మొన్నటి వరకు భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా రాహుల్ జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు లండన్‌లో ఒక వారం పర్యటించినున్న రాహుల్ మంగళవారమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు.
రాహుల్ కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అంతేగాదు రాహుల్ కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్‌లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్ కొత్త లుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
Rahul Gandhi in Cambridge. With a New Look 😎 pic.twitter.com/wOSZnl8MAE
— Aaron Mathew (@AaronMathewINC) March 1, 2023
Rahul Gandhi ji in Cambridge. With a New Look 🫶🫶 #RahulGandhi pic.twitter.com/3GHKzm6q0r
— Rabiul Hassan (@Rabiul__INC) March 1, 2023
(చదవండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్‌లో సౌరవ్, అతిషిలకు చోటు)
Comments
Please login to add a commentAdd a comment