(మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అటు అధికారిక కార్యక్రమాలతో అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. ఇటు బహిరంగ సభ వేదికగా బీఆర్‌ఎస్‌పై విమర్శలతో రాజకీయ ప్రసంగం చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్లను తీరుస్తూ పసుపుబోర్డు, గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా.. తెలంగాణకు బీజేపీ మేలు చేస్తోంది అన్నట్టుగా సంకేతాలు పంపారు. తెలంగాణప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూనే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరుస్తామని చెప్పారు.
మహిళా బిల్లును ఆమోదించడం, హైవేల నిర్మాణంతో ప్రయోజనాలు, కేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేస్తున్నట్టుగా వివరించే ప్రయత్నం చేశారు.
సభ సాంతం.. మోదీ నామస్మరణతో..
అధికారిక కార్యక్రమం, ఊరేగింపు, సభా వేదికపై ప్రసంగం సమయంలో సభా ప్రాంగణమంతా మో దీ.. మోదీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అరుపులు, కేకలతోపాటు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది చూసిన మోదీ.. ‘మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు నేను ధన్యుడిని అయ్యాను. ఇంత ప్రేమను చూసి ముగ్దుడిని అయ్యాను. మీరు, మేము కలసి తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళదాం. ఈ సభ విజయవంతం కావడం, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపడాన్ని వరుణదేవుడు కూడా హర్షాన్ని వెలిబుచ్చి వర్షాన్ని కురిపించాడు. (ప్రసంగం సాగుతున్నపుడు వర్షం పడుతుండటాన్ని ప్రస్తావిస్తూ..). తెలంగాణ ప్రజలను కలసిన నా జీవితం ధన్యమైంది..’’అని పేర్కొన్నారు.
- సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో అంతా లేచి మోదీకి గౌరవసూచకంగా చప్పట్లు కొట్టాలని కోరారు. దీనితో వేదికపై ఆసీనులైన నేతలు, సభికులు లేచి ‘మోదీ నాయకత్వం వరి్ధల్లాలి’అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మోదీ రెండు చేతులు జోడించి, వంగి సభికులకు సమస్కారం చేశారు.
- సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి జోష్ చూసి మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చి న్నారికి తన ఆశీస్సులు అందిస్తున్నట్టు చెప్పారు.
పది నిమిషాల్లో మనసు విప్పుతా..!
తొలుత అధికారిక కార్యక్రమ వేదికపై సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన మోదీ అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. చివరిలో మాత్రం.. ‘‘ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. కొన్ని అంశాలపై నన్ను నేను నియంత్రించుకున్నాను. ఓ పది నిమిషాల్లో మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నా.. అక్కడ మనసు విప్పి మాట్లాడుతా.. నేను మీకు మాటిస్తున్నా.. నేను ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా మాట్లాడుతా..’’అని పేర్కొనడం గమనార్హం.
ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ..
తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు.

Comments
Please login to add a commentAdd a comment