ప్రకాశ్ (ఫైల్)
సాక్షి, నల్లగొండ క్రైం : ‘అమ్మ లేకుండా నేను జీవించలెను..అమ్మే నా ప్రాణం..మరికొద్ది గంటల్లో తల్లి మృతి చెందుతుందని మనస్తాపం చెందిన కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాజిపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి అలియాస్ ఇద్దమ్మ (65) పక్షవాతంతో మంచాన పడింది. నోటి మాట రావడంలేదు. మరణానికి దగ్గరలో ఉం ది. కొద్దిగంటల్లో ప్రాణం పోతుందని భావించిన కుమారుడు ప్రకాశ్ (30) తల్లి లేని జీవితం ఊహించలేనని ..అమ్మలేకుండా తాను బతకనని నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలోని 61కి.మీ వద్ద రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుమారుడి మరణంతో తల్లి ..
కుమారుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తల్లి ఇద్దమ్మకు చెప్పారు. దీంతో ఆమె మంచంలోనే ప్రాణం విడిచింది.
అమ్మలేకుండా బతకలేనని..
ప్రకాశ్ ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచూ తన అమ్మ అనారోగ్యంపై చర్చించేవాడని స్నేహితులు తెలిపా రు. అమ్మలేకుండా బతకలేనని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోజువారీగా శనివారం ఉదయం ఇంటి పనుల డబ్బుల తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. రైలుపట్టాలపై ప్రకాశ్ మృతిచెందడాన్ని గమనించిన సమీప రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇద్దమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దమ్మకు కుమారుడు,కుమార్తె కుమార్తెకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల క్రితం ఆమె భర్త చెట్టుపై నుంచి మరణించాడు. ఆ ఇంటికి ప్రకాశ్ ఒక్కడే ఆధారం. ఇప్పుడు తల్లితోపాటు అతనూ మృతిచెందడంతో ఒక్కదాన్ని చేసి వెళ్లిపోయారా అంటూ సోదరి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment