
కోడలికి సహకరించిన మృతుడి తల్లి
పరారీలో అత్తాకోడళ్లు
వికారాబాద్ జిల్లా హన్మాపూర్‌లో ఘటన
వికారాబాద్ జిల్లా: మద్యానికి బానిసైన భర్త పెడుతున్న వేధింపులు భరించలేని ఓ భార్య కట్టుకున్నోడిని హతమార్చింది. మృతుడి తల్లి కూడా ఇందుకు సహకరించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి, నాయనమ్మ పరారీలో ఉండటంతో ఇద్దరు పిల్లలూ బిక్కుబిక్కుమంటున్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. హన్మాపూర్‌కు చెందిన బక్కని వెంకటేశ్ (33)కు 14 ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన సబితతో వివాహం జరిగింది. వీరికి లావణ్య, కిషోర్ ఇద్దరు పిల్లలు సంతానం. తల్లి లక్ష్మమ్మ, భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పొలం అ మ్మగా డబ్బులు రావడంతో వెంకటేశ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్ ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లి, భార్య మృతుడి సోదరుడైన శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. తన అన్న మృతికి తల్లి, వదినే కారణమని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లక్ష్మమ్మ, సబిత పరారీలో ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ నగేశ్‌తో కలిసి హన్మాపూర్‌లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment