మీపై ఇంకా చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్‌ | Minister Ponnam Prabhakar Counter Reaction To KTR Over How Many Jobs Were Given In KCR Govt | Sakshi
Sakshi News home page

ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్‌

Oct 9 2024 10:22 AM | Updated on Oct 9 2024 12:42 PM

Minister Ponnam Prabhakar Counter To Ktr On Jobs

సాక్షి,హైదరాబాద్:రాహుల్ గాంధీపై సెటైర్స్ వేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు.పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం(అక్టోబర్‌9) ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

‘మేం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.విదేశీ విద్యానిధి  గత ప్రభుత్వంలో 150 మందికి ఇచ్చారు.మేం 500 మందికి ఇవ్వబోతున్నాం.అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు.

ప్రజలు ఓడించాక ఇంకా పదేళ్ల పాలన పై చర్చ ఎందుకు’అని పొన్నం అన్నారు. కాగా, యువతకు 2 లక్షల ఉద్యోగాలిచ్చిన రాహుల్‌గాంధీకి హైదరాబాద్‌ అశోక్‌నగర్‌కు స్వాగతమని ఎక్స్‌లో కేటీఆర్‌ చేసిన పోస్టుకు పొన్నం కౌంటర్‌ ఇచ్చారు. 

ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసం మా పరువు తీశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement