lecture
-
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
బాబు కోర్టు ధిక్కారం
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ తన అరెస్టు, జైలు గురించి ప్రసంగించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన అరెస్టు గురించి మాట్లాడి కోర్టులంటే తనకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడకూడదని హైకోర్టు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది. కేసులోని విషయాల గురించి బయట ఎక్కడా చర్చించవద్దని స్పష్టంచేసింది. అలాగే, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పకుండా పాటించాలని, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయితే, చంద్రబాబు మాత్రం వీటిని బహిరంగంగా ఉల్లంఘించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోటలో శుక్రవారం తుపాను బాధితులను పరామర్శించి అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. తుపాను దెబ్బకు అన్ని విధాలుగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉంటే చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు గురించి మాట్లాడారు. ఇలా బెయిల్ షరతులను చంద్రబాబు బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దుచేయాలని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లుగా టెక్నికల్‌గా, లీగల్‌గా తప్పుచేయలేదు.. తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టేయగలుగుతున్నారని, బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా తానెక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని, టెక్నికల్‌గా, లీగల్‌గా ఒక్క తప్పూ చేయకుండా ఉన్నానని, అలాంటి తనను జైల్లో పెట్టారని చెప్పారు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉన్న పళంగా కేసు బుక్‌చేసి లోపలేశాడని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూడా మనిషినేనని, తనకూ బాధలు ఉంటాయని, తనకూ మనసు ఉంటుందని, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందంటూ ప్రజల సానుభూతి కోసం ఆయన ప్రయత్నించారు. తన కోసం 52 రోజులుగా అందరూ వీరోచితంగా పోరాడారని, తనను అరెస్టుచేస్తే అందరినీ బెదిరించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఇలా చేసినట్లు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయకోవిదుల విస్మయం.. బెయిల్ షరతులను ఉల్లంఘించి తాను అరెస్టయిన కేసు గురించి చంద్రబాబు మాట్లాడడంపై న్యాయకోవిదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ పొందినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అందుకు సంబంధించిన విషయాల గురించి కాకుండా తాను జైలుపాలవడం, కేసుల గురించి మాట్లాడడం ఏమిటనే ప్రశ్నలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. ఇక అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు గంటల తరబడి ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. తనకు అరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని భారీఎత్తున ర్యాలీలు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులోనే ఆయనకు రిమాండ్ విధించినప్పుడు సైతం న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తిని అసభ్యపదజాలంతో ధూషిస్తూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన కుమారుడు లోకేశ్, ఇతర నాయకులు కోర్టులను మేనేజ్ చేశారంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. చివరికి అదే న్యాయ వ్యవస్థ నుంచి చంద్రబాబు బెయిల్ పొంది బయటకొచ్చారు. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ స్కిల్ కుంభకోణం గురించి రాజకీయ ఉపన్యాసం చేయడం గమనార్హం. -
ఉపాధ్యాయునిగా పనిచేసిన కోటీశ్వరుడు - ఎవరో తెలుస్తే ఆశ్చర్యపోతారు!
గురువుని మించిన దైవం లేదనేది లోకోక్తి మాత్రమే కాదు, అక్షర సత్యం. ఒక వ్యక్తి జీవితంలో ఎదిగి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే తప్పకుండా వారి గురువు చలవే అయి ఉంటుంది. సాందీపుని దగ్గర కృష్ణుడు, విశ్వామిత్రుని దగ్గర రాముడు విద్య నేర్చుకున్నవారే అని పురాణాలు చెబుతాయి. భగవంతుని సైతం జ్ఞానం నేర్పే అదృష్టం కేవలం గురువుకు మాత్రమే సొంతం. భారతదేశానికి రెండవ రాష్ట్రపతి 'సర్వేపల్లి రాధాకృష్ణన్' జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ధనిక ఉపాధ్యాయుని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకడుగా నిలిచిన చైనా పారిశ్రామిక & ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత 'జాక్ మా' (Jack Ma) ఒకప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేసినట్లు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్ టీచర్‌గా గడిపినట్లు సమాచారం, కాగా కొన్ని నెలల క్రితం టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అంగీకరించాడు. మొదటి ఉపన్యాసానికి (లెక్షర్) సంబంధించిన చిత్రాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిలియనీర్ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఫిలాసఫీ గురించి బోధించాడు. యూనివర్శిటీ ఆఫ్ టోక్యోతో పాటు, మా హాంకాంగ్ యూనివర్సిటీలో కూడా బిజినెస్ ప్రొఫెసర్‌గా ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల దృష్టి నుంచి అదృశ్యమైన తర్వాత జాక్ మా ఉపాధ్యాయుడిగా తిరిగి దర్శనమిచ్చాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించి అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పడమ్ మొదలుపెట్టాడు. ఇదీ చదవండి: ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి! ఆ తరువాత క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్తులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎన్నెన్నో రంగాల్లో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో గడపాల్సి కూడా వచ్చింది. -
జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఓ కొత్త లుక్‌లో రాహుల్: ఫోటోలు వైరల్
మొన్నటి వరకు భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా రాహుల్ జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు లండన్‌లో ఒక వారం పర్యటించినున్న రాహుల్ మంగళవారమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు. రాహుల్ కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అంతేగాదు రాహుల్ కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్ కొత్త లుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Rahul Gandhi in Cambridge. With a New Look 😎 pic.twitter.com/wOSZnl8MAE — Aaron Mathew (@AaronMathewINC) March 1, 2023 Rahul Gandhi ji in Cambridge. With a New Look 🫶🫶 #RahulGandhi pic.twitter.com/3GHKzm6q0r — Rabiul Hassan (@Rabiul__INC) March 1, 2023 (చదవండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు) -
వారి హయాంలోనే బ్యాంకులు డీలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం విధాన నిర్ణేతలు, నేతల మధ్య పరస్పర విమర్శలకు తావిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్బీఐ సారథి రఘురామ్ రాజన్ల హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అధ్వానంగా తయారయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి ప్రాణవాయువు అందించడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంగా ఉన్న సమయంలో కేంద్ర బ్యాంక్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్‌ను తాను గొప్ప మేథావిగా గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు. బ్రౌన్ వర్సిటీలో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ రాజన్ హయాంలో జరిగిన బ్యాంక్ రుణాల జారీలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేవలం ఫోన్ కాల్స్‌పై రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రభుత్వ ఈక్విటీపై ఆధారపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయంలో డాక్టర్ సింగ్ భారత్ పట్ల సరైన విజన్‌తో ఉండాలని డాక్టర్ రాజన్ కోరుకుని ఉండాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు పూశాయి. సింగ్, రాజన్ల హయాంలో భారత బ్యాంకులకు దుర్థశ వాటిల్లిందని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్యాంకులకు వాటిల్లే కష్టనష్టాలపై మనకెవరికీ తెలియదని అన్నారు. -
పాఠాలు చెబుతారట
‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్‌గా సావిత్రికి ప్రేమ పాఠాలు చెప్పిన దుల్కర్ సల్మాన్ ఈసారి లెక్చరర్‌గా మారి పాఠాలు చెప్పనున్నారట. మిధున్ మన్యూల్ థామస్ దర్శకత్వంలో దుల్కర్ ఓ మలయాళ సినిమాలో యాక్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులోనే ఆయన లెక్చరర్‌గా కనిపిస్తారట. ప్రస్తుతం బాలీవుడ్లో సోనమ్ కపూర్‌తో కలసి ‘జోయా ఫ్యాక్టర్’ లో యాక్ట్ చేస్తున్న దుల్కర్ మలయాళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళైయాడితల్, వాన్’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకి గుమ్మడికాయ కొట్టాక మిధున్ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. -
లెక్చరర్లకు కంప్యూటర్ శిక్షణ
కాజీపేట రూరల్ : జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టూల్స్, ఇంటర్నెట్, ఈ–మెయిల్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ౖyð రెక్టర్, నిట్, వరంగల్ పేరిట తీసిన రూ.200 డీడీతో ప్రిన్సిపాల్ అనుమతి పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
విద్యార్థులకు మౌనముని పాఠాలు
గాంధీనగర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గుజరాత్‌లోని ఓ కాలేజీలో ఆయన ఓ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. భావి భారత రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన సూచనలు ఇవ్వనున్నారు. గాంధీనగర్ లో గుజరాత్ నాలెడ్జ్ విలేజ్ క్యాంపస్ లో కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సింగ్ వాఘెలాకు ఓ కళాశాల ఉంది. అందులో చదువుతున్న విద్యార్థులకోసం ఓ సుధీర్ఘ సూచన చేయాలని వాఘెలా కోరడంతో అందుకు మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు తెలిసింది. శనివారం ఆయన ఈ ప్రసంగం చేస్తారు. వాస్తవానికి ఆయన ఈ ప్రసంగం గత 27న ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు వాయిదా పడింది. -
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఈడెన్ గార్డెన్స్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఆ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా వక్తగా తన ప్రావీణ్యాన్ని చూపనున్నాడు. ఈనెల 19న ఈడెన్‌లో జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్ ప్రసంగించనున్నాడు. భారత్, విండీస్ జట్ల మధ్య జరిగే చివరిదైన ఐదో వన్డేతోపాటు బెంగాల్ క్రికెట్ సంఘం 150 ఏళ్ల పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ‘పటౌడీ పరిజ్ఞానంపై నేనెప్పుడూ ఆకర్షితుడినయ్యే వాడిని. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎం.ఎల్. జైసింహా ద్వారా ఆయన గురించి తెలుసుకునేవాడిని. నాలాగే పటౌడీ కూడా హైదరాబాద్‌కు ఆడారు. ఆయన స్మారకోపన్యాసంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను’ అని లక్ష్మణ్ తెలిపాడు. అలాగే ప్రారంభ ఉపన్యాసంలో గవాస్కర్.. చివరి ఎడిషన్‌లో కుంబ్లే మాట్లాడతారు.