సాక్షి, వికారాబాద్: జిల్లాలోని కొడంగల్ పట్టణ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోగా మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన నలుగురిని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment