విద్యార్థులకు మౌనముని పాఠాలు | Former PM Manmohan Singh To Deliver Lecture On 'Role Of Students' | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు మౌనముని పాఠాలు

Published Thu, Mar 17 2016 2:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

Former PM Manmohan Singh To Deliver Lecture On 'Role Of Students'

గాంధీనగర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గుజరాత్లోని ఓ కాలేజీలో ఆయన ఓ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. భావి భారత రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన సూచనలు ఇవ్వనున్నారు.

గాంధీనగర్ లో గుజరాత్ నాలెడ్జ్ విలేజ్ క్యాంపస్ లో కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సింగ్ వాఘెలాకు ఓ కళాశాల ఉంది. అందులో చదువుతున్న విద్యార్థులకోసం ఓ సుధీర్ఘ సూచన చేయాలని వాఘెలా కోరడంతో అందుకు మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు తెలిసింది. శనివారం ఆయన ఈ ప్రసంగం చేస్తారు. వాస్తవానికి ఆయన ఈ ప్రసంగం గత 27న ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement