ఢిల్లీ: 'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'సోమవారం ప్రారంభించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన 'జల్ శక్తి అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించారు. ఈనెల 30 వరకు ఇది కొనసాగనుంది. నీటి సంరక్షణఫై గ్రామ సర్పంచ్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణ కోసం ఖర్చు చేయాలని, రానున్న వంద రోజులు ఒక మిషన్‌లా పని చేయాలని తెలిపారు. వర్షం పడిన చోట నీళ్లు ఇంకిపోయేలా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు లభిస్తుంది. ఈ నీటితో 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల బుందేల్‌ఖండ్, పన్నా, టికామ్‌గా, ఛతర్‌పూర్, సాగర్, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రైసస్, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ ప్రాంతాలు ప్రయోజనం పొందనున్నాయి. గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదం.
చదవండి :ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్!
దీదీ ఓటమి ఖాయం
Comments
Please login to add a commentAdd a comment