ఆ తల్లి నిజంగానే 'సూపర్ స్టార్' | a Mother Dies while Keeping her child safe to House boat | Sakshi
Sakshi News home page

ఆ తల్లి నిజంగానే 'సూపర్ స్టార్'

Published Sun, Aug 28 2016 5:34 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ఆ తల్లి నిజంగానే 'సూపర్ స్టార్'

ఆ తల్లి నిజంగానే 'సూపర్ స్టార్'

అమెరికాలో ఓ కుటుంబం జాలీగా బోటు షికారు చేస్తుండగా విషాధం చోటుచేసుకుంది. రెండేళ్ల కుమారుడిని కాపాడేందుకు ఓ మాతృమూర్తి తన ప్రాణాలను పణంగా పెట్టింది. కుమారుడిని రక్షించుకున్న ఆ తల్లి చివరికి ప్రాణాలు కోల్పోయింది. సాల్ట్ లేక్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కొలరెడో, లేక్ వుడ్ కు చెందిన చెల్సీ రస్సెల్(35) తన కుటుంబసభ్యులతో కలిసి బోటు షికారుకు వెళ్లింది. అయితే ఆమె రెండేళ్ల బాబు ఆడుకుంటూ పొరపాటున నీళ్లల్లో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కన్నతల్లి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తన చిన్నారి కోసం నీళ్లలోకి దూకేసింది. వెంటనే ఆమె సోదరుడు బోటును అక్కడే ఆపేశాడు. వీరికోసం గాలిస్తుండగా చిన్నారిని బోటులో ఉన్న వారికి అందించిన వెంటనే ఆమె సృహకోల్పోయింది. కొంతసమయం తర్వాత చెల్సీని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

చిన్నారిని డాక్టర్లు బతికించగలిగారు కానీ, ఆ మాతృమూర్తిని మాత్రం కాపడలేకపోయారు. అరగంట సమయం వారు చేసిన ప్రయత్నం వృథా అయిందని వైద్యులు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో ఈ ఏడాది ఇదే తరహాలో ఆరుగురు చనిపోయారు. చెల్సీ సహోద్యోగులు ఆమె మృతిపై స్పందిస్తూ.. ఆమెను ఎప్పటికీ మనం 'సూపర్ స్టార్'గా గుర్తుంచుకోవాలని ఆమె సాహసాన్ని కొనియాడారు. చనిపోయిన చెల్సీ మారథాన్ రన్నర్ అని, గతేడాది వంద మైళ్ల రేసులో విజయం సాధించారని గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఆమె మరణవార్తను చెల్సీ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement