మండలి చైర్మన్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఎలా నియమిస్తారు
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహేందర్‌రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆయనను చీఫ్ విప్‌గా మండలి చైర్మన్ ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందనడానికి ఈ నియామకం ఓ ఉదాహరణ అని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమించారని ధ్వజమెత్తారు. సభలో బిల్లులు పాస్ చేయించడం, ప్రభు త్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్‌విప్ బాధ్యత అని అన్నారు.
‘బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా?’అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ చెప్పారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని గుర్తు చేశారు.
అయితే మార్చి 15వ తేదీన మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమిస్తూ గెజిట్ విడుదల చేశారని, మార్చిలో చీఫ్‌విప్ అయితే పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీగా ఆయన జెండా ఎగురవేస్తారని జీఏడీ జీవో ఎలా ఇస్తుందని హరీశ్ ప్రశ్నించారు. అనర్హత వేటు వే యాల్సిన కౌన్సిల్ చైర్మన్.. స్వయంగా మహేందర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా నియమి తులైనట్లు బులెటిన్ ఇవ్వటం సరికాదన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment