హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం | emergence of Harvard University | Sakshi
Sakshi News home page

హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం

Published Tue, Oct 27 2015 11:02 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం - Sakshi

హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం

ఆ నేడు  28 అక్టోబర్, 1636
 

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీ 1636 అక్టోబర్ 28న ఆవిర్భవించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నత విద్య కోసం మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో కొలోనియల్ మాసాచుసెట్స్ శాసనసభ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. మొదట్లో దీనిని న్యూ కాలేజ్ లేదా ది కాలేజ్ ఎట్ న్యూ టౌన్ అని పిలిచేవారు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది.

ప్రస్తుతం ఈ యూనివర్శిటీ పది వేర్వేరు అకాడమిక్ యూనిట్లను కలుపుతోంది. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని విద్యాలయాల కన్నా అత్యధిక ఆర్థిక ధర్మనిధిని కలిగి ఉన్నదిగా పేరొందింది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోని ఒక అగ్రవిద్యాసంస్థగా ర్యాంకింగ్ ఉంది. అందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారిని ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావంతులుగా గుర్తిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement