
బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అవన్ ఇవన్ (తెలుగులో వాడు వీడు)లో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే...డియో డియో డోలే’ పాట వినిస్తే పాదాలు ‘కమాన్ డ్యాన్స్’ అంటాయి. తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ముగ్గురు పిల్లల డ్యాన్స్. జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే...డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన వారు నాలుక కరుచు కోవడానికి అట్టే టైమ్ పట్టలేదు. నిజానికి వారు బాలికలు కాదు బాలురు!
Comments
Please login to add a commentAdd a comment