతోంది. ఏకైక కుమార్తె కావడంతో తల్లి తోడుగా వచ్చేది.

రోజూ లాగానే కావేరి బుధవారం కూడా పరీక్షకు ఇంటినుంచి బయలుదేరింది. నీవు వచ్చేంతవరకు ఎదురు చూస్తుం టానమ్మా అని చెప్పి బడిబయట ఓ చెట్టుకింద కూర్చుంది. పరీక్షరాస్తున్న సమయంలో తల్లి అనంతలోకా లకు వెళ్లిపోయింది. చెట్టుకింద కూర్చున్న పెంచలమ్మకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షరాసి అనంతరం బయటకు వచ్చిన కావేరి విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement