బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని ప్రజలు అనుకుంటున్నారు: ఎంపీ కేకే
కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారని వ్యాఖ్య
తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉందని కితాబు
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్‌లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్‌ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్‌ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్
తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్‌ఎస్ నేత విప్లవ్‌కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment