Cambridge
-
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
భారత్, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా..
చాలామందికి కాలేజీ రోజులు ఎంతో ఆనందంగా గడుస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల అన్వేషణలో వారు తలమునకలై ఉంటారు. ఆటువంటి సమయంలో ఏర్పడిన స్నేహబంధం కొందరి విషయంలో జీవితాంతం నిలిచిపోతుంది. అటువంటి స్నేహితులు తమ స్నేహితుల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇలాంటి కాలేజీ స్నేహితులు రీ యూనియన్ పేరుతో కలుసుకుంటారు. ఇటువంటి దీర్ఘకాల స్నేహబంధానికి సంబంధించిన ఒక ఉదంతం రథిన్ రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. డాక్టర్ రాయ్ తనకు 31 ఏళ్లుగా స్నేహితునిగా ఉన్న తన క్లాస్మేట్ డాక్టర్ అలీ చీమాతో పాటు తాను ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. డాక్టర్ రాయ్ భారత్‌కు చెందిన వ్యక్తి. డాక్టర్ చీమా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. క్యాప్షన్‌లో డాక్టర్ రాయ్ ఇలా రాశారు..‘రథిన్ రాయ్ పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) భారత పౌరుడు, అలీ చీమా పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) పాక్ పౌరుడు. స్కాలర్ షిప్ పొందుతూ చదువుకున్న వీరు సామాన్య కుటుంబాల నేపధ్యం నుంచే వచ్చారు’ ఈ పోస్టుకు 75 వేల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు తమ హృదయాలను హత్తుకున్నదని కొందరు అంటుండగా, ఈ ఫొటో వైరల్ అయ్యేందుకు అర్హత కలిగినదని పలువురు పేర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి Rathin Roy PhD (Cambridge). India citizen Ali Cheema PhD (Cambridge). Pakistan citizen Scholarship students ordinary background 31 years of friendship, collegial affection. We can still meet without being lynched Thank you, London the melting pot of the subcontinent ♥️ pic.twitter.com/nc4SWtAKiR — rathin roy (@EmergingRoy) July 17, 2023 -
ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో.. నాలుక్కరుచుకోవడం ఖాయం!
బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అవన్ ఇవన్ (తెలుగులో వాడు వీడు)లో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే...డియో డియో డోలే’ పాట వినిస్తే పాదాలు ‘కమాన్ డ్యాన్స్’ అంటాయి. తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ముగ్గురు పిల్లల డ్యాన్స్. జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే...డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన వారు నాలుక కరుచు కోవడానికి అట్టే టైమ్ పట్టలేదు. నిజానికి వారు బాలికలు కాదు బాలురు! View this post on Instagram A post shared by M.P. Dhasvanth (@m.p.dhasvanth) View this post on Instagram A post shared by Tamil Animals Life (Animals Lovely Page) (@tamilanimalsloop) -
జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఓ కొత్త లుక్‌లో రాహుల్: ఫోటోలు వైరల్
మొన్నటి వరకు భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా రాహుల్ జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు లండన్‌లో ఒక వారం పర్యటించినున్న రాహుల్ మంగళవారమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు. రాహుల్ కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అంతేగాదు రాహుల్ కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్ కొత్త లుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Rahul Gandhi in Cambridge. With a New Look 😎 pic.twitter.com/wOSZnl8MAE — Aaron Mathew (@AaronMathewINC) March 1, 2023 Rahul Gandhi ji in Cambridge. With a New Look 🫶🫶 #RahulGandhi pic.twitter.com/3GHKzm6q0r — Rabiul Hassan (@Rabiul__INC) March 1, 2023 (చదవండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు) -
‘విశ్వ’ శాస్త్రవేత్తకి అశ్రు నివాళి
కేంబ్రిడ్జ్ : కాలం కథను వివరించిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) అంత్యక్రియలు కేంబ్రిడ్జ్ పట్టణంలో శనివారం జరిగాయి. అంతకుముందు అభిమానులు, సన్నిహితులు అశ్రునయనాలతో హాకింగ్‌కు వీడ్కోలు పలికారు. గ్రేట్ సెయింట్ మేరిస్ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు బైబిల్ చదువుతూ హాకింగ్ అంతిమయాత్ర కొనసాగించారు. హాకింగ్ పార్థివదేహం చర్చికి చేరుకోగానే అక్కడున్న గంటలను 76సార్లు మోగించారు. అంతిమయాత్రలో ఆయన మాజీ భార్య జేన్ హాకింగ్, కొడుకు టిమోథీ హాకింగ్, కూతురు ల్యూసీ హాకింగ్, హాలీవుడ్ నటుడు ఎడ్డీ రెడ్మేనే(హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో హాకింగ్ పాత్ర పోషించారు), కమెడియన్ డారా ఒబ్రెయిన్, దర్శకుడు చార్లెస్ గార్డ్, టీవీ ప్రెసెంటర్ కార్లెట్ హాకిన్, ఇతర ప్రముఖులు, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. హాకింగ్ అస్థికలను ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ సమాధుల సమీపంలోనే పూడ్చిపెట్టనున్నారు. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అని గోన్విలె అండ్ కాయిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పుస్తకంలో విద్యార్థులు రాసుకొచ్చారు. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో? కాలం వెనుక్కు ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని ఆ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఈ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 14న కన్నుమూసిన విషయం తెలిసిందే. -
సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్
కేంబ్రిడ్జ్ 342 ఆలౌట్ ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ బి. చంద్రశేఖర్ (113 బంతుల్లో 119; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో స్పోర్టింగ్ ఎలెవన్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో మంగళవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన కేంబ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. చంద్రశేఖర్ ధాటిగా ఆడాడు. తనయ్ త్యాగరాజన్ (51), మల్లికార్జున్ (50) రాణించారు. స్పోర్టింగ్ బౌలర్లలో గౌరవ్ 4, సాత్విక్ రెడ్డి 3 వికెట్లు తీశారు. అంతకుముందు 412/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన స్పోర్టింగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం లభించింది. నగరంలో మంగళవారం కురిసిన వర్షం వల్ల పలు మ్యాచ్‌ల రెండో రోజు ఆట రద్దయ్యింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 216, జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 171 (సాకేత్ సాయిరామ్ 39, శాండిల్య 33; మెహదీహసన్ 6/47), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 129 (అరుణ్ 38; సాకేత్ సాయిరామ్ 5/42, తేజ 3/15), జైహనుమాన్ రెండో ఇన్నింగ్స: 78/3 (శశిధర్ 31). ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 273, చార్మినార్ సీసీ తొలి ఇన్నింగ్స్: 206/9 (ఎస్కె మొహమ్మద్ 131; భగత్ వర్మ 5/104). -
హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం
ఆ నేడు 28 అక్టోబర్, 1636 ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీ 1636 అక్టోబర్ 28న ఆవిర్భవించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నత విద్య కోసం మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో కొలోనియల్ మాసాచుసెట్స్ శాసనసభ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. మొదట్లో దీనిని న్యూ కాలేజ్ లేదా ది కాలేజ్ ఎట్ న్యూ టౌన్ అని పిలిచేవారు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది. ప్రస్తుతం ఈ యూనివర్శిటీ పది వేర్వేరు అకాడమిక్ యూనిట్లను కలుపుతోంది. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని విద్యాలయాల కన్నా అత్యధిక ఆర్థిక ధర్మనిధిని కలిగి ఉన్నదిగా పేరొందింది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోని ఒక అగ్రవిద్యాసంస్థగా ర్యాంకింగ్ ఉంది. అందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారిని ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావంతులుగా గుర్తిస్తారు. -
త్రీడీ ప్రింటర్‌తో తాజా పండ్లు!
3డీ ప్రింటర్‌తో రకరకాల వస్తువులనే కాదు.. పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఆహార పదార్థాలనూ ప్రింట్ చేసుకోవచ్చన్నది మనకు ఇదివరకే తెలుసు. అయితే పండ్లను కూడా తయారు చేసుకునేందుకు ఉపయోగపడే వినూత్న త్రీడీ ప్రింటర్‌ను కేంబ్రిడ్జిలోని డోవెటైల్డ్ అనే కంపెనీ రూపొందించింది. ఈ ప్రింటర్‌తోపాటు మన దగ్గర ఆయా పండ్ల ఫ్లేవర్లు ఉంటేచాలు.. కావల్సిన ఫలాలు చిటికెలో సిద్ధమైనట్లే. ఉదాహరణకు దానిమ్మ గింజలు తినాలని అనిపించిందనుకోండి.. దానిమ్మ ఫ్లేవర్‌ను ప్రింటర్లో వేసి బటన్ నొక్కితే చాలు ఫ్లేవర్‌ను గిన్నెలో చుక్కచుక్కలుగా పోస్తూ ఈ ప్రింటర్ తాజా గింజలను ప్రింట్ చేస్తుంది. అలాగే యాపిల్, అరటి, ఇతర పండ్లను కూడా తాజాగా తయారు చేసుకోవచ్చు. హోటళ్లలో, ఇంట్లో కూడా ఈ ప్రింటర్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పండ్లను రుచిచూడొచ్చంటున్నారు దీని రూపకర్తలు. అంతేకాదండోయ్.. పండ్ల రుచి, ఆకారం, సైజులను కూడా మన ఇష్టమొచ్చినట్లు నిర్ణయించుకోవచ్చట. అంటే యాపిల్ పండును మామిడిలా, మామిడి పండును అరటి పండులా కూడా తయారు చేసుకోవచ్చన్నమాట!