గురువుని మించిన దైవం లేదనేది లోకోక్తి మాత్రమే కాదు, అక్షర సత్యం. ఒక వ్యక్తి జీవితంలో ఎదిగి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే తప్పకుండా వారి గురువు చలవే అయి ఉంటుంది. సాందీపుని దగ్గర కృష్ణుడు, విశ్వామిత్రుని దగ్గర రాముడు విద్య నేర్చుకున్నవారే అని పురాణాలు చెబుతాయి. భగవంతుని సైతం జ్ఞానం నేర్పే అదృష్టం కేవలం గురువుకు మాత్రమే సొంతం.
భారతదేశానికి రెండవ రాష్ట్రపతి 'సర్వేపల్లి రాధాకృష్ణన్' జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ధనిక ఉపాధ్యాయుని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకడుగా నిలిచిన చైనా పారిశ్రామిక & ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత 'జాక్ మా' (Jack Ma) ఒకప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేసినట్లు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్ టీచర్‌గా గడిపినట్లు సమాచారం, కాగా కొన్ని నెలల క్రితం టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అంగీకరించాడు. మొదటి ఉపన్యాసానికి (లెక్షర్) సంబంధించిన చిత్రాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బిలియనీర్ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ ఫిలాసఫీ గురించి బోధించాడు. యూనివర్శిటీ ఆఫ్ టోక్యోతో పాటు, మా హాంకాంగ్ యూనివర్సిటీలో కూడా బిజినెస్ ప్రొఫెసర్‌గా ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల దృష్టి నుంచి అదృశ్యమైన తర్వాత జాక్ మా ఉపాధ్యాయుడిగా తిరిగి దర్శనమిచ్చాడు.
ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు!
చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్‌జౌ డియాంజీ యూనివర్సిటీ' ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించి అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పడమ్ మొదలుపెట్టాడు.
ఇదీ చదవండి: ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి!
ఆ తరువాత క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్తులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎన్నెన్నో రంగాల్లో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో గడపాల్సి కూడా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment