సాక్షి, చికాగో : చికాగో ఆంధ్ర సమితి వారి 3వ సాంస్కృతిక దినోత్సవం ప్లెయిన్‌ఫీల్డ్ నార్త్ హైస్కూల్‌లో అక్టోబర్ 13న ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారుల నాట్యాలు, పెద్దవారి ఆటలు, పాటలు, ఆడవారి చీరలు, ఆత్మీయ పలకరింపులు, విందు వినోదాలు.. మొత్తానికి దసరా జాతర- సాంస్కృతిక శోభ మేళవించిన సంబరాన్ని తలపించింది. సీఏఏ అధ్యక్షులు డా. ఉమ కటికి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 600 పైగా అతిథులు పాల్గొన్నారు. విశేష అతిథులుగా బిల్ ఫాస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవెలిన్ సంగునీటి విచ్చేసి భారత దేశ సంస్కృతిని, ఆంధ్ర ప్రదేశ్ కళలని, సీఏఏ చేస్తున్న కృషిని కొనియాడారు. కల్చరల్ టీం సభ్యులు శిరీష కోలా, రమేష్ కోలా, సురేష్ శనక్కాయల, నీలిమ బొడ్డు, సాహితి కొత్త, శ్రీ కృష్ణ మటుకుమల్లి గారి ఆధ్వర్యంలో నృత్య గురువులు శోభ తమన్న, దివ్య రాజశేఖరన్, జ్యోతి వంగర, రమ్య కౌముది, శోభ నటరాజన్, దేవకి జానకిరామన్, జానకి ఆనందవల్లి గార్ల శిష్యులు చేసిన నృత్యాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
తమ శిష్యులతో శోభ నటరాజన్ చేయించిన మల్హరి నృత్యం, జ్యోతి వంగర చేయించిన ఆంధ్ర ప్రదేశ్ నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ నృత్య కళలని చూసిన సీఏఏ ఫౌండర్స్ కమిటీ సభ్యులు దినకర్ కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా, ప్రజలు వారి మనస్సులు కలిసి ఉన్నాయి అని ఈ రోజు నిరూపించింది అన్నారు. ధనాధికారి సునీత రాచపల్లి, కిరణ్మయి వంకాయలపాటి, అను గంపల, రమణ మూర్తి ఏడవల్లి ఆత్మీయంగా అతిథుల్ని ఆహ్వానిస్తే, సాయి రవి సూరిబోట్ల ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ సభ్యుల ఆతిధ్యం ఆంధ్ర రుచులని మురిపించింది. ఏపీడీఫ్‌ఎన్‌ఏ టీం రాజ్ పొట్లూరి, శైలేష్ మద్ది ఆంధ్రాలో చికాగో ఆంధ్ర సమితి వారు చేసిన సేవలని వివరించారు. మెంబర్షిప్ ద్వారా వచ్చిన ఆదాయంలో 25% అణుగారిన వర్గాల అభ్యున్నతికి, అనాథ, దివ్యంగుల సేవకి వేచిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల టిట్లీ ప్రభావానికి గురైన ఉత్తరాంధ్రని ఆదుకోవడానికి చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించి విరాళాలు అందించారు.
దానికి సీఏఏ తమ వంతు విరాళం జత చేసి ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తామని ఏపీడీఫ్‌ఎన్‌ఏ ప్రతినిధులు తెలిపారు. సంస్థ ఫౌండర్స్ శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల గార్లు అతిథుల్ని పలకరిస్తూ చికాగో నగరంలోని ఇతర సంస్థల ప్రతినిధులని ఆహ్వానించారు. సంస్థలు భిన్నమైన, వారి ఏకత్వం ఒక్కటే అని ఈ కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. డా. ఉమ కటికి 2019 సంవత్సరానికి బోర్డుని ప్రకటిస్తూ పద్మారావు అప్పలనేని ప్రెసిడెంట్ గాను, డా. భార్గవి నెట్టంని ఉపాధ్యక్షులుగా (2020 ప్రెసిడెంట్-ఎలెక్ట్) గా ఎన్నుకునట్టు తెలిపారు. 2019 సంవత్సర అధ్యక్షులు పద్మారావు గారు ఇప్పుడున్న కార్యవర్గంలోకి నూతనంగా వస్తున్న గౌరి శంకర్ అద్దంకి, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ హరి జాస్తి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, మైత్రి అద్దంకి, శ్రుతి మోత్కుర్, సీనియర్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పుని పరిచయం చేసారు. 2019లో సంస్థ బలోపేతానికి తన వంతు కృషికి మద్దతు తెలపాలని అభ్యర్దించారు. చివర్లో 'సంసారంలో సరిగమలు' అంటూ లక్ష్మీ దామరాజు గారి ఆధ్వర్యంలో సీనియర్స్ వేసిన పాటల పూదోట, లక్ష్మీ నాగ్ సూరిబోట్ల గారి గారి దర్శకత్వంలో స.ప.స నాటకం ప్రేక్షకులని అలరించాయి.
బోర్డు సభ్యులే కాక వలంటీర్ మెంబర్లు
విజయ్ కొరపాటి, సత్య తోట, సురేష్ ఐనపూడి, సురేష్ పోనిపిరెడ్డి, శ్రీచైతన్య పోనిపిరెడ్డి, రమేష్ నెక్కంటి, సత్య నెక్కంటి, సుధీర్ పోతినేని, రామ్ ఇనుకుర్తి, శ్రీనివాస్ దూళిపాల్ల, ప్రశాంతి తాడేపల్లి, మల్లేశ్వరి పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, క్రిష్ణకాంత్ పరుచూరి, శ్రీని రాచపల్లి, పద్మాకర్ దామరాజు, మాలతి దామరాజు, భాను స్వర్గంలు కూడా అందర్నీ ఆహ్వానించి కార్యక్రమంలో వివిధ అంశాలలో సహాయ సహకరాలని అందించారు. సంస్థ సెక్రెటరీ డా. భార్గవి నెట్టం వందన సమర్పణలో 2018 సంవత్సర కార్యవర్గానికి, స్పాన్సర్స్, ఫౌండర్స్, నృత్య గురువులు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమెరికా, భారత దేశాల జాతీయ గీతలాపనతో కార్యక్రమం పూర్తి అయింది.
Comments
Please login to add a commentAdd a comment