cultural events
-
Hyderabad: నుమాయిష్.. కల్చరల్..జోష్..
నగరంలో 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జోరుగా సాగుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఈవెంట్ ఫిబ్రవరి 18 వరకూ కొనసాగనుంది. ఎప్పటి నుంచో షాప్ హాలిక్స్కు ఫేవరెట్ స్పాట్‌గా ఉన్న ఈ వస్తూత్పత్తుల ఉత్సవం.. గత కొంత కాలంగా సాంస్కృతిక కార్యకలాపాల వేదికగానూ వరి్ధల్లుతోంది. కళలను అభిమానించేవారికి చిరునామాగా మారుతోంది. నుమాయిష్కి వెళ్లొచ్చాను అనగానే.. ఏం కొన్నావ్? ఏం తిన్నావ్? అనే ప్రశ్నలే ఎదురవుతాయి తప్ప ఎవరి పాటలు ఎంజాయ్ చేశావ్! ఎవరి నృత్యాభినయాన్ని ఆస్వాదించావ్? అనే ప్రశ్నలు అరుదే. ప్రధానంగా షాపింగ్ ప్రియుల కోసం ఏర్పాటైన ప్రదర్శన కావడం వల్ల నుమాయి‹Ùని ఒక కల్చరల్ ఈవెంట్స్‌కి కేరాఫ్‌గా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. మంచి సంగీతాన్ని, నృత్యాన్ని, హాస్య కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అవకాశం ఉంటుందనే ఆలోచన నగరవాసుల్లో వస్తోంది. రోజుకు 6 గంటలపైనే.. నుమాయిష్ షాపింగ్ ప్రధాన ఆకర్షణ అయితే, దానితో పాటే అంతకు మించిన అనుభవాన్ని, వినోదాత్మక కార్యక్రమాలను కూడా అందిస్తోంది. రోజూ సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. దీని కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా పండల్, లాన్స్‌లో 2 వేదికలు ఏర్పాటు చేశారు. నుమాయి‹Ùని సందర్శించాలని ప్లాన్ చేసే కళాభిమానులు తమకు నచ్చిన ఈవెంట్ ఉన్న రోజును ఎంచుకోవడానికి వీలుగా షాపింగ్‌తో పాటే పలు రకాల అద్భుతమైన ఈవెంట్ల జాబితా కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు. మంత్రముగ్ధులను చేసే నృత్య ప్రదర్శనల నుంచి మనోహరమైన ముషైరా సెషన్స్ వరకు, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వైవిధ్యభరిత ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు.కూచిపూడితో కూడి.. సంప్రదాయ సౌరభాలను ఆస్వాదించేవారికి నుమాయిష్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు. కూచిపూడి వంటి సంప్రదాయక నృత్యకళలకు ఇక్కడ ఎక్కువగా పట్టం గడుతున్నారు. అలాగే గజల్స్, సూఫీ సంగీతం వంటివి ప్రముఖ కళాకారులు అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు నుమాయిష్ అధికారిక వెబ్సైట్లో ఆయా ఈవెంట్లకు సంబంధించిన తేదీలు, వేదికలు, కళాకారుల వివరాలతో కూడిన ఈవెంట్ల జాబితాను పరిశీలించుకోవచ్చు. ప్రముఖ స్టార్స్ ఈవెంట్స్.. గత సంవత్సరం, బాలీవుడ్ స్టార్ సింగర్ జావేద్ అలీ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం చాలా మంది నగరవాసులకు మధురమైన జ్ఞాపకం. ఈ ఏడాది ఇప్పటి వరకూ అలాంటి సంచలనాత్మక ప్రకటన ఏమీ రానప్పటికీ.. రానున్న రోజుల్లో ఉండొచ్చని నిర్వాహకులు, సందర్శకులు అంటున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ఓ వైపు సందర్శకులను సేదతీరుస్తూనే, మరోవైపు స్థానిక ఔత్సాహిక కళాకారులకు అనువైన వేదికలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయని చెప్పాలి. నేడు, రేపు..ఇలా.. ఈ వారాంతం వరకూ ఒకసారి పరిశీలిస్తే.. నేడు (మంగళవారం) కూచిపూడి నృత్యం (ఎం.భిక్షపతి) కామెడీ కార్యక్రమం (షాబుద్దీన్), బుధవారం సినిమా పాటలు (జాఫర్ ఉజ్ జమా), కూచిపూడి నృత్యం (రాజ్‌కుమార్), లయన్స్ క్లబ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అలాగే గురువారం భువనవిజయం ప్రదర్శన, శుక్రవారం విశ్వప్రభ కూచిపూడి నృత్యం, శ్రీకృష్ణ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, గజల్ గీతాలు (అడ్నాన్ సలీమ్)జిందా దిలాన్ఏ హైదరాబాద్ (ముషాయిరీ).. ఇలా పలు వైవిధ్యభరితంగా సందర్శకులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. -
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో.. నాలుక్కరుచుకోవడం ఖాయం!
బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అవన్ ఇవన్ (తెలుగులో వాడు వీడు)లో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే...డియో డియో డోలే’ పాట వినిస్తే పాదాలు ‘కమాన్ డ్యాన్స్’ అంటాయి. తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ముగ్గురు పిల్లల డ్యాన్స్. జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే...డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన వారు నాలుక కరుచు కోవడానికి అట్టే టైమ్ పట్టలేదు. నిజానికి వారు బాలికలు కాదు బాలురు! View this post on Instagram A post shared by M.P. Dhasvanth (@m.p.dhasvanth) View this post on Instagram A post shared by Tamil Animals Life (Animals Lovely Page) (@tamilanimalsloop) -
సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు తన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ 46వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గాన గంధర్వుడు పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యానికి, నాట్యమయూరి పద్మశ్రీ శోభా నాయుడికి ఘన నివాళి అర్పిస్తూ.. అంతర్జాల వేదికపై సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం, దీపావళి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆధ్యాంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి సందేశం, పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు, చెప్పుకోండి చూద్దాం, పాటలు, రాజు కామెడీ, బుర్రకథలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకి, గాయని సత్యకి, మిమిక్రీ రాజుకి, యాంకర్ నవతకి, బుర్రకథ విజయకుమార్ బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్ బృందానికి, తమ బిజీ షెడ్యూల్లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్ పి. కుమరన్, సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయ సహకారాలకు సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సమాజ కీర్తిని, ప్రజలకు మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్‌లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని కోరారు. తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీఎస్ పూర్వ కార్యదర్శులు, కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్‌కు, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు,హమారా బజార్‌కు, సెక్రటరీ సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియాకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి కృతఙ్ఞతలు తెలియజేశారు. -
బాల మేధావులు భళా !
సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి. – నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్ గాలి ద్వారా వంట.. గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్‌కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. – తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడ విషజ్వరాలు సోకకుండా.. ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు. – వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్ఎస్, మావల సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి. – యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్ దోమలు వృద్ధి చెందకుండా.. దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి. – దీపాలి, మారుతి, జెడ్పీఎస్ఎస్, మన్నూర్ సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చల్లని, వేడి గాలిచ్చే కూలర్.. తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్ ద్రియ సాగు.. బహుబాగుసేం ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్‌గ్యాస్ తయారు చేసుకోవచ్చు. – కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్ -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
-
చికాగోలో అంబురాన్ని అంటిన సాంస్కృతిక సంబురాలు
సాక్షి, చికాగో : చికాగో ఆంధ్ర సమితి వారి 3వ సాంస్కృతిక దినోత్సవం ప్లెయిన్‌ఫీల్డ్ నార్త్ హైస్కూల్లో అక్టోబర్ 13న ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారుల నాట్యాలు, పెద్దవారి ఆటలు, పాటలు, ఆడవారి చీరలు, ఆత్మీయ పలకరింపులు, విందు వినోదాలు.. మొత్తానికి దసరా జాతర- సాంస్కృతిక శోభ మేళవించిన సంబరాన్ని తలపించింది. సీఏఏ అధ్యక్షులు డా. ఉమ కటికి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 600 పైగా అతిథులు పాల్గొన్నారు. విశేష అతిథులుగా బిల్ ఫాస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవెలిన్ సంగునీటి విచ్చేసి భారత దేశ సంస్కృతిని, ఆంధ్ర ప్రదేశ్ కళలని, సీఏఏ చేస్తున్న కృషిని కొనియాడారు. కల్చరల్ టీం సభ్యులు శిరీష కోలా, రమేష్ కోలా, సురేష్ శనక్కాయల, నీలిమ బొడ్డు, సాహితి కొత్త, శ్రీ కృష్ణ మటుకుమల్లి గారి ఆధ్వర్యంలో నృత్య గురువులు శోభ తమన్న, దివ్య రాజశేఖరన్, జ్యోతి వంగర, రమ్య కౌముది, శోభ నటరాజన్, దేవకి జానకిరామన్, జానకి ఆనందవల్లి గార్ల శిష్యులు చేసిన నృత్యాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమ శిష్యులతో శోభ నటరాజన్ చేయించిన మల్హరి నృత్యం, జ్యోతి వంగర చేయించిన ఆంధ్ర ప్రదేశ్ నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ నృత్య కళలని చూసిన సీఏఏ ఫౌండర్స్ కమిటీ సభ్యులు దినకర్ కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా, ప్రజలు వారి మనస్సులు కలిసి ఉన్నాయి అని ఈ రోజు నిరూపించింది అన్నారు. ధనాధికారి సునీత రాచపల్లి, కిరణ్మయి వంకాయలపాటి, అను గంపల, రమణ మూర్తి ఏడవల్లి ఆత్మీయంగా అతిథుల్ని ఆహ్వానిస్తే, సాయి రవి సూరిబోట్ల ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ సభ్యుల ఆతిధ్యం ఆంధ్ర రుచులని మురిపించింది. ఏపీడీఫ్ఎన్ఏ టీం రాజ్ పొట్లూరి, శైలేష్ మద్ది ఆంధ్రాలో చికాగో ఆంధ్ర సమితి వారు చేసిన సేవలని వివరించారు. మెంబర్షిప్ ద్వారా వచ్చిన ఆదాయంలో 25% అణుగారిన వర్గాల అభ్యున్నతికి, అనాథ, దివ్యంగుల సేవకి వేచిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల టిట్లీ ప్రభావానికి గురైన ఉత్తరాంధ్రని ఆదుకోవడానికి చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించి విరాళాలు అందించారు. దానికి సీఏఏ తమ వంతు విరాళం జత చేసి ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తామని ఏపీడీఫ్ఎన్ఏ ప్రతినిధులు తెలిపారు. సంస్థ ఫౌండర్స్ శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల గార్లు అతిథుల్ని పలకరిస్తూ చికాగో నగరంలోని ఇతర సంస్థల ప్రతినిధులని ఆహ్వానించారు. సంస్థలు భిన్నమైన, వారి ఏకత్వం ఒక్కటే అని ఈ కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. డా. ఉమ కటికి 2019 సంవత్సరానికి బోర్డుని ప్రకటిస్తూ పద్మారావు అప్పలనేని ప్రెసిడెంట్ గాను, డా. భార్గవి నెట్టంని ఉపాధ్యక్షులుగా (2020 ప్రెసిడెంట్-ఎలెక్ట్) గా ఎన్నుకునట్టు తెలిపారు. 2019 సంవత్సర అధ్యక్షులు పద్మారావు గారు ఇప్పుడున్న కార్యవర్గంలోకి నూతనంగా వస్తున్న గౌరి శంకర్ అద్దంకి, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ హరి జాస్తి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, మైత్రి అద్దంకి, శ్రుతి మోత్కుర్, సీనియర్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పుని పరిచయం చేసారు. 2019లో సంస్థ బలోపేతానికి తన వంతు కృషికి మద్దతు తెలపాలని అభ్యర్దించారు. చివర్లో 'సంసారంలో సరిగమలు' అంటూ లక్ష్మీ దామరాజు గారి ఆధ్వర్యంలో సీనియర్స్ వేసిన పాటల పూదోట, లక్ష్మీ నాగ్ సూరిబోట్ల గారి గారి దర్శకత్వంలో స.ప.స నాటకం ప్రేక్షకులని అలరించాయి. బోర్డు సభ్యులే కాక వలంటీర్ మెంబర్లు విజయ్ కొరపాటి, సత్య తోట, సురేష్ ఐనపూడి, సురేష్ పోనిపిరెడ్డి, శ్రీచైతన్య పోనిపిరెడ్డి, రమేష్ నెక్కంటి, సత్య నెక్కంటి, సుధీర్ పోతినేని, రామ్ ఇనుకుర్తి, శ్రీనివాస్ దూళిపాల్ల, ప్రశాంతి తాడేపల్లి, మల్లేశ్వరి పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, క్రిష్ణకాంత్ పరుచూరి, శ్రీని రాచపల్లి, పద్మాకర్ దామరాజు, మాలతి దామరాజు, భాను స్వర్గంలు కూడా అందర్నీ ఆహ్వానించి కార్యక్రమంలో వివిధ అంశాలలో సహాయ సహకరాలని అందించారు. సంస్థ సెక్రెటరీ డా. భార్గవి నెట్టం వందన సమర్పణలో 2018 సంవత్సర కార్యవర్గానికి, స్పాన్సర్స్, ఫౌండర్స్, నృత్య గురువులు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమెరికా, భారత దేశాల జాతీయ గీతలాపనతో కార్యక్రమం పూర్తి అయింది. -
ట్యాగ్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
కాలిఫోర్నియా : ఎక్కడ ఉన్నా తెలుగు వారంత ఒకటే అనేలా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా శాక్రమెంటో తెలుగు సంఘం(ట్యాగ్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాగ్స్ 14వ వార్షికోత్సవ వేడుకలను కూడా సంక్రాంతి సంబరాలతో పాటే జరుపుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో సుమారు వెయ్యిమందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. లింగా శ్రీనివాస్ రూపొందించిన ‘తెలుగు విజయం’ జానపద నృత్యం , శ్రీదేవి మాగంటి బృందం ప్రదర్శించిన బుర్రకథ, కోలాటం, 300 మంది కళకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారి డప్పు వాయింపు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు శాక్రమెంటో జిల్లా అధికారి సూఫ్రాస్ట్, ఫాల్సం మేయర్ స్టీవ్ మిక్లోస్, ప్రముఖ వైద్యుడు హనిమిరెడ్డి లక్కిరెడ్డి, ఆపాప ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు సీసీ యిన్, సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు వీరిని ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కూచిభోట్ల మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, సంప్రదాయాలను భావి తరాలకు అందిచాలన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడి చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు వైద్య సేవలు అందిచ్చేందుకు సకల సౌకర్యాలతో నిర్మితమవుతున్న సంజీవని ఆస్పత్రికి సహకారం అందించడానికి దాతలు ముందుకురావాలని కోరారు. ఆస్పత్రి ద్వారా ఆరోగ్యంతో పాటు 500పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. హనిమిరెడ్డి లక్కిరెడ్డి మాట్లాడుతూ.. తాను విద్యాసంస్థలకు భూ విరాళాలు ఇచ్చానని, ఇప్పటివరకు సంపాందించింది తన కుటుంబానికైతే.. ఇకపై సంపాందించేదంతా సమాజశ్రేయస్సుకే ఖర్చు చేస్తానన్నారు. ట్యాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం, ప్రెసిడెంట్ మనోహర్ చేతుల మీదుగా తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తున్న ఆనంద్ కూచిభోట్లకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు. పాల్సం,రోసివిల్లి, నాటోమాస్ కేంద్రాలలోని సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు పద్యాలు, కథలు, పాటలతో ఆకట్టుకున్నారు. వీఎంబ్రేస్ సంస్థకు చెందిన దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను వీక్షకులు కరతాల ధ్వనులతో ప్రోత్సాహించారు. జనవరి 14న కూడా ట్యాగ్స్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని ఇదే వేదికపై నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఫ్రీమాంట్ సిద్ధి వినాయకునిక ఆలయం నుంచి వచ్చిన పూజరులు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్యాగ్స్ రేణిగుంటలోని అభయ క్షేత్రం, హైదరాబాద్‌లోని విజిష్ణ ఫౌండేషన్, బ్యాక్ టూ ద రూట్స్‌కి విరాళాలు అందజేస్తుందని ట్యాగ్స్ సభ్యులు తెలిపారు. విరాళాలు అందజేయదలచినవారు మెయిల్(sactags@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి,రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి పాల్గోన్నారు. -
ఘల్లు ఘల్లు... ఓరుగల్లు
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభమైన లోక్ జన్ ప్రథ ఉత్సవాలు అలరించిన వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లును దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోందని రాష్ట్ర పర్యాటకశాఖ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న లోక్ జన ప్రథ ఉత్సవాలు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ గతంలో సమైక్య రాష్ట్రంలో పర్యాటకానికి తగిన వనరులు లేవని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా చోట్ల వనరులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ మేరకు లోక్ జన ప్రథ ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఓరుగల్లులో ఇప్పటి వరకు సంగీతనాటక అకాడమీ ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదని.. తెలంగాణ ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారులందరూ తెలంగాణ రావాలని కోరుకున్నారని.. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కళాకారులకు గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారని అన్నా రు. వరంగల్‌లో మొదటిసారి కైట్ ఫెస్టివల్ జరిగిందని పద్మాక్షి గుట్ట వద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్మించనున్నామని వివరించారు. ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకళాకారుల ప్రదర్శనను చూసేందుకు మంచి అవకాశం లభించిందని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లని అన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి అధికారి సంజయ్‌కుమార్, డీఆర్వో శోభ, సమాచారశాఖ డీడీ డీఎస్.జగన్ పాల్గొనగా.. డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్, డాక్టర్ చుక్కా సత్తయ్యను ఘనంగా సన్మానించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. లోక్ జన ప్రథ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జానపద గిరిజన కళాకారులు అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించారు. అదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం దూపర్పేట గ్రామానికి చెందిన తోటి గిరిజన కళాకారులు సీహెచ్. కృష్ణారావు æబృందం తమ కిక్రి, కుజ్జా, డాకి వాయిద్యాలతో గొండులు తమ ఇష్టదేవతలు భావించే పాండవుల కథను పాడి వినిపించారు, మహారాష్ట్ర లోని సాంగ్లి ప్రాంతానికి చెందిన వీరప్ప దేవుని కొలిచే శ్రీగిరిదేవ్మ గజనృత్య నవయువక మండల్ వారు అనిల్ కొలేకర్ అధ్వర్యంలో గొడుగులతో జండాలతో ధన్గరిగాజ ప్రదర్శన ఇచ్చారు. ఒరి స్సాలోని గంజాం ప్రాంతానికి చెందిన సబర్ గిరిజనులు 200 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన తమ అమ్మవారిని స్వాగతిస్తూ చడ్డేయ ప్రదర్శనతో ఉర్రూతలూగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పాడేరు నుండి వచ్చిన భగత గిరిజన కళాకారులు మోహన్ రావు బృందం థింస్సా స్త్రీల నృత్యంతో ఆకట్టుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన గడ్డం శ్రీనివాస్ బృందం చిందుయక్షగాన ప్రదర్శన, భూపాలపల్లి జిల్లా కర్కపలికి చెందిన తాట సమ్మక్క బృందం కోలాటం నృత్యం అలరించాయి. -
ఇక యువ సంబరాలు
► ఈ నెల 30న జిల్లా యువజనోత్సవాలు ► పలు అంశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆదిలాబాద్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాదేశానుసారంగా జిల్లాలో యువజన సంబరాలు ప్రారంభం కానున్నాయి. కళాకారుల ప్రదర్శనలతో హోరెత్తనున్నాయి. జిల్లాల విభజన తర్వాత నిర్వహించే జిల్లాస్థాయి పోటీలు ఇవే. గతంలో మూడురోజుల పాటు నిర్వహించే యువజనోత్సవాలు ప్రస్తుతం 18 మండలాలే ఉండటంతో ఒకే రోజు నిర్విహ ంచనున్నారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలంటే కళాకారులు 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. గత మూడేళ్లుగా నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించిన కళాకారులు, కళాబృందాలు ఈ పోటీలకు అనర్హులు. పోటీ అంశాలు.. జిల్లాలోని కళాకారులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఓడస్సి, మణిపురి, ఫోక్‌సాంగ్(గ్రూప్), ఫోక్‌డ్యాన్స్(గ్రూప్), కర్ణాటక హూకల్, హిందుస్థానీ హూకల్, ప్లూట్, మృదంగం, వీణా, సితార్, తబల, గిఠార్, హర్మోనియగం, వన్‌యాక్ట్‌ప్లే(గ్రూప్)హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఎలుక్యుషన్ (వ్యక్తిత్త)పోటీలు (హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో పాల్గొనే మండలాలు... ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, బేల, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్, మావల, ఇచ్చోడ, సిరికొండ, జైనథ్, బజార్హత్నూర్, నేరడిగోండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాధిగూడ, 18 మండలాల కళాకారులు, విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. కళాకారులకు కాస్ట్యూమ్స్, రవాణా ఖర్చులు... పోటీల్లో పాల్గొనే వారికి రావాణా, కాస్టూమ్ ఖర్చులు యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించబడుతుంది. ఫోక్‌డ్యాన్స్ గ్రూప్ 20 మంది గ్రూప్‌కు రూ. 1000 చోప్పున, వన్యాక్ట్ ప్లే సభ్యులకు రూ. 600 చోప్పున, ఫోక్ గ్రూప్ సాంగ్ 10 మందికి రూ. 500 చోప్పున, వ్యక్తిత్వ, ఇతరాత్ర ప్రదర్శనలో పాల్గొనే వారికి రూ. 50 చోప్పున అందించనున్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9849913061, 9440843848, 9515460477 లకుసంప్రదించాలని కోరారు. పాటించాల్సిన సూచనలు పోటీల్లో పాల్గొనే కళాకారులు వారి ప్రదర్శన సామాగ్రిని వెంటతెచ్చుకోవాలి. ఫోక్ డ్యాన్స్ గ్రూప్‌లో 20 మంది, ఫోక్ సాంగ్‌లో 10 మంది కంటె ఎక్కువ ఉండరాదు. ఫోక్డ్యాన్స్లో రికార్డు చేసిన క్యాసెట్లు, పెన్‌డ్రైవ్‌లు అనుమతించబడవు లైవ్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఫోక్‌డ్యాన్స్ గ్రూప్‌కు 15 నిమిషాలు, ఫోక్‌సాంగ్‌కు 7 నిమిషాల సమయం ఉంటుంది వన్యాక్ట్ప్లేకు గరిష్టముగా 12మందిని 45 నిమషాల వరకు అనుమనిస్తారు. వన్‌యాక్ట్‌ప్లే హిందీ లేదా ఇంగ్లీష్ బాషలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరాత్ర ప్రదర్శనలకు సైతం సమయం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తారు తమ ఎంట్రిలను బయోడేటాను పూర్తి చేసి ఇవ్వాలి న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తుది నిర్ణయం. -
వికలాంగుల సాంస్కృతిక పోటీలు ప్రారంభం
న్యూశాయంపేట : జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా మానసిక వికలాంగులకు, అనాథలకు నిర్వహిస్తున్న సాంస్కృతిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో కలెక్టర్ వాకాటి కరుణ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 40 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వికలాంగ, అనాథలు 200 మంది ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అనాథ పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు దూదిబాల జ్యోతిరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ అనితారెడ్డి, రాజారపు ప్రతాప్, విజయ్‌పాల్‌రెడ్డి, జ్యోతిష్, రామలీల, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా ఆవిర్భావ వేడుకలు
♦ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ♦ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి హరీశ్‌రావు ♦ అమరుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీ సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కనులపండువగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత పోలీసుల గౌరవవందనం స్వీకరించా రు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి సన్మానించారు. అమరుల తల్లిదండ్రు లు కంటతడిపెట్టగా హరీశ్‌రావు వారిని ఓదార్చారు. అమరవీరుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్లు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు తెలంగాణ ఉద్యమ చరిత్రకు అద్దపట్టేలా నృత్యాన్ని ప్రదర్శించారు. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్, ఎ ద్దుమైలారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం బతుకమ్మలు, బోనాలు, పోతరాజుల వేషధారణలతో నృత్యాలు చేశారు. సాంస్కృతి క శాఖకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. సాం స్కృతిక కర్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మంత్రి హరీశ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ రాజ మణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డిలు జ్ఞాపికలు అందజేశారు. సీడీసీ చైర్మ న్ విజయేందర్‌రెడ్డి పోతిరెడ్డిపల్లి విద్యార్థులకు రూ.5వేల నగదు బహుమతి అందజేశారు. ఉత్తమ అవార్డుల ప్రదానం... వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఉత్తమ క్రీడాకారుడు), సదాశివరెడ్డి(రైతు), షబ్బీర్(టీచర్), నవీన్ (అంగన్వాడీ), రాజారత్నం, ప్రతాప్ (ఉద్యోగి), లతీఫ్(ఎన్జీవో), విఠల్‌రెడ్డి, జ్యోతి(సామాజిక సేవకులు), హేమలత(డాక్టర్), టి.యాదవాచార్యులు(కవి), మహ్మద్ రుస్తుం(ఆర్టిస్టు), జోషి చంద్రశేఖర్(వేద పండితులు), సంగ్రాం మహారాజ్(అర్చకులు), మధుసూదన్‌రెడ్డి, విష్ణు, శ్రీధర్(విలేకరులు), వాసం వెంకటేశ్వర్లు(అధికారి), రాంరెడ్డి(న్యాయవాది), శివరాజ్ రాథోడ్(సర్పంచ్), అమృత జనార్దన్‌రెడ్డి(స్పెషల్ కేటగిరీ)లకు మంత్రి అవార్డులు అందజేశారు. ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికైనందుకు సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బి.విజయలక్ష్మి అవార్డు అందుకున్నారు. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ... అమరుల కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. వేడుకల్లో భాగంగా జిల్లాలో అమరుల కుటుంబాల్లోని 47 మందికి మంత్రి హరీశ్‌రావు ఉద్యోగనియామక పత్రాలు అందజేశారు. నియామకం పత్రాలు అందుకున్న వారిలో... నోముల దర్జీ కిరణ్(సంజీవరావుపేట), సుంకే శోభ(సంజీవరావుపేట), షేక్ జహంగీర్(ఆర్సీపురం), మేఘావత్ హరిప్రసాద్(మామిడిపల్లి), పన్యాల యాదమ్మ(మక్త అల్లూరు), శ్రీధర్(దుద్దెడ), మాచర్ల నర్సింలు(కొండపాక), ఆర్.కవిత(కొండపాక), ఎ.సందీప్(దుద్దెడ), జి.నర్సింలు(మగ్ధూంపూర్), బండి బాల్‌రాజ్(కొండరాజ్పల్లి), వర్ల లావణ్య(అందె), ఆర్.దేవలక్ష్మి(దన్నారం), టి.సాయిలు(రాజ్‌పేట), ప్రవళ్లిక(వాడి), జె.యశోద(బూర్గుపల్లి), చాకలి నర్సింలు(శమ్నాపూర్), బి.చంద్రకళ(కొల్చారం), ఎన్.పవన్(సీతారాం తండా), కేతావత్ నారాయణ(కుడ్లేరు తండా), సుంకలి లక్ష్మయ్య(శేర్కాన్‌పల్లి), ఎం.పరశురాములు (పద్మనాభునిపల్లి), సి.కృష్ణ (దుబ్బాక), ఆర్.వెంకటే ష్(దుబ్బాక), ఆర్.వసుంధర(చెల్లాపూర్), బి.నర్సింహాచారి(ధర్మాజిపేట), వై.శ్యాంసుందర్‌రెడ్డి(వేములఘాట్), కె.ప్రవీణ్(కాన్గల్), సి.అరుణ(అల్గోల్), ఎస్.శ్రీనివాస్(హోతి.బి), సీహెచ్ శంకర్(సుల్తాన్పూర్), ఎన్.సుధాకుమారి(చిట్కుల్), యు.పవన్(గొడుగుపల్లి), సీహెచ్ రాజు(రాయికోడ్), ఐ.కనకరాజు(ఎల్లుపల్లి), ఎన్.అశోక్(పొన్నాల), ఎం.రవీందర్‌గౌడ్(ఝాన్సీలింగాపూర్), ఓ.రాజమణి(రామాయంపేట), ఎన్.బాలకృష్ణ(మల్కాపూర్), బి.దుర్గ(నిజాంపూర్), కె.అనిల్‌కుమార్(జోగిపేట), కె.నాగలక్ష్మి(జోగిపేట), కవిత(కర్నాల్‌పల్లి), పి.నర్సింలు(శంకరంపేట), బి.సరిత(గుమ్మడిదల). బి.శ్రీకాంత్‌గౌడ్(మంబాపూర్), కె.మంజుల(ప్యారారం) ఉన్నారు. సీఎం చేతులమీదుగా ‘గడా’ ఓఎస్డీకి అవార్డు గజ్వేల్: రాష్ట్రస్థాయి ఉత్తమ అధికారిగా ఎంపికైన ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సీఎంతోపాటు గవర్నర్ నర్సింహ్మన్ ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా హన్మంతరావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గజ్వేల్‌ను రాష్ట్రలోనే నెంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. -
మహిమల తల్లి ‘మహాంకాళి
► నేటి నుంచి వాయిపేట మహాంకాళి జాతర ► వేలాదిగా తరలిరానున్న భక్తులు ► నాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర ఆదిలాబాద్ కల్చరల్ : ఇంద్రవెల్లి మండలంలోని వాయిపేట గ్రామంలో మహాంకాళి, కాహంకాళి దేవతలు కోలువై ఉన్నారు. ఈ దేవతల దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. ఈ జాతరలో ఒక్కో రోజు 5 క్వింటాళ్లకు పైగా వంటకాలు చేసి మహా భోజనాన్ని నిర్వహిస్తారు. కొర్కెలు తీర్చే అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఆరోగ్య చికిత్స కోసం ఆయుర్వేదిక్ మందులను కూడా కినక శంభు మహారాజ్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కష్టాల్లో ఉన్నవారిని అమ్మవారు ఆదుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిమల మహాంకాళి.. మారు మూల అటవీ ప్రాంతంలో వాయిపేట గ్రామం ఉంది. రోడ్డు సౌకర్యాలు కూడా లేని ప్రాంతం వాయిపేట కానీ మహాంకాళి తల్లిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మహాంకాళి కాహాంకాళి అక్క చెల్లెళ్లు ఊయల్లో ప్రతిష్టించబడ్డారు. వీరు నిత్యం ఊయలలోనే పూజలందుకుంటారు. ఈ ఆలయాన్ని 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ స్థాపించారు. 10 ఏళ్లపాటు వెలుగు చూడని వైనం.. ఆదిలాబాద్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలోని.. ఇచ్చోడ నుంచి 30 కిలోమీటర్లు ఇంద్రవెల్లి ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ వాయిపేట మహాంకాళి మాత ఆలయం ఉంది. ఈ మందిరాన్ని గత 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ తన సొంత భూమిలో ఆలయాన్ని నిర్మిచారు. తనకు స్వప్నంలో (మహాంకాళి) మాత కనిపించి ఆలయం నిర్మించమని కోరినట్లు.. దీంతో చిన్న గుడిసెలో మహాంకాళి మాతను ఊయలలో ప్రతిష్టించినట్లు కినక శంభు మహారాజ్ పేర్కొన్నారు. ఈ మహాంకాళి తల్లిని ప్రతిష్టించిన మహారాజ్ కినక శంభు సోంతగా 15 ఏళ్లపాటు పూజలు చేస్త్తున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తుండడంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సాంస్కృతిక పోటీలు... వాయిపేట మహాంకాళి జాతరను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు విజేతలకు ప్రథమ బహుమతి రూ. 4101, ద్వితీయ బహుమతి రూ. 2101, తృతీయ రూ. 1101 బహుమతి అందించనున్నట్లు వారు పేర్కొన్నారు. 22వ తేదీ సాయంత్రం కంసూర్నాటకం ఉంటుందని పేర్కొన్నారు. అదే త రహాలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఏర్పాట్లు చేశాం.. ప్రతి ఏడాది మహాంకాళి తల్లి జాతరను నిర్వహిస్తున్నాం. భ క్తులు వేలాది సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత నాలుగైదేళ్లుగా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాల నుంచి మహరాష్ట్ర ప్రాం తాల నుంచి వచ్చి మొక్కులు తీర్చికుని పోతారు. ఆయుర్వేదిక్ మందులు చెట్ల మందులను భక్తుల కొన్ని రోగాలు నయం కావడానికి అందిస్తుంటాం. నమ్మకంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. భక్తుల నుంచి ఏమి ఆశించము. వారే అమ్మవారిని నమ్ముకుని మొక్కు తీరితే నోములు, వస్తువు కట్నకానుకలు సమర్పిస్తారు. - కినక శంభు మహరాజ్, మహాంకాళి ఆలయ వ్యవస్థాపకుడు గ్రామస్తులమంతా ఏర్పాట్లు చేస్తున్నాం మా గ్రామమే కాకుండా ఇతరాత్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. మా గ్రామస్తులమంతా జాతరను ఘనంగా నిర్వహిస్తాం. భక్తుల కోసం జాతర సమయంలో రోజుకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల అన్నదానం చేస్తాం. గ్రామస్తులు సర్పంచ్ల సహకారంతో నీటి సౌకర్యం కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. కొందరు భక్తులు అన్నదానం చేస్తారు. కానుకలు సమర్పిస్తారు. మొక్కులు తీర్చే తల్లి. అటవీ ప్రాంతంలో ఉండటంతో అభివృద్ధికి నోచుకోలేదు. - రాము, భక్తుడు, వాయిపేట -
నగరంలో.. ఆట..పాట..
-
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న గోదావరి పుష్కరాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పుష్కరాల్లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలపై గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, భద్రాచలం, కందకుర్తి తదితర కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో పుష్కరోత్సవాన్ని పూర్తిగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడానికి సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రచారానికి సంబంధించి సీడీల తయారీ, మీడియాలో ప్రచారాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు సుభాష్, దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధులు, భద్రాచలం, ధర్మపురి ఈవోలు, సాంస్కృతిక సారథి ప్రతినిధులు, జిల్లాల డీపీఆర్వోలు, ఆలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో రాష్ట్ర అవతరణ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శనివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారులు రాజా రెడ్డి, రాధా రెడ్డి, శిష్యబృందం ప్రదర్శించిన నృత్యాలు సభికులను అలరించాయి. ఎంపీ వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, హోంశాఖ సంయుక్త కార్యదర్శి గోపాలరెడ్డి, అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నేపాల్, బోస్నియా దేశాల రాయబారులు, రెసిడెంట్ కమిషనర్ శశాంక గోయల్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు చిత్రలేఖనం పోటీలు: అవతరణ దినోత్సవాల ముగింపు సందర్భంగా ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘బతుకమ్మ’పై చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్టు ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి తెలిపారు. -
కాఫీ @ గ్యాలరీ
కాఫీ షాప్‌ల్లో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించటం మామూలే. కానీ ఆర్ట్ అండ్ కల్చరల్ సెంటర్స్‌లో కెఫేల ఏర్పాటు ఇప్పుడు నగరంలో కొత్త ట్రెండ్. కళలకు వేదికలైన ఈ సెంటర్స్ ఫేవరెట్ ప్లేసెస్. అక్కడ ప్రదర్శనలు చూసిన తరువాత ఆర్టిస్ట్స్, ఆర్ట్ లవర్స్ సంభాషణలకు కొనసాగింపు ఇక్కడి కెఫేలు. ఆసక్తి, అభిరుచిని పంచుకునే వారందరినీ కలుపుతూ వారి జీవితంలోని వెలితిని పూరిస్తున్నాయి. భారమైన క్షణాలను దూరం చేస్తున్నాయి! ..:: ఓ మధు కల్చరల్ సెంటర్స్.. కళే కాకుండా కప్పు కాఫీ, బోలెడు మాటలను పంచుతున్నాయి. కాఫీ కళాకారుడి మెదడుకి ఎంత గొప్ప ముడిసరుకో వేరే చెప్పక్కర్లేదేమో!. ఈ వరుసలో బంజారాహిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీ.. ఆర్ట్ లవర్స్‌ని కొత్తగా పలకరిస్తోంది. గ్యాలరీకి వచ్చిన వాళ్లు ప్రదర్శన చూశాక కళాకారులతో కాసేపు ముచ్చటించాలనుకుంటారు. కళలపై ఆసక్తి ఉన్న తోటివారితో కొన్ని అనుభవాలు పంచుకోవాలని అనుకుంటారు. ఈ అవసరాలను, ఆసక్తిని గుర్తించి వారి కోసం, ఆర్ట్ అండ్ క్రియేటివ్ విషయాలు మాట్లాడుకుంటూ కాసేపు గడపాలనుకునే వాళ్ల కోసం కెఫే ఏర్పాటు చేశారు. కెఫేలో కప్పు కాఫీ తాగి వెళ్లటమే కదా అని అనుకోవటానికి లేదు. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ ఫొటో షూట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్.. ఇలా మీ టాలెంట్ ఏదైనా ఇక్కడ పెర్ఫాం చేయవచ్చు. ఆక్షన్ వాల్, చారిటీ వాల్, బ్లెస్సింగ్స్ ట్రీ, బుల్లి లైబ్రరీ, మల్టీమీడియా ఇన్‌స్టాలేషన్స్ అంతే కాదు 37 రకాల టీ, కాఫీలతో స్పెషల్ బరిస్తా ఉన్న ఈ కెఫేలో ఇంకా ఎన్నో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్స్ యాడ్ కానున్నాయి. ఎక్స్టెన్షన్... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కొత్తగా ఈ గ్యాలరీని ప్రారంభించిన సుప్రియ లహోటి ‘కళాకృతి ఆర్ట్ గ్యాలరీకి ఎక్స్‌టెన్షన్‌గా, విభిన్నంగా కెఫే ప్రారంభించాలని అనుకున్నప్పటి నుంచి వెల్‌విషర్స్ అనేక సలహాలు ఇచ్చారు. లక్ష్మణ్ ఏలే, రాజేశ్వరరావ్, సచిన్ జల్తార్, చిప్పా సుధాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రవికాంత్, సునీల్ లోహార్, అక్షయ్ ఆనంద్ సింగ్, అఫ్జా తమ్కనాత్ లాంటి ఎమినెంట్ ఆర్టిస్ట్‌ల ఆర్ట్ వర్క్‌తో రూపొందిన ఫర్నిచర్, పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ ఈ కెఫేలో ఉంటాయి. ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ స్పెండ్ చెయ్యటమే కాదు, నచ్చిన ఆర్ట్ పీస్‌ని కొనుక్కుని వెళ్లొచ్చు’ అంటున్నారు. గోథెజంత్రంలో స్ట్రీట్ ఫుడ్.. జర్మన్ స్టడీ సెంటర్ గోథెజంత్రంలోనూ ఈ తరహా వాతావరణం కనిపిస్తోంది. కళాకారులు, కళాభిమానులతో పాటు స్టూడెంట్స్ ఇక్కడికి వస్తుంటారు. లైక్‌మైండెడ్ పీపుల్ ఒక చోట చేరితే కబుర్లకు కొదవేముంటుంది! అందుకే.. అంతే క్రియేటివ్‌గా జనాలకు కాస్త టీ, కాఫీ వెసులుబాటు కల్పించి తమ కళల ప్రపంచంలో మునిగి తేలేలా చేస్తున్నారు. పూర్తి వీగన్ ఫుడ్ ఇక్కడ స్పెషల్. డీప్ ఫ్రై, మైదా లాంటివి కాకుండా ఆల్టర్నేటివ్గా ఉండే హెల్తీఫుడ్ ఈ కెఫే స్పెషల్. స్ట్రీట్ ఫుడ్ తరహా సెటప్‌తో అందిస్తున్న ఈ ఫుడ్ అందరికీ నచ్చుతుందని చెబుతాడు చెఫ్ ధనుష్. ‘ఇక్కడ స్టూడెంట్స్ కూర్చుని గంటలు గంటలు చదువుకుంటూ ఉంటారు. కప్పు కాఫీ తాగి ఒక బైట్ ఏదైనా తినగలిగితే బాగుండనుకుంటారు. వాళ్లతో పాటు ఆర్టిస్టులూ ఉంటారు. మెనూ కూడా చాలా హెల్త్ కాన్షియస్తో చేసింది. హెల్తీ, టేస్టీ, ఆల్టర్నేటివ్ ఫుడ్ ఉండేలా చూస్తున్నాం’ అంటున్నారు దీని నిర్వాహకురాలు అమితా దేశాయ్. ఈ రెండే కాదు.. బంజారాహిల్స్‌లోని ఓపెన్ కల్చరల్ సెంటర్ లామకాన్ ఇరానీ కేఫ్ తరహాలో స్నాక్స్‌ని అందిస్తోంది. అక్కడికి వచ్చే టెకీలకు, ఆర్ట్ లవర్స్‌కి, సినిమా పీపుల్‌కి మోస్ట్ ఫేవరెట్స్.. ఇక్కడి చాయ్ సమోసా, కిచిడీ, బ్రెడ్ ఆమ్లెట్, ఉస్మానియా బిస్కెట్. -
కనుల పండువగా వైజాగ్ ఫెస్ట్
-
స్ట్రీట్ ప్లేస్
యోగా, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌తో నగరవాసులకు కావాల్సినంత ఫన్ని అందిస్తున్న రాహ్‌గిరి.. మరో కొత్త థీమ్‌తో రోడ్డెక్కింది. ఆటపాటలతోనే సరిపెట్టక... మార్చి 8న మహిళల పట్ల బాధ్యతను తెలియజెప్పిన రాహ్‌గిరి.. ఇప్పుడు నుక్కడ్ నాటక్ (వీధి నాటకం)కి వేదికైంది. ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ మెసేజ్నీ పాస్ చేస్తోంది!. నాటకం ఏదైనా వేయండి... ప్రజలను ఆలోచింపజేయాలి. ఆసక్తికరంగానూ ఉండాలి. ప్రదర్శించడం మీకు ఇష్టమైతే... రాహ్‌గిరి వేదిక సిద్ధంగా ఉంది. ..:: కట్ట కవిత వీధి నాటకాలు... లైవ్ మీడియా. ఎవర్గ్రీన్ కూడా. టీవీ, సినిమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్నెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది... ఇంకా వీధి నాటకాలనెవరు చూస్తారు? ఇది చాలా మంది సందేహం. ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. వాటికి తాను వేదికవుతానంటోంది ‘రాహ్‌గిరి’. ఇటీవలే మంథన్ సొసైటీ.. పిల్లలతో పులులను కాపాడాలంటూ సందేశమిచ్చింది. ఈ వారం కొత్తగా... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘బేటీ బచావో, బేటీ పడావో’ స్ఫూర్తితో ‘బేటీ హై తో కల్ హై’ వీధి నాటకాన్ని ప్రదర్శించాయి మంథన్ అండ్ లివ్ లైఫ్ ఫౌండేషన్స్. ‘మంథన్’ నుక్కడ్ నాటక్ సొసైటీ... సామాజిక సమస్యలపై మరిన్ని నాటకాస్త్రాలను సంధించడానికి సిద్ధమవుతోంది. అసలు సత్యం... వీధి నాటకాలు వేయడానికి థియేటర్స్ అక్కర్లేదు. వీధులు, షాపింగ్ మాల్స్, పార్కులు ప్లేస్ ఏదైనా కావచ్చు. చాలా సింపుల్ కాస్ట్యూమ్స్‌తో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో అందరినీ ఆక ట్టుకోవడమే కాదు... ఆలోచింపజేసేలా ప్రదర్శన ఇవ్వడం కష్టంతో కూడుకున్న పని. దాన్ని సవాల్‌గా తీసుకుని ఆర్టిస్టులకు, ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నాయివి. లింగ వివక్షని ఎత్తి చూపుతూనే పొగ తాగకూడదని చెబుతున్నాయి. వరకట్నం పెనుభూతమని, భ్రూణహత్యలు పాపమని, లంచగొండితనం నేరమనే చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రవృత్తిగా అయితే ఈ నాటకాలని ప్రొఫెషనల్ ఆర్టిస్టులే వేయడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు.. వివిధ రంగాల్లో ఉన్నవారు ప్రవృత్తిగా వీటిని ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీ ప్రొఫెషనల్ అనిరుధ్. ‘చుట్టూ ఉన్నవాళ్లు మావైపు చూసేందుకు గట్టిగా అరుస్తాం. నాటకాల్లో ఇది మొదటిఅంశం. దీనికోసం ఎనర్జీతోపాటు ఏకాగ్రత కూడా అవసరం. సినిమాల్లో లాగా రీ టేకులు ఉండవు. ఒకే షాట్లో ఓకే అయిపోవాలి. దీనికోసం ఎంతో రిహార్సల్స్ చేస్తాం. మైక్, స్టేజ్ లాంటి లగ్జరీస్ ఏమీ ఉండవు. ప్రేక్షకుల కళ్లముందే ప్రదర్శించాలి. వాళ్లను మెప్పించాలంటే ఎంతో హాస్యం వచ్చి ఉండాలి. చున్ని, టవల్స్ వంటి చిన్నచిన్న ప్రాపర్టీస్‌తో ప్రేక్షకులను నవ్వించాలి. ఈ వీధి నాటకాలకు సంగీతం, డ్యాన్స్ వంటివి కూడా జోడించవచ్చు’ అని చెబుతున్నాడాయన. అంశమేదైనా... వేదిక మాది... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సుసంపన్నం చేసిన వాటిలో వీధి నాటకం కూడా ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఉన్న వీధినాటకాలను పునర్జీవింపచేయడానికి, వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడానికి రాహ్‌గిరి కచ్చితంగా సహకరిస్తుంది అంటున్నారు ‘రాహ్‌గిరి’ ప్రతినిధి విశాలరెడ్డి. సామాజిక, రాజకీయ సమస్యేదైనా... వ్యంగ్యంగా, నవ్వులు కురిపిస్తూ ఉత్సాహంగా సాగే ఈ వీధి నాటకాలు కచ్చితంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని చెబుతున్నారు ఎంబార్క్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్ బచ్. సమ్‌థింగ్ స్పెషల్ రంగులు, లైటింగ్, మేకప్, ఒక స్టేజీ, కళాకారులు, రిహార్సల్స్.. ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ఇంత సరంజామా కావాలి. పైగా ఏదైనా నాటకాన్ని చూడాలనుకుంటే.. అది ప్రదర్శించే చోటకు వెళ్లాలి. అందరూ అలా వెళ్లలేరు. కాబట్టి వాటి ద్వారా చెప్పదల్చుకున్నది జనంలోకి వెళ్లదు. కానీ, రాహ్‌గిరి వేదిక అందుకు భిన్నం. విద్యార్థులు, ఉద్యోగులు అప్పటికప్పుడు కళాకారులుగా మారిపోతారు. ఇతివృత్తాన్ని అర్థం చేసుకుని తమదైన ‘పాత్ర’ పోషిస్తారు. తాము చెప్పదల్చుకున్నది అందరి మధ్య, ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా చెబుతారు. తద్వారా అందరికీ సులభంగా సందేశం చేరుతుంది. ఇకపై ప్రతి వారం సామాజిక సమస్యలు ప్రధానాంశంగా స్ట్రీట్ ప్లేస్ ప్రదర్శిస్తామని రాహ్‌గిరి ప్రతినిధులు చెబుతున్నారు. -
భక్తులతో పోటెత్తిన పులిగుండు
వైభవంగా తిరునాళ్లు కనువిందుచేసిన పులిగుంటీశ్వరుడు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పెనుమూరు: సంక్రాంతి వేడుక ల్లో భాగంగా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన పులిగుండు తిరునాళ్లు శనివారం వైభవంగా జరి గాయి. జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తిరునాళ్లకు విచ్చేసి పులిగుంటీశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పులిగుండు పరిస ర ప్రాంతం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. పులిగుంటీశ్వరస్వామికి ఏర్పా టు చేసిన పుష్పాలంకరణ భక్తులను పరవశింప జేసింది. భక్తులు ఉత్సాహంతో పులిగుండు ఎక్కి అక్కడ ఉన్న దేవతా మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పులిగుండు పరిసర గ్రామాల ప్రజలు స్వామికి పొంగళ్లు పెట్టి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి స్వామికి కర్పూర హారతులు పట్టారు. దేవస్థానంవారు పులిగుంటీశ్వర స్వామిని శేష వాహనంపై ప్రతిష్ఠించి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పులిగుండు వద్ద నుంచి గుంటిపల్లె రోడ్డు, కనికాపురం రోడ్డు, కొత్తరోడ్డు, ఠాణావేణు గోపాల పురం, సీఎస్ అగ్రహారం మీదుగా స్వామిని ఊరేగించారు. తిరునాళ్లలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పులిగుండు ఎక్కే మెట్లదారి వద్ద భక్తుల తోపులాటలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు. మెట్లదారిలో అక్కడక్కడా భక్తుల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేసారు. పులిగుండు వద్ద పెనుమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పులిగుండు వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథా కాలక్షేపం ఏర్పాటు చేసారు. వివిధ బృందాల చెక్క భజనలు, కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నారుు. ముగ్గుల పోటీలు, క్రికెట్, కబడ్డీ, వాలిబాల్, బాల్‌బ్యాడ్మింటన్, కుంటి ఆట, టెన్నికాయిడ్, పరుగు పందెం, మ్యూజికల్ చైర్స్, పొటాటో గ్యాదరింగ్, సూదికి దారం, కోలాటాలు, గొబ్బెమ్మ పాటలు, సైక్లింగ్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులు అందించారు. రాత్రి 7 గంటలకు తిరుపతి అనంత్ సప్తస్వర ఆర్కెస్ట్రా వారిచే ఏర్పాటు చేసిన పాట కచేరి కార్యక్రమం అలరించింది. -
ముగిసిన హంగామా
-
శిల్పారామంలో స్టేట్ యూత్ ఫెస్టివల్
-
హ్యాపీ న్యూ ఇయర్
న్యూ ఇయర్-2015కు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పల్లెలు.. పట్టణాలు, అనంత నగరంలో ‘నూతనో’త్సాహం పెల్లుబికింది. కాలనీలు, ఆపార్ట్మెంట్లలో ఆట పాటల మధ్య బుధవారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు ఉత్సాహంగా గడిపారు. సిక్స్టీ.. ఫిఫ్టీ నైన్, ఫిఫ్టీ ఎరుుట్.. టెన్.. నైన్.. త్రీ.. టూ.. వన్ అంటూ కౌంట్ డౌన్ ముగియగానే ఒక్క సారిగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి ఘడియలు రావడంతో నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించడానికి ఆలయూలకు బయలుదేరారు. - అనంతపురం కల్చరల్ -
అందం అదరహో..
-
వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు, నిరసనలు
-
క్యాంపస్‌లో.. bigg boss
సిటీ కాలేజీలు ట్రెండ్‌ని ఫాలో అవ్వవు. క్రియేట్ చేస్తాయి. సూపర్‌హిట్ అయిన టీవీ రియాలిటీ షో లు బిగ్‌బాస్, రోడీస్లని క్యాంపస్‌లోకి తీసుకొచ్చి కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేయడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది పల్సేషన్. మిగిలిన కాలేజీలన్నీ మరిన్ని రియాల్టీ షోలకు వెల్కమ్ చెప్పడం ద్వారా ఇది రేపటి ట్రెడిషన్ గా మారనుంది. కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్, మ్యూజిక్ కాంపిటీషన్స్.. ఇంకా చారిటీ వర్క్స్. కాలేజ్ ఈవెంట్లలో హోరెత్తించే ఈ తరహా రెగ్యులర్ ప్రోగ్రామ్‌ల గురించి మాట్లాడడం ఇంకా మనకు బోరెత్తించదా? వాట్స్ నెక్ట్స్? అని అడగాలనిపించదా? యంగ్ అండ్ ఎనర్జిటిక్ గైస్/గాళ్స్‌కు ఆ మాత్రం తెలియదా? తెలుసు కాబట్టే.. ఓ కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో క్యాంపస్ ఈవెంట్‌ని టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా మార్చారు. ఆ కాన్సెప్ట్ పేరే రియాలిటీ షో. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా టీవీ వ్యూయర్‌షిప్‌ని శాసిస్తున్న షోస్‌ని అనుకరించడం ద్వారా కాలేజీలలో లేటెస్ట్ ట్రెండ్‌కు నాంది పలికాయి షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సెన్సైస్, డాక్టర్ వీఆర్కే వుమెన్స్ మెడికల్ కాలేజీ. ‘బిగ్’ ఫెస్ట్... విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట కొన్ని రోజుల పాటు కలసి గడపడం, వారి ప్రవర్తనను సీక్రెట్ కెమెరాల ద్వారా గమనించడం, సహజమైన భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడించే ందుకు అవకాశం కల్పించి.. వారి ప్రవర్తనకు వీక్షకుల ఓటింగ్, న్యాయ నిర్ణేతల జడ్జిమెంట్ బేస్ చేసుకుని మార్కులేయడం.. ఎక్కువ మందిని మెప్పించిన వారిని విజేతలుగా ఎంపిక చేయడం.. ఈ ప్రాసెస్ వినగానే హిందీ టీవీ చానెల్స్ చూసే వాళ్లు వెంటనే బిగ్‌బాస్ అని గుర్తిస్తారు. అంతగా పాపులరైన ఈ ప్రోగ్రామ్‌ను మక్కీకి మక్కీ షాదాన్ కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేశారు. దీని కోసం క్యాంపస్ ఆవరణలోనే బిగ్‌బాస్ హౌస్‌ను కూడా నెలకొల్పారు. ‘విభిన్నంగా ఉంటుందని దీనిని ఎంచుకున్నాం. దాదాపు 100కు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి 20 ఫైనలిస్ట్‌లు ఎంపికైతే చివరకు 15 మందికే హౌస్‌లోకి వెళ్లే అవకాశం కలిగింది’ అని నిర్వాహకులు అమన్ చెప్పారు. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్.. వంటి వాటితో ఈ బిగ్ హౌస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాత్రుళ్లు సైతం అక్కడే ఉంటే విద్యార్థినులు రాత్రి వెళ్లి పోయి ఉదయాన్నే మళ్లీ జాయిన్ అయ్యారు. అలాగే ఓటింగ్‌లు, ఎలిమినేషన్ రౌండ్లు.. ఇలా బిగ్‌బాస్‌ను తలపించే రీతిలో షో కండక్ట్ చేశారు. యూత్‌కి యూజ్‌ఫుల్.. యువత కోసం యువత చేత యువత వలన అన్నట్టు రూపుదిద్దుకునే కాలేజీ ఈవెంట్లు.. రోజు రోజుకూ క్రియేటి వ్గా మారుతుండడం నవతరానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. రియాలిటీ షో అనే కొత్త కాన్సెప్ట్ ఎంటరై హిట్టవడంతో రానున్న రోజుల్లో మరిన్ని వెరైటీ థీమ్స్ రావడం, మరింతగా యూత్ టాలెంట్ వెలుగుచూడడం తధ్యం. సో.. లెట్ వెయిట్ ఫర్ మెనీ మోర్ వెరైటీ కాన్సెప్ట్స్.. సమ్‌థింగ్ డిఫరెంట్.. విభిన్నంగా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచించి బిగ్‌బాస్ రియాలిటీషో కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అందిన రిజిస్ట్రేషన్స్ నుంచి 15మందికి కుదించి మరో 5గురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాం. కాలేజ్ బిల్డింగ్‌లో థర్డ్ ఫ్లోర్లో వేసిన బిగ్ బాస్ హౌజ్ సెట్లో మొత్తం 3రోజుల పాటు కంటెస్టెంట్స్ బస చేసేందుకు అనువుగా ఫుడ్, బెడ్స్ అన్నీ అరేంజ్ చేశాం. లోపలి ప్రతి సన్నివేశాన్ని షూట్ చేశాం. దానిని స్టూడెంట్స్ చూసేలా స్క్రీన్ ఏర్పాటు చేసి, ఆడియన్స్‌కు ఓటింగ్ ఛాన్స్ ఇచ్చాం. ఎవిరిడే ఎలిమినేషన్ రౌండ్స్ నిర్వహించాం. నలుగురు ఫైనలిస్ట్‌ల నుంచి విన్నర్‌గా డాక్టర్ నాసిహ్ని ఓటింగ్ ఆధారంగా సెలెక్ట్ చేశాం. అలాగే రోడీస్ రియాలిటీ షో తరహాలో చేసిన ప్రోగ్రాం కోసం ఆడిషన్స్‌లో 30 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశాం. డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాం. దీనిలో షయ్యద్ షాబాజుద్దీన్, అదీబా అలీలు విజేతలుగా నిలిచారు’ అంటూ వివరించారు నిర్వాహకులు. - మన్నన్ అలీ అష్మీ, నిర్వాహక ప్రతినిధి -
భళా..ఉత్సవ్
కొత్తగూడెం : బాలలతో కొత్తగూడెం కళకళలాడింది. మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి 23వ అంతర్‌పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-14) పట్టణంలోని కొత్తగూడెంక్లబ్లో శుక్రవారం అంత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు బాలోత్సవ్‌కు సుమారు ఐదు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 15 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. ఆటాపాటలతో చిన్నారులు ఆహూతులను అలరించారు. సాంస్కృతిక, సాహిత్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు బాలోత్సవ్‌కు హాజరై పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. ఢిల్లీలో ఉంటూ తెలుగు మాట్లాడే చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ పండగకు హాజరైన మహతి, పారూన్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరితోపాటు వీరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం పోటీలు తిలకించేందుకు తరలి వచ్చారు. వీరందరికీ నిర్వాహకులు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. అయితే.. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సుమారు మూడు వేల మందికి స్వచ్ఛందంగా భోజనం, వసతి కల్పించారు. 15 విభాగాల్లో పోటీలు తొలిరోజు బాలోత్సవ్‌లో 15 విభాగాల్లో పోటీలు జరిగాయి. తెలుగు మాట్లాడుదాం పోటీకి 285 మంది, సినీ, లలిత, జానపద గీతాలు జూనియర్స్ విభాగంలో 152 మంది, సీనియర్స్‌లో 145, కవితా రచనలో 245, కథా విశ్లేషణలో 225, భరత నాట్యం సబ్ జూనియర్స్‌లో 59, కూచిపూడి సబ్ జూనియర్స్‌లో 107, జానపద నృత్యాల్లో 160, క్విజ్ పోటీలకు 250, , నాటికల్లో 90 బృందాలు, స్పాట్ డ్రాయింగ్‌లో 200 మంది పాల్గొన్నారు. విజేతలు వీరే... చిత్రలేఖనం జూనియర్స్ : హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన జి.వి.దివ్యశ్రీ ప్రథమ, ఖమ్మం శ్రీ చైతన్య ఇంటర్ నేషనల్ స్కూల్‌కు చెందిన ఆర్.దీక్షిత ద్వితీయ, ఖమ్మం హార్వేస్ట్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన కె.లోహిత తృతీయ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లావణ్యరెడ్డి స్పెషల్ ప్రైజ్‌లు గెలుచుకున్నారు. చిత్రలేఖనం సబ్ జూనియర్స్ : ఖమ్మం న్యూవిజన్ స్కూల్‌కు చెందిన జే.జోహారిక ప్రథమ, హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన ప్రంజల్ శర్మ ద్వితీయ, కర్నూలు జిల్లా నంద్యాల శ్రీగురురాజా స్కూల్‌కు చెందిన పి.బెన్నీబాల్రాజ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. చిత్రలేఖనం సీనియర్స్ : ఖమ్మం జిల్లా రుద్రంపూర్ సెయింట్ జోసప్ హైస్కూల్‌కు చెందిన ఎం.డి.అనీస్ ప్రథమ, ఖమ్మం జిల్లా పాల్వంచ డీఏవీ మోడల్ స్కూల్‌కు చెందిన జి.నవీన్ ద్వితీయ, అశ్వాపురం అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌కు చెందిన జి.సంజయ్బార్గవ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. లఘు చిత్ర సమీక్ష విభాగం : నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన శ్రీ తేజ విద్యాలయం విద్యార్థి అభిజ్ఞ ప్రథమ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం త్రివేణి స్కూల్‌కు చెందిన వి.హడప్ప ద్వితీయ, ఖమ్మం న్యూఇరా మైండ్ ఫీల్డ్స్‌కు చెందిన ఎస్.కె.అస్లం తృతీయ బహుమతులు సాధించారు. కవితా రచన జూనియర్స్ : కర్నూలు జిల్లా నంద్యాల గురురాజా స్కూల్‌కు చెందిన ఎం.మనీషా ప్రథమ, ఖమ్మం జిల్లా మణుగూరు ఎస్సీ హైస్కూల్‌కు చెందిన టి.వెన్నెల ద్వితీయ, భద్రాచలం ఎస్ఎస్ఎంజీ హైస్కూల్‌కు చెందిన దివ్యసాయి తృతీయ బహుమతులు సాధించారు. కవితా రచన సీనియర్స్ : ఖమ్మం హార్వేస్ట్ స్కూల్‌కు చెందిన శ్రీహిత ప్రథమ, భద్రాచలం నవోదయ స్కూల్‌కు చెందిన టి.చందన ద్వితీయ, ఖమ్మం భారత్ బాలమందిర్‌కు ఎందిన వి.సాయిసుష్మా తృతీయ బహుమతులు సాధించారు. సృజనాత్మకత భేష్ ప్రతి పోటీలోనూ విద్యార్థులు ఎవరికి వారే దీటుగా తమ సజనాత్మకతను చాటుకున్నారు. సినీ, లలిత, జానపద గీతాల పోటీల్లో సైతం తమ వయసుకు మించి ప్రతిభను కనబర్చడంతో న్యాయ నిర్ణేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కథా విశ్లేషణ లో ‘రెండు రాజ్యాలు- అభివృద్ధికి దారులు’ అనే అంశాన్ని ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆలోచనాశక్తికి పదునుపెట్టారు. పెయింటింగ్ విభాగంలో ‘సామాజిక రుగ్మతలు’ అనే అంశాన్ని పేపర్‌పై అద్భుతంగా చిత్రీకరించారు. అలరించిన జానపద నృత్యాలు బాలోత్సవ్‌లో జానపద నృత్యాలు ఉర్రూతలు ఊగించాయి. ‘బొట్ల బొట్ల చీర కట్టి.. బొమ్మంచు రవికతొడిగి’ అని పాట మొదలుకాగానే వేదికపై చిన్నారులతోపాటు ఆహూతులు సైతం నృత్యాలు చేశారు. ‘నా అందం చూడుబాబయ్యో..’ అంటూ సాగే పాటకు కేరింతలు, కరతాళధ్వనులు మార్మోగాయి. సాయంత్రం ఇండోర్ స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్స్ భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాస్ట్యూమ్స్ రెడీ బాలోత్సవ్లోని వివిధ పోటీల్లో పాల్గొనే చిన్నారుల కోసం రెడీమేడ్ కాస్ట్యూమ్స్ కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలోనే అందుబాటులో ఉన్నాయి. ఏ వేషమైనా... ఏ నృత్యమైనా ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, నాటికలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీల్లో పాల్గొనే వారికి అవసరమైన కాస్ట్యూమ్స్, వస్తువులు లభ్యమవుతున్నాయి. కర్నూలు, హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా మేకప్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. -
నేటి నుంచి బాలోత్సవ్
కొత్తగూడెం: జాతీయస్థాయి 23వ అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-2014)కు అంతా సిద్ధమైంది. విద్యార్థులు తమ ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం క్లబ్ వేదికగా శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం నుంచే వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒక్కొక్కరిగా వస్తుండటంతో పట్టణంలో బాలల సందడి నెలకొంది. చిన్నారులకు ఆతిథ్యమిచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. మూడురోజుల పండుగను ముచ్చటగా జరుపుకుని ఆ మధురస్మృతులను తమ మదిలో దాచిపెట్టుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. జాతీయస్థాయి పోటీలు కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు విద్యార్థులు కూడా తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల నుంచి చిన్నారులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రతిభాపాటవాలను ప్రదర్శించనున్నారు. వారిలోని సృజనాత్మకతను బయటపెట్టడంతో పాటు అది నలుగురికి ఉపయోగపడేలా ఈవెంట్లను సిద్ధం చేసుకున్నారు. చైతన్యాన్ని నింపేందుకు... మట్టి బొమ్మలు అనగానే గుర్తుకొచ్చేది వినాయక చవితి. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను మట్టితో తయారుచేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ చేసే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈసారి ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని బాలోత్సవ్‌లో మట్టి బొమ్మలు తయారు చేసే పోటీని నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ బొమ్మలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్లాస్టిక్, పీఓపీ ఇతర రకాల బొమ్మలు పెరిగిపోయిన నేపథ్యంలో మట్టి బొమ్మలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వ్యర్థంతో అర్థం’ అనే అంశం కూడా అందరిలో చైతన్యం నింపేదే. మనం ఎందుకూ పనికిరావనుకునే పదార్థాలు, వస్తువులతో విద్యార్థులు అద్భుతమైన ఆకృతులను తయారు చేసి ప్రదర్శిస్తారు. వీటిని చూసేందుకు వచ్చేవారు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. జానపదం వైపే మొగ్గు ఎక్కువ మంది విద్యార్థులు జానపద కళపై ఆసక్తి చూపుతున్నారు. జానపద నృత్యాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజులపాటు జరిగే జానపద నృత్య పోటీల్లో సుమారు 200కు పైగా ప్రదర్శనలు ఇస్తారు. పోటీల్లో అత్యంత ఆదరణ లభించేది కూడా ఈ జానపద నృత్యాలకే. ప్రేక్షకుల కేరింతలు జానపద నృత్య ప్రాంగణం హోరెత్తనుంది. అందర్నీ ఆకట్టుకునే నాటికలు బాలోత్సవ్‌లో అందర్నీ ఆకట్టుకునే వాటిలో నాటికలు కూడా ఉన్నాయి. నాటికల్లో భాగంగా బాల్య వివాహాలు, బాలల చదువు, మూఢ నమ్మకాలు, అమ్మాయిల చదువు వంటి అంశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హాస్య నాటికలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిన్నారి కళాకారులు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రదర్శించే ప్రతి నాటిక ఓ సందేశంతో కూడుకొని ఉంటుంది. -
ఆనందోత్సవం
- ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనాల్లో ఊరేగిన మలయప్ప - వాహనసేవల్లో పెరిగిన భక్తుల సందడి, నిండిన గ్యాలరీలు - సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాల హోరు సాక్షి, తిరుమల: సోమవారం ఉదయం కల్పవృక్షం, రాత్రి సర్వ భూపాల వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉత్సవాలలో మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినా నాల్గోరోజు నుంచి కొంత పెరిగి సందడి పెరిగింది. ఉద యం కల్పవక్ష వాహనసేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. నాలుగు మాడ వీధు ల్లో వాహనసేవలు తిలకించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కొన్ని చోట్ల ఖాళీగా, మరి కొన్ని చోట్ల నిండుగా కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో కూడా భక్తులు ఇదే స్థాయిలో కనిపించారు. ఆలయం లోపల మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తిరుమంజనం, వెలుపల సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నాల్గవరోజు ప్రత్యేకత. టీటీడీ ఉద్యానవన శాఖ వేల టన్నుల పుష్పాలతో రూపొందించిన పుష్ప ప్రదర్శన శాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సోమవారం సుమారు 45 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అన్నదానం, క్యూలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద సుమారు 58 వేల మందికిపైగా అన్న ప్రసాదం అందజేశారు. కళాబృందాల ప్రదర్శనల హోరు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ భక్తులను కట్టిపడేస్తోంది. వాహనసేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృం దాలు ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చిన హిందూస్తానీ భజన బృందాలు డప్పువాయిద్యం భక్తులను ఉర్రూతులూగించాయి. టీటీడీ అధికారుల సైతం కళాకారులతో కలసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వీరికి కళాకారులు తోడై నృత్యం చేశారు. -
ముత్యపుపందిరిలో నందగోపాలుడు
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై నవనీతచోరుడు నందగోపాలుడి రూపంలో శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పకు జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహన సేవను చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా అశేష భక్తజన గోవింద నామాల నడుమ ముత్యాలు పందిరి గా రూపొందించిన వాహనంలో నవనీత చోరుడు నందగోపాలుడి రూపంలో స్వామి ఆశీనులయ్యారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పురవీధుల్లో వైభవంగా ఊరేగారు. వాహన సేవలో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. అంతకు ముందు ఉదయం ఆలయ వీధుల్లో మలయప్ప ధ్యానముద్రలో యోగ నృసింహ రూపంలో భక్తులను కటాక్షించారు. యోగశాస్త్రంలో సింహం శీఘ్ర గమన శక్తికి నిదర్శనంగా భావిస్తారు. భవ బంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగసాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్ర రూపం ద్వారా స్వామి తెలియజేస్తాడు. భక్తుల గోవింద నామాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేద ఘోష మధ్య సింహ వాహన సేవ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాగింది. సాయంత్రం రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయల ఊగుతూ దర్శనమిచ్చారు. అనంతరం స్వామికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించారు. వాహనసేవలో టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షులు జగదీష్చంద్రశర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఆలయంలో తిరుమంజన వేడుక బ్రహ్మోత్సవాల్లో తొలి మూడు రోజులు ఆలయంలో తిరుమంజనం నిర్వహించటం ఆలయ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తిరుమంజనం వైభవంగా సాగింది. రంగనాయక మండపాన్ని పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. పెద్ద జీయర్, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. -
విద్యార్థుల్లో జోష్..
-
నేటి నుంచి రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు
మాదాపూర్, న్యూస్‌లైన్: సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, వినూత్న కార్యక్రమాల సమాహారంగా రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలు శనివారం నుంచి మాదాపూర్‌లోని శిల్పారామంలో కనువిందు చేయనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి వట్టి వసంతకుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 23 జిల్లాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేశారు. ఆయా ప్రదర్శనల్లో ఎంపికయిన వారిని పంజాబ్ లూథియానాలో జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలకు పంపిస్తారు. శిల్పారామంలో జానపద సంగీతం, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం (కర్నాటక, హిందుస్తానీ), శాస్త్రీయ వాయిద్యాలు (తబలా, వీణా, మృదంగం, హార్మోనియం, సితారా, వేణువు), శాస్త్రీయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, కథక్, ఒడిస్సీ) తదితరాల్ని నిర్వహించనున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మ్యాజిక్, ఏకపాత్రాభిన యం, ఫ్యాన్సీడ్రెస్, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వం, గీతం, నృత్యం, సామూహిక చర్చ, మార్షల్ ఆర్ట్స్ తదితర ప్రత్యేక ప్రదర్శన, కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి. అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29న లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 30న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని యువజన సర్వీసుల శాఖ నిర్దేశకుడు కర్రి రాజభౌమ హరినారాయణ చక్రవర్తి తెలిపారు. -
24 నుంచి కాకతీయ ఉత్సవాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాలు తిరిగి ఈ నెల 24నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయులపై సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం వరంగల్ మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావుతో కలెక్టర్ సమావేశమయ్యారు. 24, 25, 26 తేదీల్లో ఘణపురం ఉత్సవాలను ములుగుఘణపురం కోటగూళ్ల దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. రాణిరుద్రమ దేవి సామ్రాజ్య అధినేతగా బాధ్యతలు చేపట్టి 750 సంవత్సరాలు పూర్తయినందున అక్టోబర్ 2న ఖిలా వరంగల్‌లో మహిళా సాధికారత అనే అంశంపై ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 5,6 తేదీలలో కాకతీయ యువ జనోత్సవాలను నిర్వహిస్తామని, ఈ యువజనోత్సవాల్లో భాగగా అన్ని కళాశాలల విద్యార్థులు భాగస్వామ్యం చేస్తామన్నారు. కాకతీయుల చరిత్ర, నీటి పారుదల వ్యవస్థ, నిర్మాణ శైలి ఇతర అంశాలపై కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్ఐటి, ఇంటాక్లతో సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవాల సందర్బంగా కాకతీయ బాలల ఉత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.