2న ముంబైకి తెలంగాణ అధికారుల బృందం | telangana official to observe mumbai transport system | Sakshi
Sakshi News home page

2న ముంబైకి తెలంగాణ అధికారుల బృందం

Published Wed, Jun 25 2014 7:58 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

మంత్రి పట్నం మహేందర్ రెడ్డి - Sakshi

మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వచ్చేనెల 2న ముంబైకి అధికారుల బృందాన్ని పంపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ముంబై తరహా రవాణా వ్యవస్థను హైదరాబాద్ లో అమలు చేయాలన్న ప్రతిపాదనపై బుధవారం ఆయన అధికారులతో చర్చలు జరిపారు. ఆర్టీసీ పోలీస్‌, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన చర్చకు రాలేదని సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పారు. ముంబైలో ప్రయాణికులు బస్సెక్కేందుకు పాటిస్తున్న ‘క్యూ’ పద్ధతిని హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement