హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వాటర్ గ్రిడ్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదామని నగర ప్రజలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాని పురస్కరించుకుని కేబీఆర్ పార్క్ వద్ద నీటి అవగాహనపై ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నీటిని రక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. నీటి పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా జాగ్రత్తపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.