చికాగో : భారతి తీర్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో చికాగోలో ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాపర్విల్లేలోని ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఇతర కమ్యూనిటీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి తీర్థ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశం మాట్లాడుతూ.. నీరు లేని మనిషి జీవితాన్ని ఊహించలేమన్నారు. నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జల దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. నీటీని పొదుపుగా వాడుకోవాలని కోరారు. అలాగే గత 15 ఏళ్లు భారతీ తీర్థ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను సభికులకు వివరించారు. అనంతరం నీటి నిర్వహణ, పొదుపుపై అవగాహనకు కృషి చేసిన 15 మందికి ‘వాటర్ వారియర్స్’ జ్ఞాపికలను అందించారు. హితేష్ షా, డాక్టర్ అజిత్ పాంట్, డాక్టర్ రాజ్ రాజారాం, ప్యాట్రిసియా మెర్రీ వెదర్ ఆర్గిస్, డాక్టర్ రోజర్ ఐలిఫ్, ఖాజా మొయినుద్దీన్, విజయ్ గుప్తా, లెన్‌బ్లాండ్, డేవిడ్ ముల్లాన్, స్టెఫెన్ మెక్క్రాకెన్, ఉమా వేంపాటి, చేతన్ కాలే, సుందర్ దిట్టకావి, శ్యామా పప్పు, యోగేష్ షా తదితురులకు వాటర్ వారియర్స్ జ్ఞాపికలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment