కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇదే ఊరికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్‌రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు
Comments
Please login to add a commentAdd a comment