world water day
-
వాటర్ వార్నింగ్!
సాక్షి, అమరావతి: మానవాళికి నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 – 300 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటుండగా రాబోయే దశాబ్ద కాలంలో ఇది తీవ్రం కానుంది. అంతర్జాతీయ సమాజం మేల్కొని సహకరించుకోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో హెచ్చరించింది. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా న్యూయార్క్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వినియోగం, నిర్వహణపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వరల్డ్ వాటర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల (జనాభాలో 26 శాతం) మందికి సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. 3.6 బిలియన్ల (46 శాతం) జనాభాకు సురక్షితమైన పారిశుధ్య నిర్వహణ అందుబాటులో లేదు. ఉమ్మడి భవిష్యత్తును కాపాడుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎదుర్కొంటున్న పట్టణ జనాభా 2016లో 930 మిలియన్లు ఉండగా 2050 నాటికి 1.7–2.4 బిలియన్లకు పెరుగుతుందని వరల్డ్ వాటర్ నివేదిక అంచనా వేసింది. నీటిని సంరక్షించుకుంటూ జల వనరులను స్థిరంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సదస్సులో సూచించారు. అందరికీ నీరు– పారిశుధ్యం అందించాలంటే ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రణాళికను అనుసరించాలన్నారు. కలసికట్టుగా నీటి సంక్షోభ నివారణ చర్యలను వేగవంతం చేయాలని యూఎన్ వాటర్ చైర్ పర్సన్ గిల్బర్ట్ ఎఫ్.హౌంగ్బో పిలుపునిచ్చారు. సహకారంతో సంక్లిష్టతలను అధిగమిద్దాం.. అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే నదులు, జలాశయాల నిర్వహణలో నెలకొన్న సంక్లిష్టతలను అధిగమించకుంటే కష్టాలు తప్పవని యూఎన్ వాటర్ సదస్సు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఇందుకు ప్రత్యేక దౌత్య మార్గాలను అనుసరించాలని కోరింది. ఇది నీటి భద్రతకు మించి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిపింది. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందాలున్న 468 జలాశయాలలో కేవలం 6 మాత్రమే ఒప్పందానికి లోబడి ఉన్నట్లు వెల్లడించింది. 2013లో మెక్సికోలో ప్రారంభించిన మోంటెర్రే వాటర్ ఫండ్ కార్యక్రమం ద్వారా నీటి నాణ్యతను పెంచడంతో పాటు వరద నివారణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపింది. ఇక నైరోబీకి 95 శాతం మంచినీటిని, కెన్యాకు 50 శాతం విద్యుత్‌ను సరఫరా చేసే తానా–నైరోబి నదీ పరీవాహక ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో అనుసరించిన విధానాలు పరస్పర సహకారానికి ఉదాహరణగా పేర్కొంది. -
2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? కనీసం..
గాలి తర్వాత ప్రాణాధారం నీటిచుక్క. గొంతెండిపోతే నోట్లకట్టలు దాహం తీర్చవు. నీటి చుక్క కోసం... అర్రులు చాచాల్సి వస్తుంది. ధారపోయడానికి చేతిలో డబ్బున్నా సరే... నేలతల్లి కడుపులో చుక్క మంచి నీరుండదు. జాగ్రత్త పడదాం... భవిష్యత్తును కాపాడుకుందామని... దేశాన్ని చైతన్యవంతం చేస్తున్నారు వసంతలక్ష్మి. ‘‘2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? భావి తరాల కోసం ఆస్తులు కూడబెడుతున్నాం, బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలని వాళ్లకు నేర్పిస్తున్నాం. చేతి నిండా డబ్బు ఉండి గొంతు తడుపుకోవడానికి నీటి చుక్క లేని జీవితాలను పిల్లలకు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే రాబోయే తరాలు కాదు కదా, మనతరమే నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు సంపాదనను వ్యసనంలాగ పిల్లల బుర్రల్లోకి ఎక్కించేస్తున్నాం, నీటి వృథాను అరికడదామని మాట మాత్రంగానైనా చెప్తున్నామా?’’ ఇలా సాగుతుంది వసంతలక్ష్మి ప్రసంగం. నీటి సంరక్షణ గురించి పాఠం చెప్తోందామె. నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా తన నీటి ఉద్యమం వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. జలమే ధనం ‘‘వర్షాలొస్తే రోడ్లు జలమయం, ఎండకాలం మొదలయ్యే నెల నుంచే రోడ్ల మీద నీటి ట్యాంకుల స్వైరవిహారం. ఆ ట్యాంకర్లను చూస్తే డేంజర్ బెల్స్ మోగించుకుంటూ వెళ్తున్నట్లే అనిపించేది. మనిషి భవిష్యత్తు ఎంతటి ప్రమాదంలో పడుతుందోననే దిశలో నా ఆలోచన సాగడంతో అధ్యయనం మొదలుపెట్టాను. గణాంకాలు భయపెట్టాయి. ఇదే ధోరణిలో నీటిని వృథా చేస్తుంటే మన తరమే నీటికోసం అల్లాడే రోజు వస్తుంది. అందుకే జలాన్ని మించిన ధనం మరొకటి లేదని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను. కశ్మీర్లో మొదలు పెట్టిన ‘జల్ ధన్ యాత్ర’ ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా ఢిల్లీకి చేరింది. వరల్డ్ వాటర్ డే (మార్చి 22) పురస్కరించుకుని గుర్గావ్లో 20వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించాం. జలగండం! నీటి గురించిన వివరాల్లోకి వెళ్లేకొద్దీ వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. మనదేశంలో మనిషి సగటున ఒక రోజుకి వృథా చేసే నీరు పదకొండు గ్యాలన్లుగా ఉంటోంది. జలపొరల్ని చీల్చుకుని మరీ తోడేస్తున్నాం. మహారాష్ట్రలో భూగర్భజలాలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. మూడు వందల అడుగుల వరకు నీటి చుక్క ఆనవాలుకు కూడా అందడం లేదు. తమిళనాడులో ఒకప్పుడు 57 జీవనదులు ప్రవహించేవి. మనిషి భూమి ఆక్రమణ ఆకలికి నదులు కూడా బలయిపోయాయి. ఇప్పుడు ఐదారుకి మించి జీవనదుల్లేవక్కడ. మనకు నీటిని పొదుపు చేయడం, వృథాను అరికట్టడంలో విచక్షణ లేదు. అలాగే పరిశ్రమల వ్యర్థాల కారణంగా నీటి వనరులు కలుషితం కావడం గురించి ఏ మాత్రం ముందుచూపు లేదు. ప్రజల్లో చైతన్యం ఉంటే పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వెనుకాడతామయనేది నా అభిప్రాయం. పరిశ్రమల నిర్వహకులు తాము వాడిన నీటిని శుద్ధి చేసి భూమిలోకి వదలాల్సి ఉండగా, ఆ నియమాలేవీ పాటించకుండా నేలకు రంధ్రాలు చేసి వదిలేస్తున్నారు. దాంతో భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయి. పంజాబ్‌లో ఒక రైలును స్థానికులు క్యాన్సర్ రైలని పిలుస్తారు. ఆ రైలులో ప్రయాణించే వాళ్లలో... కలుషిత నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఢిల్లీకి వైద్యానికి వెళ్లే వాళ్లే ఎక్కువని చెబుతారు. మనదేశంలో నీటి కాలుష్యానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ‘ఉదాసీనంగా ఉంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మేల్కోండి’ అని ఎలుగెత్తి చెబుతున్నాను’’ అని చెప్పారు సామాజిక కార్యకర్త చీరాల వసంతలక్ష్మి. వాటర్ షెడ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వసంతలక్ష్మి గత ఏడాది ‘వాటర్ వారియర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘జల్ ధన్ యాత్ర’ ద్వారా దేశవ్యాప్తంగా పర్య టించి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, మహిళలు, రైతులకు గణాంకాలతో సహా నీటి గురించి వివరిస్తున్నారు. సామాజిక ‘స్నేహిత’ చీరాల వసంతలక్ష్మి పుట్టింది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నగరంలో. ‘అమ్మతనానికి అవమానం జరగకూడదు. బిడ్డలందరూ సమానంగా పుడతారు. ఏ బిడ్డా అన్వాంటెడ్ కాదు... కాకూడదు. ఆడపిల్లను వద్దంటే నాకివ్వండి... బతికిస్తాను’... ఈ ‘అమ్మ ఒడి’లో ప్రేమ ఉంది, ‘ఇదిగో ఊయల’... అని పాతికేళ్ల కిందట నగరంలో 27 ఊయలలు పెట్టారు. 87 మంది పిల్లలకు అమ్మ అయ్యారామె. ఆ ఊయలను ప్రభుత్వం చేపట్టింది, తమిళనాడులో జయలలిత ప్రభుత్వమూ అందుకుంది. సమాజంలో తల్లులందరూ తమ పిల్లలను అనారోగ్యాల నుంచి సంరక్షించుకోగలిగిన అవగాహన కలిగి ఉండాలనే ఆశయంతో మొదలైన నా సేవలో ఏదీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. ఒక్కొక్కటిగా వచ్చి చేరుతూ నా బాధ్యతలను పెంచుతూ వచ్చాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వచ్చినప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలంటే రిజిస్టర్ అయిన సంస్థ ఉండాలన్నారు. అలా నా సేవ 1998లో వ్యవస్థీకృతమైంది. స్పెషల్ కిడ్స్ 150 మందిని దత్తత తీసుకున్నాను. వాళ్లతో డీల్ చేయడం కోసం నేను స్పెషల్ బీఈడీ చేసి వాళ్లకు ఎడ్యుకేటర్‌గా మారాను. అలాగే మహిళల సమస్యల గురించి పోరాడే క్రమంలో చట్టాలు తెలుసుకోవడానికి బీఎల్ చదివి... సేవలను ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించాను. కరాటేలో బ్లాక్‌బెల్ట్, రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్‌ని కావడంతో బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కాలేజీ విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు మొత్తం పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రమాదాల బారిన పడకుండా కొన్ని మెళకువలు నేర్పించాను. అలాగే చనిపోవాలనుకున్న వాళ్లకు ‘స్నేహిత’నయ్యాను. సర్వీస్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టలేదు, కానీ ఎక్కడ అవసరం ఉందనిపిస్తే అక్కడ వాలిపోతూ నా ప్రయాణం నీటి సంరక్షణ దిశగా సాగుతోంది. – సీహెచ్. వసంతలక్ష్మి. అడ్వొకేట్, వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ – వాకా మంజులారెడ్డి చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా! -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
World Water Day 2022: అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకుందాం!
మార్చి నెల ముగియకుండానే మండే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎండలతోపాటు మనకు గుర్తొచ్చేది నీరు. నీరు లేకపోతే జీవం లేదు. నీరు కరువైతే ప్రకృతి లేదు.. మనిషి మనుగడ లేదు. ప్రపంచవ్యాప్తంగా తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడి పోతున్న అభాగ్యులెందరో. నీటి వనరులు, భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నా అంతులేని నిర్లక్ష్యం. అందుకే నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తుంచుకుంటాం. గంగమ్మ తల్లి సంరక్షణలో పౌరులుగా మన బాధ్యతను గుర్తించాల్సిన సమయం ఇది. మంచినీటి కొరత ఇపుడొక ప్రపంచ సంక్షోభం. దీనిపై ప్రతీ పౌరుడు అవగాహన కలిగి ఉండటంతోపాటు, బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది. నీటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాలంటూ 1992లో రియో డి జనేరియోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు తీర్మానించింది. అలా 1993లో మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో వరల్డ్ వాటర్ డేని నిర్వహించడం ఆనవాయితీ. 2022 ఏడాదికి సంబంధించి 'గ్రౌండ్ వాటర్: మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్' అనేది థీమ్. నానాటికి అదృశ్యమైన పోతున్న భూగర్భ జలాల్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమతి పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అంద జేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాలు కనిపించవు, కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. కనుచూపు మేరలో, మన కాళ్ళ కిందుండే భూగర్భ జలాలు మన జీవితాలను సుసంపన్నం చేసే గొప్ప నిధి. ఈ విషయాన్ని గుర్తించక మానువుని అంతులేని నిర్లక్ష్యం, అత్యాశ పెనుముప్పుగా పరిణ మిస్తోంది. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే మనం మాత్రం తాగునీటిని వృధా చేస్తున్నాం. సముద్రాలు, నదులు, కాలువలు, చెరువులు అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నాం. కలుషితం చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు లభించదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మానవ అవసరాల పేరుతో అడవులను విచక్షణా రహితం నరికిపారేస్తున్నాం. అటవీ నిర్మూలనతో జీవవైవిధ్యం దెబ్బ తినడమే కాదు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, అతి వినియోగం, సహజ వనరుల దోపిడీకారణంగా తీవ్రమైన నీటి కొరత లాంటి దారుణమైన పరిస్థితులను జనజీవనం ఎదుర్కొంటోంది. వీటన్నింటికి తోడు కాలుష్య కాసారం వుండనే ఉంది. నీటిని వృధా చేయడం అంటే రాబోయే తరాలకు భవిష్యత్తులేకుండా చేయడమని అందరం అర్థం చేసుకోవాలి. ఈ భూగోళంలో కేవలం 0.3 శాతం మాత్రమే శుద్ధనీటి వనరులు ఉన్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టూ విలువైనదే అన్న అవగాహన పెంచుకోవాలి. ఈ భూ ప్రపంచంపై మానవుడితో పాటు సమస్త ప్రాణికోటి సుభిక్షంగా సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే ప్రతీ నీటిచుక్కను రక్షించుకోవాలి. ఈ అవగాహన, బాధ్యత ప్రతీ ఒక్క మనిషిలోనూ రావాలి. లేదేంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు. -
నీరు లేక నీవు లేవు
-
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
జాగ్రత్తపడకపోతే మనకు ఇదే గతి
-
వైరల్: జాగ్రత్తపడకపోతే మనకు ఇదే గతి
విశ్వంలో జీవం ఆవిర్భవానికి.. మనిషి మనుగడకు.. అభివృద్ధికి నీరే మూలాధారం. నీరు లేకపోతే బతకలేం. అలాంటి నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తూ.. అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు చాలా మంది. ఓ వైపు జనాభా పెరుగుతుంటే.. మరోవైపు నీటి వనరులు తగ్గిపోతున్నాయి. వేసవి వస్తే చాలు దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. అందుకే నీటిని జాగ్రత్తగా వాడుకుని.. మన ముందు తరాలకు అందించాలి. అలా కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు వర్ణించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నేడు అంతర్జాతీయ నీటి దినోత్సవం. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్లో ఓ వీడియోని షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి బావి నుంచి నీటిని తోడటం కోసం తాడును లాగుతాడు. ఎంత సేపటికి తాడు మాత్రమే కనిపిస్తుంది కానీ నీటిని తీసుకు వచ్చే పాత్ర కనిపించదు. ఈ దృశ్యాన్ని చూసే వారికి అతడేదో పాతళంలో నుంచి నీటిని తోడుతున్నట్లుగా అనిపిస్తుంది. అలా జాగ్రత్తగా తోడిన నీటిని ఒంటెకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి సంచుల్లో నింపుకుంటాడు. నీటి ప్రాధాన్యాన్ని గుర్తించండి అంటూ సాగే ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ నీటి బావి కూడా ఎండిపోతే.. అప్పుడు ఏంటి పరిస్థితి అంటూ కొంత మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాప్ తిప్పగానే నీరు వచ్చే వారు ఈ వీడియోని చూసి ఓ పాఠం నేర్చుకోవాలి. నీటిని అనవసరంగా వృథా చేయకూడదు.. లేదంటే మనకు కూడా ఇదే గతి పడుతుంది అని గుర్తుంచుకోవాలి అని సూచిస్తున్నారు. చదవండి: ఇచట గాలి నుంచి నీరు తయారు చేయబడును సముద్రపు నీరు మంచి నీరుగా.. -
'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
-
'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
ఢిల్లీ: 'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'సోమవారం ప్రారంభించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన 'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించారు. ఈనెల 30 వరకు ఇది కొనసాగనుంది. నీటి సంరక్షణఫై గ్రామ సర్పంచ్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణ కోసం ఖర్చు చేయాలని, రానున్న వంద రోజులు ఒక మిషన్లా పని చేయాలని తెలిపారు. వర్షం పడిన చోట నీళ్లు ఇంకిపోయేలా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు లభిస్తుంది. ఈ నీటితో 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల బుందేల్‌ఖండ్, పన్నా, టికామ్‌గా, ఛతర్పూర్, సాగర్, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రైసస్, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్పూర్ ప్రాంతాలు ప్రయోజనం పొందనున్నాయి. గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదం. చదవండి :ఢిల్లీలో మరోసారి లాక్డౌన్! దీదీ ఓటమి ఖాయం -
చికాగోలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం
చికాగో : భారతి తీర్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో చికాగోలో ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాపర్విల్లేలోని ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఇతర కమ్యూనిటీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి తీర్థ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశం మాట్లాడుతూ.. నీరు లేని మనిషి జీవితాన్ని ఊహించలేమన్నారు. నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జల దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. నీటీని పొదుపుగా వాడుకోవాలని కోరారు. అలాగే గత 15 ఏళ్లు భారతీ తీర్థ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను సభికులకు వివరించారు. అనంతరం నీటి నిర్వహణ, పొదుపుపై అవగాహనకు కృషి చేసిన 15 మందికి ‘వాటర్ వారియర్స్’ జ్ఞాపికలను అందించారు. హితేష్ షా, డాక్టర్ అజిత్ పాంట్, డాక్టర్ రాజ్ రాజారాం, ప్యాట్రిసియా మెర్రీ వెదర్ ఆర్గిస్, డాక్టర్ రోజర్ ఐలిఫ్, ఖాజా మొయినుద్దీన్, విజయ్ గుప్తా, లెన్‌బ్లాండ్, డేవిడ్ ముల్లాన్, స్టెఫెన్ మెక్క్రాకెన్, ఉమా వేంపాటి, చేతన్ కాలే, సుందర్ దిట్టకావి, శ్యామా పప్పు, యోగేష్ షా తదితురులకు వాటర్ వారియర్స్ జ్ఞాపికలను అందజేశారు. -
నీరే ఔషధం
విశాఖ సిటీ : నీరు మన శరీరానికి మంచి ఔషధం. టానిక్‌లా పనిచేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే సంజీవిని నీరే. ఎక్కువగా తాగేవారు నిత్య యవ్వనంతో పాటు చర్మ సౌందర్యవంతులుగా ఉంటారు. ఆరోగ్య వంతులుగా జీవిస్తారు. చురుగ్గా పనిచేస్తారు. అందుకే నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. నీటితోనే ఆరోగ్యం వేసవిలో వీలైనంత ఎక్కువ సార్లు నీరు తాగాలి. తగినంత స్థాయిలో పొట్టలో నీరు నిల్వ ఉండాలి. లేకపోతే సమస్యలు తలెత్తుతాయి. నీటితో ఆరోగ్యం సాధ్యం. చర్మం ప్రకాశవంతంగా సురక్షితంగా ఉంటుంది. సాధారణంగా మానవ శరీరంలో 70 నుంచి 75 శాతం నీరు ఉంటుంది. పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఆహారం లేకుండా 20 రోజులకుపైగా జీవించవచ్చు. నీరు లేకుండా రెండు రోజులు కూడా ఉండలేరు. శుద్ధి చేయని నీటిని తాగరాదు. కాచివడ పోసిన నీటినే తాగాలి. ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగకుండా ఇంట్లో కుండను ఏర్పాటు చేసుకుని అందులోని నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె జబ్బులు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారు, మందులు సేవించేవారు, కాలేయం వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నీరు తాగాలి. నీరు తక్కువ తాగితే.. నీరు తక్కువ తాగితే డీ హైడ్రేషన్, మలబద్ధకం వచ్చేఅవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగడం, అలసట కలిగి నీరం వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి కలగడం, మూత్రవిసర్జన సక్రమంగా లేకపోవడం జరుగుతుంది. మూత్రం రక్త మలినాలతో నిండిపోతుంది. రక్తపోటు, శారీరక నొప్పులు, ఆస్తమా రావడానికి కారణం నీరు ఎక్కువగా తాగకపోవడమే. నీరు తక్కువగా తాగడం వల్ల లివర్ కోలెన్, యుటెరస్, ఊపిరితిత్తులువంటి అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. యూరిస్ జనిటెల్ వ్యాధులు రెక్టాల్ ప్రొల్యాప్స్, అజీర్ణం, ఫైల్స్ వంటి వ్యాధులువస్తాయి. శరీరంలో అత్యధిక కొలస్ట్రాల్ నిల్వ, గుండె సంబంధిత వ్యాధులు నీరు తాగకపోవడం వల్ల కలిగే ఫలితమే. చిన్న వయసు నుంచి నీరు తాగడం వల్ల అలవాటు తప్పితే పెద్ద అయిన తర్వాత దాహం తగ్గుతుంది. అందువల్ల కనీసం రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. శరీరమంతా జలమయమే మన శరీరంలో రక్తంలో 80శాతం, మెడలో 74 శాతం, కండరాల్లో 75 శాతం, ఎముకల్లో 22 శాతం, కార్నియాలో 80 శాతం ఉంటుంది. మొత్తం కలిపి శరీరం బరువలో 2/3వ వంతు నీరు ఉంటుంది. శరీరంలో ఈ శాతాన్ని ఇలాగే ఉంచుకోవాలంటే నీరు తాగాల్సిందే. దీని వల్ల ఆరోగ్యంతో పాటు యవ్వనంగా ఉంటాం. జ్ఞాపకశక్తి పెరుగుతుంది నీరు ఎక్కువగా తాగడం వల్ల చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడులోని బూడిద రంగు పదార్థాల్లో 85 శాతం నీరు ఉంటుంది. అందువల్ల మెదడు సరిగా పనిచేయాలంటే తగినంత నీరు తాగాలి. మానసిక శక్తుల పెరుగుదలకు నీరు ఎంతగానో ఉపకరిస్తుంది. మెదడులో రెండు శాతం నీరు తక్కువైనా జ్ఞాపశక్తి తగ్గే అవకాశం ఉంది. శరీరంలో వివిధ అవయవాలు ఖనిజాలు సక్రమంగా పని చేయడానికి ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు, ఎంజైమ్స్ వంటివి చాలా అవసరం. రక్తంలో 83 శాతం వరకు నీరు ఉంటుంది. నీటి దినోత్సవం వచ్చిందిలా.. నీటిని జాతీయ వనరుగా గుర్తించి.. పొదుపుగా వాడుకోవాలని జాతీయ జల విధానం చెబుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వృథాగా పోతున్న నీటిని రక్షించుకోవాలని, ప్రజలకు నీరు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వివిధ దేశాల్లో తాగునీరు కోసం ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎంతమందికి సమృద్ధిగా నీరు అందుతోందనే అంశాలను ప్రజలకు వివరించేందుకు 1992 మార్చి 22 నుంచి ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తాగునీటి విషయంలో జాగ్రత్త అవసరం శరీరంలో రక్త ప్రసరణ జరగాలంటే ఎక్కువ నీరు తాగాలి. ఇలా చేస్తే మూత్రాశయంలో రాళ్లు ఏర్పడవు. అదే విధంగా భోజనం చేయకముందు రెండు గ్లాసుల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఎండలో తిరిగే వారు క్రమం తప్పకుండా రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగితేనే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఇదే క్రమంలో కలుషిత నీరు తాగితే అనారోగ్యానికి గురవుతారు. ప్యాకెట్లలో శుద్ధి చేయని జలాలు నింపేసి అమ్ముతున్నారు. చాలా దుకాణాల్లో ప్యాకెట్లు ఎండలో ఉంటున్నాయి. వీటి వల్ల చాలా ప్రమాదం. ప్యాకెట్లలో నీటిని తాగడం వల్ల గొంతు నొప్పులు, జలుబు, దగ్గులాంటి సమస్యలతో పాటు టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. ఫుడ్‌గ్రేడ్ పాలిథీన్ ప్యాకెట్లు వినియోగించడం వల్ల కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి వేసవిలో ప్రజలు మంచినీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మేలు. చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాచి చల్లార్చిన నీరు తాగడం, ఫిల్టర్ చేసిన నీటిని తాగడం చాలా మంచిది. ఇంటిలో వినియోగించే బాటిల్స్ సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. – డా.కాండ్రేగుల వెంకట్రామ్కుమార్, జనరల్ ఫిజీషియన్ -
డేంజర్‌కు దగ్గరగా బెంగళూరు
సాక్షి, న్యూఢిల్లీ : నీరే జీవకోటికి ప్రాణాధారం. జలం లేకపోతే జీవమే ఉండదు. ఇతర గ్రహాలు మనుషుల ఆవాసానికి అనుకూలమా, కాదా అనే విషయం కూడా అక్కడి నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే ఈ సృష్టే అంతరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చేజేతులా భూతాపాన్ని పెంచి తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాము. అందుకే అతివృష్టి, అనావృష్టిలాంటి పరిస్థితులు. ఇంకా వేసవి పూర్తిగా ప్రారంభమవలేదు. అయినప్పటికీ అప్పుడే నీటి ఎద్దడి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్య తీవ్రంగా ఉండి ఇప్పుడు సిలికాన్ సిటీ బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పత్రిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న10 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిలో బెంగళూరు ఒకటి. అనతి కాలంలోనే బెంగళూరు మరో కేప్ టౌన్ కానుంది. వరుస కరువు, ముందుచూపులేని ప్రభుత్వం తీరుతో కేప్‌టౌన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గత జూన్-.జూలైలో అక్కడ 'డే జీరో' (ట్యాప్లలో నీరు రాకుండా పూర్తిగా నిలిచిపోవడం) పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నీటిని కూడా రేషన్‌లో తీసుకోవాల్సిన దుస్థితి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోను ఇవే దృశ్యాలు కనిపించనున్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఈ పత్రిక వెల్లడించిన అంశాల ప్రకారం ప్రణాళిక ప్రకారం లేని నగరీకరణ, నిర్మాణాల వల్ల 79శాతం నీటి వనరులు తగ్గిపోయాయి. 1973 నుంచి నిర్మాణాలకు సంబంధించిన స్థల విస్తీర్ణం 8 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. బెంగుళూరులో ఇంతకుముందు నీటి లభ్యత 10-12 మీటర్ల లోతు లోపు ఉండేది, కానీ ప్రస్తుతం ఇది 76-91 మీటర్లకు పడిపోయింది. 30 ఏళ్ల క్రితం 5 వేల వరకూ ఉన్న బావుల సంఖ్య ప్రస్తుతం 0.45 మిలియన్లకు పెరిగింది. బెంగుళూరు జనాభా ప్రతి సంవత్సరం 3.5శాతం పెరుగుతూ 2031 నాటికి 20.3మిలియన్లకు చేరుకుంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సవ్యంగా వినియోగించుకోకపోతే కేప్‌టౌన్‌లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పది నగరాలు ఇప్పటికైనా మేల్కోనకపోతే అతి త్వరలోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఈ పత్రిక వెల్లడించింది. బెంగుళూరుతోపాటు చైనాలోని బీజింగ్, మెక్సికోలోని మెక్సికో సిటీ, కెన్యాలోని నైరోబీ, పాకిస్తాన్‌లోని కరాచీ, ఆఫ్గానిస్తాన్‌లోని కాబూల్, టర్కీలోని ఇస్తాంబుల్‌లో కూడా ఇవే పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. -
సభ నుంచి వైఎస్ఆర్ సీపీ సభ్యుల వాకౌట్
అమరావతి: శాసనసభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. సభా నియమాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని నిరసన తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జల దినోత్సవంపై ప్రకటన అంటూ సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారని, ఎజెండాకు కట్టుబడాల్సిందిపోయి సోత్కర్షలు చేశారన్నారు. 18 పేజీల సుదీర్ఘ ప్రసంగాన్ని స్టేట్మెంట్గా పెట్టారని, జల సంరక్షణ గురించి కాకుండా సొంత డబ్బా ఏకరువు పెట్టారన్నారు. 2004-09 నాటి ప్రాజెక్టుల వ్యయం గురించి ఇప్పుడెందుకని ప్రశ్నించారు. స్టేట్మెంట్పై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదని తప్పు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. కాగా అంతకు ముందు జల దినోత్సవం సందర్భంగా ప్రకటన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ ప్రకటన చేస్తూ ప్రాజెక్ట్‌ల అంశాన్ని సీఎం లేవనెత్తారు. అయితే ప్రకటన పేరుతో సభను తప్పుదోవ పట్టించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. -
నీటి పొదుపునకు అంతా కృషి చేయాలి
♦ ప్రపంచ జల దినోత్సవం ♦ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ♦ హార్టీకల్చర్ హబ్‌గా రాయలసీమ ♦ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: జల వనరుల సమర్థతను పెంచి, వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జల పరిరక్షణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అసమానతలను తగ్గించడం లక్ష్యమన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమన్నారు. జలవనరుల సద్వినియోగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభలో మంగళవారం సీఎం ప్రసంగించారు. ప్రతీ నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రాయలసీమ ఇప్పటికీ కరవు ప్రాంతంగా ఉందని, నిర్దిష్ట కార్యక్రమాలతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో రెండేళ్లు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయన్నారు. దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వరి పంట కన్నా పండ్లతోటలే ఆదాయాన్నిస్తాయని, రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవనాలను ప్రోత్సహిస్తామన్నారు. భూగర్భ జలమట్టం పెంచేందుకు చేపట్టిన పంట గుంటల కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పంటగుంటలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.... ♦ గడచిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 7,888.62 కోట్ల నిధులు కేటాయించాం. ఈ కాలంలో మరో 1.182 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. స్థిరీకరించిన ఆయకట్టు 13.08 లక్షలు. ఏడు ప్రాజెక్టులకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటిని 2017-18 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ♦ ఈ ఏడాది డిసెంబర్ నాటికి బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి, శ్రీకాకుళం జిల్లాలోని 45 వేల ఎకరాలకు నీరి స్తాం. 194 కట్టడాల్లో ఇప్పటికే 28 పూర్తయ్యాయి. తోటపల్లి ప్రాజెక్టును ఈ ఏడా ది జూన్ నాటికి, గజపతినగరం బ్రాంచ్ కాల్వను అక్టోబర్‌లో పూర్తవుతాయి. పట్టిసీమ ఎత్తిపోతల పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేస్తాం. ♦ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును 2017-18లోగా పూర్తి చేయాలని, మొత్తం 4,47,300 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ♦ నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటాం. ప్రతీ వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.టెంపుల్ టూరిజం లో భాగంగా శ్రీశైలం,విజయవాడలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన ప్రణాళికలపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం పరిసరాల్లో ఐదు వేల ఎకరాల్లో నాలుగైదు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.శ్రీశైలం చుట్టూ 8 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో పాటు శ్రీశైలం, సున్నిపెంటలను పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కాలిబాట వంతెనలు ఏర్పాటు, అర్జున వీధిని 60 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయాలని భావిస్తున్నారు. -
దేశంలో 7.6 కోట్ల మందికి క‘న్నీరు’!
సురక్షిత నీరందని వారు భారత్‌లోనే అధికం కొచ్చి/న్యూఢిల్లీ: ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేక అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నది భారత్‌లోనే అన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 7.6 కోట్ల మంది ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. టాప్ 10 జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, నైజీరియా ఉన్నాయని వాటర్‌ఎయిడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. పాక్ పదో స్థానంలో నిలిచింది. మంచి నీటి కోసం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొందని, నీటి వనరుల అస్తవ్యస్త నిర్వహణే దీనికి ప్రాథమిక కారణమని తేల్చింది. ప్రాజెక్టుల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడమో లేదా పైపులైన్లు లేకపోవడం వల్లనో ప్రజలకు నీరు అందడం లేదని పేర్కొంది. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌లో సురక్షిత నీరు లేక బాధపడుతున్న వారిలో అత్యధిక మంది రోజువేతనం రూ.300 కన్నా తక్కువగా ఉందని, వారు ట్యాంకర్ నుంచి నీటిని కొనాలంటే లీటర్‌కు ఒక రూపాయిపైనే వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తోందని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనీస వేతనం పొందుతున్న వారికి నీటి వ్యయం లీటర్‌కు 0.1 శాతం ఉండగా, అది భారత్ లాంటి దేశాల్లో 17 శాతం వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 85 శాతం మందికి జలాశయాలు తాగునీటిని అందిస్తున్నా, 56 శాతం మందికి మాత్రమే అందుతోందని పేర్కొంది. -
నీటిపై అవగాహన ర్యాలీ
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : 'వరల్డ్ వాటర్ డే' సందర్భంగా మంగళవారం బాసర గ్రామంలో నీటిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ 'వాక్ ఫర్ వాటర్'లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. -
'కేసీఆర్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదాం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వాటర్ గ్రిడ్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదామని నగర ప్రజలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాని పురస్కరించుకుని కేబీఆర్ పార్క్ వద్ద నీటి అవగాహనపై ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నీటిని రక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. నీటి పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా జాగ్రత్తపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
జీవితానికి నీరే ముఖ్య ఇంధనం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఈ భూమిపై మన జీవితానికి నీరే ముఖ్యమైన ఇంధనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్బంగా ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. నేటి నీటి వినియోగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పారు. 'నేడు నీటిని వినియోగించుకోండి. రేపటికి ఆదా చేయండి' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతున్న నేటి రోజుల్లో నీటిని రక్షించుకోవడం అత్యంత ముఖ్యమైన బాధ్యత అని తెలియంది కాదు. Water is the most important fuel for life on our planet. Let's not take it for granted. Conserve today. Save for tomorrow. #WorldWaterDay — YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2016 -
కెసెండ్రా మాట ఎవరు వింటారు?
నీరు జీవితం! చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం! కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం! భూగోళం బాస్కెట్‌బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’! భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్‌డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది. నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది. జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా! సేద్యానికి జూదానికి తేడా ఏమిటి? వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది. నీటి కంటె చమురు చౌక గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా. ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు. కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా! ఆ దండ కట్టలేం! ‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..? నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి