Mother dies
-
నీ వెంటే వస్తున్నా బిడ్డా..!
కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే ఊరికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్‌రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు -
కొడుకు మృతి.. ఆగిన తల్లి గుండె..
సాక్షి, వరంగల్: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిగుండె ఆగిపోయింది. ఈ ఘటన బుధవారం వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం పెరకవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ 33వ డివిజన్ పెరకవాడలో టింగిల్‌కార్ కృష్ణ(45) కులవృత్తి మటన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కృష్ణ అనారోగ్యానికి గురై బుధవారం సాయంత్రం మృతి చెందాడు. చదవండి: Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్ గురువారం తెల్లవారు జామున కొడుకు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తల్లి భారతిబాయ్(85) గుండె ఆగిపోయింది. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం మృతదేహాలను శివనగర్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. చదవండి: తెల్లారితే లోకం చూడాల్సిన పసికందు.. అమ్మా ఎందుకిలా చేశావ్! -
కొడుకు మరణవార్తతో తల్లి ఆకస్మిక మృతి
సాక్షి, మక్తల్ : కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఆ తల్లి గుండెపోటుతో మృత్యువాత పడిన సంఘటన మక్తల్ మండలం చందాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బీరప్ప(35) రెండురోజుల క్రితం కిందపడటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ మరణ వార్త విన్న బీరప్ప తల్లి లక్ష్మమ్మ(75) కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. అయితే బీరప్పకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చి గ్రామ శివారులో కుటుంబసభ్యులు దూరంగా ఉండగా ఖననం చేశారు. ఇంటి దగ్గర తల్లి శవం ఉండగానే కొడుకుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు కాగా బీరప్ప పెద్దవాడు. బీరప్పకు భార్య నర్సమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: మీ స్థాయి ఎంత.. మీ లెక్కెంత..? నీటిసంపులో పడి బాలుడు.. పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): మండలంలోని పెద్ద కారుపాముల చెందిన కృష్ణయ్య, యాదమ్మ దంపతుల కుమారుడు సుశాంత్ (3) శనివారం ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడ్డాడు. కాగా చాలాసేపటి తర్వాత గుర్తించడంతో అప్పటికి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చెరువులో మొసలి కలకలం మాగనూర్ (మక్తల్): మండలంలోని అమ్మపల్లి పెద్ద చెరువులో మొసలి కలకలం సృష్టించింది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల కోసం చెరువు పక్కకు వెళ్తుండగా గట్టుపైకి మొసలి వస్తుందని రైతులు తెలిపారు. ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
వనపర్తి/పాన్‌గల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వందేళ్ల వయస్సు దాటిన ఆమె వనపర్తిలోని మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలోనే ఇన్నాళ్లు ఉన్నారు. రోజూలానే ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించగా.. సోమవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ కనిపించింది. మంత్రి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. మంత్రితోపాటు వారి చెల్లెళ్లు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రముఖుల పరామర్శ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మంత్రిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అబ్రహం, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, శ్వేతామహంతి, శ్రీధర్, శంశాంక్, వనపర్తి ఎస్పీ కె. అపూర్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, స్వర్ణసుధాకర్‌రెడ్డి, పద్మావతి, టీడీపీ, బీజేపీ నాయకులు, ఆయా జిల్లాల జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అలాగే, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టులు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాయినిపల్లి శివారులో అంత్యక్రియలు సింగిరెడ్డి తారకమ్మ అంత్యక్రియలు పాన్‌గల్ మండలం రాయినిపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసం నుంచి రాయినిపల్లి శివారు వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు బంధువులు తరలివచ్చారు. తన వ్యవసాయక్షేత్రంలో మంత్రి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి తలకొరివి పెట్టారు. తల్లి తారకమ్మకు కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. -
ఎంత పరీక్ష పెట్టావు తల్లీ...
సాక్షి, పెనగలూరు: పెనగలూరు మండలం కొం డూరు పంచాయతీ ఉప్పరపల్లెకు చెందిన ఓర్సు పెంచలమ్మ, తండ్రి రమణయ్య దంపతులకు ఏకైక కుమార్తె కావేరి. ఒకే కుమార్తె కావడంతో తల్లి దండ్రులు అపురూపంగా పెంచారు. ఎంతగానంటే కుమార్తె పరీక్షకు వెళుతున్నా వదిలి పెట్టలేనంతగా. పరీక్షల నేపథ్యంలో పెనగలూరు మోడల్‌స్కూల్‌కు ప్రతిరోజూ వచ్చి పరీక్షరాసి వెళుతోంది. ఏకైక కుమార్తె కావడంతో తల్లి తోడుగా వచ్చేది. రోజూ లాగానే కావేరి బుధవారం కూడా పరీక్షకు ఇంటినుంచి బయలుదేరింది. నీవు వచ్చేంతవరకు ఎదురు చూస్తుం టానమ్మా అని చెప్పి బడిబయట ఓ చెట్టుకింద కూర్చుంది. పరీక్షరాస్తున్న సమయంలో తల్లి అనంతలోకా లకు వెళ్లిపోయింది. చెట్టుకింద కూర్చున్న పెంచలమ్మకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షరాసి అనంతరం బయటకు వచ్చిన కావేరి విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
కన్నపేగును చూసుకోకుండానే కనుమూసింది
సర్కారు ఆస్పత్రిలో మెరుగైన ప్రసవాలు చేస్తున్నారని వస్తే... ఓ బాలింత ప్రాణం పోయింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఎస్.కే.జరీనాసుల్తానా(25)ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి మృతిచెందింది. తొలుత కుటుంబ సభ్యులు, బం ధువుల ఆందోళనల మధ్య జరీనాసుల్తానాకు మెరుగైన వైద్యం అందించడానికి కరీంనగర్‌లోని ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా ఆమె మృతి చెందింది. మగబిడ్డకు జన్మనిచ్చి.. ఎన్టీపీసీలోని పీకే రామయ్యకాలనీకి చెందిన ఎస్కే ఫయాజ్, జరీనాసుల్తానా దంపతులు. వివాహమై 11 మాసాలవుతోంది. ఫయాజ్ సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి గర్భందాల్చిన ఎస్.కే.జరీనాసుల్తానాకు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ప్రసూతీ కోసం ఈనెల 17న అడ్మిట్ చేశారు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బాలింతల వార్డుకు తరలించారు. సాయంత్రం వరకు బాగానే ఉంది. తరువాత కడుపులో నొప్పిగా ఉందని తల్లడిల్లింది.ఆపరేషన్ చేసిన సమయంలో ఒక బ్యాగు రక్తం ఎక్కించిన వైద్యులు, వార్డుకు తరలించాక మళ్లీ రక్తం అవసరం ఉందని చెప్పడంతో ఆమె భర్త స్వయంగా రక్తదానం చేశారు. అయినా బాధితురాలి ఆరోగ్య కుదుటపడలేదు. హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయిన వైద్యులు, మళ్లీ రక్తం అవసరం ఉందని కోరడంతో, సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ నుంచి తెప్పించారు. బంధువుల ఆందోళన... వైద్యులు ప్రయత్రించినప్పటికీ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాలింత రోగ్యం ఎందుకు విషమించిందో సరైన వైద్యులు సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు రెఫర్ చేయాలంటున్న వైద్యులు, బాధితురాలికి ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే జరినాసుల్తానా ఆరోగ్యం విషమించిందని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చనిపోయిన మృతదేహాన్ని మెరుగైన చికిత్స కోసమంటూ తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ సలీంపాషా, పోలీసులు జోక్యం చేసుకొసి బాధితురాలిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందింది. ఆస్పత్రిలో గొడవలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్, ఎస్సైలు పర్యవేక్షించారు. -
అమ్మంటే.. పెన్షన్ డబ్బు కాదు!
‘అమ్మ’ంటే ఆట బొమ్మకాదు..అవసరాలు తీర్చే ‘ఆయా’ కానేకాదు..ప్రేమకు ప్రతి‘రూపం’.. సృష్టిలో అపురూపంతరాలు మారినా ఆధునికత పెరిగినా మనిషిలోనైనా మట్టి ముద్దలోనైనా.. ఏ వయసులోనైనా అమ్మ దేవత.ఆకలేస్తే ఉగ్గు పాలలో అమ్మ.. నిద్దరొస్తే జోలపాట అమ్మ..దయాగుణంలో ధరిత్రిలా.. ప్రేమానురాగాల పవిత్రమూర్తి..అమ్మ శాశ్వతం.. ఆమె ప్రేమ శాశ్వతం..అమ్మ అనాథ కాదు..అద్దంలో రూపం కాదు.. మాంసం ముద్ద అసలే కాదు..‘అమ్మ’ను విస్మరిస్తే శాపం..లోకం క్షమించదు ఈ పాపం. గుంతకల్లు: కుమారుడి ఆదరణ లేక ఓ తల్లి తనువు చాలించిన ఘటన పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రిటైర్డు ఆర్పీఎఫ్ సూర్యనారాయణ, పార్వతీబాయి(72) దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మోహన్‌రావు బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకోబ మతిస్థిమితం లేక ఊరూరు తిరిగేవాడు. ఐదేళ్ల క్రితం సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతీబాయి భర్త పెన్షన్‌తో జీవిస్తుండేది. పెళ్లి అయిన మోహన్ భార్యాపిల్లలతో వేరు కాపురం పెట్టాడు. నెల నెలా మొదటి వారంలో తల్లి పార్వతీబాయిని బ్యాంకుకు పిలుచుకువెళ్లి పెన్షన్ సొమ్ము డ్రా చేసుకొని తల్లిని ఇంటి వద్ద వదిలివెళ్లేవాడు. ఆమె బాగోగులు పట్టించుకునే వాడు కాదు. మూడు రోజులుగా చలితీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గురువారం ఉదయం మృతి చెందింది. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుమారుడు మోహన్‌ను పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. -
తల్లి లేకుండా ఉండలేనని ..
సాక్షి, నల్లగొండ క్రైం : ‘అమ్మ లేకుండా నేను జీవించలెను..అమ్మే నా ప్రాణం..మరికొద్ది గంటల్లో తల్లి మృతి చెందుతుందని మనస్తాపం చెందిన కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాజిపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి అలియాస్ ఇద్దమ్మ (65) పక్షవాతంతో మంచాన పడింది. నోటి మాట రావడంలేదు. మరణానికి దగ్గరలో ఉం ది. కొద్దిగంటల్లో ప్రాణం పోతుందని భావించిన కుమారుడు ప్రకాశ్ (30) తల్లి లేని జీవితం ఊహించలేనని ..అమ్మలేకుండా తాను బతకనని నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలోని 61కి.మీ వద్ద రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లి .. కుమారుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తల్లి ఇద్దమ్మకు చెప్పారు. దీంతో ఆమె మంచంలోనే ప్రాణం విడిచింది. అమ్మలేకుండా బతకలేనని.. ప్రకాశ్ ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచూ తన అమ్మ అనారోగ్యంపై చర్చించేవాడని స్నేహితులు తెలిపా రు. అమ్మలేకుండా బతకలేనని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోజువారీగా శనివారం ఉదయం ఇంటి పనుల డబ్బుల తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. రైలుపట్టాలపై ప్రకాశ్ మృతిచెందడాన్ని గమనించిన సమీప రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇద్దమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దమ్మకు కుమారుడు,కుమార్తె కుమార్తెకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల క్రితం ఆమె భర్త చెట్టుపై నుంచి మరణించాడు. ఆ ఇంటికి ప్రకాశ్ ఒక్కడే ఆధారం. ఇప్పుడు తల్లితోపాటు అతనూ మృతిచెందడంతో ఒక్కదాన్ని చేసి వెళ్లిపోయారా అంటూ సోదరి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. -
ఆ తల్లి నిజంగానే 'సూపర్ స్టార్'
అమెరికాలో ఓ కుటుంబం జాలీగా బోటు షికారు చేస్తుండగా విషాధం చోటుచేసుకుంది. రెండేళ్ల కుమారుడిని కాపాడేందుకు ఓ మాతృమూర్తి తన ప్రాణాలను పణంగా పెట్టింది. కుమారుడిని రక్షించుకున్న ఆ తల్లి చివరికి ప్రాణాలు కోల్పోయింది. సాల్ట్ లేక్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొలరెడో, లేక్ వుడ్ కు చెందిన చెల్సీ రస్సెల్(35) తన కుటుంబసభ్యులతో కలిసి బోటు షికారుకు వెళ్లింది. అయితే ఆమె రెండేళ్ల బాబు ఆడుకుంటూ పొరపాటున నీళ్లల్లో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కన్నతల్లి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తన చిన్నారి కోసం నీళ్లలోకి దూకేసింది. వెంటనే ఆమె సోదరుడు బోటును అక్కడే ఆపేశాడు. వీరికోసం గాలిస్తుండగా చిన్నారిని బోటులో ఉన్న వారికి అందించిన వెంటనే ఆమె సృహకోల్పోయింది. కొంతసమయం తర్వాత చెల్సీని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని డాక్టర్లు బతికించగలిగారు కానీ, ఆ మాతృమూర్తిని మాత్రం కాపడలేకపోయారు. అరగంట సమయం వారు చేసిన ప్రయత్నం వృథా అయిందని వైద్యులు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో ఈ ఏడాది ఇదే తరహాలో ఆరుగురు చనిపోయారు. చెల్సీ సహోద్యోగులు ఆమె మృతిపై స్పందిస్తూ.. ఆమెను ఎప్పటికీ మనం 'సూపర్ స్టార్'గా గుర్తుంచుకోవాలని ఆమె సాహసాన్ని కొనియాడారు. చనిపోయిన చెల్సీ మారథాన్ రన్నర్ అని, గతేడాది వంద మైళ్ల రేసులో విజయం సాధించారని గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఆమె మరణవార్తను చెల్సీ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది. -
అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..
చెన్నై : తన తల్లి వైద్య ఖర్చుల కోసం చోరీ చేశాడు. తీరా తల్లి చనిపోవడంతో చోరీ చేసిన సొమ్ములో ఖర్చు చేయగా మిగిలిన డబ్బును బాధితులకు అప్పగించాడు. ఖర్చు చేసిన సొమ్ముకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను వదిలిపెట్టి కటకటాలపాలయ్యాడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. పుదుక్కొట్టై పెరియార్ నగర్‌కు చెందిన రాజమాణిక్యం (75) రిటైర్డు ప్రభుత్వ అధికారి. కాగా ఈ నెల 24వ తేదీన బ్యాంకు నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి ఇంటికి తీసుకెళ్లాడు. భార్య కాత్యాయిని చేతికి డబ్బుల బ్యాగు ఇచ్చి ఆయన బయటకు వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని ఆమెను కోరాడు. నీళ్లు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న డబ్బు బ్యాగుతో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగారుపడిన కాత్యాయిని భర్తకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 26వ తేదీన సదరు యువకుడు రాజమాణిక్యం ఇంటికి చేరుకుని రూ.4.5 లక్షలున్న బ్యాగును అందజేశాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుప్రతిలో ఉన్న తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం గత్యంతరం లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడ్డానని, దురదృష్టవశాత్తు తల్లి చనిపోయిందని తెలిపాడు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు పోగా మిగిలిన సొమ్మును ముట్టజెబుతున్నానని, తాను ఖర్చుపెట్టుకున్న రూ.50 వేలకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను వదిలి వెళ్తున్నానని చెప్పి పరుగందుకున్నాడు. ఇరుగుపొరుగువారు యువకుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు విరాలీమలైకి చెందిన మన్సూర్ (20) అని, తిరుచ్చిలోని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి అని గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అమ్మ లేదన్న బాధలోనూ పరీక్ష..