చికాగొ : ప్రపంచంలో మానవాళి ఇప్పుడు ఒక విచిత్రమైన విపత్కరం లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. కరోనా మహమ్మారి మన జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. ఏంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. ప్రజలు భయబ్రాంతులతో రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 'మానవ సేవే మాధవ సేవ' ధేయ్యంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలు భార్గవి నెట్టెం మాట్లాడుతూ.. 'ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాటి తెలుగు వారికి సహాయం చెయ్యడం, కష్టాలలో వున్న భారతీయ విద్యార్థులను ఆదుకోవడం లాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యబృందాల రక్షణ కోసం మా సంఘ ఆడపడుచులు అలుపెరగకుండా ఎన్నో మాస్క్ లు తయారు చేసి ఇవ్వటం మాకు గర్వకారణం. స్వతహా గా డాక్టర్ అయినా నేను నా సాయ శక్తుల రోగుల సేవలు అందించడమే కాకుండా, భారత దేశం నుంచి తమవాళ్లను చూసుకునేందుకు వచ్చిన తల్లితండ్రుల ఆరోగ్యం, మందుల విషయంలో సహాయం చేసే అదృష్టం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు.
ఆన్ లైన్ ద్వారా 100కి పైగా కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి ఆ వచ్చిన విరాళాలను ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పూజారులకు అందించాం. ఇమ్మిగ్రేషన్ సమస్యలున్న వారికి అటార్నీలతో సంప్రదింపులు జరిపి ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తున్నాం. వయో వృద్ధులకు మా వలంటీర్ల ద్వారా నిత్యావసరాలు అందించాం. నా తరపున సహాయం అందేందుకు సహకరించిన చికాగో ఆంద్ర అసోసియేషన్ వ్యవస్థాపకులకి, బోర్డు డైరెక్టర్‌లకి, మా సంఘ సభ్యులకి, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment