సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌పై గుత్తా ఫైర్..
- ఉద్యోగ నియామకాల మీద బీఆర్‌ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారు
- ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిది
- మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.
- ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి
- ఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.
- ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.
- నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.
- బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలి
- ఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దు
- మూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
- హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.
- ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.
- అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే..
ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment