తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్‌కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం.
మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్‌ఎస్‌ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment