
సాక్షి, వరంగల్: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిగుండె ఆగిపోయింది. ఈ ఘటన బుధవారం వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం పెరకవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ 33వ డివిజన్ పెరకవాడలో టింగిల్‌కార్ కృష్ణ(45) కులవృత్తి మటన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కృష్ణ అనారోగ్యానికి గురై బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
చదవండి: Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
గురువారం తెల్లవారు జామున కొడుకు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తల్లి భారతిబాయ్(85) గుండె ఆగిపోయింది. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం మృతదేహాలను శివనగర్ శ్మశాన వాటికలో ఖననం చేశారు.
చదవండి: తెల్లారితే లోకం చూడాల్సిన పసికందు.. అమ్మా ఎందుకిలా చేశావ్!
Comments
Please login to add a commentAdd a comment