Hyderabad Mayor
-
పార్టీలు మారనున్న కార్పొరేటర్లు?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పార్టీలు మారనున్నారా? అంటే కాదనలేమనే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో జీహెచ్ఎంసీలో ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న 15 స్థానాలూ ఇప్పటి వరకు బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకే ఏకగ్రీవమవుతూ వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ (standing committee) సభ్యులవుతారు. ఏడాది కాలపరిమితి గల స్టాండింగ్ కమిటీకి గత సంవత్సరం వరకు బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తు బంధం కొనసాగింది. రెండు పార్టీలూ కలిస్తే.. పోటీలో దిగినా లాభం లేదనే తలంపుతో మిగతా పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఎంఐఎం తమకు లభించే ఏడు స్థానాల కోసం అధిష్ఠానం ఎవరి పేర్లయితే ఎంపిక చేస్తుందో వారే నామినేషన్లు వేసేవారు. బీఆర్ఎస్ (BRS Party) నుంచి సైతం ఉపసంహరణ నాటికి దాని వాటా మేరకు ఎనిమిదిమంది మిగిలేవారు.జంపింగ్ సమయం.. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి, రాజకీయ పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలతోపాటు పలువురు కార్పొరేటర్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో మూడు స్థానాల నుంచి కాంగ్రెస్ బలం 24కు పెరగడం తెలిసిందే. ప్రస్తుతం ఎంఐఎం.. కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నందున ఈసారి అవి రెండూ కలిసి పోటీచేసే అవకాశం ఉన్నప్పటికీ, ఏక్షణం ఎలాంటి మార్పులైనా జరగవచ్చుననే తలంపుతో ఇతర పార్టీల నుంచి సైతం నామినేషన్లు వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. మరోవైపు, తమ పార్టీకి ఎక్కువ మంది సభ్యులుంటే స్టాండింగ్ కమిటీలో ప్రభావం చూపవచ్చుననే తలంపుతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 146 మంది కార్పొరేటర్లలో బీఆర్ఎస్కు అత్యధికంగా 42 మంది కార్పొరేటర్లున్నారు. ఆతర్వాత వరుసగా ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్‌కు 24 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఏపార్టీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే బీఆర్ఎస్ నెగ్గుతుంది. కానీ, అది సాధ్యం కాదని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు. మేయర్ పీఠంపై దృష్టితో.. మరోవైపు, బల్దియాలో తమ బలం పెంచుకొని వచ్చే సంవత్సరం జరగబోయే పాలకమండలి ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే బలాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని మూడు పార్టీలూ భావిస్తున్నందున కూడా ప్రస్తుతం పార్టీ మార్పిడులు జరిగేందుకు అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపార్టీలో చేరిన వారి సంఖ్య 24కు పెరిగినప్పటికీ, చేరేవారు ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గత సంవత్సరం ఆగిపోయిన చేరికలను కాంగ్రెస్ తిరిగి ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు. కార్పొరేటర్లకు మిగిలిన ఏడాది పదవీ కాలంలో ఎక్కువ నిధులు పొందేందుకు, తద్వారా ఎక్కువ పనులు చేసి వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు ఆపార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది.చదవండి: ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్బీజేపీ సైతం కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ గెలుపు జెండా ఎగురవేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమందిని చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదపనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు స్టాండింగ్ కమిటీ ఎన్నిక తగిన సమయమని చెబుతున్నారు. కొందరు పార్టీలో చేరినంత మాత్రాన ఏ పార్టీ కూడా సొంతబలంతోనే అన్ని స్థానాలూ గెలవలేదని, అందుకు వివిధ కారణాలున్నాయని కొందరు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే 15 స్థానాలు లభిస్తాయంటున్నారు. అయినప్పటికీ తమ పార్టీకి ఎక్కువ బలం కోసం మూడు పార్టీలు ఎలాంటి కార్యాచరణ అమలు చేయనున్నాయో వేచి చూడాల్సిందే!మొదటి రోజు నామినేషన్లు నిల్.. స్టాండింగ్ కమిటీకి నామినేషన్ల తొలిరోజైన సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇద్దరు సభ్యులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. నామినేషన్ల దాఖలుకు 17వ తేదీ వరకు గడువుంది. ఈలోగా ఎవరు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో, ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేవలం స్టాండింగ్ కమిటీ కోసం ఇతర పార్టీలతో పొత్తు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కార్పొరేటర్లకు సూచించినట్లు సమాచారం. పోటీ చేయాలనుకుంటే బీజేపీ కార్పొరేటర్లు పోటీ చేయవచ్చునని అన్నట్లు తెలిసింది. -
మేయర్..ఫిబ్రవరి ఫియర్?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్(BRS Party) నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎంపికైన (GadwalVijayalakshmi)గద్వాల్ విజయలక్ష్మిని.. అలాగే డిప్యూటీ మేయరైన శ్రీలతా శోభన్‌రెడ్డిని పదవుల నుంచి తప్పించేందుకు ఆ పార్టీ వ్యూహం పన్నుతోందా? అంటే కాదనలేని పరిస్థితి నెలకొంది. బల్దియాలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతలకు అప్పటి ప్రభుత్వ ఆశీస్సులతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. అప్పట్లో ఎంఐఎం బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీ వల్ల అధికారం దక్కించుకున్న వారు పార్టీపై విశ్వాసం చూపలేదనే తలంపుతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. తమ పార్టీ వల్లే పదవులు పొందిన వారు, పార్టీ మారినా రాజీనామా చేయకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతుండటాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమకు దక్కని యోగం.. వారికి దక్కడంపై అంతర్గతంగా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోకి వారి రాకతో తమ ప్రాధాన్యం తగ్గిపోయిందనే తలంపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా వారిని ఆ పదవుల నుంచి తప్పించాలనే యోచనలో పలువురు కార్పొరేటర్లున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలు 2020 డిసెంబర్లో జరిగినప్పటికీ, మేయర్, డిప్యూటీ మేయర్లు 2021 ఫిబ్రవరి 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో వారి నాలుగేళ్ల కాలం పూర్తవుతున్నందున, అది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే.. నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్‌అఫీíÙయో సభ్యులు వెరసీ.. మొత్తం 196 మంది ఉన్నారు. వీరిలో సగం అంటే 98 మంది సభ్యుల సంతకాలు అవసరం. బీఆర్ఎస్కు ప్రస్తుతం 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వెరసీ.. 71 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాసం పెట్టాలంటే మరో 27 మంది సభ్యులు అవసరం. గతంలోవలే ఎంఐఎం పొత్తు ఉంటే సాధ్యమయ్యేదే కానీ ప్రస్తుతం అది కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటం తెలిసిందే. ఎంఐఎం లేదా బీజేపీతో కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం ఆచరించనుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఎప్పుడు ఉపసంహరించుకుంటుందో చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏం జరిగేందుకైనా ఆస్కారం ఉందంటున్నారు. అందుకు రాజకీయాల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ కురీ్చకి గండం పొంచి ఉందని అంటున్నారు. డిప్యూటీ మేయర్‌కు సైతం అదే వర్తిస్తుందంటున్నారు. పార్టీలు మారారు ఇలా.. ⇒ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తొలుత రెండు సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ, లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్‌గౌడ్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాత పరిణామాలతో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి 18 మంది చేరడంతో ఆ పార్టీ బలం 24కు పెరిగింది. ⇒ ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒకరు మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం 41 మంది ఉన్నారు. ⇒ బీజేపీ 48 స్థానాల్లో గెలవగా ఆదిలోనే ఒకరు మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఓటమితో 47 మంది అయ్యారు. అనంతరం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మృతి చెందడం, కొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బలం 39గా ఉంది. ⇒ బీఆర్ఎస్ వారు 56 సీట్లలో గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు పార్టీలో చేరడంతో బలం 60కి పెరిగినప్పటికీ.. అనంతరం 18 మంది కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42 మంది ఉన్నారు. -
అసభ్య పోస్టులపై జీహెచ్ఎంసీ మేయర్ ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నా..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్‌లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్‌ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్‌గా పనిచేయడం అంత సులువు కాదని విజయలక్ష్మి అన్నారు. కాగా, తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించారు.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ మేయర్ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ
సాక్షి, వికారాబాద్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని ఓ వ్యక్తి బుధవారం మీడియా ఎదుట ఆరోపించాడు. ఇందుకు సంబంధించి అతడి వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్ 20లో పదెకరాల భూమిని గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో తామే కబ్జాలో ఉన్నామని చెప్పాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దొరసాని రాములమ్మ నుంచి తమ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. 2004 వరకు సదరు భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరునే నమోదై ఉందని తెలిపారు. అయితే 2005లో దొరసాని సంబంధీడైన నర్సింహారెడ్డి అప్పటి తహసీల్దార్ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన కడీలను నగర మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తొలగించేయిస్తున్నారని, అడిగితే చంపేస్తామని గన్‌తో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్ -
ఉప్పల్‌లో మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్ విజయలక్ష్మిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్‌తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు. -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు. శుక్రవారం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో చేపట్టిన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, కలెక్టర్ శర్మన్, వాటర్ వర్క్స్ అధికారి సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లను తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఎంఎంటీఎస్ స్పెషల్ ... ► ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి– సికింద్రాబాద్, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ► ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు.. ► నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ► బషీరాబాగ్ – కాచిగూడ, బషీర్‌బాగ్–రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్–దిల్‌సుఖ్‌నగనర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్–ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్ – వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ► ఉప్పల్– ఇందిరాపార్కు, మల్కాజిగిరి–ఇందిరాపార్కు, ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు ► లక్డీకాపూల్ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్ నుంచి బీహెచ్‌ఈఎల్‌వరకు, లకిడికాఫూల్ నుంచి కొండాపూర్, యూసుఫ్‌గూడ, రాజేంద్రనగర్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ► ఆల్ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. నిమజ్జన మార్గాల్లో మళ్లింపు.. ► పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేస్తారు. ► సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ► ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి. హెచ్ఎండీఏ.. ► హుస్సేన్‌సాగర్‌లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. ► ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వాటర్‌బోర్డు.. ► 101 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది. గణేశ్ యాత్రలో ఇంకా.. ► గణేశ్ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్ వాహనాలు ఉంచుతారు. ► సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. ► టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ వైపు 3 బోట్లు, నెక్లెస్‌రోడ్ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు ► విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ చుట్లూ 48 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ► జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు. చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి -
మరో వివాదంలో హైదరాబాద్ మేయర్
సాక్షి, సిటీబ్యూరో: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ ఇంటిలో పని చేసే వారి కుటుంబీకులను నియమించేందుకు ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను తొలగించారంటూ సీపీఎం నగర శాఖ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ బాధితులతో కలిసి సోమవారం కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంజగుట్ట ప్రాంతంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు వి.భారతి, ఎల్.రమాదేవి, ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) సాయిబాబాలను తొలగించి మేయర్ ఇంట్లో పని చేసే వారి కుటుంబ సభ్యులను నియమిస్తూ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ జూన్ 22న ఉత్తర్వులు జారీ చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. తొలగించిన కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న భారతి గత ఏప్రిల్ 20న కరోనా బారిన పడి ఖమ్మం ఆస్పత్రిలో చేరిందని, తోడుగా పారిశుద్ధ్య కార్మికురాలిగానే పని చేస్తున్న తన కుమార్తె రమాదేవిని తీసుకు వెళ్లిందని, ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక మే 11న డ్యూటికీ రాగా, వారిద్దరినీ తొలగించామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచీ జీతం ఇవ్వకపోయినా పనిచేస్తున్నారని, వారిని యథావిధిగా కొనసాగించడంతో పాటు విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంలో మేయర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మేయర్ దగ్గర పని చేసేవారు కార్మికులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వాట్సాప్‌లో వైరల్.. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినందున ఎస్ఎఫ్ఏ సాయిబాబాను, ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు అనధికారికంగా గైర్హాజరైనందున రమాదేవి, భారతిలను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వారు విధులకు హాజరు కాకున్నా ఎస్ఎఫ్ఏ సాయిబాబా బయోమెట్రిక్‌లో అక్రమంగా హాజరు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు పంపినా హాజరుకాలేదని పేర్కొన్నారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదని తెలిపారు. సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ కమిషనర్‌కు అందజేసిన వినతిపత్రంతో పాటు జత చేసిన (జూన్ 22న జారీ అయినట్లుగా ఉన్న) ఉత్తర్వు ప్రతిలో రమాదేవి, భారతిల స్థానంలో వేరేవారిని నియమించినట్లు పేర్లున్నాయి. వారు మేయర్, ఆమె తండ్రి ఇంట్లో పని చేసే వారి కుటుంబీకులని పేర్కొన్నారు. -
వైరల్ : హైదరాబాద్ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్లు
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ..తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కూడా తనదైన స్టయిల్లో పంచులేశాడు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవలె ఈ వీడియోను ట్విట్టర్లో షేర్చేసింది. అందులో తన కుక్కకి కుడిచేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. దీనిపై స్పందించిన వర్మ..'నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. తక్షణమే ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కుక్కపై చూపిస్తున్న ప్రేమలో ఒక్కశాతం అయినా తెలంగాణ ప్రజలపై ఉందా? ఈ కుక్కను చూసి వాళ్లంతా ఇప్పుడు ఈర్ష్య పడుతుంటారు. కుక్కపై ఆమె చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. వచ్చే జన్మలో నేను ఆమె కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కుక్కపై మేయర్కున్న ప్రేమను కొందరు ప్రశంసిస్తుంటే, మరొకొందరు మాత్రం తప్పుబడుతున్నారు. చదవండి : (జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!) (డ్రగ్స్ ఎలా తీసుకోవాలో ఆ నటుడు నేర్పించారు) After seeing this video of @GadwalvijayaTRS I am wondering if she was drunk with love on a dog or in love with a drunk dog but the question is whether she loves the people as much as her dog.Honestly I pray to be born as a dog in my next birth if a mayor can love me this much 🙏 pic.twitter.com/3dQNXRFp13 — Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2021 -
హైదరాబాద్ మేయర్ పవర్స్ ఎంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ మేయర్ ఎవరా అన్న చర్చలు చోటు చేసుకోగా, ప్రస్తుతం మేయర్కున్న పవరేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. మేయర్ పదవి కోసం ఎందరెందరో పోటీపడటం.. తీవ్ర స్థాయిలో పైరవీలు చేయడం.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం మేయర్ అభ్యర్థిని ప్రకటించేందుకు ఆచితూచి వ్యవహరించడం.. చివరి నిమిషం వరకు అభ్యర్థిని వెల్లడించకుండా తీవ్ర ఉత్కంఠ రేపడం.. సీల్డు కవరుకు మొగ్గు చూపడం తదితర కారణాలతో మేయర్ అధికారాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారి కమిషనర్ కాగా, కమిషనర్ అధికారాలేమిటి..మేయర్ అధికారాలేమిటి..అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఎవరేం చేయవచ్చునంటే.. మేయర్ పవర్ ఇలా.. జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్యసమావేశాలను ఏర్పాటు చేయడం. సదరు సమావేశాలకు మినిట్స్ రూపొందించడం. సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించి సభ నిర్వహించడం. సర్వసభ్య సమావేశాల్లో రూ. 6 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలపడం. వారం వారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికీ అధ్యక్షత వహించడం. జీహెచ్ఎంసీకి సంబంధించి ఏ కొత్త పాలసీని అమలు చేయాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం. రూ.3 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలిపే అధికారం స్టాండింగ్ కమిటీకి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేసే సమయాల్లో కమిషనర్ మేయర్‌ను సంప్రదించాలి. ప్రమాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారంగా చెల్లించేందుకు పవర్ ఉంటుంది. కమిషనర్ అధికారాలిలా.. జీహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు కమిషనర్ సర్వోన్నతాధికారి. పనులు చేసేందుకు రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అధికారం. అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం. ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు..ఇతరత్రా ఫీజుల వసూళ్లు. అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు పనుల్ని నామినేషన్లపై ఇవ్వవచ్చు. ప్రభుత్వంతో సంప్రదింపులు..ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత. పాలకమండలి నిర్ణయాలు ప్రభుత్వానికి తెలియజేయడం. పాలకమండలిలో ఆమోదించిన బడ్జెట్‌ను ప్రభుత్వానికి నివేదించడం. నిర్ణయాలు తీసుకునే అధికారం మేయర్, పాలకమండలిది కాగా, వాటిని అమలు చేసే బాధ్యత కమిషనర్, అధికారులది. చదవండి: మేయర్ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం -
మేయర్ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరిపై ఒకరు నమ్మకం నిలుపుకోవాలి.. ఎన్నాళ్లయినా తరగనంత ప్రేమను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి.. అంటున్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. ఆమెది ప్రేమ వివాహమే.. అయితే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని.. ప్రేమకు ముందు ఏర్పడిన పరిచయం తమను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన మనసులోని మాటను ఆమె వెల్లడించారు. ఇద్దరమూ క్రీడాకారులమే.. నేను క్రికెట్ ప్లేయర్‌ను. ఆయన బాస్కెట్ బాల్ ప్లేయర్.. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు వచ్చి చూసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వెంగల్రావునగర్ ఇక్రిశాట్ క్లబ్లో ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడేవాళ్లం. అది స్నేహానికి దారి తీసింది. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ప్రేమంటే ఏంటో నాకు ఇంటర్ తర్వాత తెలిసింది. ఆయనకు సంబంధించిన స్నేహితుడితో మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పెద్దలను ఒప్పించాం.. నన్ను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించాను. బీబీఏ చదువుకున్న బాబిరెడ్డి తనతో ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమకు దారి తీయడంతో పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ చేశారు. మా ఇద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకొంటారో లేదో అని సందేహించాను. మీరే మా పెద్దలను ఒప్పించాలని చెప్పడంతో ఆయన తన తల్లిదండ్రులను తీసుకొచ్చి మా నాన్న కేకేను కలిశారు. మొత్తానికి మా పెళ్లికి ఒప్పించారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు నాకు ప్రేమ లేఖలు రాసేవారు. ముందు పెళ్లి చేసుకుందామని ఆయనే ప్రపోజ్ చేశారు. నేను ఒప్పుకొనే వరకూ నా వెంటతిరిగారు. తరగని ప్రేమ.. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి అమెరికా వెళ్లాం. అక్కడ నేను జాబ్ చేస్తూనే చదువుకునేదాన్ని. ఇద్దరి మధ్య ఏనాడూ పొరపొచ్చాలు రాలేదు. నా తల్లిదండ్రులు ఇండియాకు రావాలని కోరడంతో అదే విషయాన్ని ఆయనకు చెప్పాను. ఒక్క మాట కూడా అనకుండా నాతో పాటు ఇండియాకు వచ్చేశారాయన. కలిసే భోంచేస్తాం.. మా ఆయన ప్రతిరోజూ ఏదో ఒక పూట నాతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ మొత్తానికి ఇద్దరం కలిసే తింటాం. ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులది కూడా విశాలమైన హృదయం. నువ్వుంటే చాలు.. ఈ రోజుకు మా ఇద్దరి మధ్య ఏ విషయంలోనూ చిన్న గొడవ జరగలేదు. ఆయన ఎప్పుడూ నువ్వుంటే చాలు అంటుంటారు. మాకు పిల్లలు లేరన్న విషయంలో ఎప్పుడూ బాధ లేదు. నన్ను ఆయన తన సొంత పిల్లల్లా చూసుకుంటే ఆయనను నేను చిన్న పిల్లాడిగానే చూస్తాను. నాకు నా తండ్రి కేకే మొదటి ప్రాధాన్యం అయితే రెండో ప్రాధాన్యం భర్తకే ఇస్తాను. చదవండి: ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు -
హైదరాబాద్ మేయర్‌కు ఆశాభంగం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోటిమంది జనాభా అవసరాలు తీర్చే జీహెచ్ఎంసీకి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆయనను మేయర్ పదవి వరించడం తెలిసిందే. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఐదేళ్లు ఉన్నప్పటికీ, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పోటీ చేసి అసెంబ్లీలో ప్రవేశించాలనేది ఆయన కోరిక. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆ నియోజకవర్గంలో అమలయ్యేలా చూసేవారు. భారీ ఫ్లై ఓవర్లు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి సైతం ఇటీవలే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువుల సుందరీకరణ నుంచి శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా, ప్రజల మన్ననతో ఎమ్మెల్యేగా ఎన్నికై.. అన్నీ అనుకూలించి, అదృష్టం కలిసివస్తే మంత్రి కూడా కావచ్చని రాజకీయ వర్గాల్లోను ప్రచారం జరిగింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కూడా అందుకు ఉపకరిస్తుందని పలువురు భావించారు. ఉప్పల్ నియోజకవర్గంపై ఆయన చూపెట్టిన శ్రద్ధను చూసి రాజకీయ వర్గాల్లోనే కాదు.. సర్కిల్లో పనిచేసిన జీహెచ్ఎంసీ అధికారులు సైతం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఖాయమని భావించారు. కానీ.. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఉప్పల్ అభ్యర్థిగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉండటం తెలిసిందే. దీంతో మేయర్ ఆశలు ఆవిరయ్యాయి. -
శ్మశానంలో మందు కొడుతున్న యువత
-
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మేయర్
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. వాచ్ మెన్ కుటుంబం, మరో నాలుగు కార్మికుల కుటుంబాలు ఇందులో నివసిస్తున్నాయి. బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు పర్మిషన్ ఐదు అంతస్తులకు తీసుకుంటే.. కట్టేది మాత్రం అంతకంటే ఎక్కువ అంతస్తులని, అధికారుల కళ్లుగప్పి అక్కడక్కడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఫిల్మ్ నగర్ సొసైటీలో ఇటీవల ఓ భవనం కూలిన ఘటనపై చర్యలు తీసుకోనందున ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ సొసైటీ క్లబ్ వారికి ఇప్పటివరకూ మళ్లీ నిర్మాణం చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మేయర్ రాంమోమన్ మీడియాకు వివరించారు. -
గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు జరగలేదు
-
నగరంలో పర్యటించిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు. -
'ఇంకుడుగుంతలు లేకుంటే నల్లా కలెక్షన్ ఇవ్వం
హైదరాబాద్: ఇంకుడుగుంతలు లేకుంటే ఇంటికి అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. శనివారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇంకుడుగుంతను తవ్వి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. రెండు కొత్త జలాశయాలు పూర్తయితే నగరంలో మంచినీటి సమస్య తీరినట్టేనని అన్నారు. ఇంటి నెంబర్ల కోసం డిజిటల్ నెంబరింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. -
'ఫొటో షూట్ కోసమే హెల్మెట్ తీశారు'
హైదరాబాద్: నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆకస్మిక పర్యటనల ద్వారా పరిశీలిస్తున్న నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా వాహనం నడిపారంటూ కొన్ని మీడియాలతో పాటు సోషల్‌మీడియాలోనూ హల్చల్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటో సైతం ప్రత్యక్షమైంది. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మేయర్‌కు ఈ-చలాన్ ద్వారా రూ.100 జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. అయితే గురువారం మధ్యాహ్నం ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులకు వివరణ ఇచ్చిన మేయర్ కార్యాలయం రామ్మోహన్ హెల్మెట్ పెట్టుకునే వాహనం నడిపారని పేర్కొంది. కేవలం ఫొటో షూట్ కోసమే ఆయన హెల్మెట్ తీశారంటూ అందుకు సంబంధిచిన ఫొటోలను ట్రాఫిక్ పోలీసులకు అందించింది. కొందరు పాత్రికేయులు చేసిన విజ్ఞప్తి మేరకు కేవలం ఫొటో కోసమే తాను తాత్కాలికంగా హెల్మెట్‌ను తీసినట్లు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో మేయర్‌కు పంపాలని భావించిన ఈ-చలాన్‌ను రద్దు చేసినట్లు ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. -
'కేసీఆర్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదాం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వాటర్ గ్రిడ్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదామని నగర ప్రజలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాని పురస్కరించుకుని కేబీఆర్ పార్క్ వద్ద నీటి అవగాహనపై ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నీటిని రక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. నీటి పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా జాగ్రత్తపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
హైదరాబాద్ మేయర్‌గా రామ్మోహన్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్‌గా రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లు నాలుగు భాషల్లో ప్రమాణం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్‌గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, మీర్ పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇతరులెవరూ పోటీపడకపోవడంతో రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్‌గా బోరబొండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్ పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి బలపరిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. -
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
-
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయినట్లే కనిపిస్తోంది. మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేస్తున్నారు. రాజీనామా విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారమే ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవానికి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారమే మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నా.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది. తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు పార్టీలకు మధ్య చెడిపోయింది. కొన్ని భూముల విషయం కూడా ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో బుధవారం భేటీ అయ్యారు. ఇక కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. తద్వారా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కూడా భావిస్తోంది. -
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
-
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
హైదరాబాద్: సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులపై హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా సమ్మె విరమించకపోతే కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ తరఫున కార్మికులకు చేయాల్సినవి అన్నీ చేశామన్నారు. జీతాల పెంపు అన్నది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఎస్మాకు భయపడబోమని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాలతో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మాజిద్ హుస్సేన్ తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. 25 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినా వారు ఒప్పుకోలేదు.