Chicago Andhra Association
-
'కష్టాల్లో ఉన్నవారిని సీఏఏ ఆదుకుంటుంది'
చికాగొ : ప్రపంచంలో మానవాళి ఇప్పుడు ఒక విచిత్రమైన విపత్కరం లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. కరోనా మహమ్మారి మన జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. ఏంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. ప్రజలు భయబ్రాంతులతో రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 'మానవ సేవే మాధవ సేవ' ధేయ్యంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలు భార్గవి నెట్టెం మాట్లాడుతూ.. 'ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాటి తెలుగు వారికి సహాయం చెయ్యడం, కష్టాలలో వున్న భారతీయ విద్యార్థులను ఆదుకోవడం లాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యబృందాల రక్షణ కోసం మా సంఘ ఆడపడుచులు అలుపెరగకుండా ఎన్నో మాస్క్ లు తయారు చేసి ఇవ్వటం మాకు గర్వకారణం. స్వతహా గా డాక్టర్ అయినా నేను నా సాయ శక్తుల రోగుల సేవలు అందించడమే కాకుండా, భారత దేశం నుంచి తమవాళ్లను చూసుకునేందుకు వచ్చిన తల్లితండ్రుల ఆరోగ్యం, మందుల విషయంలో సహాయం చేసే అదృష్టం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు. ఆన్ లైన్ ద్వారా 100కి పైగా కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి ఆ వచ్చిన విరాళాలను ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పూజారులకు అందించాం. ఇమ్మిగ్రేషన్ సమస్యలున్న వారికి అటార్నీలతో సంప్రదింపులు జరిపి ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తున్నాం. వయో వృద్ధులకు మా వలంటీర్ల ద్వారా నిత్యావసరాలు అందించాం. నా తరపున సహాయం అందేందుకు సహకరించిన చికాగో ఆంద్ర అసోసియేషన్ వ్యవస్థాపకులకి, బోర్డు డైరెక్టర్లకి, మా సంఘ సభ్యులకి, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు. -
చికాగో ఆంధ్రా సంఘం మహిళా దినోత్సవ వేడుకలు
చికాగో: చికాగో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అమెరికాలోని చికాగోలో అత్యంత ఘనంగా జరిగాయి. తమకూ సమాన అవకాశాలు కావాలంటూ చికాగో ఆంధ్రా సంఘం మహిళా సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మనోహరంగా సాగింది. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర సంఘం సేవా విభాగమైన ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన వివిధ అభివృద్ధి పథకాల కోసం అధిక మొత్తం విరాళాలిచ్చిన శ్రీమతి నాగేశ్వరి చేరుకొండ, శ్రీమతి డా. విజి సుసర్ల, శ్రీమతి సుజాత మారంరెడ్డి లకు ప్రశంసాఫలకాలను అందజేశారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ “సమానత్వం”పై చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ డా.భార్గవి నెట్టెం మాట్లాడుతూ మనలో ప్రతి ఒక్కరూ.. అందరికీ సమాన అవకాశాలు లభించే ప్రపంచాన్ని సృష్టించడానికి కృషి చేయాలని కోరారు. సంతూర్ తల్లులు కిరణ్ మట్టే, మాలతి దామరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనురాధ గంపాల రిజిస్ట్రేషన్లు, పార్టీ హాల్ అలంకరణలు మల్లేశ్వరి పెదమల్లు, పవిత్ర కరుమూరి, ఆహ్లాదకరమైన ఆటలను సాహితి కొత్త నిర్వహించారు. చికాగో నేపర్విల్ ప్రాంతంలోని ప్రఖ్యాత దంత వైద్యులు డాక్టర్ సత్య మేడనాగ దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన మెళకువలు వివరించారు. ప్రముఖ డైటీషియన్ దీపాలి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, భారతీయ ఆహారపు విశిష్టతను, దానిని పాశ్చాత్య దేశాల జీవనవిధానానికి తగినట్లుగా ఎలా మలచుకోవటం అనే ఆవశ్యకతను, సూచనలను తెలియజేసి అందరి మెప్పును పొందుతూ ఆసక్తికరంగా వివరించారు. మెహెందీ ఆర్టిస్ట్ నౌషీన్ మహిళలందరికీ వేసిన గోరింటాకు చిత్రాలు మైమరపించాయి. ఇల్లినాయిస్ 11 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న శ్రీ కృష్ణ బన్సాల్ గౌరవ అతిథిగా వచ్చి ‘సమానత్వం’ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారు. శారీ డ్రేపింగ్ పోటీల్లో పాల్గొన్న అందమైన భామలు చీరలను స్టైలిష్ గా ధరించడంలో వారి ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోటీ ఆద్యంతం అందరికీ కన్నుల పండుగగా జరిగింది. ఇన్స్టంట్ పాట్ వంటల పోటీతో మహిళలు ఆనందించారు ఈ తరం తల్లుల గురించి హరినణి మేడా చేసిన ఫన్నీ స్కిట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. మాధురి తీగవరపు, అనుపమ తిప్పరాజు, సునీతా విస్సా ప్రగడ, లావణ్య ఆరుకొండ వారి పాటలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. అబ్సొల్యూట్ బిబిక్యు వారు తయారుచేసిన రుచికరమైన బఫేలో అమ్మాయిలు స్ట్రాబెర్రీ కస్టర్డ్‌ను ఎక్కువగా ఆనందించారు. చికాగో ఆంధ్రా అసోసియేషన్ వారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ ఇది ఒక ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా మిగిలింది. -
ఇదే నా పల్లెటూరు: చికాగో ఆంధ్ర సంఘం
చికాగో: ఇదే నా పల్లెటూరు అంటూ హరివిల్లు ముగ్గులు పెట్టి, గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అని పాటలు పాడుతూ చలి మంటల వెలుగులో కళకళలాడుతున్నాయి. మన తెలుగింటి ఆడపడుచులు చేసిన ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, పిల్లల పల్లె పాటల నృత్యాలు, ఘుమ ఘుమలాడే పిండి వంటలు, బండ్లపై ధాన్యపు రాశులు, ఎడ్ల పోటీలు, కోడి పందాలు, చలాకీగా ఎగిరిన గాలి పటాలు, పల్లె సంబరాలివన్నీ. ఇదంతా మన ఆంధ్రలో కాకుండా ఏడు సముద్రాలు దాటి మన తెలుగు కుటుంబాలు సరదాగా చికాగోలో జరుపుకున్న వేడుకలు. చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఉల్లాసంగా ఏర్పాటు చేసిన పల్లె సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రెసిడెంట్ భార్గవి నెట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 280 మందికి పైగా పిల్లలు, పెద్దలు సమర్పించిన 35 సాంస్కృతిక కార్యక్రమాలకు వేయిమందికి పైగా అతిథులు పాల్గొన్నారు. బోలింగ్ బ్రూక్ హైస్కూల్ లో ఈ కార్యక్రమ వేదిక అలంకరణలను కిరణ్ మట్టె, పవిత్ర కారుమురి, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను రాజ్ మునగా దంపతులు, జయశ్రీ సోమిశెట్టి అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి ప్రశంసలను అందుకున్నారు. నీలిమ బొడ్డు, సునీత రాచపల్లి, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, అర్చిత దామరాజు సాంప్రదాయ పద్దతిలో పన్నీరు చల్లుతూ ఆహూతులను ఆహ్వానించారు. చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మంది పైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సమత పెద్దమారు, పావని కొత్తపల్లి, శ్వేత కొత్తపల్లి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య రీతులతో పాటు అందరినీ అలరించడానికి విభిన్నమైన సినీ సంగీత కార్యక్రమాలను రూపొందించారు. గురు జానకి ఆనందవల్లి శిష్యుల పూర్వాంగం, గురు అపర్ణ ప్రశాంత్ శిష్యుల మండూక శబ్దం కూచిపూడి నృత్యాలు అందర్నీ అలరించాయి. మాటపాటలతో అదరగొట్టిన వ్యాఖ్యాతలు గురు జ్యోతి వంగర దర్శకత్వంలో పల్లెపదం నృత్యరూపకం ఆంధ్ర పల్లె జీవితాన్ని అమెరికాలో ప్రస్ఫుటింపజేసి అందరి ఆదరణ చూరగొంది. సాహితి ఆదిమూలం, పద్మాకర్ దామరాజు, సవిత యాలమూరి-వెర్నేకర్ వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కోశాధికారి గౌరి శంకర్ అద్దంకి, మాలతి దామరాజు, రామకృష్ణ తాడేపల్లి, అనురాధ గంపాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, కిరణ్మయి వంకాయలపాటి, సురేశ్ శనక్కాయల, నాగరమేశ్ నెక్కంటి, శ్యామ పప్పు తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు. సభ్యులు జమ చేసే వార్షిక సభ్యత్వ రుసుములో పాతిక శాతం సంస్థ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చికాగోలోనే కాక అమెరికా దేశంలోని తెలుగు సంఘాలలో ప్రథమమని ప్రెసిడెంట్ భార్గవి నెట్టం, కార్యదర్శి రాజ్ పోట్లూరి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఈడీ వాణి దిట్టకవి గారు తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ఏడాది అంధ్ర రాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అందించడమే సీఏఏ లక్ష్యమని వ్యవస్థాపక చైర్మన్ సుందర్ దిట్టకవి పెర్కొన్నారు. ఆహా ఏమి రుచి అంతే కాకుండా చికాగో ఆంధ్ర సంఘం వారు ఏటా తెలుగు రుచులను ఇక్కడి వారికి పరిచయం చేస్తున్నట్లు, విజయ్ కొర్రపాటి నేతృత్వంలో ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధమైన తెలుగు విందును అందించారు. సంఘ సహ వ్యవస్థాపకులు పద్మారావు- సుజాత అప్పలనేని, శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ-శివబాల జాట్ల, సుందర్-వాణి దిట్టకవి, దినకర్-పవిత్ర కరుమూరి, ప్రసాద్-భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ, కార్యకర్తలు అతిథులకు కొసరి వడ్డిస్తూ భోజన ఏర్పాట్లను నిర్వహించారు. వందన సమర్పణ, భారత జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. -
చికాగోలో ఘనంగా ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం
చికాగో : దసరా వెళ్లి, దీపావళి పర్వదినానికి భారతీయులందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్న వేళ చికాగో ఆంధ్ర సంఘం (సిఏఏ) ఆధ్వర్యంలో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లెమాంట్ హిందూ దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నేతృత్వంలో యువ చిత్రకారిణి అర్చిత దామరాజు, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను జయశ్రీ సోమిశెట్టి, అఖిల్ దామరాజు అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి పలు ప్రశంసలను అందుకున్నారు. సంఘ అధ్యక్షులు పద్మారావు అప్పలనేని నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కోశాధికారి అనురాధ గంపాల నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు జానకి ఆనందవల్లి (రామాయణ శబ్దం), అపర్ణ ప్రశాంత్ (శ్రీరాజరాజేశ్వరి అష్టకం), జ్యోతి వంగర (మహాలక్ష్మి నమోస్తుతే) తమ తమ విద్యార్ధులతో ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యాలు కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. అలాగే వాణి దిట్టకవి పర్యవేక్షణలో గురు జ్యోతి వంగర రూపొందించిన సీతారామ కళ్యాణం ప్రేక్షకులను అలరించింది. స్మిత నండూరి, సుష్మిత బట్టర్, హరిణి మేడ, పూజ జోషి, శ్వేత కొత్తపల్లి, జయశ్రీ సోమిశెట్టి, రాణి తంగుడు, కిరణ్మయి రెడ్డివారి, మృదులత మతుకుమల్లి, ప్రశాంతి తాడేపల్లి, పూర్ణిమ వేముల, శైలజ సప్ప, శిల్ప పైడిమర్రి, దివ్య చిత్రరసు, సమత పెద్దమారు, సౌమ్య బొజ్జా, మాలతి దామరాజు, షాలిని దీక్షిత్, యశోద వేదుల సందర్బోచితంగా సినిమా గీతాలు పాడి అలరించారు. అనంతరం లక్ష్మీనాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన సందేశాత్మక హాస్యనాటిక మహానటి కడుపుబ్బ నవ్విస్తూనే అందరినీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమానికి మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ వాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని హుషారుగా ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ జాట్ల, శివబాల జాట్ల, సుందర్ దిట్టకవి, వాణి దిట్టకవి, దినకర్ కరుమూరి, పవిత్ర కరుమూరి, ప్రసాద్ నెట్టం, భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, గౌరి అద్దంకి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ తదితరులు పాల్గొన్నారు. -
చికాగోలో 'హెల్త్ ఫెయిర్' విజయవంతం
చికాగొ : గ్రేటర్ చికాగోలోని శ్రీ బాలాజీ టెంపుల్లో ఆగస్టు 3న పబ్లిక్ కమ్యూనిటీ హెల్త్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ హెల్త్ ఫెయిర్ కార్యక్రమానికి డాక్టర్ వసంతనాయుడు, డాక్టర్ రాధికా పతి అధ్యక్షత వహించారు. హెల్త్ ఫెయిర్‌లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు, చుట్టుపక్కల నివసించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా హాజరైన ఈ హెల్త్ ఫెయిర్‌లో రక్తపోటు, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు.ఈ హెల్త్ ఫెయిర్‌కు చికాగో ఆంధ్ర అసోసియేషన్, చికాగో తమిళ సంఘం, చికాగో తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో, శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ్ ట్రస్ట్ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. పరీక్షలను నిర్వహించడానికి కావలసిన ల్యాబ్ వసతులను యునిల్యాబ్కి చెందిన శివరాజన్ అందజేశారు. మొత్తం 20మందికి పైగా వైద్య నిపుణులు ఉచిత హెల్త్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఫెయిర్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు వరుసగా.. శోభ చొక్కలింగం(కార్డియాజిస్ట్), సురేఖ సాకల, శాంతి యెన్న(డెంటల్), మల్లిక రాజేంద్రన్ (గైనకాలజిస్ట్), గిరిజా కుమార్, రామరాజు యేలవర్తి(ఇంటర్నల్ మెడిసిన్), రమేశ్ కోలా (హెమటాలజిస్ట్), వసంతనాయుడు, కాంచన రాజశేఖర్, తనూజ కొత్తింటి, ఉషా అప్పలనేని (పిడియాట్రిషియన్స్), వైదేహి సలాడి (ఫిజియో థెరపిస్ట్), శ్రీ గురుస్వామి (సోషల్ వర్కర్), శ్రీ శక్తి రామనాథన్( డైటిషీయన్), మధ్వాని పట్వర్ధన్ (క్లినికల్ సైకాలజిస్ట్), భార్గవి నెట్టెమ్, కృష్ణ బత్తిన (ఫ్యామిలి నిపుణులు), కృతిబెన్ అగేరా(యోగా), సంజీవని ( మానసిక రుగ్మతల నిపుణురాలు) ఉన్నారు. వీరు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫెయిర్‌లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చారు. ఇక కార్యక్రమం చివర్లో రాధిక పతి మాట్లాడుతూ.. ఈ హెల్త్ ఫెయిర్‌ను విజయవంతం చేసినందుకు టెంపుల్ నిర్వాహకులను, పరీక్షలు నిర్వహించిన వివిధ వైద్య నిపుణులను, స్పాన్సర్లను, వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణమైన బాలాజీ టెంపుల్‌కు చెందిన మేనేజర్లు రమేశ చిత్తూరి, సత్య కుమారి, నిర్వాహకులు డా. ఎన్ఎస్ రావు, విజయలక్ష్మీరావు, వరదీశ్ చిన్నికృష్ణన్, అను అగ్నిహోత్రి, గణేశ్ సోలయిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
వయోలిన్ సంగీత విభావరి
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), చికాగో ఆంధ్ర అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ వయోలిన్ కచేరి చికాగో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆరభి కేంద్ర విద్వాంసుడు కళారత్న అషోక్ గుర్జాలే మరియు ఆయన శిష్యబృందం 15 వయోలిన్లతో తమ ప్రజ్ఞాపాటవాలతో శ్రోతలను అలరించారు. చికాగో గ్రేటర్ హిందూ టెంపుల్లో నిర్వహించబడిన ప్రదర్శనలో 400 వందల మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. వయోలిన్ తదితర శాస్త్రీయ సంగీత మెళకువలను నేర్పించే లాభాపేక్షలేని సంస్థైన ఆరభి కేంద్రం ఇప్పటివరకూ 750కి పైగా ప్రదర్శనలిచ్చి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల ప్రశంసలనూ, పురస్కారాలనూ అందుకుంది. చికాగోలోని ప్రముఖ వ్యాపారవేత్త రమణ అబ్బరాజు గుర్జాలే కంపోజర్‌గా 8 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల బాలలు నిర్వచించే ఈ అద్భుతమైన వయోలిన్ కచేరి నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆద్యంతం శ్రోతలను ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ విభావరిలో శ్రోతలు కళాకారులకు ‘స్టాండింగ్ ఓవియేషన్’ ఇచ్చి గౌరవంగా సత్కరించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఇంకా నిర్వహిస్తామని నిర్వాహకులు పద్మారావు అప్పలనేని అన్నారు. ఈ సందర్భంగా అషోక్ గుర్జాలే ఈ కార్యక్రమనిర్వాహకులైన సీఏఏ, ఆటాలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర వహించిన వాలంటీర్స్ వేణు అబ్బరాజు, మోహన్ మన్నే, శర్మ కొచ్చెర్లకోట, సుందర్ దిట్టకవి, మణి తాళ్ళప్రగడ, ఉష పరిటి, లక్ష్మి అబ్బరాజు, అహల్య అబ్బరరాజు, మనిషా పొన్నల తదితరులకి నిర్వాహకులు అభినందనలు తెలిపారు. -
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన ఆంధ్ర వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బారింగ్టన్ రోడ్ పాండ్ పిక్నిక్ గ్రోవ్‌లో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని ప్రెసిడెంట్ పద్మారావు పేర్కొన్నారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. చికాగోలో తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. సాయిరవి సూరిభోట్ల, విజయ్ కొరపాటి, సురేష్ పొనిపిరెడ్డి, విష్ణువర్ధన్ పద్దమారు, సత్య తోట పర్యవేక్షణలో విష్ణు విలాస్ వారు అందించిన విందుభోజనానికి తోడుగా సుజాత అప్పలనేని, రాజీ మక్కెన, శైలజ కపిల తయారుచేసిన గోంగూర పచ్చడి, నాటుకోడి కూర, ఆవకాయ పచ్చడి, మైసూర్‌పాక్, నెయ్యితో కలిపి కోనసీమ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకులలో వడ్డించారు. సాయంత్రం మల్లేశ్వరి పెదమల్లు ఆధ్వర్యంలో మహిళలు ముంత మసాలా తయారుచేసి వడ్డించారు. ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవి నెట్టెం (ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2020) సీఏఏ ఫౌండర్స్ దినకర్ - పవిత్ర కారుమూరి, మల్లేశ్వరి - శ్రీనివాస్ పెదమల్లు, సుందర్- వాణి దిట్టకవి, రాఘవ జాట్ల, ప్రసాద్ - భార్గవి నెట్టెం, సుజాత అప్పలనేని, ఉమా కటికి, సీఏఏ బోర్డ్ డైరెక్టర్లు శ్యామ్ సుందర్ పప్పు, సాయిరవి సూరిభోట్ల, శైలేష్ మద్ధి, శ్రీకృష్ణ మతుకుమల్లి, రాజ్ పోట్లూరి, రామకృష్ణ తాడేపల్లి, గౌరిశంకర్ అద్దంకి, శిరీష కోల, అనురాధ గంపాల, సాహితీ కొత్త, కిరణ్ వంకాయలపాటి, సునిత రాచపల్లి, నీలిమా బొడ్డు, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి వంగర సారథ్యంలో సంఘ వ్యవస్థాపకులు, బోర్డ్ డైరెక్టర్లు చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ విశేష ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా పిల్లలకి పెద్దలకి ఆటపాటల పోటీలను నిర్వహించి.. నీలిమ బొడ్డు, జయశ్రీ సోమిశెట్టి, శ్రీచైత్య పొనిపిరెడ్డి, శ్వేతా కొత్తపల్లి, సరిత వీరబ్రహ్మ, నాగేశ్వరి తోట, కిరణ్ మట్టే, స్మిత నండూరి బహుమతులందించారు. ఈ వనభోజనాలు జయప్రదం కావడానికి సహకరించిన దాతలు పటేల్ బ్రదర్స్, అశోక్ లక్ష్మణన్, కృష్ణ రంగరాజు తదితరులకు ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని మరియు సీఏఏ బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశ్ మీడియావారి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సహకారాన్ని పలువురు అభినందించారు. -
చికాగోలో ఘనంగా సీఏఏ తృతీయ వార్షికోత్సవ వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది పండుగ రోజున చికాగో ఆంధ్రా సంఘం(సీఏఏ) తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఆటా, పాటలు, హాస్య, పౌరాణిక నాటికలు, సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు, తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతంలో మూలాలున్న శ్రీ రామ్ విల్లివాలం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతరం డాక్టర్, ఇంజనీర్ వృత్తులనే కాకుండా నచ్చిన ఏ రంగంలోనైనా నిరంతర కృషితో తమ కలలను సాకారం చేసుకోవచ్చని ప్రోత్సహించారు. ఫౌండర్స్ ప్రెసిడెంట్ దినకర్ కారుమూరి మాట్లాడుతూ రామ్ విల్లివాలం కూడా చిన్ననాటి నుంచి మన తెలుగు సంస్థలలో ప్రాతినిధ్యం వహించి, నేటి యువతకి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావుకి చిత్ర లేఖనం, కవిత్వం, రచనా రంగాలలో వారు చేసిన విశేష కృషిని అభినందిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సమితి సభ్యులే కాకుండా చికాగో ఇండియన్ ఔట్ రీచ్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణ బన్సల్ వంటి పలువురు విచ్చేసి చికాగో ఆంధ్రా సమితి సభ్యులకి ప్రోత్సహం అందించారు. చికాగో ఆంధ్ర సంఘం వారి సేవా విభాగం ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి వివరించారు. చికాగో ఆంధ్రా సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మందిపైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషిచేశారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో జయశ్రీ సోమిశెట్టి, సవిత యాలమూరి-వెర్నేకర్, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్ మునగా వేదికను అందంగా అలంకరించగా, ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి అందరి ప్రశంసలనూ పొందేలా చక్కగా కూర్చి ఆద్యంతమూ చురుకుగా నడిపించారు. ఈ కార్యక్రమానికి సుందర్ దిట్టకవి, అన్విత పంచాగ్నుల, సవిత యాలమూరి-వెర్నేకర్, కార్తీక్ దమ్మాలపాటి వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. ఉగాది సందర్భంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు ఆంధ్ర ప్రాంత రుచులతో భోజనం వడ్డించారు. చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ పద్మారావు అప్పాలనేని మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విజయానికి సీఏఏ కార్యవర్గ సభ్యులు, వాలంటీర్ల కృషి మరువలేనిదని అన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం మాట్లాడుతూ ఫౌండర్స్ కమిటీ చైర్మన్ దినకర్ కారుమూరి, సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల, తన్వి జాట్ల, సంధ్య అప్పలనేని, సెక్రటరి శైలేష్ మద్ది, జాయింట్ సెక్రటరి రాజ్ పొట్లూరి, ట్రెజరర్ అను గంపాల, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, నీలిమ బొడ్డు, సురేష్ శనక్కాయల, సాయి రవి సూరిభొట్ల, సునీత రాచపల్లి, కిరణ్ వంకాయలపాటి, వెబ్ అండ్ డిజిటల్ డైరెక్టర్ శ్రీకృష్ణ మతుకుమల్లి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి, రామకృష్ణ తాడేపల్లి, లాజిస్టిక్స్ డైరెక్టర్ గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి, సీనియర్స్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పు రమణమూర్తి ఎడవల్లి, రఘు బడ్డి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, శృతి మోత్కూరు, మైత్రి అద్దంకిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ విజయానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలు విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, విష్ణు పెద్దమారు, సత్య తోట, సత్య నెక్కంటి, రమేశ్ నెక్కంటి, సురేశ్ ఐనపూడి, సరిత ఐనపూడి, వెంకట్ మక్కెన, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, హరచంద్ గంపాల, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రోమో వీడియోలలో పాల్గొన్న సభ్యులకు, రామాలయ ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్, వనమూర్తి, సతీశ్ అమృతూర్, అన్నపూర్ణ విశ్వనాధన్, వీడియో అండ్ ఫోటోగ్రఫీ సేవలందించిన యుగంధర్ నాగేశ్లతోపాటూ పలువురు కార్యకర్తలకు, అలాగే ఆర్థిక చేయూతనిస్తున్న స్పాన్సర్లకు అధ్యక్షులు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు. -
చికాగోలో సీఏఏ పల్లెసంబరాలు
చికాగో : చికాగో ఆంధ్ర సంఘం(సీఏఏ) ఆధ్వర్యంలో ఘనంగా “పల్లె సంబరాలు” కార్యక్రమం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న హిమపాతం, చలిగాలులు, రహదారులపై పేరుకుపోయిన మంచు, నడవటానికి కూడా ఇబ్బందిగా ఉన్నా లెక్కచేయకుండా చికాగో పరిసర పట్టణాలన్నిటి నుంచీ 1000 మందికిపైగా తెలుగువారు తరలివచ్చి, కార్యక్రమానికి శోభతెచ్చారు. తెలుగువారందరిని ఒక్క చోటికి తెచ్చి తెలుగు పల్లెల జీవనవిధానాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలన్న చికాగో తెలుగు ఆడుపడుచుల సంకల్పానికి ఇవేవీ అడ్డుకాలేకపోయాయి. ఈ కార్యక్రమం దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతం, చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయటం, వినాయక స్థుతితో ప్రారంభమైంది. జానకి ఆనందవల్లి నాయర్ విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం “దేవీస్థుతి రాగమాలిక”,, అపర్ణ ప్రశాంత్ విద్యార్ధుల బృందం ప్రదర్శించిన “జతిస్వరం” లను ప్రేక్షకులు కరతాళధ్వనులతో ప్రశంసించారు. చిన్నారులు నర్తించిన అనేక సినీ గీత నృత్యాలు అందరినీ అలరించాయి. శిల్ప పైడిమర్రి సమన్వయించిన మహానటి పాటల నృత్యాలు అందరినీ మెప్పించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించిన అనేక నృత్యగీతాలు ప్రేక్షకులను కూడా తమతోపాటు నర్తించేలా చేశాయి. జ్యోతి వంగర నృత్యదర్శకత్వంలో మూడు రోజుల సంక్రాంతి వేడుకలను ప్రతిబింబిస్తూ 60మందికి పైగా పాల్గొన్న సంక్రాంతి రూపకం 20 నిమిషాలపాటు ప్రేక్షకులను సమ్మోహనపరచి మెప్పించింది. సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి సాంస్కృతిక కార్యక్రమాలను, వేదిక నిర్వహణను చాలా చక్కగా సమర్ధవంతంగా చేసి అందరి మన్ననలూ పొందారు. మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, సుజాత అప్పలనేని, వాణి దిట్టకవి వారికి సలహాలు, సూచనలు అందిస్తూ అన్నిటా తోడుగా నిలిచారు. శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన ఎడ్లబండి, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన అలంకరణలు, ద్వారం, ముగ్గులు, గాలిపటాలు, అందరికీ ఒక చక్కని అనుభూతినిచ్చాయి, ఫోటోలు వీడియోల రూపంలో గుర్తుంచుకొనేలా మిగిలాయి. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో దాదాపు 20మంది ఆడపడుచులు ఉత్సాహంగా వేదికపై చేసిన అలంకరణలు, జయశ్రీ సోమిశెట్టి, భార్గవి నెట్టెం చిత్రించిన వేదిక నేపధ్య చిత్రాలు, శ్వేత కొత్తపల్లి, శైలజ సప్ప కూర్చిన సంక్రాంతి బొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణలుగా అందరి మెప్పును పొందాయి. సమత పెద్దమారు చేసిన దీపవనితల అలంకరణ మరో ప్రత్యేక ఆకర్షణై విశిష్టంగా నిలిచింది. శ్రీశైలేశ్ మద్ది, శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన లోగోలు, బ్యానర్లు, ప్రచార కరపత్రాలు, కార్యక్రమ వివరాల కరపత్రం కనులవిందుగా ఉండి అందరి ప్రశంసలనూ పొందాయి. వారే రూపొందించి ముద్రించిన 2019 తెలుగు క్యాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా ఏడాది పొడవునా ఉపయోగించుకునేవిధంగా నిలిచింది. కార్యక్రమ నిర్వహణను కిరణ్మయి మట్టే, శైలజ చెరువు, సుందర్ దిట్టకవి సమయపాలన తప్పకుండా నిర్వహించారు. చైర్మన్ దినకర్ కారుమూరి చికాగో ఆంధ్ర సంఘపు పూర్వ నాయకత్వాన్ని సత్కరించారు. సంఘ అధ్యక్షులు అప్పలనేని పద్మారావు మాట్లాడుతూ ఈ ఏడాదంతా నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించి, సంఘ సభ్యులకు, స్పాన్సర్లకు, విచ్చేసిన గౌరవ అతిధులకు, పెద్దలకు, అన్ని బాధ్యతలను స్వఛ్ఛందంగా తీసుకుని చక్కగా నిర్వహించిన కార్యకర్తలకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం అన్నిచోట్లా తామేవుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, సీనియర్ డైరెక్టర్ శ్యామ పప్పు అతిథి స్వాగత సత్కారాలను నిర్వహించారు. సంఘ యువ డైరెక్టర్లు మైత్రి అద్దంకి, శృతి మోత్కూర్, నిఖిల్ దిట్టకవి యవత కోసం తమ ప్రణాళికలు వివరించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సంపత్తిని, సహకారాన్ని మణి తెల్లాప్రగడ, పద్మాకర్ దామరాజు, కిరణ్ ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ శైలేశ్ మద్ది, సంధ్య అప్పలనేని సమకూర్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సురేశ్ శనక్కాయల, అనురాధ గంపల, కిరణ్మయి వంకాయలపాటి, శ్రీకృష్ణ మతుకుమల్లి, నీలిమ బొడ్డు, శ్రీనివాస్ ధూళిపాళ్ళ, రమేశ్ నెక్కంటి సమర్ధవంతంగా నిర్వహించారు. -
చికాగోలో అంబురాన్ని అంటిన సాంస్కృతిక సంబురాలు
సాక్షి, చికాగో : చికాగో ఆంధ్ర సమితి వారి 3వ సాంస్కృతిక దినోత్సవం ప్లెయిన్‌ఫీల్డ్ నార్త్ హైస్కూల్లో అక్టోబర్ 13న ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారుల నాట్యాలు, పెద్దవారి ఆటలు, పాటలు, ఆడవారి చీరలు, ఆత్మీయ పలకరింపులు, విందు వినోదాలు.. మొత్తానికి దసరా జాతర- సాంస్కృతిక శోభ మేళవించిన సంబరాన్ని తలపించింది. సీఏఏ అధ్యక్షులు డా. ఉమ కటికి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 600 పైగా అతిథులు పాల్గొన్నారు. విశేష అతిథులుగా బిల్ ఫాస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవెలిన్ సంగునీటి విచ్చేసి భారత దేశ సంస్కృతిని, ఆంధ్ర ప్రదేశ్ కళలని, సీఏఏ చేస్తున్న కృషిని కొనియాడారు. కల్చరల్ టీం సభ్యులు శిరీష కోలా, రమేష్ కోలా, సురేష్ శనక్కాయల, నీలిమ బొడ్డు, సాహితి కొత్త, శ్రీ కృష్ణ మటుకుమల్లి గారి ఆధ్వర్యంలో నృత్య గురువులు శోభ తమన్న, దివ్య రాజశేఖరన్, జ్యోతి వంగర, రమ్య కౌముది, శోభ నటరాజన్, దేవకి జానకిరామన్, జానకి ఆనందవల్లి గార్ల శిష్యులు చేసిన నృత్యాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమ శిష్యులతో శోభ నటరాజన్ చేయించిన మల్హరి నృత్యం, జ్యోతి వంగర చేయించిన ఆంధ్ర ప్రదేశ్ నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ నృత్య కళలని చూసిన సీఏఏ ఫౌండర్స్ కమిటీ సభ్యులు దినకర్ కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా, ప్రజలు వారి మనస్సులు కలిసి ఉన్నాయి అని ఈ రోజు నిరూపించింది అన్నారు. ధనాధికారి సునీత రాచపల్లి, కిరణ్మయి వంకాయలపాటి, అను గంపల, రమణ మూర్తి ఏడవల్లి ఆత్మీయంగా అతిథుల్ని ఆహ్వానిస్తే, సాయి రవి సూరిబోట్ల ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ సభ్యుల ఆతిధ్యం ఆంధ్ర రుచులని మురిపించింది. ఏపీడీఫ్ఎన్ఏ టీం రాజ్ పొట్లూరి, శైలేష్ మద్ది ఆంధ్రాలో చికాగో ఆంధ్ర సమితి వారు చేసిన సేవలని వివరించారు. మెంబర్షిప్ ద్వారా వచ్చిన ఆదాయంలో 25% అణుగారిన వర్గాల అభ్యున్నతికి, అనాథ, దివ్యంగుల సేవకి వేచిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల టిట్లీ ప్రభావానికి గురైన ఉత్తరాంధ్రని ఆదుకోవడానికి చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించి విరాళాలు అందించారు. దానికి సీఏఏ తమ వంతు విరాళం జత చేసి ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తామని ఏపీడీఫ్ఎన్ఏ ప్రతినిధులు తెలిపారు. సంస్థ ఫౌండర్స్ శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల గార్లు అతిథుల్ని పలకరిస్తూ చికాగో నగరంలోని ఇతర సంస్థల ప్రతినిధులని ఆహ్వానించారు. సంస్థలు భిన్నమైన, వారి ఏకత్వం ఒక్కటే అని ఈ కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. డా. ఉమ కటికి 2019 సంవత్సరానికి బోర్డుని ప్రకటిస్తూ పద్మారావు అప్పలనేని ప్రెసిడెంట్ గాను, డా. భార్గవి నెట్టంని ఉపాధ్యక్షులుగా (2020 ప్రెసిడెంట్-ఎలెక్ట్) గా ఎన్నుకునట్టు తెలిపారు. 2019 సంవత్సర అధ్యక్షులు పద్మారావు గారు ఇప్పుడున్న కార్యవర్గంలోకి నూతనంగా వస్తున్న గౌరి శంకర్ అద్దంకి, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ హరి జాస్తి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, మైత్రి అద్దంకి, శ్రుతి మోత్కుర్, సీనియర్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పుని పరిచయం చేసారు. 2019లో సంస్థ బలోపేతానికి తన వంతు కృషికి మద్దతు తెలపాలని అభ్యర్దించారు. చివర్లో 'సంసారంలో సరిగమలు' అంటూ లక్ష్మీ దామరాజు గారి ఆధ్వర్యంలో సీనియర్స్ వేసిన పాటల పూదోట, లక్ష్మీ నాగ్ సూరిబోట్ల గారి గారి దర్శకత్వంలో స.ప.స నాటకం ప్రేక్షకులని అలరించాయి. బోర్డు సభ్యులే కాక వలంటీర్ మెంబర్లు విజయ్ కొరపాటి, సత్య తోట, సురేష్ ఐనపూడి, సురేష్ పోనిపిరెడ్డి, శ్రీచైతన్య పోనిపిరెడ్డి, రమేష్ నెక్కంటి, సత్య నెక్కంటి, సుధీర్ పోతినేని, రామ్ ఇనుకుర్తి, శ్రీనివాస్ దూళిపాల్ల, ప్రశాంతి తాడేపల్లి, మల్లేశ్వరి పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, క్రిష్ణకాంత్ పరుచూరి, శ్రీని రాచపల్లి, పద్మాకర్ దామరాజు, మాలతి దామరాజు, భాను స్వర్గంలు కూడా అందర్నీ ఆహ్వానించి కార్యక్రమంలో వివిధ అంశాలలో సహాయ సహకరాలని అందించారు. సంస్థ సెక్రెటరీ డా. భార్గవి నెట్టం వందన సమర్పణలో 2018 సంవత్సర కార్యవర్గానికి, స్పాన్సర్స్, ఫౌండర్స్, నృత్య గురువులు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమెరికా, భారత దేశాల జాతీయ గీతలాపనతో కార్యక్రమం పూర్తి అయింది. -
సీఏఏ ఆధ్యర్యంలో ఘనంగా 'వుమెన్స్ గాలా'
చికాగో : నాపర్విల్లేలోని రాయల్ ప్యాలెస్ హాలులో చికాగో ఆంధ్ర అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా 'విమెన్స్ గాలా' నిర్వహించారు. సీఏఏ అధ్యక్షురాలు డా.ఉమ కటికి, బోర్డు సభ్యులు దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని దీపనాగ్ ఆలపించిన వినాయక ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 300మందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ జాతీయ సమైక్యతా సూచిగా 10మంది సీనియర్ మహిళలు వివిధ రాష్ట్రాల సాంప్రదాయక వస్త్రధారణతో ప్రదర్శించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపనాగ్ తన గాత్రంతో కార్యక్రమాన్ని ఉరకలెత్తించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన డా. విజ్జీ, శ్రీశక్తి, డార్లెన్ సెంగెర్, సంతోష్ కుమార్, రీస్ యవర్, గౌరీ శ్రీ, వాసవిలు తమ ప్రసంగాలతో మంచి సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆటాపాటలతోపాటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సీఏఏవారు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చికాగోలో శాంబర్గ్ లోని బస్సే పార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. డా. ఉమ కటికి అధ్యక్షతన చికాగో ఆంధ్రా సంఘం వారు, వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తు, ఈ ఏడాది కూడా అరిటాకులలో వడ్డించడం అందరిని ఆకట్టుకుంది. చికాగోలోని తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఆంధ్రా రుచులైన పులిహోరతో పాటు ఊరగాయ, ముక్కల పులుసు, బెండకాయ వేపుడు, పెరుగువడలు వడ్డించారు. రుచికరమైన పెరుగువడ కోసం ఆంధ్ర అయినా వెళ్లాలి లేదా చికాగో ఆంధ్ర సంఘం వన భోజనాలకి రావాలి అని ఫుడ్ కమిటీ చైర్ సాయి రవి సూరిభోట్ల అనడంతో నవ్వుల పూయించింది. 500 మందికిపైగా అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలి అన్న అంశంపై సీఏఏ కార్యదర్శి డా. భార్గవి నెట్టం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పిల్లలకి పెద్దలకి ఆటలని నిర్వహించారు. తండ్రులతో కలిసి పిల్లలు ఆడిన మూడు కాళ్ల పరుగు అందరిని ఆకట్టుకుంది. ఫాధర్స్ డేను పురస్కరించుకొని చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో సీఏఏ అధ్యక్షురాలు డా. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ ఛైర్మన్ దినకర్ కారుమురితో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం సీఏఏ ఇలాంటి మరెన్నో కార్యక్రమలని నిర్వహించబోతోందన్నారు.