Nalgonda Bhojpuri Singer Commits Suicide Due To Love Failure - Sakshi
Sakshi News home page

Hyderabad: ప్రేమ విఫలమైనట్టు వాట్సాప్‌లో స్టేటస్‌లు.. ఫ్రెండ్స్‌ వెళ్లి చూడగా గాయకుడు ఆత్మహత్య

Published Thu, Mar 17 2022 1:41 AM | Last Updated on Thu, Mar 17 2022 8:56 AM

Young Man From Nalgonda Committed To Ends Life - Sakshi

మోహన్‌నాయక్‌ 

సైదాబాద్‌(హైదరాబాద్‌)/ తిరుమలగిరి(సాగర్‌): నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్‌ మోహన్‌ నాయక్‌ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోహన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సైదాబాద్‌ రెడ్డి కాలనీలో ఉంటున్నాడు. బంజారా పాటలతో సామాజిక మాద్యమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్‌ మంగళవారం రాత్రి తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  

పై చదువులకని నగరానికొచ్చి.. 
మోహన్‌ పై చదువుల కోసం నగరానికి వచ్చి గది అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే రెండు మూడు రోజులుగా వాట్సాప్‌లో తన ప్రేమ విఫలమైనట్లుగా స్టేటస్‌లో పెడుతున్నాడని, ఓ వీడియోను కూడా  పోస్టు చేశాడని స్నేహితులు చెబుతున్నారు. తన గదిలోనే ఉంటున్న ఇద్దరు స్నేహితులు మంగళవారం రా త్రి బయటకు వెళ్లిన సమయంలో  మోహన్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించి పక్కగదిలో ఉంటున్న వారు మోహన్‌ స్నేహితులకు ఫోన్‌చేసి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, మోహన్‌ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement