Patnam Mahender Reddy
-
చీఫ్‌విప్‌గా ‘పట్నం’ నియామకం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహేందర్‌రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆయనను చీఫ్ విప్‌గా మండలి చైర్మన్ ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందనడానికి ఈ నియామకం ఓ ఉదాహరణ అని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమించారని ధ్వజమెత్తారు. సభలో బిల్లులు పాస్ చేయించడం, ప్రభు త్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్‌విప్ బాధ్యత అని అన్నారు.‘బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా?’అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ చెప్పారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని గుర్తు చేశారు.అయితే మార్చి 15వ తేదీన మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమిస్తూ గెజిట్ విడుదల చేశారని, మార్చిలో చీఫ్‌విప్ అయితే పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీగా ఆయన జెండా ఎగురవేస్తారని జీఏడీ జీవో ఎలా ఇస్తుందని హరీశ్ ప్రశ్నించారు. అనర్హత వేటు వే యాల్సిన కౌన్సిల్ చైర్మన్.. స్వయంగా మహేందర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా నియమి తులైనట్లు బులెటిన్ ఇవ్వటం సరికాదన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేను బీఆర్ఎస్ చైర్మన్‌ను కాదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్ -
ఏం మాట్లాడుతున్నావ్!.. ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. -
పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
కారు దిగుతున్న కీలక నేతలు
-
11 లేదా 12న కాంగ్రెస్‌లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు!
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. దీనిలో భాగంగా వీరిద్దరూ రేపు(శనివారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు.మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
రసవత్తరంగా తాండూరు మున్సిపల్ రాజకీయం
తాండూరు: మున్సిపల్ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్పర్సన్ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన సంతకాలు గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్పర్సన్ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మద్దతులో ఎలాగైనా చైర్పర్సన్ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల పంచాయితీ సాయిపూర్ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్లోని 9వ వార్డు కౌన్సిలర్ అయిన వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు చైర్పర్సన్ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్ చైరపర్సన్కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు విషమ పరీక్ష మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు
-
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. చదవండి: గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు: హైకోర్టు కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం.. మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
మినిస్టర్ ‘పట్నం’
తాండూరు: తాండూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి లభించింది. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. పైలెట్‌కు టికెట్ ఇవ్వడంతో.. కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనుండడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అధికార పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే విషయం కొద్ది రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. పట్నం తీరు సైతం ఈ అంశాలను బలపర్చేలా కనిపించడంతో పార్టీ మారుతారని చాలామంది డిసైడయ్యారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం శంకర్‌పల్లిలో నిర్వహించిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ పక్కనే కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు ఆయనకు హామీఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే.. అనవసర నిర్ణయాలు తీసుకుని ఆగం కావద్దని సూచించినట్లు తెలుస్తోంది. గైర్హాజరుతో అనుమానాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహేందర్‌రెడ్డి ఇటీవల సైలెంట్ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల మహేశ్వరంలో నిర్వహించిన సీఎం మీటింగ్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎప్పుడూ ముఖ్యమంత్రి పక్కనే ఉండే ఆయన కనిపించకపోవడం ఊహాగాలకు మరింత ఆజ్యం పోసింది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విషయం మీడియాలో ఫోకస్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. అతనితో సన్నిహితంగా ఉండే సెకండ్ క్యాడర్ నేతలతో పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇద్దరు రంగంలోకి దిగి పట్నంను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ చర్చలు పట్నం దారెటు.. అనే విషయంలో తలెత్తిన చర్చ అధికార పార్టీని ఆలోచింపజేసింది. సీనియర్ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయనను వదులుకోవద్దని గులాబీ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవి సఫలం కావడంతో మరుసటి రోజు శకంర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో మహేందర్‌రెడ్డి.. సీఎం వెంట ప్రత్యక్షమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన గులాబీ బాస్ కేసీఆర్.. పట్నం అలక తీర్చినట్లు సమాచారం. ఆ వెంటనే రెట్టించిన ఉత్సాహంతో మహేందర్‌రెడ్డి తాండూరులోని తన మద్దతుదారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి కూడా బీఆర్ఎస్ తాండూరు టికెట్ మనకే వస్తుందని ధీమా వ్యక్తంచేసినట్లు వినికిడి. సయోధ్య కుదిరిందా..? బీఆర్ఎస్ అధిష్టానం చొరవతో.. మహేందర్‌రెడ్డి మనసు మార్చుకున్నారా..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లటంతో పాటు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టం కావడంతోనే.. పార్టీ నష్టపోతుందనే కారణంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి పట్నం మనసు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమా.. ఫైనలా..? అనే విషయాపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా అలక పాన్పు వేసి అనుకున్నది సాధించుకున్న పట్నం తనను నమ్ముకుని.. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆయన మద్దతుదారులను ఏం చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
ముగ్గురు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్లో కోల్డ్‌వార్!
వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీలో రాజకీయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టెన్షన్ పెడుతున్నాయి. ఓ మాజీ మంత్రి అసంతృప్తితో రగిలిపోతూ ఎమ్మెల్యేలను ముప్పతిప్పలు పెడుతున్నారని టాక్. తెరవెనుక పావులు కదుపుతూ తమను దెబ్బతీస్తున్నారని ఆ సీనియర్ నేత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఆ సీనియర్ ఎవరు?.. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెర వెనక చక్రం తిప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి క్యాబినెట్లో బెర్త్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రవేశించారు. వరుసగా మూడు సార్లు తన సతీమణి పట్నం సునీతారెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారు. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలదే ఫైనల్ డెసిషన్ కావడంతో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తెరవెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మహేందర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా బీఆర్ఎస్ చీలిపోయింది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ చాలాసార్లు రచ్చకెక్కింది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పొసగడం లేదు. గతంలో మర్పల్లిలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డిపై ఎమ్మెల్యే ఆనంద్ తన వర్గీయులతో దాడి చేయించారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి.. ఆనంద్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల వికారాబాద్ లో ఎమ్మెల్యే ఆనంద్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆనంద్ వర్గీయులు సమావేశం దగ్గరకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్తా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు చేరింది. ఇరువర్గాలకు మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి.. తనకు వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి, ఆనంద్‌తో కలిసి జట్టు కట్టారని గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. పరిగిలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మనోహర్ రెడ్డిని తనవైపు తిప్పుకుని మహేంద్రుడు చక్రం తిప్పుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కునుకు లేకుండా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన వ్యతిరేకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్: చిక్కుల్లో పైలట్.. ఉత్సాహంలో పట్నం
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న తాండూరు గులాబీ రాజకీయాలు.. ఏ మలుపు తీసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చిక్కుల్లో పైలట్ .. ఉత్సాహంలో పట్నం రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంచలనంగా మారారు. అప్పటి నుంచి వార్తల్లో హైలెట్ గా నిలిచారు. ఈ కేసు తరవాత చాలా రోజులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసు కారణంగా సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. పక్షం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోహిత్‌రెడ్డి...ఎమ్మెల్సీ వర్గాన్ని బలహీన పరిచే పనిలో పడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉందనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి క్రమంగా కేడర్ దూరం అవుతోంది. ఎమ్మెల్యే కారణంగా తన క్యాడర్ దూరం అవుతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి... తన వర్గబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పెద్ద బాస్ భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బలంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఎర అంశంతో తాండూరు పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్ళానని ప్రచారం చేసుకుంటున్నారు. తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నిధులు తెస్తున్నానని పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మళ్లీ తానే పోటీ చేస్తానని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. తాండూరు గులాబీ తోటలో ఇప్పడు సీటు విషయమై రచ్చ రచ్చ అవుతోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కేడర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telangana: బీజేపీ మెయిన్ టార్గెట్ ఆ ఆరుగురే..!
తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి? తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్ఎస్కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు. పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు. 1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. 2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్‌హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు. 3. జలగం వెంకటరావు ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. 4. జూపల్లి కృష్ణారావు తుమ్మల లాగే టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. 5. పట్నం మహేందర్ రెడ్డి నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. 6. బాల్కొండ సునీల్ రెడ్డి బాల్కొండ టీఆర్ఎస్లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్‌కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్‌రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్‌లో సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు. మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్‌గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు -
పంతం నీదా.. నాదా!.. ‘మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా’
నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్లకుగా పైగా ఈ తతంగాలను గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు వీరి తీరును ఈసడించుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం వినూత్న నిరసనలతో వీరి తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గల్లోనూ అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నా తాండూరులో ఇవి తార స్థాయికి చేరాయి. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగడం పరిస్థితికి అద్దం పట్టింది. తాండూరులో రోడ్ల దుస్థితిపై చెప్పుల దండ వేసుకుని నిరసన మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా.. ‘జనం బాధలు పట్టించుకోని ఈ నేతలకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుల దండ మెడలో వేసుకుని ఇటీవల నిరసన తెలిపాడు. ‘తాండూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని రోడ్ల ను చూసి.. ఈ నాయకుల్లో చలనం రాకపోవడం తమ దౌర్భాగ్యం’ అని పట్టణ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు, అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టిస్తానని చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను అరెస్టులు, గదమాయింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైలెట్ చేరికతో సీన్ రివర్స్ టీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మొదటినుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హరీశ్వర్‌రెడ్డి వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా మారారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. అనూహ్యరీతిలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత కొద్ది రోజులకే రోహిత్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేచింది. మంత్రి సబితారెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు, మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుతో జనం అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో నూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీరి మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పెద్దేముల్ మండలంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేయడం నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సొంత కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ సాగుతోంది. -
Ranga Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..మళ్లీ ఆ ఇద్దరే
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్ నుంచి ఇదే జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించ లేదు. ఆయా పార్టీలకు ఓట్లు తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఆయా పార్టీలు స్థానిక సంస్థల ఫోరం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదీ లెక్క.. ► ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 627 మంది మహిళలు, 552 మంది పురుషులు ఉన్నారు. ► 310 మంది కార్పొరేటర్లు, 432 మంది కౌన్సిలర్లు, 384 మంది ఎంపీపీలు, 33 మంది జెడ్పీటీసీలు, 20 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నారు. ► ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటికి 21, 22 తేదీల్లో స్క్రూట్నీ నిర్వహించి 23న తుది జాబితా ప్రకటించనున్నారు. ► ఈ నెల 16 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న పరిశీలించి, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ► ఎన్నికల కోసం రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏం చేశారని జైల్లో పెడతారు? బీజేపీకి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా’ అని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాల కంటే సీఎం కేసీఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నందున అపుడు ఎవరు గెలుస్తారో చూద్దామని మహేందర్‌రెడ్డి సవాలు చేశారు. చదవండి: చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’ రామ మందిరానికి రూ.లక్ష విరాళం: పొన్నాల ‘నా పేరు లక్ష్మణుడు.. అందుకే రామభక్తితో నా వంతుగా రామ మందిర నిర్మాణానికి రూ.1,00,116 విరాళంగా ఇస్తున్నా..’అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాముణ్ని రాజకీయాల్లోకి లాగకుంటే మంచిదని, గతంలో తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టానని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని కోరారు. -
రైతు సమితి రేసులో మహేంద్రుడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పదవి రేసులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా? ఆయన స్వయంగా ఈ కుర్చీని ఆశిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయన పేరు టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ పదవిలో కొనసాగిన నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాజాగా శాసనమండలి చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం చెబుతుండడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ పట్నం వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మొన్నటి వరకు ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గ నేత ఉండటంతో.. త్వరలో జరిగే నియామకంలోనూ అదే వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టే ఆలోచన ఉందనే చర్చ జరుగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ఒక దఫా మంత్రిగా సేవలందించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మహేందర్‌రెడ్డి ఎంతో బలమైన నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. -
చిచ్చురేపిన సభ్యత్వ నమోదు
సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ కమిటీల నియామకం.. మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. మరోసారి వర్గపోరు.. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేశాం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్షిప్ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. – అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
‘పట్నం’కే పట్టం
స్సాక్షి, రంగారెడ్డి జిల్లా :థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేందర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం. క్రాస్ ఓటింగ్ ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్ఎస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్ఎస్ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్ఎస్కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. అప్పుడు ఓటమి..ఇప్పుడు గెలుపు గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నేపథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. ‘స్థానికత’ను సానుకూలంగామలుచుకున్న టీఆర్ఎస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రశాంతం ముగిసింది. రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయంలో ఓట్ల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. కౌంటింగ్ కేంద్రానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, కార్పొరేటర్లు కోరని శ్రీలత, రావుల విజయ తదితరులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించారు. సమష్టి కృషితో విజయం ప్రజాప్రతినిధులందరి సమష్టి కృషితో తాను భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం మహేందర్‌రెడ్డికి రిటర్నింగ్ హరీష్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్దే గెలుపు ఏ ఎన్నికలు జరిగినా గెలుపు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్ధానాలను టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగడంతో స్వల్ప తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో కూడా టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. భారీ బందోబస్తు.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయం వద్ద ఏసీపీ ఆశోకచక్రవర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలను వంద మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. చెల్లుబాటు కాని ఓట్లు 21ఇరు పార్టీలు నిర్వహించిన శిబిరాల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలనే దానిపై సభ్యులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. దాదాపు వారం రోజులపాటు రోజుకు రెండుసార్లు అవగాహన కల్పించినట్లు సమాచారం. అయినా, సభ్యులు సరిగా ఓటు వేయలేకపోవడం గమనార్హం. మొత్తం 797 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాని ఓట్లలో టీఆర్ఎస్వి 3 కాగా.. కాంగ్రెస్‌వి 18 ఓట్లు ఉన్నాయి. -
‘పట్నం’కే పట్టం
గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నే పథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉపఎ న్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేం దర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం. క్రాస్ ఓటింగ్ ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్ఎస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్ఎస్ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్ఎస్కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ‘స్థానికత’ను సానుకూలంగా మలుచుకున్న టీఆర్ఎస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
మండలి టికెట్ మహేందర్‌రెడ్డికే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, అధికార పార్టీ తరఫున బరిలో ఎవరు ఉంటారన్నది ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ మధ్యలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి సబితమ్మకు మంత్రి పదవితోపాటు కార్తీక్‌కు ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే కార్తీక్ మాత్రం ఎమ్మెల్సీ బరిలో లేరని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఎవరి పేరు ఖరారు చేసినా తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. సీఎం భరోసా మేరకు.. అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహేందర్‌రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఆశించారు. దాదాపు ఈ టికెట్ ఆయనకే ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, అనూహ్యంగా మహేందర్‌రెడ్డి మిత్రుడు పారిశ్రామికవేత్త డాక్టర్ రంజిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇలా చివరి నిమిషంలో టికెట్ చేజారిన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్ అప్పుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మహేందర్ రెడ్డి వైపు సీఎం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలు శనివారం ప్రత్యేకంగా గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దిరిలో ఒకరికి అవకాశం ఇస్తారా? లేదంటే మరొకరిని తెరమీదకు తీసుకొస్తారా? అనేది ఈ భేటీలో తేలనుంది. -
చేవెళ్ల టికెట్ ఎవరికో..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు. మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పట్నం’కు దక్కేనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ నుంచి పటిష్ట క్యాడర్ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్ పేరు తెరమీదకు రావడంతో టికెట్ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్ కేటాయింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. -
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్‌లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్లో కేబినెట్లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్.. సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్ఆర్టీసీకి చైర్మన్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. -
మంత్రుల సీటు..
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ హేమాహేమీలైన నేతలు బరిలో నిలిచి గెలుపొందడమే కాకుండా...మంత్రి పదవులు చేపట్టారు. అందుకే దీన్ని మంత్రుల సీటుగా చెప్పొచ్చు. 20014లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించగా...అంతకు ముందు ఇక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచిన మర్రి చెన్నారెడ్డి, మాణిక్‌రావు, చంద్రశేఖర్‌రావులు కూడా మంత్రులుగా పనిచేశారు. 2004లో గెలిచిన నారాయణరావుకు కూడా మంత్రి పదవి ఛాన్స్ లభించినా..కొన్ని కారణాల వల్ల ఆయనకు చివరి నిమిషంలో పదవి దక్క లేదు. మొత్తమ్మీద తాండూరు నుంచి గెలిచిన ఎక్కువ మంది మంత్రి పదవి చేపడతుండడం గమనార్హం. ఇక వ్యవసాయ, వాణిజ్యపరంగా తాండూరు నియోజకవర్గం మంచి ప్రగతి సాధించింది. ఈ ప్రాంతంలో కంది సాగు ప్రత్యేకత కలిగి ఉంది. నాపరాయి, సుద్ద, లాటరైట్ వంటి ఖనిజాలకూ తాండూరు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ సారి బరిలో టీఆర్ఎస్ తరుపున మరోసారి పట్నం మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన నాలుగున్నరేళ్ల కాలంలో తాండూరు నియోజకవర్గానికి రూ.1800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాధించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తనకున్న ప్రాబల్యం, చేపట్టిన పనులు ఈసారి ఎన్నికల్లోనూ గెలిపిస్తాయని మహేందర్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బషీరాబాద్ మండలానికి చెందిన పైలట్ రోహిత్‌రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఈయన మొదటిసారి తాండూరు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు. స్థానిక నేతల సహకారంతో ప్రచారం చేపట్టారు. తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. మొత్తానికి తాండూరు నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్ ప్రొఫైల్.. పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ మూడు దశాబ్దాల పాటు గెలుస్తూ వస్తున్న మహరాజుల కుటుంబ సభ్యులను ఓడించి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. గతంలో స్థానికేతరుడని ముద్ర ఉంది. అయితే తరచు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి చేరువయ్యారు. తిరిగి 1999, 2009లలో టీడీపీ తరపునే విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరుపునా ఆయన తిరిగి విజయం సాధించి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. 2004లో మాత్రమే ఒకసారి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి 6వ సారి పోటీకి దిగుతున్నారు. ప్రధాన సమస్యలు - తాండూరులో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఉపాధి లభించడం లేదు. దీనిపై ఇక్కడి యువత కొంత అసంతృప్తిగా ఉన్నారు. - తాండూరు పట్టణంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇవి ఏర్పాటైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది. - తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. - గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కొన్నిచోట్ల అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేకతలు - తాండూరులో గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఐటీఐ కళాశాల మంజూరు నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేసింది. - రైతు బజార్ , సోలార్ విద్యుత్ కేంద్రం నిర్మాణం - తాండూరు మున్సిపల్ పరిధిలో రోడ్ల విస్తరణ వంటి ముఖ్యమైన అభివృద్ధి పనులు మహేందర్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. - కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 4448 మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల నిధులు అందించారు. - సీఎం సహాయ నిధి ద్వారా వివిధ చికిత్సల కోసం 1,113 మందికి రూ.6.60 కోట్ల వరకు ఆర్థిక సాయం చేశారు. - మిషన్ కాకతీయ పథకం ద్వారా 198 చెరువులను బాగు చేసేందుకు రూ.74 కోట్ల మంజూరు. - తాండూరు బైపాస్ రోడ్డుకు రూ.78కోట్ల నిధులు మంజూరు. - పంచాయతీరాజ్ నిధుల ద్వారా 1987 అభివృద్ధి పనులకు గాను రూ.185 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు. - ఇందర్‌చెడ్, నవాంద్గి ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.1.82 కోట్ల నిధులు మంజూరు. పనులు కొనసాగుతున్నాయి. - మిషన్ భగీరథ ద్వారా 185 గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో 3.24 లక్షల మందికి ఇంటింటికీ తాగునీరు. - రైతు బంధు పథకం ద్వారా 54,115 మంది రైతులకు రూ.65,18 కోట్ల వరకు పెట్టుబడి సాయం .::: ఇన్పుట్స్: కరణం భీంసేన్ రావు, తాండూరు -
మంత్రి మహేందర్‌కు ఎస్బీఐ షాక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికలవేళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన కుటుంబీకుల ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జప్తు చేసింది. రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ‘పట్నం రాజేందర్‌రెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ’పేరిట ఏడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా షాబాద్ ఎస్బీఐ శాఖలో రుణం తీసుకున్నారు. ఈ అప్పుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్, మంత్రి సతీమణి సునీత పూచీకత్తు ఇచ్చారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 9న రుణగ్రహీతకు నోటీసు జారీ చేసింది. బకాయిపడ్డ రూ.1.78 కోట్లను రెండు నెలల్లోపు చెల్లించాలని షరతు విధించినా స్పందన రాకపోవడంతో సొసైటీ ఆస్తులతోపాటు పూచీకత్తుదారు ఇంటి స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేయడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఎడ్యుకేషనల్ సొసైటీ లిమిటెడ్ పేరిట షాబాద్‌లోని వివిధ సర్వే నంబర్లలో మొత్తం 25 ఎకరాల భూమిని, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పేరుపై వికారాబాద్ జిల్లా తాండూరు యశోదనగర్‌లో సర్వే నంబర్137/పి (ప్లాట్ నం.27/సీ పార్టు)లో ఉన్న వంద చదరపు గజాల విస్తీర్ణంలోని ఇంటిని జప్తు చేసింది -
వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు
తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికలు జూలై నెలాఖరు లోపు పూర్తవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 60 గిరిజనతండాలు, అనుబంధ గ్రామాలను కొత్త జీపీలుగా ఏర్పాటు చేశామన్నారు. 200 మంది ఓటర్లున్న తండాలు, 300 నుంచి 500 మంది ఓటర్లున్న అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా గుర్తించామని స్పష్టంచేశారు. వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించామని తెలిపారు. గ్రామాల అభివద్ధిపై సీఎం కేసీఆర్ దష్టిసారించారన్నారు. వచ్చే నెలలో ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 26న పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారవుతాయని చెప్పారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది అన్నదాతలకు రైతుబీమా పథకం కింద రూ.12 వేల కోట్లు అందజేశామని చెప్పారు. జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నవాబ్‌పేట, యాలాల మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ఇందులో రూ.25 కోట్లతో అభివద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని త్వరలో తాండూరు మున్సిపాలిటీలో అభివద్ధి పనులు జరుగుతాయన్నారు. తాండూరు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు రానున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
‘రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి’
తాండూర్(రంగారెడ్డి): రాష్ట్రంలో ఏటా జరుగుతున్న వేలాది రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తాండూర్ ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.18కోట్లతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. సురక్షితంగా వాహనాలను నడిపేలా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని అన్నారు. ప్రమాదాల నివారణ లో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణానికి అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లఘుచిత్రాలు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. అంతకుమునుపు ఆయన డిపోలో మొక్కలు నాటారు. -
బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రులు
గోదావరిఖని(కరీంనగర్): కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్‌డిపోలో నూతన బస్సు సర్వీసులను మంత్రులు ప్రారంభించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో డిపోనకు కొత్తగా మంజూరైన 10 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులతోపాటు తిరుపతికి ఏసీ బస్సును మంత్రులు ఈటల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
'నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుంది'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఏపీ మంత్రులే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలను ఏపీలో టీడీపీ కిడ్నాప్ చేయలేదా అని మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదే విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీకి ఉనికి ఉండదని ఆయన చెప్పారు. -
'నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుంది'
-
వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే...
హైదరాబాద్: ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేకే సీఎం చంద్రబాబు నాయుడు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. టీడీపీలో లూటీ నేతలు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. -
అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 26 కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. -
రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి
కీసర(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
పరిగిలో వంద పడకల ఆస్పత్రి
పరిగి, పరిగి రూరల్: వెనుకబడి ఉన్న పరిగిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆసరా పథకంలో బాగంగా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పరిగి సర్పంచ్ విజయమాల ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో , మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ ప్రారంభ సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ శాఖ మంత్రితో మాట్లాడి పరిగి పంచాయతీ భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. తెలంగాణా ఆర్టీసీని దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామని తెలిపారు. రూ. 150 కోట్లతో 500 బస్సులు, ఇందులో 100 ఏసీ బస్సులు త్వరలో కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తామన్నారు. ఈవారంలో పరిగి డిపోకు ఐదు బస్సులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్లులేని కారణంగా బస్సులు నడవడం లేదని గుర్తించామన్నారు. ఆ గ్రామాలన్నింటికి రోడ్లు వేసి బస్సులు నడుపుతామన్నారు. ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ. 10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం రూ.ఐదు వేలకోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెల ల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు చెందిన నాలుగు పశ్చిమ నియెజకవ ర్గాల్లో ఉద్యానవన పంటలతో పాటు పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. వ్యవసాయానికి , గృహ అవసరాలకు 24 గంటల నిరంతర కరంటు ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 7కోట్ల రూపాయలను పింఛన్ల కోసం వెచ్చించగా కొత్త పింఛన్లతో రూ.27 కోట్లకు పెంచామన్నారు. జిల్లాలో 2.40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. పేదలకు ఇళ్లు, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలు వెంటనే ప్రారంభమవుతాయన్నారు. -
86 పశు వైద్యశాలలు మంజూరు
ఘట్కేసర్: జిల్లాకు 86 పశు వైద్యశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం 3.5 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రతాప్సింగారంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని 1300 గ్రామాలకు రవాణా వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకూ రోడ్లు వేస్తామన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నీటి ఎద్దడి సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం శివారు ప్రాంతంలో ఉన్నందున 3 డిపోలను ఏర్పాటు చేయాలన్నారు. చెంగిచర్ల డిపో నుంచి రోడ్డు వేయాలని కోరారు. సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్ల స్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యులు మంకం రవి, కేశవనాథం, రమాదేవి, సర్పంచ్‌లు స్వర్ణలత, నక్క వరలక్ష్మి, మూసీ శంకరన్న, నాయకులు బైరు రాములు, లక్ష్మణ్, నరసింహ, కొంతం వెంకట్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాట కుమార్, ధరంకార్ సత్యరాం పాల్గొన్నారు. ఆహ్వానపత్రం అందలేదు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదంటూ ప్రతాప్‌సింగారం సర్పంచ్ బాషగల్ల ఆండాలు, ఎంపీటీసీ సభ్యులు సంజీవ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. గ్రామానికి ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌కు తెలియకుండా అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని ఎంపీటీసీ సభ్యుడు సంజీవ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రజక సంఘం ప్రారంభ కార్యక్రమాన్ని సైతం ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. -
మాది ప్రగతిపథం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో ప్రతిరోజు 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరీకరణ నేపథ్యంలో భవిష్యత్తులో పెరిగే రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను విస్తృతం చేయనున్నాం. అందుకనుగుణంగా మరిన్ని బస్సు డిపోలను ఏర్పాటు చే యాలని నిర్ణయించాం. గ్రేటర్ పరిధిలో కొత్తగా 9 డిపోలను ఏర్పాటు చేస్తున్నాం. ముర్తుజాగూడ, కొండాపూర్, దొమ్మరిపోచంపల్లి, తిమ్మాపూర్(మహబూబ్‌నగర్ జిల్లా), నార్సింగి, శంకర్పల్లి, ఉప్పర్‌పల్లి, కుత్బుల్లాపూర్, కోహెడలో ప్రతిపాదించిన ఈ డిపోలు ఏడాదిలోగా కార్యరూపం దాలుస్తాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన వీటికి స్థలాలను సేకరిస్తున్నాం. చేవెళ్ల, జవహర్‌నగర్, నాదర్గుల్, శామీర్ పేటల్లో డిపోలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి కే నిర్వహణలో ఉన్న మహేశ్వరం డిపోకు 60 బస్సులను కేటాయించాం. మిగతా డిపోలకు కూడా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నాం. జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 80 ఏసీ బస్సుల్లో అధికశాతం గ్రేటర్ పరిధిలోనే తిప్పనున్నాం. ‘క్యూ’ బాగుంది ఇటీవల ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేశాం. మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్ ప్రవేశపెట్టిన ‘క్యూ’ విధానాన్ని ఇప్పటివరకు అవలంభిస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మెట్రో, లోకల్ రైళ్లు, బస్స్టేషన్లను అనుసంధానించడం వల్ల క్రమపద్ధతికి అక్కడి ప్రజలు అలవాటుపడ్డారు. హైదరాబాద్‌లో ఆ తరహా వ్యవస్థ లేకపోవడంతో లైన్లో బస్సులు ఎక్కే విధానానికి ఇక్కడి ప్రయాణికులు అలవాటు పడలేదు. ఎన్జీఓస్కాలనీ, సచివాలయం, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి తదితర కాలనీలో ఈ విధానం అమలులో ఉన్నా... పూర్తిస్థాయిలో అమలు కావాలంటే మాత్రం ‘మెట్రో’ అందుబాటులోకి వచ్చిన తర్వాతే సాధ్యపడే అవకాశముంది. 111 జీవోను సడలిస్తాం పశ్చిమ ప్రాంతంలోని 84 గ్రామాల అభివృద్ధికి నిరోధకంగా మారిన 111 జీవోను సడలించే ందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. న్యాయ నిపుణులతో అత్యున్నతస్థాయి కమిటీ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. ఎన్నిక ల్లో హామీ ఇచ్చినందున అసెంబ్లీ సమావేశాలనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పారు. త్వరలోనే 111 జీవో సమస్య కొలిక్కి రానుంది. మారనున్న రూపురేఖలు విస్తారంగా ఉన్న వనరులు జిల్లాకు కలిసొచ్చే అంశం. పెట్టుబడుల తాకిడి కూడా మన జిల్లాకే ఎక్కువ ఉంది. ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే అనుమతులిచ్చేలా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుడుతుండడం సానుకూలంగా మారింది. ఏపీతో పోలిస్తే భూ లభ్యత, వాతావరణ పరిస్థితులు మన రాష్ట్రానికి ప్లస్పాయింట్లు. కొత్తగా ఐదు జిల్లాలు జిల్లాల పునర్వ్యస్థీకరణతో బాగా లబ్ధిపొందేది మన జిల్లానే. ఒక జిల్లా స్థానే నాలుగైదు జిల్లాలుగా ఏర్పడనుంది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాలో పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నియోజకవర్గాలను కూడా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. జిల్లాల ఏర్పాటులో పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికగా తీసుకుంటాం. కలుపుకుపోతా ఐదేళ్లవరకు ఎలాంటి ఎన్నికల్లేవు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తాం. జిల్లా అభివృద్ధిలో అన్ని పార్టీల సూచనలు, సలహాలు స్వీకరిస్తా. రాజకీయాల జోలికి వె ళ్లకుండా జిల్లా సమగ్రాభివృద్ధికి ‘పెద్దన్న’లా వ్యవహరిస్తా. ఉద్యానపంటలకు ప్రోత్సాహం నగరానికి 60 కి.మీ. విస్తీర్ణంలో కూరగాయల మండలిని ఏర్పాటు చేయనున్నాం. కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రైతాంగానికి రాయితీలు ఇవ్వాలని యోచిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పూలు, పండ్లను ఇక్కడే పండించేలా రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. రుణమాఫీ కింద జిల్లాలో 2.18 లక్షల మందికి రూ.1061 కోట్ల మేర అప్పులు మాఫీ అవుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు పరిగి, తాండూరు, చేవెళ్లలో పంటలకు ఆపారనష్టం కలిగింది. రైతాంగాన్ని అదుకునేందుకు పంటనష్టం అంచనాలు రూపొందించాలని యంత్రాంగాన్ని ఆదేశించాం. -
పట్నం వర్సెస్ తీగల
భూమి పూజ కార్యక్రమంలో నేతల మధ్య వాగ్వాదం హైదరాబాద్: భూమి పూజ కార్యక్రమం విషయంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలతో మంద మల్లమ్మ చౌరస్తాలో ఆర్సీఐ రోడ్డు వెడల్పుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజ రయ్యారు. అయితే భూమి పూజ విషయంలో ఆర్సీఐ అధికారులు తమను సంప్రదించలేదని మహేందర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరు పార్టీల కార్యకర్తలు సముదాయించి నాయకులిద్దరిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. -
పట్టం పట్నంకే..
* రంగారెడ్డి జిల్లా పరిషత్ కూడా గులాబీదే * చైర్‌పర్సన్‌గా పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నిక * కాంగ్రెస్‌ను కాదని టీఆర్ఎస్తో టీడీపీ దోస్తీ * ‘దేశం’కు వైస్ చైర్మన్ పదవి.. చక్రం తిప్పిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘పాలమూరు ఫార్ములా’తో అధికార టీఆర్ఎస్ రంగారెడ్డి జెడ్పీనీ కైవసం చేసుకుంది. టీడీపీతో జతకట్టి జెడ్పీ పీఠంపై గులాబీ గుభాళించింది. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏడుగురు తెలుగుదేశం జెడ్పీటీసీలు మూకుమ్మడిగా.. టీఆర్ఎస్ను బలపరిచారు. అంతేకాక కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు సభ్యులు కూడా అధికారపార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి రెండోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పంచుకోవడానికి పవర్‌షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనతో కంగుతిన్నాయి. రంగారెడ్డి జెడ్పీని కైవసం చేసుకోవడానికి ఏమాత్రం బలంలేని టీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన తొమ్మిది మంది జెడ్పీటీసీలను తనవైపునకు తిప్పుకుని చైర్పర్సన్ పదవిని సునాయాసంగా కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయం వరకు.. కాంగ్రెస్-టీడీపీల కూటమి నుంచే చైర్పర్సన్ ఎన్నికవుతారనే ప్రచారం జరిగింది. పదవీ కాలం పంచుకోవడంలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నదానిపై సందిగ్ధం ఉన్నా.. టీఆర్ఎస్కు జెడ్పీ పీఠం దక్కకుండా చేయాలని రెండుపార్టీల నాయకత్వాలు భావించాయి. కానీ, మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో తనకున్న పాత పరిచయాలను అనుకూలంగా మార్చుకుని వారి ఆశలపై నీళ్లు చల్లారు. టీడీపీ జెడ్పీటీసీలు ఎవరూ చేజారిపోకుండా ఆయన ముందునుంచీ వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్తో అంతర్గతంగా జరుగుతున్న ఒప్పందం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఎనిమిది జెడ్పీలలో నల్లగొండ మినహా మిగిలిన ఏడింటిలో విజయకేతనం ఎగురవేసింది. ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, మండల పరిషత్‌ల ఎన్నికలు హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వాయిదాపడ్డాయి. రెండు మినహా అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి.. ఈ నెల 4న ఎన్నికలు వాయిదా పడిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్, హన్మకొండ మండల పరిషత్‌లలో ఎన్నిక మళ్లీ వాయిదాపడింది. కరీంనగర్ జిల్లా ముత్తారం, మహాముత్తారం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మెదక్ జిల్లా సదాశివపేట, నల్లగొండ జిల్లా మునగాల, యాదగిరిగుట్ల, భువనగిరి, ఆత్మకూరు, నిజామాబాద్‌లోని బిక్కనూరు, రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల, శంషాబాద్, కీసర, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్, వెంకటాపురం, నల్లబెల్లి, జనగామలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు, నల్లగొండ జిల్లా చివ్వెంల, గరిడేపల్లిల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయినట్లు అధికారవర్గాలు వివరించాయి. -
2న ముంబైకి తెలంగాణ అధికారుల బృందం
హైదరాబాద్: ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వచ్చేనెల 2న ముంబైకి అధికారుల బృందాన్ని పంపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ముంబై తరహా రవాణా వ్యవస్థను హైదరాబాద్ లో అమలు చేయాలన్న ప్రతిపాదనపై బుధవారం ఆయన అధికారులతో చర్చలు జరిపారు. ఆర్టీసీ పోలీస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన చర్చకు రాలేదని సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పారు. ముంబైలో ప్రయాణికులు బస్సెక్కేందుకు పాటిస్తున్న ‘క్యూ’ పద్ధతిని హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. -
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
-
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
మండీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ఘటనలో విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. విద్యార్థుల వెంబడి సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు గల్లంతైన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగి ఇన్నాళ్లైనా దర్యాప్తు నివేదిక ఎందుకివ్వలేదని హిమాచల్ ప్రభుత్వ యంత్రాంగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలీచాలని నష్టపరిహారం ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. నష్టపరిహార మొత్తాన్ని పెంచాలని సూచించింది.