సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.
అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు.
Comments
Please login to add a commentAdd a comment