విషాదం: ప్రేమికులిద్దరూ మృతి | Young Duo Girl And Boy Eliminates Themselves In Vikarabad District | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగిన ప్రేమజంట మృతి

Published Wed, Nov 4 2020 8:28 PM | Last Updated on Wed, Nov 4 2020 8:30 PM

Young Duo Girl And Boy Eliminates Themselves In Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కీర్తన (16), బాలరాజ్ (22) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలిసిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన అక్కడిక్కడే మృతి చెందగా.. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో  బాల్‌రాజ్‌ ప్రాణాలు విడిచాడు.(చదవండి: ఆన్‌లైన్‌లో అప్పులు.. యువతి ఆత్మహత్య )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement