Vikarabad District
-
లగచర్లలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, వికారాబాద్ జిల్లా: దుద్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణలో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు రోటిబండ తండా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని వెళ్లకుండా వారించారు. దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గిరిజనులు ప్లకార్డులు చేతబూని తమ నిరసన తెలిపారు.మా అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ పహారా మధ్య అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు.ఈ ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. తర్వాత అక్కడే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారుఇందులో భాగంగా ఇవాళ రోటిబండ తండాకు అధికారులు సర్వే చేసేందుకు రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వేవైపు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలం పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసుల నిర్భందంతో సర్వేచేయటంపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు గిరిజన మహిళలు. -
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు.. ఆత్మహత్య
ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు. మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
మా ప్రాణాలు తీసి.. భూములు లాక్కోండి
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్.. ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నలుగురు రిమాండ్‌కు.. లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు. కలెక్టర్‌తో ఏడీజీ భేటీ లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్మన్లను అదనంగా కేటాయించారు. పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు! ‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది. ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు. తిండికి తిప్పలు వచ్చాయి ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండాపోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారుఅధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా -
కలెక్టర్ పై మూకుమ్మడి దాడి
-
బాలికపై గ్యాంగ్‌రేప్: వికారాబాద్ జిల్లా
దోమ: మాయమాటలతో ఓ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు, నలుగురు మైనర్లు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)తో అదే ఊరికి చెందిన సంతోష్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ చనువును అవకాశంగా తీసుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ విషయం సంతోష్ స్నేహితులైన నలుగురు మైనర్లకు తెలియగా, బాలికను బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించడంతో వీరి అఘాయిత్యాలను ఆరు నెలలుగా మౌనంగా ఆ బాలిక భరిస్తోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బాలికను సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే నలుగురు మిత్రులు అక్కడకు చేరుకున్నారు. అంతా కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.సాయంత్రం వరకే స్కూల్ నుంచి రావాల్సిన బాలిక రాత్రి ఆలస్యంగా ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో వెంటనే పీఎస్‌కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని పరిగిలోని డీఎస్పీ కార్యాలయానికి తరలించగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.గంజాయి మత్తు కారణమా?గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ఈ మత్తులోనే వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు గంజాయి సరఫరా అవుతోందని, దీనికి బానిసలుగా మారిన యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుల్కచర్ల: కుటుంబ కలహాలతో కలత చెందిన తండ్రి ఆత్మహత్యకు సిద్ధపడగా.. కాపాడబోయిన కూతురుతో పాటు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్చచర్ల మండల పరిధి చౌడాపూర్ల మండలం మందిపల్ గ్రామానికి చెందిన శివానంద్(51) భార్య లావణ్యలకు కుమారుడు సాయి, కూతురు చందన ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఈ కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా శివరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో భూమి విషయంలో ఇంట్లో గొడవ జరగగా.. మనస్థాపం చెందిన శివానంద్.. రైలు పట్టాలపై నిల్చున్నాడు. ఇది గమనించిన కూతురు, కుమారుడు తండ్రిని కాపాండేదుకు యత్నించగా.. వేగంగా వచ్చిన రైలు.. తండ్రి శివానంద్, తనయ చందనను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలకు కుటుంబ సభ్యులు మందిపల్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పరిగి మున్సిపాలిటీ పరిధిలో దొంగల బీభత్సం
-
ఏం మాట్లాడుతున్నావ్!.. ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్‌నగర్‌లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు
సాక్షి, తాండూరు: చిల్లర ఖర్చుల కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు. చివరికి సైకోగా మారిపోయాడు. మర్డర్స్ చేయడం హబీగా మార్చుకున్నారు. అందుకు అడ్డా మీద కూలీలనే టార్గెట్ చేసుకున్నాడు. హత్య చేయడం అంటే అతనికి నీళ్లు తాగినంత ఈజీ.. ఇప్పటికే ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు. ఏడో హత్య చేసి పోలీసులకు మళ్లీ చిక్కిపోయాడు. వికారాబాద్ జిల్లాను వణికించిన సైకో కిల్లర్ కిష్లయ్య స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం... అదృశ్యమైన మహిళ గురించి తాండూరు పోలీసులు చేసిన దర్యాప్తు చేస్తుండగా...ఈ సైకో కిల్లర్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సర్వబీ.. ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు.. నవంబర్ 29న ఉదయం 9 గంటల ప్రాంతం.. కూలీ పనుల కోసం సర్వబీ అడ్డా మీదికి వెళ్లింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. డిసెంబర్ ఒకటిన ఆమె భర్త మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప వెంట వెల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిన్ని క్లూ దొరికింది. కిష్టప్పపై ఫోకస్ పెట్టారు. సైకో కిల్లర్ కిష్టప్ప బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తే పోలీసులే విస్తుపోయారు. కిష్టప్పను అదుపులో తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తాండూరులోని కూలీల అడ్డా మీద సర్వాబీని గ్రామంలో పని ఉందని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. తాండూరు నుంచి జహీరాబాద్ వెళ్లే బస్సులో ఎక్కారు. మధ్యలో తట్టెపల్లి అటవీ ప్రాంతంలో బస్సు దిగి... లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెను చీర కొంగుతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, మోబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును తీసుకుని కిష్టప్ప సొంత ఊరు అల్లీపూర్ వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా.. డిసెంబర్ 7న అదృశ్యమైన మహిళ సర్వాబీ మృతదేహం పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలో కిష్టప్పపై ఆరు హత్య కేసులుండగా... ఐదు కేసుల్లో ఆధారాలు దొరకనివ్వలేదంటే అతని క్రిమినల్ మెంటాలిటీ ఎంటో అర్థం చేసుకోవచ్చు. మరో కేసు విచారణలో రెండేళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సైకో కిల్లర్ కిష్టప్ప ఏడో హత్యకు తెగబడ్డాడు. పని ఇప్పిస్తానని చెప్పి ప్రాణాలు తీసే ఇలాంటి క్రిమినల్స్‌తో బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్. ఇదీ చదవండి: చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం! -
వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు
బొంరాస్‌పేట: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం
బొంరాస్‌పేట/సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగుబోతు పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి నుంచి హాథ్‌సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, భార్యాభర్తలకు వృద్ధాప్య పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాభర్తీ వంటి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ధరలు పెంచి పేదలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను పదవుల నుంచి తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రంలో కూడా రేవంత్ యాత్ర కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ ఫిరాయిస్తే ఉరి శిక్ష విధించాలి బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేశాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని విమర్శించారు.గురువారం ఉదయం ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు. అవసరమైతే ఉరి వంటి కఠిన శిక్షలను అమలు చేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతిభవన్, రాజ్భవన్లకు పరిమితం చేసి.. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేశారని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని హైకోర్టు, ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
బషీరాబాద్: ఇసుక మాఫియా బరితెగించింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్‌పై ట్రాక్టర్ ఎక్కించడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలతో తాండూరు డీఎస్పీ శేకర్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.శంకర్, హోంగార్డు శివరాం రాత్రి బ్లూ కోట్ విధుల్లో భాగంగా ఇందర్‌చెడ్ గ్రామంలో ఉన్నారు. ఈ సమయంలో ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్‌ను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బైక్ పైకి తీసువెళ్లాడు. ట్రాక్టర్ కింద పడిన కానిస్టేబుల్ శంకర్‌పై నుంచి ఇసుక ట్రాక్టర్ చక్రాలు వెళ్లాయి. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్‌ను వేగంగా తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఇసుక మాఫియా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ట్రాక్టర్‌తో ఢీ కొట్టిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా అయ్యాళం గ్రామానికి చెందిన భీమారాయగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిందని డీఎస్పీ తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన శంకర్‌కు తాండూరులో ప్రథమ చికిత్స చేయించి, మె రుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విరిగిన కాళ్లకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగని ఇసుక మాఫియా.. బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా ఆగడా లు పెచ్చుమీరాయి. ఐదేళ్లుగా క్యాద్గిరా, నవాంద్గి, గంగ్వార్, ఇందర్‌చెడ్ గ్రామాల వద్ద కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందన్న ఆ రోపణలున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’పలు మా ర్లు కథనాలు సైతం ప్రచురించింది. పోలీసు, రెవె న్యూ, భూగర్భశాఖ అధికారులు నిర్లక్ష్యంతోనే ఇసు క మాఫియా రెచ్చిపోతోందనే వాదనలున్నాయి. -
విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి
తాండూరు: అమెరికాలోని మిస్సౌరిలో వైద్యవిద్య అ భ్యసిస్తున్న తాండూరు విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. శివదత్తు సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితుడితో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. (చదవండి: దంత ఆరోగ్యంపై తలసరి ఖర్చు 4 రూపాయలే!) -
పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది!
వికారాబాద్ జిల్లా: మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపిన హృదయ విదారక ఘటన జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటు చేసుకుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి చంపేసింది నాగుపాము. కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి సమయంలో నాగుపాము పెద్ద పెద్దగా బుసలు కొడుతూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా
వికారాబాద్ జిల్లా: జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 29 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతగిరిలో మైసవ్వ చిన్న గుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ ద్వారా బస్సుని వెలికి తీశారు. కాగా, బస్సు బ్రేకులు సక్రమంగా లేవని అధికారులకు డ్రైవర్ చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. -
రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
జోగిపేట (అందోల్)/ధారూరు: రాష్ట్రంలో రహ దారులు నెత్తురోడాయి. గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారికనిపంచక జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దారి కనిపించక కుటుంబం బలి జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా షాపూర్ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో స్పీడ్‌గా వస్తున్న బస్సు కారును ఢీకొట్టి సుమారు 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందుభాగం బస్సుకింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల సుభాష్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ దిలీప్ (50), భార్య వినోద (44), కూతురు సుప్రతిక (24), మనవరాలు కాన్షీ (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరగగానే అక్కడే రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలు కారు వద్దకు పరుగెత్తివెళ్లి చూడగా, చిన్నారితోపాటు దిలీప్, వినోద మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సుప్రతిక కొట్టు మిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చివరకు ఆమె కూడా పది నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంది. కారు డోర్లు ఇరుక్కు పోవడంతో ఆమెను కాపాడలేకపో యామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరమైన ఘటనను మరిచిపోలేక పోతున్నా మన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి తనువు చాలించడం అక్కడున్న వారి హృదయాలను కలిచి వేసింది. జేసీబీ, క్రేన్ సహాయంతో గంటకుపైగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వద్దన్నా వెళ్లాడు.. దిలీప్ కూతురు సుప్రతిక, అల్లుడు ప్రదీప్‌రెడ్డికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతు న్నాయి. దీంతో గత నెల 31న అడ్వొకేట్‌తో మాట్లాడేందుకు కుటుంబంతోసహా మహారాష్ట్ర లోని స్వగ్రామమైన షాపూర్‌కు వెళ్లారు. కుమా రుడు వంశీని అక్కడే ఉంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబసభ్యులంతా మృతి చెందడంతో వంశీ అనాథయ్యాడు. వంశీ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని షాపూర్‌కు వెళ్లిన దిలీప్ తన స్నేహితుడైన సంజీవరెడ్డి వద్దనే ఉన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు జీడిమెట్లకు వెళ్లేందుకు సిద్ధ మయ్యారు. ఇంతపొద్దున ఎందుకు, టిఫిన్ చేసి 8 గంటలకు బయలుదేరండి అని చెప్పినా వినకుండా వెళ్లాడని సంజీవరెడ్డి జోగిపేటలో ఆవేదనతో చెప్పారు. తమ ఇంటి నుంచి బయ లుదేరిన రెండు గంటల్లోనే చనిపోయాడన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిద్రమత్తులో లారీ నడిపి.. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జమీర్ తన ఆటోలో 10 మందిని ఎక్కించుకుని వికారాబాద్‌కు బయలుదేరాడు. వీరిలో ఎనిమిది మంది అడ్డా కూలీలున్నారు. వీరంతా వికారాబాద్‌లోని ఓ క్రషర్ మిషన్‌లో పనిచేస్తారు. బాచారం గ్రామ సమీపంలోకి రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ జమీర్ (35), హేంలానాయక్ (45), రవి (40) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను తొలుత వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నేనావత్ కిషన్(40) తుదిశ్వాస వదిలాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మిగిలిన వారిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నెనావత్ వినోద్ (35) మృతి చెందాడు. ప్రస్తుతం ఆరుగురు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ ఎం.కుమార్ (28) నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా పట్టనట్లు వ్యవహరించిన డ్రైవర్ కుమార్.. అదే లారీని నడుపుకొంటూ తాండూరు వరకు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ నరేందర్ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తండాకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో మదనంతపూర్‌లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, దీంతో క్షతగాత్రులను తరలించేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు స్థానికులు చెప్పారు. ఆపకపోతే ప్రాణాలు దక్కేవి మదనంతాపూర్ వద్ద కూలీలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ జమీర్.. క్రషర్లో పనిచేసే టిప్పర్ డ్రైవర్ శ్రీనివాస్ కోసం బాచారం వద్ద ఐదు నిమిషాలు ఆపాడు. అక్కడి నుంచి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఆపకపోయి ఉంటే ఆటో సురక్షితంగా బాచారం మలుపు దాటి ఉండేదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. -
పెళ్లికి నిరాకరించారని తల్లీ కూతుళ్లపై దాడి
ధారూరు(వికారాబాద్): నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి నిరాకరించారన్న కోపంతో ఓ యువకుడు తల్లీ, కూతుళ్లపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వికారాబాద్ జి ల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారం గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్ల రాకేశ్ (27) హైదరాబాద్‌లో ఆటో మొబైల్ రంగంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో రాకేశ్‌కు ఏడాది క్రితం (ఇల్లరికం) నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రాకేశ్ యువ తిపై అనుమానం పెంచుకుని వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని యు వతి తల్లి భారతమ్మ గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి వారి సమక్షంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. గ్రామంలోని మేనత్త ఇంట్లో వారంరోజులుగా మకాం వేసి ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని రాకేశ్ వేధించడం మొదలు పెట్టాడు. అందుకు యువతి తల్లి అడ్డుచెబుతుండటంతో కోపంతో రగిలిపోయిన రాకేశ్ ఆ తల్లీకూతుళ్లను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా పథకం ప్ర కారం ఆదివారం యువతి ఇంటికి వెళ్లి తల్లీ, కూతుళ్లపై వెంట తెచ్చుకున్న పెట్రో ల్ పోశాడు. తల్లీకూతుళ్లు భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అగ్గిపుల్ల వెలిగిస్తున్న రాకేశ్‌ను పట్టుకుని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్పైడర్ ‘మ్యాన్’!
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్)ను కనుగొన్నారు. దాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్ మ్యాన్‌లా ఉందంటూ కేరింతలు కొట్టారు. సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్ మిటిఫికస్ అని సమాచారం. -
కారు పార్టీలో ‘కయ్యం’.. టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్..
వికారాబాద్: టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వపక్షంలోనే ప్రతిపక్షం తయారవడంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శుక్రవారం తాండూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది. చదవండి: అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు! టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం జిల్లాలో ఇదే సీన్ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు జోరందుకుంది. పార్టీ కార్యక్రమాలకు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం నేతలకు పరిపాటిగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాటల యుద్ధం సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. అయితే అందరికీ అవసరమయ్యే కొన్ని పనుల విషయంలో.. మనవతా దృక్పథంతో పరస్పరం సహకరించుకుంటాయి. కానీ మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎక్కువవుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సొంత పారీ్టకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొంటూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. నాలుగు చోట్లా అదే సీన్ తాండూరులో మొదలైన టీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు జిల్లా అంతటా వ్యాపించాయి. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన గొడవలు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. కొగంగల్లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ సాగుతోంది. వికారాబాద్‌లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యేకు వర్గపోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పార్టీ కేడర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పరిగి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దిగజారుతున్న ప్రతిష్ట అధికార పార్టీ నేతల తీరు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కలిసి హాజరైన నేతలు ప్రస్తుతం ఎవరికి వారే అనే రీతిలో సాగుతున్నారు. వికారాబాద్, తాండూరులో జరిగిన పలు సంఘటనలు నేతల వ్యవహారాన్ని ప్రజలు ఈసడించుకునే స్థాయికి చేరింది. అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వరకు గులాబీ నేతల వ్యవహార శైలి నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి మున్సిపల్ కార్యాలయాల సాక్షిగా చేస్తున్న రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అధికార పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత గొడవలు పెరిగానే తప్ప తగ్గుముఖం పట్టలేదు. మంత్రులు, ఎంపీలు చెబితేనే తెగని పంచాయితీలకు జిల్లా అధ్యక్షుడు పరిష్కారం చూపగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఆయనే ఓ వర్గాన్ని నడుపుతుండగా ఇక నేతలను ఎలా సమన్వయం చేయగలరనే విమర్శలూ వినిపిస్తున్నాయి. -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
డమ్మీ హామీలు.. అప్పులకుప్ప
దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమి దేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో దించారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం ఉదయం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని సురాయిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చల్లాపూర్, ఈర్లపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గాంధీ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు భారంగా మారాయని, ఫింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని పలువురు షర్మిల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంద ర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా పథకాల పేరు చెప్పి కేసీఆర్ ఎన్నో మోసాలకు పాల్పడ్డారని, రూ.25 వేలు ఇచ్చే వ్యవసాయ పథకాలను నిలిపివేసి కేవలం రూ.5 వేల రైతుబంధుతో సరిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వసతిగృహాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారని, రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు ఆపేశారన్నారు. రాష్ట్రంలో ఉద్యో గాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. రూ.16 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పులకుప్ప చేశారని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి రాగానే మోసం చేసిందని, విభజన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీదనే పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర «అధికార ప్రతినిధి పిట్టల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మలి బాల్‌రాజ్, మండల అధ్యక్షులు కుర్మని పకీరప్ప ఉన్నారు. -
కాగ్నాలో కొట్టుకుపోయిన దంపతులు
బషీరాబాద్: కూరగాయలు అమ్మి తిరిగి వస్తుండగా భార్యాభర్తలు కాగ్నా నది దాటుతూ వరదలో కొట్టుకుపోయారు. మూడు రోజుల తర్వాత కర్ణాటకలోని జెట్టూరు వద్ద శవాలై తేలారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టిలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప (50), యాదమ్మ (45) భా ర్యాభర్తలు. వీరికి మంతట్టి గ్రామ శివారులోని కాగ్నానది పరీవాహక ప్రాంతంలో పొలం ఉంది. ఆదివారం సాయంత్రం పొలంలో కూరగాయలు కోసుకొని చంద్రవంచలో విక్రయించి.. రాత్రి బంధువుల దగ్గర ఉండి మరుసటి రోజు వస్తామని కొడుకు వెంకటప్పకు చెప్పి వెళ్లారు. అయితే వారు సోమవారం రాకపోవడంతో కొడుకు.. బంధువుల దగ్గర ఆరా తీయగా ఉదయమే మంతట్టికి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వారికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం వెంకటప్పకు బంధువులు కర్ణాటకలోని జెట్టూరు కాగ్నా నదిలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాల ఫొటోలు పంపారు. అక్కడికి వెళ్లి చూ డగా తన తల్లిదండ్రులేనని గుర్తుపట్టాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని, చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారని గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
-
బాత్రూంలోనే నివాసం
పూడూరు: వారంపాటు కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఒక కుటుంబం స్నానాల గదినే నివాసంగా మార్చుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన కూలీలు గోనె కుమార్, కనకమ్మ దంపతులు కూతురితో కలిసి పురాతన ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఆ ఇల్లు కూలిపోయింది. దాని పునర్నిర్మాణానికి డబ్బుల్లేక బాత్రూంనే వారు నివాసంగా మార్చుకున్నారు. ఆరుబయట వంట చేసుకుంటున్నారు. వర్షం వస్తే పొరుగు వారిని ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఇల్లు కూలిన వెంటనే ఆధికారులు వచ్చి చూశారే తప్ప ఎలాంటి సహాయం అందించలేదని వాపోయారు. -
కులాలకు ఎదురెళ్లలేక రైలుకు ఎదురెళ్లి..
నవాబుపేట: రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం చెందింది. మృతు లిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (18), ధారూర్ మండలం ఎబ్బనూర్‌కు చెందిన అభినయ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పవన్ ఇంటర్ సెకం డియర్ ఆపేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అభినయ ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పుడు పవన్, అభినయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి విషయం కుటుంబ పెద్దలకు తెలిసింది. ఈ వయసులో ప్రేమలు ఏమిటంటూ మం దలించారు. అయినా ఇద్దరి కులాలు వేర్వేరని చెప్పారు. తమ పెళ్లికి వయసు, కులాలు అడ్డుగా ఉన్నాయని మనస్తాపం చెందిన పవన్, అభినయ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ బయట కలుసుకొని ద్విచక్ర వాహనంపై కడ్చర్ల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి బలవన్మరణం చెందారు. రైలు వేగం ధాటికి పవన్ తల 200 మీటర్ల దూరంలో పడింది. గమనించిన రైలు డ్రైవర్ వికారాబాద్ స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చూసి ఇరువురి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతురాలి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ తెలిపారు. -
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో ఆదివారం రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్డీ రంగారెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..
తాండూరు రూరల్(వికారాబాద్ జిల్లా): ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాలిక గర్భం దాల్చి, ప్రసవించిన సంఘటన తాండూరు మండలం జినుగుర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. చైల్డ్‌లైన్ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(15). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చదవండి: స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. గత శుక్రవారం కడుపులో నొప్పి వస్తోందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. బాలిక పడుతున్నవి పురిటి నొప్పులని (ప్రీ డెలివరీ) చెప్పారు. అదే రోజున బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. చైల్డ్‌లైన్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణ చేసిన సీడీపీఓ రేణుక సదరు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కరన్‌కోట్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
బషీరాబాద్(వికారాబాద్ జిల్లా): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ఫిర్యాదుదారుడి వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావణి (పేరుమార్చాం) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. చదవండి: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం ఈ క్రమంలో పరమేశ్ భార్యతో విశ్వనాథ్ సన్నిహితంగా మెలిగేవాడు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై అనుమానం రావడంతో పరమేశ్ తన భార్యను నిలదీశాడు. అయినా వీరి తీరు మారకపోవడంతో కొద్ది రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. ఆనాటి నుంచి పావణి, విశ్వనాథ్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 30న పావణి తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండాపోయింది. అదే రోజున విశ్వనాథ్‌పై అనుమానం వ్యక్తంచేస్తూ పరమేశ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను విశ్వనాథ్ అపహరించుకుపోయాడని, ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.42 వేలు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. విశ్వనాథ్‌కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగింది. మరో మహిళను తీసుకుని పారిపోయాడని తన భర్తపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ.. తన జీవితం ఏం కావాలని..? మామ పిట్టలి అంజిలప్పను నిలదీసింది. దీనిపై స్పందించిన ఆయన నాలుగు రోజుల్లో తన కొడుకు తిరిగిరాకపోతే.. ఆస్తి మొత్తాన్ని కోడలి పేరున రాస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా తన భర్త కనిపించకుండా పోయాడని, ఆయన ఆచూకీ కనుక్కోవాలని విశ్వనాథ్ భార్య అనురాధ సైతం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విశ్వనాథ్, పావణిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు. -
సార్.. రెండు బీర్లు కావాలి
దౌల్తాబాద్: అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు రావాలి’అని కోరాడు. దీంతో డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వెంటనే అతని వద్దకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళితే ‘సార్.. నాకు రెండు బీర్లు కావాలి’అని ఆ యువకుడు అనడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లేసరికి ‘డయల్ 100’కు ఫోన్ చేసిన జనిగెల మధు అనే యువకుడు మద్యం మత్తులో తూగుతున్నాడు. పైగా బీర్లు కావాలంటూ పోలీసులను ఆటపట్టించడానికి యత్నించాడు. దీంతో మధును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. 100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
తాండూరులో ‘కారు’చిచ్చు.. దుమారం రేపిన వాయిస్ రికార్డింగ్
తాండూరు ‘కారు’లో చిచ్చురేగింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా మారింది. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తార స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలుగా విడిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకుంటున్నారు. చదవండి: కేసీఆర్ క్లారిటీకి వచ్చారా? తాండూరు(వికారాబాద్ జిల్లా): ఇద్దరు బలమైన నేతల నడుమ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు అధిష్టానం దృష్టికి వెళ్లినా రాజీ కుదరలేదు. దీంతో సదరు నాయకులిద్దరూ ఎవరికివారే తెరవెనుక గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టికెట్ తనకేనని ఇరువురూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఫోన్లో దూషించారనే ఆడియో వైరల్‌గా మారింది. తివాచీతో ముదిరిన వివాదం జిల్లాలో తాండూరు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే సమయంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల జరిగిన భద్రేశ్వర రథోత్సవం నేపథ్యంలో మరోసారి బయటపడింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు, నిర్వాహకులు నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. రథోత్సవానికి ముందుగా హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. ఆయన ఎమ్మెల్సీ పక్కన కూర్చోకుండా.. వారి ముందు మరో తివాచీ వేయించుకుని తన వర్గీయులతో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్సీ వర్గం వారు వెనుక వరుసలోకి వెళ్లారు. దీనిపై లోలోపల మండిపడిన మహేందర్‌రెడ్డి వర్గీయులు వేడుకలకు ఆటంకం కలిగించవద్దనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగిందని భావించిన ఎమ్మెల్సీ మరునాడు సీఐ రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఐని దుర్భాషలాడినట్లు ఉన్న ఆడియోలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తోఫాల పంపిణీలో రగడ రంజాన్ సందర్భంగా గత మంగళవారం యాలాల, బషీరాబాద్, తాండూరులో తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ వర్గీయులు అధికారులపై మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా వార్.. తాండూరు టీఆర్ఎస్లో రెండున్నరేళ్లుగా రచ్చ సాగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆరోజు నుంచి ఇరువర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు నేతలిద్దరూ సిద్ధమయ్యారు. పోటాపోటీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్వాత్ర విమర్శలు.. తాండూరులో టీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉండటం, ఇరువురికి పొసగక తరచూ గొడవలు జరగడంపై అధికార పార్టీ అభిమానులు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. -
ప్రియుడే కాలయముడు
పరిగి: మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ‘పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (15), అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్ (నాని) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం మైనర్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో 27వ తేదీన కూతురును తల్లి మందలించింది. ఈ విషయాన్ని సదరు మైనర్ మహేందర్‌కు చెప్పడంతో 28న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రమ్మని చెప్పాడు. లైంగిక వాంఛ తీర్చాలని మహేందర్ ఒత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యతోపులాట జరిగింది. ఆమెను పక్కకుతోయడంతో తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఆమెపై అత్యాచారం చేయడంతో ఊపిరి ఆడక మైనర్ మృతి చెందింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మహేందర్ తన స్నేహితుడు సుఖిందర్ ఇంటికి వెళ్లాడు. తెల్లారాక ఇద్దరూ కలసి ఘటనా స్థలంలో దూరం నుంచి మరోసారి మైనర్ మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు’అని ఎస్పీ చెప్పారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. తల్లిని కూడా విచారించామని, అయితే ఆమె పాత్ర లేదని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అబ్బాయిల ప్రలోభాలకు అమ్మాయిలు గురికావొద్దని ఎస్పీ సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. -
విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..?
వికారాబాద్: పదో తరగతి విద్యార్థిని హత్య ఘటనలో విస్మయకర విషయాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా అంగడి చిట్టెంపల్లిలో పదిహేనేళ్ల విద్యార్థినిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగుచూసిన విషయం తెలి సిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందా లుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఆ విద్యార్థినితో ప్రేమ పేరిట సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ప్రధాన నిందితుడిగా భావిస్తూ దర్యాప్తు చేపట్టారు. అతనితోపాటు మరో స్పేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం విద్యార్థిని తల్లిని, ఆమెతో సన్నిహితంగా ఉండే మరోవ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు హైదరాబాద్ నుంచి రప్పించిన క్లూస్ టీం ద్వారా మంగళవారం మరోసారి ఆధారాలు సేకరించారు. ఆ యువకుడే హత్య చేశాడా?: కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమపేరిట వేధిస్తున్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని తెలుస్తోంది. సోమవా రం తెల్లవారుజామున 3–00 గంటల ప్రాంతంలోనేవిద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన యువకుడు అప్పటికే పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టు, మరోసారి బలవంతంగా లైంగిక దాడికి యత్నించగా విద్యార్థిని అంగీకరించకపోవటంతో హత్య చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థినిని తీసుకువెళ్లటానికి ముందే అతడు స్నేహితుడితో కలసి మద్యం తాగినట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే లైంగికదాడికి పాల్పడింది అతడొక్కడేనా.. అతడి స్నేహితుల పాత్ర కూడా ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు వెల్లడించిన విషయాలకు సాంకేతికతను జోడించి సరిపోల్చి నిర్ధారణకు వచ్చేందుకే కొంత సమయం తీసుకుంటున్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ ఎస్పీ రషీద్, డీఎస్పీ శ్రీనివాస్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుండగా సీఐ వెంకటరామయ్య, ఎస్ఐ శ్రీశైలం ఇతర పోలీసు బృందాలతో కలసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బుధవారం కేసు విషయాలు వెల్లడించే అవకాశముంది. -
‘యాసంగి’ యమా స్పీడ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరగడంతో సాగు పనులు చకచకా సాగుతున్నాయి. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 46,49,676 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 8,06,511 ఎకరాల్లో (17 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 4,63,744 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది రెట్టింపు వేగంతో పంటల విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నాటికి లెక్కతేలనున్న వరి విస్తీర్ణం ధాన్యం కొనుగోలుపై కేంద్రం పలు ఆంక్షలు విధించిన క్రమంలో యాసంగి సీజన్లో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు చేస్తోంది. వాస్తవానికి యాసంగిలో రాష్ట్రంలో సగటున 52.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేది. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల దృష్టి పెట్టారు. ఈక్రమంలో ఈ ఏడాది వరిసాగును 21 లక్షల ఎకరాలకు తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈ సీజన్లో వరిసాగు 31.01 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 1,737 ఎకరాల్లోనే వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వరినాట్లు డిసెంబర్లో మొదలై జనవరి రెండో వారంకల్లా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభ దశలో ఉండటంతో విస్తీర్ణం ఏమేరకు తగ్గుదల ఉంటుందో చూడాలి. నాగర్‌కర్నూల్‌లో అత్యధికం... యాసంగి సీజన్ పంటల సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 76 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 61 శాతం, వనపర్తి జిల్లాలో 39 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 36 శాతం, గద్వాల జిల్లాలో 35 శాతం పంటలు సాగైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల రెండోవారం నుంచి సాగు పుంజుకునే అవకాశాలున్నాయి. నెలాఖరుకల్లా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
మర్పల్లి/ ఖమ్మం మయూరిసెంటర్: ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో కండక్టర్‌సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్పల్లి మీదుగా తాండూరుకు వెళుతోంది. వేగంగా ఉన్న బస్సు మర్పల్లి సమీపంలోని గుర్రంగట్టు తండా మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో భయాం దోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొందరు బస్సు అద్దాలను పగులగొట్టి బయట కు వచ్చారు. కండక్టర్ రాజమణి తలకు బలమైన గాయం కాగా, ఓ ప్రయాణికురాలి కం టికి తీవ్ర గాయం అయ్యింది. మరొకరికి కాళ్లూ చే తులు విరిగాయి. క్షతగాత్రులను మర్పల్లి ఎస్ఐ వెంకట శ్రీను తన వాహనం, మరో ఆటోలో మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన 10 మందిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో 15 మందిని హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ భుజంగం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ వెంకట శ్రీను తెలిపారు. బస్సు వేగంగా నడపడం వల్లే మూలమలుపు వద్ద అదుపు తప్పిందన్నారు. మంత్రులు పువ్వాడ, సబితారెడ్డి ఆరా ప్రమాదం ఘటనపై మంత్రులు సబితారెడ్డి, పు వ్వాడ అజయ్ అధికారులను ఆరా తీశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్, సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్లను పువ్వాడ ఆదేశించారు. -
ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు
-
టీకాలు ఎగిరొస్తాయ్!
వికారాబాద్: దేశంలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘ఆకాశ మార్గం ద్వారా మందులు’ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా టీకా చేరవేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం జరుగనుంది. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలకు మొదటి రోజు డ్రోన్ల ద్వారా చేరవేయనున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ముందుగా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు డ్రోన్ల ద్వారా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులు, పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు గగనతలంలో ఎగరటం, గమ్యస్థానాలకు చేరే వరకు పర్యవేక్షణ, వాటి రక్షణను పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి సబితారెడ్డి ఈ నెల 11న కార్యక్రమం జరిగే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలోని మైదానాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, డ్రోన్లు ఎగిరే ప్రదేశం, మీడియా గ్యాలరీ తదితరాలను పరిశీలించిన మంత్రి.. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఫైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు వికారాబాద్ నుంచి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సబిత సందర్శించారు. కోవిడ్ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. 9–10 కి.మీ. దూరం వరకు.. డ్రోన్ల ద్వారా టీకాలను తీసుకెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి. అందువల్ల గురు, శుక్రవారాల్లో అధికారులు వీటిని పరీక్షించనున్నారు. ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి 9–10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు. ఇవి టీకాతోపాటు, మందులు, ఇతర వైద్య పరికరాలను కూడా తీసుకెళ్తాయి. దీనికోసం డ్రోన్‌ఆధారితవస్తు రవాణాలో పేరొందిన స్కై ఎయిర్ కన్సార్టియం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. -
అయ్యో.. హారిక..! కన్న తండ్రి భుజాలపై మోసుకెళ్లినా..
తాండూరు రూరల్ (వికారాబాద్): పదకొండేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. జ్వరంతో ఆరోగ్యం విషమించడం.. ఊరు చుట్టూ వాగు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో బాలిక మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరుకు చెందిన హరిజన్ బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక (11) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుం ది. పాఠశాలలు తెరుచుకోవడంతో స్నేహితులతో కలిసి వెళ్లాలనుకుంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి. (చదవండి: బంజారాహిల్స్: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..) రెండు రోజుల క్రితం జ్వరం.. హారికకు 2రోజుల క్రితం తీవ్రజ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో హారికను భుజాలపై ఎత్తుకుని బొంకూర్ నుంచి పొలాల వెంట ఖాంజాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక కన్నుమూసింది. బొంకూర్ నుంచి తాండూరుకు వెళ్లాలంటే బొంకూర్ వాగుపై వంతెన నిర్మించాలి. తమ సమస్యను అరవై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి ఉంటే హారికను జ్వరం వచ్చిన రోజే ఆస్పత్రికి తీసుకెళ్లేవారమని తల్లిదండ్రులు రోధిస్తూ పేర్కొన్నారు. (చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన సిబ్బంది’) -
బీజేపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేయవు: బండి సంజయ్
వికారాబాద్: తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో కొనసాగింది. ఇందులో భాగంగా మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేయబోవని తేల్చిచెప్పారు. ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసేందుకు కేసీఆర్‌కు సమయం ఉండదన్నారు. ప్రధాని మోదీ మాత్రం దేశ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తారని తెలిపారు. అందులో భాగంగా కేసీఆర్ ఎప్పుడు వెళ్లినా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు. ఇది ఆసరాగా చేసుకుని ప్రధాని తనను ప్రశంసించారని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు. నీటి వాటా కోల్పోతున్నాం.. సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కయ్యా రని బండి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారని, అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒట్టి బూటకం అని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లిచ్చే ఆలోచనేదీ ఆయనకు లేదన్నారు. నీటి కేటాయింపులో ద్రోహం చేసిన కేసీఆర్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలు, ఉచిత బియ్యం లాంటి పథకాలన్నీ బీజేపీ చలవేనని తెలిపారు. అన్యమతాల ముసుగులో ఎవరైనా హిందువుల జోలికొస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎంఐఎంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ముస్లింల అభ్యున్నతిపై, పాతబస్తీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పాత బస్తీకి మెట్రో రైలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, బీజేపీ నేతలు సదానంద్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు. బండి సంజయ్ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు. అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు. మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో సంజయ్‌కి ఘన స్వాగతం పూడూరు: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ధరణి కాటన్ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు. -
ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
పూడూరు: ఓ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న ఒకే కుటుంబంలోని ముగ్గురిని క్వాలిస్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన సంతోష్‌రెడ్డి(36), స్వాతి దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఉద్యోగరీత్యా స్వాతి యూఎస్‌లో ఉంటోంది. సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రులు మల్లికార్జున్‌రెడ్డి (60) రాజ్యలక్ష్మి(56), కుమారుడు దేవాన్ రెడ్డి(6)తో కలసి హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఉంటున్నారు. వికారాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన దావత్‌కు సంతోష్‌రెడ్డి తన తల్లిదండ్రు లు, కుమారుడితో కలిసి వచ్చారు. మరుసటిరోజు ఉద యం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యా రు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సమీపంలో రాంగ్రూట్లో వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌రెడ్డి, దేవాన్ రెడ్డి, రాజ్యలక్ష్మి మృతిచెందారు. సంతోష్‌రెడ్డి, క్వాలిస్ డ్రైవర్ మహ్మద్‌గౌస్, మరోవ్యక్తి గాయపడ్డారు. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. నలుగురు మృతి
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని కొడంగల్ పట్టణ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోగా మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన నలుగురిని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు. చదవండి: ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి -
సీఎం కేసీఆర్ రైతుల వ్యతిరేకి: వైఎస్ షర్మిల
దోమ: కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా 3 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించిన విషయం తెలుసుకున్న షర్మిల... అన్నదాతల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శుక్రవారం పాలేపల్లిలో పర్యటించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా సీఎం కేసీఆర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరి గింజ వరకూ కొంటామని చెప్పి జూన్ వరకూ ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, రాజగోపాల్ పాల్గొన్నారు. -
వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని ఛేదించిన పశువైద్యాధికారులు
సాక్షి, బషీరాబాద్: వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని పశువైద్యాధికారులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విచారణ జరిపి ఊపిరాడకనే అవి చనిపోయాయని వెల్లడించారు. ‘వింతవ్యాధితో నాటుకోళ్ల మృత్యువాత’శీర్షికన ఈ నెల 16న ప్రచురితమైన ‘సాక్షి’కథనానికి రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పందించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా వెటర్నరీ అధికారిని ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ మండల పశువైద్యాధికారి హతిరామ్ తన సిబ్బందితో కలసి మండంలోని క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల్లో విచారణ జరిపారు. నాటుకోళ్లు మురుగుకాలువల్లోంచి ఆహారం తీసుకుంటున్నట్లు గమనించారు. అనారోగ్యానికి గురైన ఓ నాటు కోడిని పోస్టుమార్టం చేయగా దాని గిజార్డ్ పూర్తిగా ఇసుక రేణువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. పేగుల్లో మొత్తం పరాన్నజీవులు ఉన్నాయని, తద్వారా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని హతిరామ్ తెలిపారు. కోళ్ల పెంపకందారులు వాటికి గింజలు వేయకపోవడం, నీళ్లు సరిగ్గా పట్టకపోవడం, ఎండలకు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో చనిపోయాయని వివరించారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకలేదని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ లేదు.. యువతి బలవన్మరణం
పరిగి: అప్పుల బాధతో తండ్రి ఉరివేసుకున్నాడు... అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు... ఉన్నత చదువులు చదివి ఎన్నాళ్లు ఎదురు చూసినా ఉద్యోగం రాలేదు.. చివరకు పెళ్లి కుదిరిందన్న ఆనందమూ మిగల్లేదు... అప్పు చేస్తే తప్ప పెళ్లి జరిగే పరిస్థితి లేదు... కానీ పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చేవారు లేరు... ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారమని భావించిన ఓ యువతి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లికి చెందిన వడ్ల అనిత (29) పీజీతోపాటు బీఈడీ చేసింది. అప్పుల బాధతో తండ్రి పదేళ్ల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే సోదరుడు 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికితోడు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడం, తల్లి బయటకు వెళ్లి పని చేసే స్థితిలో లేకపోవడంతో అనిత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు. ఇటీవల పెళ్లి కుదరగా మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అప్పు చేస్తే తప్ప చేసుకోలేని పరిస్థితి ఆమెకు నెలకొంది. కానీ ఒకవేళ అప్పు చేసినా దాన్ని తిరిగి తీర్చేవారు కూడా లేరని భావించిన అనిత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఆవేదనను సూసైట్ నోట్లో రాసుకొని గురువారం ఉదయం తల్లిని పాల కోసం పక్కింటికి పంపించింది. ఆమె వచ్చేలోగా ఇంట్లోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వచ్చి చూసేలోగా మృతిచెందింది. సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనాకు బలి -
రసాభాసగా టీఆర్ఎస్ సమావేశం
సాక్షి, వికారాబాద్(యాలాల): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణ శివారులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం టీఆర్ఎస్ యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆతర్వాత ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్‌కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని, ముందుగా పార్టీ అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ మండల అధ్యక్షుడికి మొదట మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ అప్పగించారు. ఇదే సమయంలో తాను రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని విఠల్ నాయక్ చెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మధ్యలో కల్పించుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డిపై సిద్రాల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది యాలాల మండల పార్టీ సమావేశం.. తాండూరు మండలానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు’ అని గద్దించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యక్రమంలో మండల అధ్యక్షుడికే అవమానం జరిగితే ఎలా అని అసహనం వ్యక్తంచేస్తూ కొంతమంది సర్పంచ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులకు నచ్చజెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల పార్టీకి కొందరు కొత్తబిచ్చగాళ్లు వచ్చారు’అనడంతో.. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్టేజీపై ఇలా మాట్లాడటం తగదన్నారు. రెండు రోజులుగా సమావేశ ఏర్పాట్లు జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సమయానికి వచ్చి గొడవ చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా కార్యక్రమం ముగిసే వరకూ నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కలి్పంచుకుని పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా చక్కదిద్దారు. -
ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను..
సాక్షి, వికారాబాద్: ‘నాకు ఇప్పుడే పెళ్లి వద్దు.. నేను చదువుకుంటా.. నా మాట వినకుండా మీరు సంబంధాలు చూస్తున్నారు. లేనిపోని నిందలు వేస్తున్నారు’ అంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన సంపంగి వెంకటమ్మ, నర్సింహులు దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం తల్లి వెంకటమ్మ కూడా మృతి చెందింది. దీంతో కూతురు రేణుక (14) పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఉన్న అమ్మమ్మ అనంతమ్మ వద్ద ఉంటోంది. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం టీచర్లు పాఠ్య పుస్తకాలను కూడా అందజేశారు. అయితే రేణుకకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. బాలిక వద్దని వారించినా వారు సంబంధాలు చూస్తుండటం.. లేనిపోని నిందలు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో సూసైడ్‌నోట్ రాసి ఇంటి దూలానికి ఉరేసుకుంది. ‘అమ్మమ్మా.. నన్ను క్షమించూ.. నిందలు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక) -
టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత!
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు) తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు. -
15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ
ఇజ్రా చిట్టెంపల్లి.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఓ చిన్న గ్రామం. 300 కుటుంబాలు ఉన్న గ్రామంలో అందరూ గిరిజనులే. అందరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. అలాంటి పల్లె దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఉదయాన్నే దూసుకొచ్చిన మృత్యుశకటం ఐదు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఐదుగురివి పేద కుటుంబాలే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు సమీప బంధువులు, దాయాదులు. మృతులు జాటోత్ సోనాబాయి, నితిన్, జాటోత్ శేనిబాయి, జాటోత్ రేణుకాబాయి దాయాది కుటుంబాలకు చెందినవారు కాగా, రమావత్ సంధ్య వీరికి సమీప బంధువు. – మోమిన్‌పేట 15 రోజుల్లో పెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన కమల్, శవంత దంపతులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకూతురు సంధ్య వికారాబాద్ కొత్తగడి సమీపంలో ఉన్న సమీకృత హాస్టల్లో ఉంటూ నలంద కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి టాపర్ అయిన సంధ్య కరాటే కూడా నేర్చుకుంది. కరోనా కారణంగా కళాశాలకు సెలవు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి ఆసరాగా రోజూ కూలిపనులకు వెళ్తోంది. కమల్ సోదరి కుమారుడితో జనవరి 10న సంధ్య వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం ఆమెతో వికారాబాద్‌లో పూజలు చేయించాలనుకున్నారు. పెళ్లి బట్టలు కొనడంతోపాటు పత్రికలు రాసుకునేందుకు సిద్ధ మయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూలిపనులకు బయలుదేరి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. చదవండి: (మృత్యుశకటం!) తిరిగిరాని లోకాలకు చదువులతల్లి.. కమల్, జీనిబాయిల రెండో కుమార్తె సోనీబాయి(16)కి చదువుల తల్లిగా గ్రామంలో పేరుంది. ప్రస్తుతం ఆమె వికారాబాద్ కొత్తగడి సమీకృత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్దే ఉంటూ కూలిపనులకు వెళ్తోంది. ఈ క్రమంలోనే శనివారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. సోనిబాయి అక్క స్వప్నకు మాటలు రావు. త మ్ముడు చిన్నవాడు. దీంతో సోనిబాయిని బాగా చదివించి ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావిం చారు. కానీ రోడ్డు ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. కూలిపనులకు వద్దన్నా వెళ్లి.. చిట్టెంపల్లికి చెందిన శేనిబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లిళ్లు అయిపోయాయి. భర్త బాబు వ్యవసాయ కూలీ. శేనిబాయి పెద్దకుమారుడు వినోద్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా డబ్బులు పంపిస్తానని, కూలిపనులకు వెళ్లొద్దని తల్లిని నిత్యం వారించేవాడు. అయినా ఆమె వినిపించుకునేది కాదు. 10 రోజుల క్రితం కూడా తల్లితో మాట్లాడిన వినోద్.. కూలికి వెళ్లవద్దని నచ్చజెప్పాడు. కొడుకు వారిస్తున్నా వినకుండా శనివారం పనులకు బయలుదేరి, ప్రాణాలు కోల్పోయింది. పిల్లలను వదిలి.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేణుకాబాయికి ఐదేళ్ల కూతురు సింధు, మూడేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నారు. భర్త వినోద్ వ్యవసాయ కూలీ. రేణుకాబాయి రోజు మాదిరిగానే పనులకు బయలుదేరి వెళ్లి ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ఆలనాపాలనకు దూరమయ్యారు. నానమ్మ దశదినకర్మ మరుసటిరోజే.. నానమ్మ దశ దినకర్మ మరుసటిరోజే మనవడు మృతిచెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. చిట్టెంపల్లికి చెందిన మోతీలాల్, మంగీబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారిలో జాటోత్ నితిన్(16) చిన్నవాడు. నితిన్ రంగారెడ్డి జిల్లా యాచారంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా ఇంటివద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు. ఇటీవల నానమ్మ మంకీబాయి మృతి చెందటంతో పది రోజులుగా పనులకు వెళ్లడంలేదు. శుక్రవారం దశదినకర్మ ముగియటంతో శనివారం ఉదయం పత్తి తీసేందుకు బయలుదేరి విగతజీవుడయ్యాడు. ఆటో డ్రైవర్ హరి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావించిన నితిన్ తండ్రి మోతీలాల్.. అతడి ఇంటి పైకప్పు కూల్చివేశాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిందిలా.. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి-మోమిన్‌పేట ప్రధాన రోడ్డుపైన ఒకే కుటుంబానికి చెందినవారు ఆటోలో ఎక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతలోనే తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చి ఆటో ముందు ఆగింది. వెనుకాలే లారీ వేగంగా వస్తోంది. ఇది గమనించని ఆటో డ్రైవర్ బండి ముందుకు తీశాడు. దీంతో లారీ ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూపుకెళ్లి మూడు పల్టీలు కొట్టింది. లారీ తాకిడికీ బస్సు కూడా కొద్దిగా ధ్వంసమైంది. ఆటోలో ఎక్కి కూర్చున్న కుటుంబ సభ్యుల్లో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఉన్న వారూ తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
విషాదం: ప్రేమికులిద్దరూ మృతి
సాక్షి, వికారాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కీర్తన (16), బాలరాజ్ (22) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలిసిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన అక్కడిక్కడే మృతి చెందగా.. హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బాల్‌రాజ్ ప్రాణాలు విడిచాడు.(చదవండి: ఆన్లైన్లో అప్పులు.. యువతి ఆత్మహత్య ) -
వికారాబాద్ జిల్లాలో దారుణం
-
‘కరోనా’ అనుమానం.. రోడ్డున పడిన మృతదేహం
ధారూరు/యాలాల: కరోనా.. మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్ సోకిందంటేనే బాధితులకు ఆమడదూరం పారిపోతున్న మనుషులు.. ఇక, మరణాల విషయంలో కనికరమే చూపట్లేదు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కెరెళ్లి వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. గొం తుపై ఏర్పడిన కణితితో బాధపడుతూ ఓ మహిళ బస్సులో కుప్పకూలి చనిపోయింది. కరోనాతోనే చనిపోయిందనే అనుమానంతో ఆమె మృతదేహాన్ని ఉన్నపళంగా రోడ్డుపై దించేసి డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు వెళ్లిపోయారు. కరోనా భయంతోనే.. యాలాల మండలం కిష్టాపూర్‌కు చెందిన గడ్డం చిన్న ఆశప్ప భార్య వెంకటమ్మ (40) గొంతుపై కొన్నేళ్లుగా కణితి పెరుగుతోంది. శ్వాస తీసుకునేందుకు, భోజనం చేసేటపుడు ఇబ్బందిపడేది. కొన్ని రోజుల క్రితం ఆమెకు నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అంతకుముందు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. గొంతు వద్ద కణితి తొలగించేందుకు రూ.2 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో భార్యను కాపాడుకోవడానికి ఆశప్ప తనకున్న మూడెకరాల్లో ఎకరం అమ్మి ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకొని ఆశప్ప, వెంకటమ్మ తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో తాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం బయలుదేరారు. 10 గంటలకు ధారూరు దాటాక వెంకటమ్మ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ చనిపోయింది. కెరెళ్లిలో బస్సు ఆపిన డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు.. మృతదేహాన్ని కిందకు దించాలన్నారు. తన భార్యకు కరోనా లేదని, గొంతు వద్ద కణితితో చనిపోయిందని ఆశప్ప చెప్పినా వారు వినలేదు. దీంతో మృతదేహాన్ని కిందికి దింపించి వెళ్లిపోయారు. ఆశప్ప రోదిస్తూ విషయాన్ని ఫోన్లో తన అల్లుడితోపాటు కిష్టాపూర్ సర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌కు చెప్పాడు. చివరకు ఎలాగో ఓ ఆటో మాట్లాడుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. రోడ్డు పక్క దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న తమ పట్ల ఎవరూ జాలీ, కనికరం చూపలేదని ఆశప్ప విలపిస్తూ చెప్పాడు. -
బయటపడ్డ బంగారు,వెండి చెంబులు
-
అదుపు తప్పిన బస్సు
మోమిన్‌పేట: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిం దికి దూసుకెళ్లిన ఘటనలో మహిళా కండక్టర్‌తోపా టు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వికారాబా ద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.తాండూరు డిపోకు చెందిన బస్సు (టీఎస్ 34ఏ 6125)ను తీసుకొని డ్రైవర్ ఉస్మాన్, కండక్టర్ లక్ష్మి మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులతో తాండూరు నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. మోమిన్‌పేట మండలం కేసారం దాటాక మొరంగపల్లి సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న మ లుపులో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దిగింది. అక్కడే ఉన్న రైల్వే గేటుకు సంబంధించిన ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కండక్టర్ లక్ష్మి చేతికి బలమైన గాయమైంది. బస్సులో ఉన్న మో త్కుపల్లికి చెందిన దంపతులు ఎల్లమ్మ, మొగుల య్య గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయం లో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. -
వాట్సాప్‌లో కరోనాపై తప్పుడు ప్రచారం
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు లోని జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళకు కరోనా సోకిందని వాట్సాప్ గ్రూపులో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బషీరాబాద్ ఠాణా పరిధిలో సోమవారం జరిగిందని ఎస్పీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అయితే ఆమెకు కరోనా సోకిందని, తాండూరులో మొదటి కేసు నమోదైందంటూ కొర్విచెడ్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ సోమవారం తెల్లవారుజామున ఓ వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు పెట్టాడు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ విభాగం సిబ్బంది విచారణ జరిపి విజయ్‌కుమార్‌ను గుర్తించారు. వెంటనే అతడితోపాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న బాల్‌రాజ్‌పై ఐపీసీ 188తో పాటు సెక్షన్ 54 ఎన్డీఎంఏ కింద చట్టాల కింద కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టుచేశారు. కాగా గ్రూప్ అడ్మిన్ బాల్‌రాజ్ ఓ వెబ్ చానల్ రిపోర్టర్. ఎవరైనా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై నమోదైన కేసు రాష్ట్రంలోనే ఇదే మొదటిదని పోలీసు వర్గాలు తెలిపాయి. -
సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి
సాక్షి, వికారాబాద్: వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన శుక్రవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లికి చెందిన మీనా వైద్యం కోసం మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడ నర్సులు వైద్యం చేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడంతో వెంటనే 108 వాహనంలో సదాశివపేటకు తరలించగా.. వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణి మార్గమధ్యలోనే మృతి చెందింది. వైద్య సేవల్లో జాప్యం చేయడం వల్లనే మీనా మృతిచెందిందని ఆరోపిస్తూ.. మృతురాలి కుటుంబసభ్యులు మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. -
‘పాప’పు లోకాన్ని విడిచి వెళ్లింది
మర్పల్లి: తనను కని చెత్తబుట్టలో పారేసిన ఈ పాడు లోకాన్ని చూడకుండానే ఓ పసికందు మృతిచెందింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వారు ముళ్లపొదల్లో పడేసిన సంఘటన విదితమే. ఆ పసికందును ఓ కుక్క ఎత్తుకుపోతుండగా గుర్తించిన ఓ రైతు ఆ కుక్కను తరిమివేసి పాపను తీసుకున్నాడు. వెంటనే పోలీసుల సహాయంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ పాప ఆదివారం మృతిచెందింది. మర్పల్లి ఎస్ఐ సతీశ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌లోని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
వివక్ష చూపలేదు
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ ముదిరాజ్ అనే యువకుడికి దివ్యాంగుల కోటాలో చాలినంత అర్హత లేనందునే టీఆర్టీకి ఎంపిక చేయలేదని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లికి చెందిన రామకృష్ణ టీఆర్టీ–2017లో ఉత్తీర్ణత చెందినప్పటికీ ఉద్యోగావకాశం రాలేదంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, కమిషన్ కచ్చితంగా నియమ, నిబంధనలకు లోబడి వ్యవహరిస్తుందే తప్ప ఎవరి పట్ల వివక్ష చూపబోదని స్పష్టంచేశారు. సరోజినీ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లో ఆయనకు వైకల్యం 30 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించిందని, కనీసం 40 శాతం ఉండాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు ఆయనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. రాత పరీక్షలో అతడికి 53.209 మార్కులు వచ్చినా కంటిచూపులో 40 శాతం కంటే తక్కువగా వైకల్యం (30 శాతమే ఉందని) ఉందని మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక మేరకు తిరస్కరించినట్లు వెల్లడించారు. అంతేతప్ప అర్హత ఉన్నా ఉద్యోగావకాశం కల్పించలేదన్న సదరు అభ్యర్థి ఆరోపణలో నిజం లేదన్నారు. ఈ విషయమై సదరు అభ్యర్థి కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించినపుడు కూడా అక్కడున్న సిబ్బంది అతనికి అన్ని వాస్తవాలను వివరించారని, తనకు టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదని ఆ అభ్యర్థి పేర్కొనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు. -
కారులో వృద్ధుడి సజీవదహనం
తాండూరు టౌన్: పాడైపోయిన ఓ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన పత్తర్‌షెడ్ వీరన్న (70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నప్పటికీ వేరుగా ఉంటున్నాడు. కొన్నేళ్లుగా స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని గల్లీలో పాడైపోయిన ఓ కారులో రాత్రిళ్లు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం మర్రిచెట్టు కూడలి వద్ద ఉన్న రక్తమైసమ్మ జాతర సందర్భంగా కారు నిలిపి ఉంచిన సమీపంలో టెంటు వేసి కొందరు వంటలు చేశారు. వీరన్న ఎప్పటిమాదిరిగానే అర్ధరాత్రి కారులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకుని కారుపై పడిపోవడంతో దానికి నిప్పంటుకుంది. దీంతో కారులో నిద్రిస్తున్న వీరన్న సజీవ దహనమై గుర్తు పట్టలేని స్థితిలో బూడిదగా మారాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల వీరన్న తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని మృతిచెంది ఉంటాడని డీఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. మృతుడి కుమారులు రఘు, చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దొరికిపోతామనే భయంతో ఢీ కొట్టారు
వికారాబాద్: కారులో గంజాయి..ఎదురుగా పోలీసుల తనిఖీలు..తప్పించుకునేందుకు లైట్లు ఆపి కారు ముందుకు పోనిచ్చారు అందులోని యువకులు. గంజాయితో పట్టుబడిపోతామన్న భయంతో కారును ముందుకు పోనిచ్చి ఆ ముగ్గురు యువకులు ఎస్ఐని ఢీకొట్టేశారు. దీంతో ఆయన కాలు విరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటన వికారాబాద్ జిల్లాల్దో బుధవారం అర్థరాత్రి దాటాక జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ సబ్ డివిజన్లోని నవాబ్ పేట ఎస్ఐగా పనిచేస్తున్న కృష్ణ బుధవారం రాత్రి అనంతగిరి గుట్ట ఘాట్‌రోడ్‌లోని నంది విగ్రహం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్‌లు నగరంలోని ఓ పెడ్లర్ వద్ద గంజాయిని కొన్నారు. అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కారును అద్దెకు తీసుకుని కోట్‌పల్లి ప్రాజెక్టుకు బయల్దేరారు. ఈ క్రమంలో అనంతగిరి గుట్ట పైకి చేరుకున్నారు. అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి తనిఖీల్లో గంజాయితో పట్టుబడిపోతామని భయపడి వెంటనే లైట్లు ఆపి నందిగుట్ట పక్కనే కారుని నిలిపివేశారు. దీన్ని గమనించిన కృష్ణ వారి కారువద్దకు వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో యువకులు లైట్లు ఆన్ చేయకుండానే కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో వారు ఎస్ఐ కృష్ణను ఢీ కొట్టారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఫెన్సింగ్‌కు ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎస్ఐ కాలు విరిగిపోవడంతోపాటు కంటినొసలకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు యువకుల్ని అరెస్టు చేశారు. వారివద్దనుంచి సుమారు 150–200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ ఎస్ఐను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మరింత మెరుగైన చికిత్స కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ నారాయణ గురువారం మీడియాకు తెలిపారు. ఎస్ఐను ప్రశంసిస్తూ డీజీపీ ట్వీట్ ఈ ఘటనలో గాయపడ్డ ఎస్ఐ కృష్ణ ఆరోగ్యం గురించి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ‘కొత్త సంవత్సర వేడుకల్లో బందోబస్తులో ప్రమాదానికి గురైన ఎస్ఐ కృష్ణ త్వరగా కోలుకోవాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, వ్యక్తిగతంగా నష్టపోయినా మొక్కవోని ధైర్య ం , విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’అని డీజీపీ ట్వీట్ చేశారు. కాగా, చికిత్స పొందుతున్న కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలు విరగడంతో పాటు,కంటి నొసలు వద్ద గాయమైందని కిమ్స్‌కు చెందిన డాక్టర్ ఐవీ రెడ్డి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం సర్జరీ కి ఏర్పాట్లు చేశామని, 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని అందులో పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం : ఇద్దరు సజీవ దహనం
సాక్షి, వికారాబాద్ జిల్లా : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో శుక్రవారం జరిగిన అమానుష ఘటనలో ఇద్దరు సజీవ దహనమవగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన అంజిలమ్మ (40)తో అదే గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తికి వివాహేతర సంబంధం విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో కోపోద్రిక్తుడైన నర్సింహులు అంజిలమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పోసుకొని నిప్పంటించుకున్నాడు. అంతేకాక, అడ్డు వచ్చిన ఇద్దరు అంజిలమ్మ కుటుంబసభ్యులపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పరిస్థితి విషమించడంతో గమనించిన గ్రామస్థులు తాండూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటి అనంతరం అంజిలమ్మ కూడా మృతి చెందింది. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
అనంతగిరిలో ఇక పారాగ్లైడింగ్..!
సాక్షి, అనంతగిరి: అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్కు అనుకూలంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం టూరిజం ఎండీకి అందజేస్తామని చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి.. వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్టను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలు అందుకున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి గత నెల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న సిక్కిం రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్ జోన్ ప్రతినిధులు పారాగ్లైడింగ్ ఏర్పాటుపై ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతగిరిలో పారాగ్లైడింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వీరు ప్రతిరోజు అనంతగిరి చుట్టూ ఉన్న కొండప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి నుంచి విహారం ఎలా ఉంటుందో చూస్తున్నారు. గాలి ఎలా సహకరిస్తుంది..? గ్లైడింగ్‌లో పారాషూట్లు దిగడానికి అనుకూలమైన స్థలాలను అన్వేషిస్తున్నారు. సిక్కిం నుంచి వచ్చిన వీరు ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వీరికి అన్ని వసతులు కల్పించారు. వీరి వెంట వెళ్లి కొండల్లో గ్లైడింగ్ కోసం ప్రయత్నాలు చేశారు. కెరెళ్లి– జైదుపల్లి మధ్యలోని పాముల గుట్ట నుంచి నిర్వహించిన ట్రయల్‌రన్‌ను గురువారం ఆయన గుట్ట ఎక్కి స్వయంగా వీక్షించారు. అనంతరం పారాగ్లైడింగ్ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్ అనుకూలంగా ఉన్నాయని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ ప్రాంతం శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉందన్నారు. పారాగ్లైడింగ్తో పాటు జీప్లైన్, మౌంటేన్ బైకింగ్ తదితర వాటిని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం రాష్ట్ర టూరిజం ఎండీకి అందజేస్తామని స్పష్టంచేశారు. టూరిజం సీనియర్ సిబ్బంది మనోహర్, వికారాబాద్‌కు చెందిన ప్రదీప్ వీరికి సహాయంగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, రాజమల్లయ్య, నవీన్, అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, రంగరాజు, గోపి, షఫీ తదితరులు ఉన్నారు. -
బాలికపై యువకుడి అత్యాచారం
తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్‌కు చెందిన యువకుడు పవన్ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు
సాక్షి, వికారాబాద్: మూసీ నది ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని మూసీ జన్మ స్థలం వద్ద శనివారం ప్రత్యేక పూజలు చేసి ‘నమామి మూసీ’పేరిట పోరాటాన్ని ప్రారంభించారు. నదికి హారతి ఇచ్చిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, మూసీ ప్రవహించే ఐదు జిల్లాల్లో ప్రక్షాళన కార్యక్రమం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఇందులో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది కాలుష్య కాసారంగా మారిందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని నదిలోకి వదలడంతో పాటు డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. 16న బాపూఘాట్, ఆ తర్వాత సూర్యాపేటలో మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. శనివారం అనంతగిరిలో పుష్కరిణిలో పూజలు చేస్తున్న లక్ష్మణ్ తదితరులు -
విషాదం: ప్రాణం తీసిన గాలిపటం
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి చెందిన ఘటన పరిగి మండలం బాహర్పేటలో జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎంతో సంతోషంగా ఇద్దరు బాలురు గాలిపటం ఎగరవేయడానికి భవనంపైకి వెళ్ళారు. గాలిపటం కరెంట్ వైర్లకు చిక్కుకోవడంతో.. పైపు గొట్టంతో తీయడానికి బాలుడు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడి చేతికి షాక్ తగలడంతో తీవ్రం గాయపడ్డాడు. బాలుడిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రమైన శబ్దంతో కరెంట్ వైర్లు తెగిపడి కింద మరో వ్యక్తికి మీద పడ్డాయి. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. -
పరిగిలో ఘరానా మోసం
సాక్షి, వికారాబాద్: అతి తక్కువ ధరలకే హోంనీడ్స్ ఇస్తామని చెప్పి ఘరానమోసం చేసిన ఘటన జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. హోంనీడ్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసగాళ్లు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన వ్యక్తులు పరిగిలో హోంనీడ్స్ ఇచ్చే పేరుతో ‘రోజా ట్రేడర్స్’ను నిర్వస్తున్నారు. వస్తువు విలువలో సగం డబ్బులు చెల్లించి.. వారం రోజుల తర్వాత తీసుకుంటే సగం ధరకే ఆ వస్తువులు ఇస్తామని మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మి వినియోగదారులు వేల రూపాయలు చెల్లించారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులను తీసుకున్న రోజా ట్రేడర్స్ యాజమాన్యం రాత్రికిరాత్రే పరారైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక పరిగి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధితులు దాదాపు రూ.కోటి వరకు మోస పోయినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. -
పాస్ పుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య
మర్పల్లి: విరాసత్ పూర్తయి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినా డిజిటల్ పాస్ పుస్తకం రాకపోవడంతో తనకు బ్యాంక్ రుణం, రైతుబంధు సాయం దక్కడం లేదనే మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన కావలి మణెమ్మ పేరుపై ఎకరం 25 గుంటల భూమి ఉంది. గతేడాది ఆమె మృతి చెందడంతో తన ఇద్దరు కుమారులు మొగులయ్య, సామేల్ (50) చెరో 30 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి విరాసత్ ప్రొసీడింగ్ కాపీ వచ్చినా.. కొత్త పాస్‌బుక్ రాలేదు. దీంతో సామేల్ బ్యాంక్ రుణం, రైతుబంధు సాయం పొందలేకపోయాడు. దీనిపై ఐదు రోజుల కిందట సా మేల్ రెవెన్యూ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆందోళనకు దిగాడు. అధికారులు ఆయనను సముదాయించి ఇంటికి పంపారు. ఈ క్రమంలో కొత్త పాస్ పుస్తకం లేదు.. బ్యాంకు రుణం రాదు.. చేసిన అప్పులు తీరవు అంటూ మనోవేదనకు గురైన సామేల్ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగు మందు తాగాడు. మెరుగైన వైద్యానికి సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. అతనికి రూ.1.2 లక్షల అప్పు ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. -
నక్సలైట్లమా.. దేశద్రోహులమా?
సాక్షి, పూడూరు: ‘గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కార్మికుడు వీరభద్రప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పా.. మేమేమైనా నక్సలైట్లమా.. దేశద్రోహులమా..? ఇలా రోడ్లపై అరెస్టులు చేయడం ఏమిటి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిందుకు హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తున్న వీరిని చన్గోముల్ పీఎస్ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ పోకడవల్లే ఆర్టీసీ కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భేషరతుగా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లుగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు దెయ్యాలయ్యారా అని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు పెద్దఎత్తున కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కారణంగా 82 ఏళ్ల చరిత్రలో పడని భారం ఇప్పుడే పడుతోందా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్, ఆర్టీఐ మండల కన్వీనర్ వెంకటయ్య, యువజన నాయకులు సల్మాన్‌ఖాన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హమ్మద్, శ్రీనివాస్, అజీంపటేల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని..
యాలాల/బంట్వారం: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇద్దరు యువకులు వేర్వేరు చోట్ల బలవన్మరణాల కు పాల్పడ్డారు. ఈ వి షాదకర ఘటనలు వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం, అదే జిల్లాకు చెందిన బంట్వారంలో చోటుచేసుకున్నాయి. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. రాస్నం గ్రామానికి చెంది న దోమ మల్లేశం, పుష్పమ్మ దంపతుల కుమా రుడు రోహిత్ అలియాస్ రంజిత్ (24) బీటెక్ వరకు చదివాడు. 2018లో వెలువడిన నోటి ఫికేషన్‌తో కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. రెండు నెలల క్రితం ఈ ఫలితాలు వె లువడ్డాయి. బీసీ–డీ కేటగిరీకి చెందిన రంజిత్ కు 101 మార్కులు వచ్చాయి. కటాఫ్ 103 మార్కులు కావడంతో రెండు మార్కుల తేడా తో ఉద్యోగం కోల్పోయాడు. దీనిపై తరచూ స్నేహితులు, బంధువుల వద్ద చెబుతూ మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరేసుకున్నాడు. సోమవారం ఉద యం కుటుంబీకులు గమనించగా అప్పటికే విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి సోదరుడు రాకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేజారిందనే మనస్తాపంతో వికారాబాద్ జిల్లా బంట్వారం లో కుమార్ (24) అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అల్లిపురం నర్సింలు, ఈశ్వరమ్మ దంపతుల నాలుగో కొడుకు కుమార్ డిగ్రీ వరకు చదివాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్, తాండూ రులో శిక్షణ తీసుకున్నా డు. ఇటీవల విడుదలై న ఫలితాల్లో అతడికి ఉద్యోగం రాలేదు. అ దే గ్రామానికి చెందిన కుమార్ స్నేహితులకు ఇద్దరికి ఉద్యోగం వ చ్చింది. తనకు ఉద్యో గం రాలేదని అతడు మిత్రులకు చెప్పి ఆవేద న వ్యక్తం చేస్తుండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగి వచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో నర్సింలు దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ప్లీజ్.. నాకు పెళ్లి వద్దు
బషీరాబాద్: ‘‘సార్.. నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇంకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. మా అమ్మానాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఆదివారం నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంచి, చెడు ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది. పైగా నేను మేజర్‌ను. దయచేసి ఈ పెళ్లిని ఆపండి సార్.. లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి’’అంటూ శనివారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై తాండూరు గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ ఆమె తల్లిదండ్రులను ఠాణాకు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి మేజర్ కావడంతో ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని వారికి సూచించారు. ‘మంచి సంబంధమని ఇప్పటికే పెళ్లికి అంగీకరించాం. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నాక ఇష్టం లేదంటే బంధువుల ఎదుట మా పరువు ఏం కావాలి’అంటూ తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. తాము ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటామని తల్లిదండ్రులు యువతిని తీసుకొని ఇంటికి వెళ్లారు. యువతి మేజర్ కావడంతో ఇష్టం లేని పెళ్లి చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, వరుడి వయస్సు 40 ఏళ్లని తెలుస్తోంది. -
భక్తిశ్రద్ధలతో మెథడిస్ట్ జాతర
సాక్షి, ధారూరు: ధారూరు మెథడిస్ట్ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన క్రిస్టియన్ జాతర గురువారం మూ డో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాలి నడకన వచ్చేవారి సంఖ్య అధికమవుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని గుల్బర్గా, బీదర్, బీజాపూర్, సోలాపూర్ నుంచి యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఏసుక్రీస్తు తమ కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జాతరలో క్రీస్తు శిలువలు, బైబిల్ గ్రంథాలు, జీసస్ చిత్ర పటాలు, బ్యానర్లు, ఫొటోలను విక్రయిస్తున్నారు. వేడుకల ప్రాంగణంలో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. సీఐ రాజశేఖర్ అధ్వర్యంలో పోలీసులు వాహనాలను నియంత్రించి పార్కింగ్ స్థలాలకు మళ్లిస్తున్నారు. -
కన్నతల్లినే కడతేర్చాడు
బంట్వారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతల్లిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పరిధిలోని రొంపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబీ (55), చిన్న మైబు దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు జరిపారు. గతేడాది కొడుకు మస్తాన్‌కు వివాహం జరిపించారు. ఈ క్రమంలో వారు కొడుకు, కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మస్తాన్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. సోమవారం ఎప్పటిలాగానే అందరూ కలిసి భోజనం చేశారు. నిద్రకు ఉపక్రమించే సమయంలో మద్యం మత్తులో ఉన్న మస్తాన్ తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో మస్తాన్ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహబూబీ భయాందోళనతో అరుస్తూ బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్‌లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మంగళవారం పోస్టుమార్టం జరిపించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కూతురు బీబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ రాజు తెలిపారు. -
రేపటి నుంచి మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు
సాక్షి, ధారూరు: దేశంలోనే ఎక్కడా జరగని మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా ధారూరులో ప్రారంభమవుతున్నాయి. విశాలమైన ప్రదేశం కాగ్నా నది పక్కన స్టేషన్‌ధారూరు–దోర్నాల్ గ్రామాల మధ్య ఉత్సవాలు కొనసాగుతాయి. 96 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులతో ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకం. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఈ ఉత్సవాలను నిర్వహింస్తుంటారు. దాదాపు 35 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ఆరు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాలకు బీదర్, గుల్బర్గా, రాయచూర్, సోలాపూర్, బెంగళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం నిర్వాహకులు తగిన సౌకర్యాలు కల్పిస్తునారు. 2019లో నిర్వాహకులు 97వ జాతరను కొనసాగిస్తున్నారు. ఉత్సవాల విశేషాలు జాతర ప్రధాన ప్రాంగణంలో ఇప్పచెట్లు ఆనవాళ్లు మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాల్లో ఏసుక్రీస్తు నామంతో కీర్తనలు, భజనలు, ప్రార్థనలు హోరెత్తుతాయి. క్రీస్తు శిలువ దగ్గర ఆరు రోజులపాటు నిత్యం ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వక్తల ప్రసంగాలు, నిర్వాహకులతో వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలలో బంగారం, వెండితో పాటు నగదును దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరుతో చాలా మంది గొర్రెలు, మేకలు, కోళ్ళు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాట్లు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తూ యాత్రికులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మైనారిటి కమిషన్ చైర్మన్ ఖమ్రోద్దిన్, కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎస్పీ నారాయణ, డీఆర్ఓ మోతీలాల్, డీఆర్డీఓ జాన్సన్, జిల్లా పంచాయతి అధికారి రిజ్వాన, డివిజన్, మండల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక నిఘా యాత్రికుల నీటి అవసరాలను తీర్చే కాగ్నా నది జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిఘాను పెంచారు. కాగ్నా నదిపై ఉన్న పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో మట్టి రోడ్డు వేసి ఇరువైపుల బారికెడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్లడ్‌లైట్లు, చెత్త కుండీలు, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ప్రత్యేక రైలు ధారూరు, బీదర్ మధ్యన ప్రత్యేక రైలు నడుస్తోంది. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్–ముంబాయి మధ్య కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ధారూరు స్టేషన్లో ఆగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు వేసి ధారూరు జాతర ప్రాంగణం వరకు నడిపిస్తారు. -
అదుపు తప్పి.. పొలాల్లో 100 మీటర్ల లోపలికి దూసుకెళ్లి..
సాక్షి, చేవెళ్ల: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నారు. అయితే, వీరికి అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం హైదరాబాద్ నుంచి తాండూరు వైపు వెళ్తున్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 29జడ్3608) పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుకిందకు దిగి పంట పొలాల్లోకి వెళ్లింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. సుమారు 100 మీటర్ల లోపలికి వెళ్లి ఆగింది. రోడ్డు పక్కన పొలం చదునుగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా తీవ్ర భయాందోళనతో ఒక్కసారిగా కిందకు దిగారు. కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వేర్వేరు వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. -
మా పొట్ట కొట్టకండి
తాండూరు టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులమంతా సమ్మె చేస్తుండగా, తాత్కాలిక ఉద్యోగులుగా చేరి మా పొట్ట కొట్టకండని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్న విషయం విదితమే. 18వ రోజుకు చేరిన సమ్మెలో భాగంగా మంగళవారం ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి వద్దకు వెళ్లి వారికి గులాబీ పువ్వులను అందించారు. ఆర్టీసి బలోపేతానికి, ఉద్యోగ భద్రతకు, ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం సమ్మె చేస్తున్నామని, దీనికి విరుద్ధంగా మీ స్వలాభం కోసం విధులకు హాజరవుతూ మా పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితే కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. మీరంతా శాశ్వత ఉద్యోగులుగా మారొచ్చని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే తాత్కాలిక ఉద్యోగులను తీసుకుందన్నారు.కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మానేయాలని, ఇకనైనా హైకోర్టు ఆదేశాలను శిరసావహించి కార్మిక సంఘాల జేఏసీ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీజేఎస్ నేత సోమశేఖర్, టీజేఎంయూ డిపో గౌరవాధ్యక్షుడు పటేల్ విజయ్, బీజేపీ నేతలు కృష్ణముదిరాజ్, భద్రేశ్వర్, సీపీఎం నేత శ్రీనివాస్, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అంజిలయ్య, గోపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విమాన ప్రమాదంపై దర్యాప్తు
సాక్షి, బంట్వారం: శిక్షణ విమానం కూలిన ఘటనపై అధికారులు విచారణ జరిపారు. సోమవారం ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దర్యాప్తు బృందం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్పూర్ శివారులో ఆదివారం శిక్షణ విమానం కూలిపోవడంతో పైలెట్ ప్రకాష్‌విశాల్, కోపైలెట్ అమన్‌ప్రీతికౌర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దర్యాప్తు బృందం అధికారులు సోమవారం ఢిల్లీ నుంచి వచ్చారు. స్థానిక అడిషనల్ ఎస్పీ భాస్కర్‌రావు, ధారూరు సీఐ రాజశేఖర్, ఎస్ఐ వెంటకటేశ్వర్లుతో కలిసి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని అణువణువు గాలించారు. విమాన శకలాలతో పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 4 గంటల పాటు దర్యాప్తు చేసి సమగ్ర నివేదికతో తిరిగి వెళ్లారు. -
కటకటాల్లోకి కామాంధులు
సాక్షి, పహాడీషరీఫ్: గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రాజీ చేసేందుకు యత్నించిన మరో ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ శంకర్‌తో కలిసి వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, పుర్యనాయక్ తండాకు చెందిన మహిళ, కుటుంబంతో సహా బతుకుదెరువు నిమిత్తం నాలుగు నెలల క్రితం నగరానికి వలసవచ్చి హర్షగూడలోని ముచ్చా ప్రశాంత్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి పౌల్ట్రీ ఫారంలో పనికి కుదిరారు. సదరు మహిళకు నెలకు రూ.15 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కాగా సదరు దంపతులు దాణా సంచులను దొంగతనంగా విక్రయించినట్లు తెలియడంతో యజమాని ప్రశాంత్ రెడ్డి ఈ నెల 18న రాత్రి పౌల్ట్రీ ఫారానికి వచ్చాడు. మరో ఫౌల్ట్రీఫారం వద్ద చెల్లా చెదురుగా ఉన్న కాకరెల్స్‌ను వేరు చేయాలని తీసుకెళ్లి ఆమెను గదిలో బంధించి బెల్టు, కర్రలు, పైప్‌లతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతనితో పాటు అతని సోదరుడు అనిల్ రెడ్డి, చాంద్రాయణగుట్టకు చెందిన భరత్(26), అలియాబాద్‌కు చెందిన దేవరశెట్టి పవన్ కుమార్, చిక్కింపురి హన్మత్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలోనే బంధించి తీవ్రంగా కొట్టడంతో సురేష్ అనే యువకుడికి దాణా సంచులు విక్రయించినట్లు తెలిపారు. దీంతో సురేష్‌ను తీసుకువచ్చిన వారు చోరీ సొత్తు ఎలా కొంటావంటూ తీవ్రంగా కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ బెదిరించారు. రాజీకి యత్నం.. బాధిత దంపతులథక్ష పాటు సురేష్ ఈ నెల 21న ఫిర్యాదు చేసేందుకు పహాడీషరీఫ్ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా తుక్కుగూడ, హర్షగూడ ప్రాంతాలకు చెందిన పది మంది పెద్దలు రాజీ చేసేందుకు రంగంలోకి దిగారు. వర్త్య రవీందర్, భవానీ వెంకట్ రెడ్డి, జెటావత్ రవీందర్, చర్లపల్లి యాదయ్య, జర్పుల రాజు, బేగరీ సురేష్, ఏనుగు లోకేష్, మెగావత్ విజయ్ కుమార్, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ప్రశాంత్ రెడ్డిని కలిసి బాధితులతో రాజీ కుదురుస్తామని అందుకు బాధితులకు రూ.2.5 లక్షలు చెల్లించాలని సూచించారు. దీంతో నిందితులు రూ.2.5 లక్షలను వారికి అందజేశారు. దీంతో అదే రోజు పంచాయతీ ఏర్పాటు చేసిన వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దని రాజీ కుదుర్చుకున్నట్లు బలవంతంగా బాధితులతో సంతకాలు తీసుకున్నారు. బాధిత దంపతులకు రూ.1.02 లక్షలు, సురేష్‌కు రూ.1.30 లక్షలు ఇచ్చారు. రవీందర్ రూ.3 వేలు తీసుకోగా, మిగిలిన రూ.15 వేలతో విందు చేసుకున్నారు. ఫిర్యాదుతో వెలుగులోకి ఈ విషయం తెలియడంతో బాధితుల బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ధైర్యం చెప్పడంతో ఈ నెల 26న బాధితురాలు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజీ చేసేందుకు యత్నించిన 10 మందిపై కూడా కేసు నమోదు చేసి శనివారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని, ఇందుకు సంబంధించి నివేదికను చార్జిషీట్లో జతచేస్తామని ఆయన పేర్కొన్నారు.