
విజయరాజేశ్వరి (ఫైల్)
నిడమనూరు: మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కడతేర్చాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు రుద్రయ్య, విజయరాజేశ్వరి (36) దంపతులు. వీరి కుమారుడు గణేశ్ (12) అనారోగ్య కారణాలతో ఏడాది క్రితం మృతిచెందాడు. రుద్రయ్య హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.
రుద్రయ్య సోద రుడి కుమార్తె నిశ్చితార్థం ఆదివారం బొక్కమంతులపాడ్‌లో నిర్వహించారు. ఈ శుభకార్యానికి హాజరయ్యేందుకు రుద్రయ్య, రాజేశ్వ రి ఉదయం స్వగ్రామానికి వచ్చారు. కాగా, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని రుద్ర య్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డ లితో ఆమె తలపై వేటువేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఇరుగుపొరుగు వారు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలోనే మృతిచెందింది. సీఐ గౌరీనాయు డు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment