jack ma
-
వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్
విశాల విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడుగా పనిచేశారు. చైనాలో అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత కూడా. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో విదేశీ పర్యాటకులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు.ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడాని ఇదొక అద్భుత అవకాశంగా భావించారు. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికంటే.. భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు.విద్య & ఉద్యోగంఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో జాక్ 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాసారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు.చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు.ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో ఆంగ్ల అనువాదం, వివరణను అందించడానికి 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించారు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని వచ్చింది. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు.అంతర్జాలం (ఇంటర్నెట్) అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. ఆ సమయంలోనే రూ.1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు.దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్.. జాక్‌కు చెప్పారు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నారు.ఇదీ చదవండి: నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానంఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించారు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది.ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం నేటీకి ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
ఉపాధ్యాయునిగా పనిచేసిన కోటీశ్వరుడు - ఎవరో తెలుస్తే ఆశ్చర్యపోతారు!
గురువుని మించిన దైవం లేదనేది లోకోక్తి మాత్రమే కాదు, అక్షర సత్యం. ఒక వ్యక్తి జీవితంలో ఎదిగి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే తప్పకుండా వారి గురువు చలవే అయి ఉంటుంది. సాందీపుని దగ్గర కృష్ణుడు, విశ్వామిత్రుని దగ్గర రాముడు విద్య నేర్చుకున్నవారే అని పురాణాలు చెబుతాయి. భగవంతుని సైతం జ్ఞానం నేర్పే అదృష్టం కేవలం గురువుకు మాత్రమే సొంతం. భారతదేశానికి రెండవ రాష్ట్రపతి 'సర్వేపల్లి రాధాకృష్ణన్' జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ధనిక ఉపాధ్యాయుని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకడుగా నిలిచిన చైనా పారిశ్రామిక & ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత 'జాక్ మా' (Jack Ma) ఒకప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేసినట్లు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్ టీచర్‌గా గడిపినట్లు సమాచారం, కాగా కొన్ని నెలల క్రితం టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అంగీకరించాడు. మొదటి ఉపన్యాసానికి (లెక్షర్) సంబంధించిన చిత్రాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిలియనీర్ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఫిలాసఫీ గురించి బోధించాడు. యూనివర్శిటీ ఆఫ్ టోక్యోతో పాటు, మా హాంకాంగ్ యూనివర్సిటీలో కూడా బిజినెస్ ప్రొఫెసర్‌గా ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల దృష్టి నుంచి అదృశ్యమైన తర్వాత జాక్ మా ఉపాధ్యాయుడిగా తిరిగి దర్శనమిచ్చాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించి అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పడమ్ మొదలుపెట్టాడు. ఇదీ చదవండి: ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి! ఆ తరువాత క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్తులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎన్నెన్నో రంగాల్లో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో గడపాల్సి కూడా వచ్చింది. -
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు!
చైనా కుబేరుడు జాక్ మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడి సర్కారుకు టార్గెట్‌గా మారిపోయారు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలతో జాక్ మా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. తాజాగా, జాక్‌మా అధినేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాంట్ గ్రూప్‌కు డ్రాగన్ కంట్రీ 1 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని తప్పని సరిగా చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. ఇంతకీ జిన్‌పింగ్ జాక్‌మాపై కక్ష పెంచుకోవడానికి అసలు కారణాలేంటీ? అలిబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత జాక్‌మాపై జిన్‌పింగ్ ఆంక్షలు విధించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనూ ఉండాల్సి వచ్చింది. అయితే, అంత అకస్మాత్తుగా ఆయన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే ఆయన పాలిట శాపమా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఏదైనా ఒక్క పొరపాటు లేదా తప్పుడు నిర్ణయం కూడా మనిషిని ఉన్నత శిఖరాల నుంచి అగాధంలోకి నెట్టేస్తుంది. అపర కుబేరుడు జాక్ మా విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ కోటాను కోట్లు వెనకేసుకున్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలనే బుద్ధి పుట్టింది. అదే ఆయన పాలిట శాపమైంది. జిన్‌పింగ్‌కు మింగుడు పడలేదు 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడమే జాక్ మా కొంపముంచింది. చైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ట్రంప్‌తో భేటీ అయ్యారు. అంతేకాదు, అమెరికాలో 10లక్షల ఉద్యోగాలు సృష్టస్తామని హామీలిచ్చారు. అది సరిపోదున్నట్లు చైనాలో జరిగే ఓ బిజినెస్ సమ్మిట్‌లో దేశ ఆర్ధిక వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఇదిగో ఈ తరహా ధోరణే చైనా పాలకులకు ఏమాత్రం మింగుడుపడలేదు. పైగా చైనాను కట్టడి చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్న ట్రంప్‌ను కలవడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదిగో అప్పటి నుంచి జాక్‌మాను చైనా ప్రభుత్వం వేధిస్తూ వస్తుంది. రోజుకు 7వేల కోట్ల నష్టం యాంట్ ఐపీవోను అడ్డుకుంది.టెక్నాలజీ, స్థిరాస్థి, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీ ఇలా అన్నీ వ్యాపారాలను ఆంక్షలతో కుదేలయ్యేలా చేసింది. ఏడాది తిరిగే లోపు దాదాపు రూ.25లక్షల కోట్లు నష్టపోయారు. అంటే రోజుకు రూ.7వేల కోట్లన్న మాట. అందుకే చైనాలో ప్రభుత్వాన్ని ఎదిరించి మనుగడ సాధించడం కష్టం. ఈ విషయం తెలుసుకున్న జాక్‌మా జిన్ పిన్ ప్రభుత్వంతో రాజీ పడ్డారు. దేశాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే కానీ చైనా ప్రభుత్వం జాక్‌ను కనికరించలేదు. సరికాదా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో జాక్‌మాకు చైనా ప్రభుత్వం ఫైన్ విధించింది. జరిమానా విధించినా..భవిష్యత్‌లో జాక్ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే వాదన వినిపిస్తుంది. చైనా టాప్ సెక్యూరిటీ రెగ్యులేటర్ పరిశ్రమలపై ఆంక్షల విధించే సమయం ముగియనుంది. కాబట్టే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘలన పేరుతో జాక్ మాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. మా’ 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని షరతు పెట్టింది. ఊరట కలిగేనా 2020లో యాంట్పై అణిచివేత తర్వాత, దాని మాతృ సంస్థ అలీబాబా రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ల యాంటీట్రస్ట్ పెనాల్టీని విధించిన డ్రాగన్ కంట్రీ అధికారులు. దీంతో పాటు రైడ్-హెయిలింగ్ కంపెనీ దీదీకి సైతం 1.2 బిలియన్ల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం జాక్‌మాకు ఊరట కల్పిస్తుందా? లేదంటే మరింత ఇబ్బందులు పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. చదవండి : పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో
చైనా అపర కుబేరుడు, అలీబాబా వ్యవస్తాపకుడు జాక్‌మా పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. పాక్‌లో జాక్‌మా అడుగు పెట్టినట్లు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ (boi) మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. జాక్‌మా పాక్‌కు రాకముందు జూన్ 27న నేపాల్ రాజధాని ఖాట్మండూ తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలలో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో మా ప్రపంచ దేశాల్లో చర్చాంశనీయంగా మారారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో పర్యటనలలో ఈ చైనా అపర కుబేరుడితో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఐదుగురు చైనా పౌరులు, ఒకరు యూరప్ దేశమైన డెన్మార్క్‌కు చెందిన డానిష్ వ్యక్తి, మరొకరు అమెరికా దేశస్తుడు ఉన్నట్లు తెలిపాయి. తాజాగా, స్విర్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థ జెట్ ఏవియేషన్ ప్రైవేట్ ఫ్లైట్ వీపీ-సీఎంఏలో పాకిస్తాన్‌కు చేరుకున్నారు. జూన్ 29న లాహోర్‌లో అడుగు పెట్టిన జాక్‌మా 24 గంటల పాటు అక్కడే ఓ ప్రైవేట్ ప్రాంతంలో గడిపారు. అనంతరం, అదే విమానంలో ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లారు. మీడియాలో అనేక ఊహాగానాలు జాక్‌మా,అతని బృందం పాకిస్తాన్లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు పర్యటించినట్లు అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇందులో భాగంగా బిజినెస్ చేసేందుకు అనువైన ప్రాంతాల గురించి ఆరాతీయడంతో పాటు, ఆ దేశంలో వ్యాపార వేత్తలతో భేటీ, వివిధ వాణిజ్య ఛాంబర్ల అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు,సమావేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన వ్యక్తిగతమే జాక్‌మా పర్యటన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని బోవోఐ మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ట్వీట్ చేశారు. మా’ పర్యటన చైనా రాయబార కార్యాలయ అధికారులకు కూడా తెలియదని ట్వీట్లో పేర్కొన్నారు. చైనాపై విమర్శలు చేసి ఈ-కామర్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రముఖ వాణిజ్య వేత్తగా జాక్‌మా సుపరిచితులు. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చైనా అధికారులు జాక్‌మాను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయన కంపెనీలపై చైనా దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2021 చివర్లో జాక్‌మా చైనాను వీడారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏడాది పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల్లో అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు వరుస ప్రపంచ దేశాల పర్యటనలతో జాక్‌మా భవిష్యత్‌లో ఏం చేయనున్నారోనని ప్రపంచ దేశాల వ్యాపార వేత్తలు, దేశాది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి : ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండుసార్లు ఫెయిల్.. నేడు చైనాలో కుబేరుడు!
Richest Man in China Jack Ma Success Story: విశాలమైన విశ్వంలోనే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి ఈ రోజు చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేతగా అందరికి తెలుసు. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ ఒక దిగువ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతడు అతిథులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు. ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. ఇది తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికి భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు. విద్య & ఉద్యోగ జీవితం ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాశాడు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించాడు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడుగులు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్ కాకపోవడం గమనార్హం. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభం ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో మొదటి సంస్థ 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించి ఆంగ్ల అనువాదం, వివరణను అందించడం ప్రారంభించాడు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని పొందాడు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. అక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. అంతర్జాలం అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. అప్పుడు అతడు యాహూలో సెర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం ఏమి దొరకలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రూ. 1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. ఇంటర్నెట్తో ప్రత్యర్థులకు పోటీ జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నాడు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) ఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ 1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాడు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం ఆధునిక కాలంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది - ఫోటోలు
-
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్
న్యూఢిల్లీ: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత చైనా కుబేరుడు జాక్ మా స్వదేశంలో అడుగుపెట్టారు. తన సొంత నగరం హాంగ్జౌలోతాను స్థాపించిన పాఠశాలను సందర్శించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సోమవారం నివేదించింది. ఈ సందర్బంగా పాఠశాల విద్య, చాట్‌జీపీటీ సాంకేతికత గురించి చర్చించినట్లు పేర్కొంది. ఒకపుడు ఇంగ్లీష్ టీచర్ కేడా అయిన జాక్ మా హాంకాంగ్‌లో కొద్దిసేపు స్నేహితులతో ముచ్చటించాడని ఆ తరువాత ఆర్ట్ బాసెల్‌ను సందర్శించాడని కూడా నివేదించింది. ఈ వార్తలతో అలీబాబా షేర్లు 4శాతానికి పైగా పెరిగా పుంజుకున్నాయి. మరోవైపు జాక్‌మా, రాకతో రెండు సంవత్సరాల రెగ్యులేటరీ ఆంక్షలతో కునారిల్లిన దేశంలోని ప్రైవేట్ బిజినెస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల కోవిడ్ సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి నాయకుల ప్రయత్నాలకు తోడు తాజాగా మా ప్రత్యక్షంకావడం ప్రైవేట్ రంగ పునరుజ్జీవనం పట్ల ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేస్తోందని భావిస్తున్నారు. ఇ-కామర్స్ దిగ్గజం సొంత నగరమైన హాంగ్జౌలో ఇతర అలీబాబా వ్యవస్థాపకులతో కలిసి 2017లో స్థాపించారు. అలీబాబా గ్రూప్ స్థాపనతో దేశంలోనే టాప్ బిలియనీర్‌గా అవతరించిన జాక్‌మా, అనూహ్యంగా అక్కడి ప్రభుత్వాన్ని, రెగ్యులేటరీని బహిరంగంగా విమర్శించి 2020లో ఇబ్బందుల్లో పడ్డాడు. జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులతో ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అధికారు. ఈ పరిణామాల నేపథ్యంలోఅలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. దీంతో 2021 చివర్లో చైనాను వీడారు. అయితే అపుడపుడూ జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో కనిపించి వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మరోవైపు జాక్‌మాను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌కు సన్నిహిత మిత్రుడైన లీ ప్రయత్నాల వల్లే మా తిరిగి వచ్చాడా లేదా అనేది స్పష్టత లేదు. అయితే తమ ప్రభుత్వం బీజింగ్ అన్ని సంస్థలను సమానంగా చూస్తుందని ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించ నుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..
చైనాకు చెందిన టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. కొన్ని నెలల క్రితం చైనా నుంచి అదృశ్యమైన ఆయన మెల్బోర్న్లోని ఒక హోటల్లో కనిపించాడని, కొన్ని రోజులపాటు ఆ దేశంలోనే జాక్‌మా గడిపినట్లు చైనాకు చెందిన వయికై మీడియా సంస్థ పేర్కొంది. అయితే దీన్ని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ధ్రువీకరించడం లేదు. ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం ఆస్ట్రేలియాలో జాక్‌మా జాడపై స్పష్టత లేనప్పటికీ, ఆయనకు ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి మోర్లీ కుటుంబానికి మా సన్నిహితంగా ఉండేవారు. 1980 ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్‌లోని న్యూకాజిల్‌ను సందర్శించడానికి ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు వచ్చారు. ఈ సమయంలో మెంటర్‌గా ఉంటూ జాక్‌మా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మోర్లీ కృషి చేశారు. అందుకే 2017లో దివంగత కెన్ మోర్లీ పేరు మీద 20 మిలియన్ డాలర్లతో యూనివర్శిటీ స్కాలర్షిప్ ఫండ్‌ను జాక్‌మా ఏర్పాటు చేశారు. జాక్‌మా థాయ్‌లాండ్ వెళ్లే ముందు జపాన్ లోని టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో గడిపారు. ముయే థాయ్ బాక్సింగ్ మ్యాచ్‌లోనూ మా పాల్గొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఫైనాన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసేందుకు ఆయన గత నెలలో హాంకాంగ్ వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (ఇదీ చదవండి: అదానీ, అంబానీలపై రామ్‌దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు) -
Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం
చైనా ఫిన్ టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాంట్ గ్రూప్‌ను నియంత్రించే అధికారాన్ని వదులుకోనున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలో ఉన్న వాటాలను షేర్ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాటాలను షేర్ హోల్డర్లకు వాటాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏ షేర్ హోల్డర్ సింగిల్‌గా లేదంటే ఇతర వ్యక్తులతో జత కలిసి యాంట్ గ్రూప్‌ని నియంత్రణ చేయలేరంటూ ఓ ప్రకటనలో తెలిపింది. జాక్ మా విమర్శలు..ఐపీవోకి వెళ్లకుండా అడ్డంకి యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. అయితే 2020లో 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులపై జాక్‌మా విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా అడ్డుకున్నారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత యాంట్ గ్రూప్ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా..తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. చైనా బ్యాంకులా.. పాన్ షాపులా గతంలో సంస్థల్ని నియంత్రించే రెగ్యులేటర్లు ఇన్నోవేషన్‌ను అరికడుతున్నాయని జాక్ మా విమర్శించారు. దీంతో పాటు గ్లోబల్ బ్యాంకింగ్ నియమాలను తోలుబొమ్మలతో పోల్చారు. చైనాలో పటిష్టమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ లేదని, చైనీస్ బ్యాంకులు పాన్ షాప్‌లు లాంటివని అంటూ చైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2నెలల్లో రూ.80వేల కోట్ల లాస్ 2020 చివరి నెలలు బిలియనీర్ ‘జాక్ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకు పైమాటే. చైనా ప్రభుత్వం ఊరుకుంటుందా? అనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. యాంట్ గ్రూప్, జాక్ మా సంస్థల విస్తరణను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జాక్ మా తరచూ చైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది కామెంట్లు చేస్తుంటారు. పైగా ఆయన ఎదుగుతున్న తీరుతో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ భావిస్తోంది. అందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. -
చైనా బిలియనీర్ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్ నుంచే తరుచూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. స్పెయిన్, నెదర్లాండ్‌లోనూ ఆయన కనిపించినట్లు సమాచారం. కాగా జాక్ మా టోక్యోకు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌కు సన్నిహిత మిత్రుడు. అంతేగాక మసయోషి అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. జాక్ మా ఒకప్పుడు చైనాలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా వెలుగొందారు. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగ వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్‌ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జాక్ మా సంస్థలపై చైనా ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి. అప్పటి నుంచి జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలు నిబంధనలు పాటించడం లేదని నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఆలీబాబా కంపెనీపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ప్రభుత్వంతో విబేధాల కారణంగా 2020 ఆయన బహిరంగంగా కనిపించడం మానేశారు. చైనాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
ఐదేళ్ల ముందు ఆ వ్యాపారవేత్త చెప్పిన జోస్యం నిజమవుతుందా!
రోబోలకు కృత్రిమ మేధ జోడిస్తే, ప్రస్తుత ప్రపంచంలో మనుషులు చేసే చాలా ఉద్యోగాలకు ఎసరొస్తుందనే ఆందోళన చాలామందిలో ఉంది. సమీప భవిష్యత్తులో ఆ ఆందోళన నిజమయ్యేటట్లే కనిపిస్తోంది. చైనాలోని ‘నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్’ అనే మెటావెర్స్ కంపెనీ ఇటీవల కృత్రిమ మేధతో పనిచేసే ‘మిస్ టాంగ్ యు’ అనే ఒక రోబోను తన సీఈవోగా నియమించుకుంది. వెయ్యి కోట్ల డాలర్ల (82 వేల కోట్లు) విలువ చేసే ఈ కంపెనీ వ్యవహారాలను ఈ రోబో సీఈవో పర్యవేక్షించనుంది. కంపెనీలో అత్యంత కీలకమైన ఆర్గనైజేషనల్ అండ్ ఎఫిషియెన్సీ డిపార్ట్మెంట్కు నాయకత్వం వహించనుంది. కంపెనీకి చెందిన రోజువారీ పనులు క్రమపద్ధతిలో జరిగేలా చూడటం, పనుల అమలు వేగంగా, నాణ్యంగా పూర్తయ్యేలా చూడటం వంటి విధులను ‘మిస్ టాంగ్ యు’ నిర్వర్తించనుందని ‘నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్’ ఇటీవల ప్రకటించింది. ఈ రోబో సీఈవోను చూస్తుంటే, ఐదేళ్ల కిందట చైనీస్ వ్యాపారవేత్త జాక్ మా చెప్పిన జోస్యం నిజమైనా ఆశ్చర్యం అక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరో ముప్పయ్యేళ్లలో ఒక రోబో ఉత్తమ సీఈవోగా ‘టైమ్’ మ్యాగజీన్ కవర్‌పేజీపై కనిపించగలదంటూ 2017లో జాక్ మా చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
అయ్యో! జాక్ మా.. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది?
Jack Ma-China: జాక్ మా నేతృత్వంలోని యాంట్ గ్రూప్ కో లిమిటెడ్ కంపెనీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, బ్యాంకులను చైనా అధికారులు ఆదేశించినట్లు బ్లూమ్ బెర్గ్ న్యూస్ నివేదించింది. చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్‌తో సహా దాని అనుబంధ సంస్థలు, వాటాదారుల ఆర్ధిక మూలాలకు సంబంధించి వివరాలను నిశితంగా పరిశీలించాలని సంస్థలను కోరినట్లు నివేదిక తెలిపింది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నేషనల్ ఆడిట్ కార్యాలయం ఈ తనిఖీలకు నాయకత్వం వహిస్తోంది అని నివేదిక తెలిపింది. 2020 చివరలో $37 బిలియన్లతో ఐపీఓకు వచ్చిన యాంట్ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐపీఓ రద్దు అయ్యింది. ఐపీఓ రద్దు చేసినప్పటి నుంచి అలీబాబా బిలియనీర్ వ్యవస్థాపకుడు జాక్ మా నియంత్రణలో ఉంది. చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో ఆ కంపెనీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ ప్రభావం అలీబాబా షేర్ల మీద పడటంతో ఆ కంపెనీ షేర్లు జనవరి 28 నుంచి 5.3% వరకు పడిపోయాయి. తాజా చర్యలో, నియంత్రణ అధికారులు ఈక్విటీలలో పెట్టుబడుల పెట్టిన వారి వివరాలను సమర్పించాలని, యాంట్ గ్రూప్‌కు సంబంధించి రుణాలను సమర్పించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కోరాయి. గత నెలలో, చైనాలోని నాలుగు అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తి నిర్వహణ సంస్థలలో(ఏఎంసీలు) ఒకటైన చైనా సిండా అసెట్ మేనేజ్ మెంట్ కో లిమిటెడ్, ప్రణాళికాబద్ధమైన యాంట్ గ్రూప్ పెట్టుబడిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర అధికారుల ఒత్తిడి కారణంగా యాంట్ గ్రూప్ వినియోగదారు ఫైనాన్స్ విభాగంలో సుమారు $944 మిలియన్ల విలువైన 20% వాటాను కొనుగోలు చేసే ఒప్పందాన్ని సిండా రద్దు చేసింది. 2020 అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని జాక్ మా బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు బ్రేకులు పడ్డాయి. (చదవండి: ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!) -
మీ అంతు చూస్తా..జిన్ పింగ్ వార్నింగ్
చైనాలో నోరు తెరవడం అంత ఈజీకాదు. నోరుతెరిచి ప్రభుత్వంపై జోకేయాలనుకున్నా కష్టమే. అలాంటిది ఎర్రపాలకులకు ఎర్రికోపం తెప్పిస్తే ఇంకేమన్నా ఉందా? కోపం తెపిస్తే ఏమవుతుందంటారా? మనుషులు ఉన్న చోట నుంచే మాయమైపోతారు. ఇలా మాయమైతున్న మనుషులు..మామూలు మనుషులు కాదు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖులు కావడం విశేషం. ప్రభుత్వ విధానాలు నచ్చక కళ్లు మూసుకుని కూల్‌గా ఉండలేక ఇదేంటి అధ్యక్షా అని ప్రశ్నిచ్చారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదిగో చివరికి ఇలా కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే వ్యక్తులు, సంస్థలు' చైనా ప్రభుత్వ తీరుపై హడలెత్తిపోతుంటే తాజాగా.. అదే ప్రభుత్వం దెబ్బకు చైనాలో అతిపెద్ద బీమా సంస్థకు చైర్మన్‌గా ఉన్న వాంగ్ బిన్‌పై కమ్యూనిస్ట్ పార్టీ అవినీతి నిరోధక శాఖ విచారణకు ఆదేశించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దేశంలోని రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైనాలో అతిపెద్ద బీమా సంస్థ 'చైనా లైఫ్ ఇన్సూరెన్స్' చైర్మన్‌గా ఉన్న 'వాంగ్ బిన్' పై కమ్యూనిస్ట్ పార్టీ చెందిన యాంటీ కరప్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాంగ్ ప్రభుత్వ విధానాల్ని ఉల్లంఘించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడిపై డిసిప్లినరీ యాక్షన్ కింద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు చైనా సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ పేర్కొంది. ఇందులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీస్ టైమ్స్ ప్రకారం..ఈ ఏడాది అవినీతికి పాల్పడిన వ్యక్తుల్లో చైనా ఫైనాన్స్ రంగంలో వాంగ్ తొలి ఉన్నత స్థాయి అధికారి తెలిపింది. విచారణ పూర్తయితే ఆయనపై డ్రాగన్ కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ఇప్పటికే చైనా ప్రభుత్వం తీరుతో దిగ్గజ కంపెనీలు నామరూపాల్లేకుండా పోతుంటే, ఇటీవల కాలంలో 10లక్షల మందికంటే ఎక్కువ మంది అధికారుల్ని చైనా శిక్షించింది. ►ఇటీవల చైనా ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడింది. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. అందుకు ప్రభుత్వం తెచ్చిన విధానాలేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ►260 మిలియన్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న చైనా అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన హువారోంగ్ మాజీ ఛైర్మన్ లై జియోమిన్‌ను గత సంవత్సరం చైనా ఉరితీసింది. ►సెప్టెంబరులో యువాన్ రెంగువో, ప్రపంచంలోని అత్యంత విలువైన స్పిరిట్స్ కంపెనీ కీచౌ మౌటై మాజీ అధిపతి 17 మిలియన్లకు పైగా లంచం తీసుకున్నారనే కారణంగా జీవిత ఖైదు విధించింది. ►2020లో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చైనా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మాజీ అధిపతికి చైనా ప్రభుత్వం 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. చదవండి: చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో.. -
అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్
China's Alibaba Sack Woman Employee Over Sexual Assault Allegations: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కామ పిశాచాలపై చర్యలకు ఉపక్రమించకపోగా.. వాళ్లకు అనుగుణంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోంది. పైగా ఉద్యోగుల మీదే రివెంజ్ తీర్చుకుంటోంది. ఆమధ్య తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి ఆరోపించగా.. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఉద్యోగంలోంచి ఆ యువతిని తొలగించింది కంపెనీ. పైగా ఆమె ఆరోపణలు అవాస్తవమంటూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. చైనా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. గత ఆగష్టులో ఓ ఉద్యోగిణి అత్యాచార ఆరోపణలతో మీడియాకు ఎక్కగా.. ఇప్పుడు ఆ యువతికి షాక్ ఇచ్చింది అలీబాబా. తప్పుడు ప్రచారంతో కంపెనీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను తొలగిస్తున్నాం అంటూ ప్రకటించింది అలీబాబా. ఇదిలా ఉంటే ఓ బిజినెస్ ట్రిప్ సందర్భంగా మేనేజర్ లెవల్ అధికారి(మిస్టర్ వాంగ్!), ఓ క్లయింట్ బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది సదరు యువతి. కానీ, కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో తోటి ఉద్యోగుల మద్ధతుతో ఆమె ‘స్క్రీన్ షాట్స్’ ఉద్యమాన్ని నడిపించింది. ఆ టైంలో ఆమెకు అండగా నిలిచిన పది మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసేసింది అలీబాబా కంపెనీ. ఈ నిర్ణయంపై విమర్శలు వెత్తడంతో తగ్గిన అలీబాబా గ్రూప్.. ఆ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకుంది. అంతేకాదు బాధితురాలికి తాత్కాలిక ఉపశమనం ఇస్తూ.. నిందితుడిపై వేటు వేసింది. (అదే సమయంలో అతడిపై పెట్టిన క్రిమినల్ కేసును సైతం ఎత్తేయించింది.. క్లయింట్ మీద మాత్రం దర్యాప్తు కొనసాగించింది). ఇక యువతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించని మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను సస్పెండ్ కూడా చేసింది. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే.. బాధితురాలిని అర్ధాంతరంగా ఉద్యోగంలోంచి తొలగించింది అలీబాబా గ్రూప్. ఆమెవి కేవలం ఆరోపణలే అని , కంపెనీ పేరు ప్రతిష్టలను బజారుకీడ్చిందంటూ చెబుతూ తాజాగా సదరు ఉద్యోగిణిపై వేటు వేసింది అలీబాబా. మరోవైపు చర్యలు తీసుకున్న అధికారుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులు పని చేస్తున్న అలీబాబా కంపెనీలో.. కిందటి ఏడాది యాభై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ హెడ్లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం. ఈ ఏడాది లైంగిక వేధింపుల ఫిర్యాదులు 75 పైనే వచ్చాయి. ఇంకోవైపు తోటి ఉద్యోగుల నుంచి వేధింపులపై సుమారు 1,500 దాకా ఫిర్యాదు అందినట్లు స్థానిక మీడియా ఒకటి కథనం వెలువరించింది. చైనా ప్రభుత్వానికి భయపడే.. ఇలాంటి ఫిర్యాదులపై చర్యలకు కంపెనీ అధినేత జాక్ మా వెనకంజ వేస్తున్నాడంటూ విమర్శలూ వినిపిస్తున్నాయి. సంబంధిత కథనం: రేప్ విక్టిమ్‌కు అండగా పోస్టులు.. పది మంది అలీబాబా ఎంప్లాయిస్ డిస్మిస్ -
జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో
Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్ కుబేరుడు ‘జాక్–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. సుదీర్ఘ విరామం తరువాత జాక్ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు. అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్ – మా హామీలు మాత్రమే కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే! అప్పటికే ఉప్పు.. నిప్పు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్–మా, ట్రంప్‌ల మీటింగ్ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది. నవంబరు 5న జాక్–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక దశలో జాక్–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మారిపోయిన సీన్... చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్–మా కే చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది. వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ సి త్సాయి జూన్ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..!
గత ఏడాది అక్టోబర్‌లో చైనా ప్రభుత్వాన్ని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో కొద్ది రోజులపాటు జాక్ మా అండర్ గ్రౌండ్ కూడా వెళ్లిపోయాడు. అక్కడి ప్రభుత్వం జాక్ మా కంపెనీలపై ఉక్కుపాదం వేసింది. ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఇప్పుడు జాక్ మా కొంపముంచాయి. భారీ నష్టాలు...! చైనా బిజినెస్ టైకూన్ జాక్ మాకు చెందిన అలీబాబా గత ఏడాది కాలంలో 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది అక్టోబర్‌లో అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా విమర్శించినప్పుడే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ పతనమవుతాయని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే జాక్ మా భారీ నష్టాలను సొంతం చేసుకున్నారు. మూడు వారాల ముందు హాంకాంగ్‌లో అలీబాబా షేర్లు అత్యధికంగా రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్టోబర్ 5 నుంచి 30శాతం రికవరీ ఉన్నప్పటికీ...గత ఏడాదితో పోలిస్తే 43 శాతం మేర స్టాక్ ధర తగ్గింది. చదవండి: ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?! బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం...అలీబాబా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాదిలో 344 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా షేర్‌హోల్డింగ్‌లో అతిపెద్ద నష్టాలను అలీబాబా ముటకట్టుకుంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆరోపణలు చేయడంతో...చైనాకు చెందిన జాక్ మా ఫిన్‌టెక్ ఆర్మ్ యాంట్ గ్రూప్ జాబితాను ఐపీవోకు వెళ్లకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి దేశంలోని అత్యంత శక్తివంతమైన రంగంపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీ అణిచివేత చేపట్టి, అలీబాబాకు తీవ్ర నష్టాలు వచ్చేలా చేసింది. జిన్పింగ్ప్రభుత్వంపై భారీ విమర్శలు..! గత ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. దీంతో జాక్ మా వ్యాపార లావాదేవీలకు అక్కడి చైనా ప్రభుత్వం భారీ ఆటంకాలను సృష్టించింది. చదవండి: Tesla: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! -
ఏడాది తర్వాత ప్రత్యక్షమైన మల్టీబిలియనీర్
Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!) బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్ వేదిక వద్ద జాక్ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్ ఫైనాన్షియల్ హబ్ ఈవెంట్లో పాల్గొన్న జాక్ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్ చేశాడు. డ్రాగన్ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్ మా.. గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది. చదవండి: బిట్‌కాయిన్.. చైనా బ్యాన్ ఎఫెక్ట్ నిల్! -
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు
చైనా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగిణినిపై మేనేజర్ లెవల్ అధికారి, ఓ క్లయింట్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు పది మంది ఉద్యోగులపై వేటు వేసింది కంపెనీ. క్రమశిక్షణ చర్యల పేరుతో అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కిందటి వారం పది మందిని డిస్మిస్ చేసింది. అయితే వాళ్లంతా అత్యాచార బాధితురాలికి మద్దతుగా పోస్ట్‌లు చేసినందుకే ఇదంతా జరిగిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మేనేజర్, క్లయింట్ ఇద్దరూ తనను ఓ బిజినెస్ ట్రిప్‌లో వేధించారని, బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారని గతంలో ఆమె ఆరోపించింది. దీంతో ఆరోపణలపై నిజాలు తేలేదాకా ఆ మేనేజర్‌పై వేటు వేశారు. క్లిక్ చేయండి: బిజినెస్ బిల్డప్ బాబాయ్ ఈ తరుణంలో ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కంపెనీ అంతర్గత ఫోరమ్‌లో షేర్ చేశారు పది మంది ఉద్యోగులు. తిరిగి ఆ మేనేజర్‌ను విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నందునే బాధితురాలికి న్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు వాళ్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే కంపెనీ మాత్రం విషయం బయటకు పొక్కేలా చేసినందుకు వాళ్లపై వేటు వేసింది. మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులున్న అలీబాబా కంపెనీలో.. 2020లో ముప్ఫై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ బాస్‌లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం. చదవండి: జియో వర్సెస్ ఎయిర్టెల్.. గూగుల్ షాకింగ్ నిర్ణయం -
పాపం ఈ ఆలీబాబాకు మరో షాక్!
బీజింగ్: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏ ముహుర్తంలో చైనా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారో,ఇక అప్పటి నుంచి ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది డ్రాగన్ సర్కార్. ఈ క్రమంలో జాక్ మాను, ఆయన సంస్థలను కష్టాలు వదలక వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జిన్‌పింగ్ ప్రభుత్వం ఆ సంస్థపై మరో బాంబ్ పేల్చింది. మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించారంటూ జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది. ‘పిక్ వన్ ఫ్రమ్ టూ’ అనే నినాదంతో దేశీయ ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో పోటీని పరిమితం చేస్తూ అలీబాబా గ్రూప్ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తోందంటూ చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 2.8బిలియన్ డాలర్లు జరిమానా విధించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో 4 శాతానికి సమానం కావడం గమనార్హం. కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనా ప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఇవేకాక గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది.దాని ఫలితంగానే తాజా ఈ జరిమానాను జాక్ మా పై విధించింది. ( చదవండి: వైరల్: బ్రూస్లీ వన్ ఇంచ్ పంచ్‌తో అదరగొడుతున్న యువకుడు ) -
జాక్ మాకు మరో షాక్!
బీజింగ్: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు తాజాగా మరో షాక్ తగిలింది. దేశ అధికారిక రాష్ట్ర మీడియా ప్రచురించిన టాప్ బిజినెస్ లీడర్స్ జాబితా నుంచి అలీబాబాను తప్పించడం సంచలనం రేపింది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రశంసించిన షాంఘై సెక్యూరిటీస్ పత్రిక కీలకమైన ప్రముఖ టెక్ దిగ్గజం అలీబాబాను విస్మరించింది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షింజువా ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ దేశంలోని టెక్ దిగ్గజాలపై స్టోరీ ప్రచురించింది. ఇందులో టెక్ సంస్థలు, టెక్ కంపెనీల అధినేతల కృషి, అభివృద్ధి గురించి ప్రముఖంగా పేర్కొంది. అయితే ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, దాని వ్యవప్థాపకుడు జాక్ మా ప్రస్తావన లేదు. మరోవైపు కొత్త మొబైల్ యుగాన్ని లిఖించాడంటూ జాక్ మా ప్రధాన ప్యత్యర్థి, టెన్సెంట్ సీఈవో పోనీమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. టెన్సెంట్తో పాటు బివైడి కో చైర్మన్ వాంగ్ చవాన్ వూ, షావోమీ లీ జూన్, హువావే అధినేత తదితరులను పొగడ్తలతో ముంచెత్తింది. మొదటి పేజీ వ్యాఖ్యానంలో జాక్ మా పేరును కావాలనే పక్కన పెట్టిన పత్రిక "మన పాత ఆర్థిక వ్యవస్థ కఠినమైన విధానాలను బ్రేక్ చేయడానికి కొంతమంది వ్యవస్థాపకులు "నిర్లక్ష్య వీరులు" గా వ్యవహరించా రంటూ రాసుకొచ్చింది. కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనాప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న జాక్ మా, గతనెల జనవరిలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో అలీబాబా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అలీబాబా డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. అలీబాబా తన త్రైమాసిక ఆదాయాలను ఈ రోజు ప్రకటించనుంది. తాజా పరిణామంపై అలీబాబా ఇంకా స్పందించలేదు. -
వెలుగులోకి అలీబాబా చీఫ్ జాక్‌మా
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా రెండున్నర నెలల తర్వాత ఆన్లైన్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో.. తన ఫౌండేషన్ మద్దతు పొందిన టీచర్లకు అభినందనలు తెలియజేశారు. తను రెండున్నర నెలలుగా కనిపించకుండా పోవడానికి, అలీబాబా గ్రూపుపై చైనా సర్కారు నియంత్రణ చర్యల గురించి మా ప్రస్తావించలేదు. ఈ వీడియో చైనా బిజినెస్ న్యూస్, ఇతర పోర్టళ్లలో దర్శనమిచ్చింది. ‘‘జనవరి 20న జరిగిన వార్షిక గ్రామీణ టీచర్ల ఆన్లైన్ కార్యక్రమంలో జాక్‌మా పాల్గొన్నారు’’అంటూ జాక్‌మా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 24న షాంఘై కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా నియంత్రణ సంస్థలను జాక్‌మా విమర్శించారు. ఆవిష్కరణలను తొక్కి పెడుతున్నాయని ఆయన ఎత్తిచూపారు. తర్వాత కొన్ని రోజుల్లోనే జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూపు భారీ ఐపీవో ప్రయత్నాలను నియంత్రణ సంస్థలు సస్పెండ్ చేశాయి. వ్యాపార దిగ్గజంగా ఎదిగిన 56 ఏళ్ల జాక్‌మా ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోవడంతో.. చైనా కమ్యూనిస్ట్ సర్కారు నిర్బంధించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మూడు నెలల సస్పెన్స్‌కు బ్రేక్...
బీజింగ్: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఆయన బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. చైనా బ్యాంకుల తీరును ఎండగట్టిన నాటి నుంచి జాక్ మా బహిరంగంగా కనిపించలేదు. ఇక ఆయన నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ షోకు కూడా హాజరు కాలేదు. దాంతో జాక్ మా మిస్సింగ్ అంటూ రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వ్యతిరేకంగా మాట్లడటంతో జిన్‌పింగ్ ఆయనను ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. జాక్ మా కనిపించారు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసిన జాక్ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు. ఇక జాక్ మా వీడియో కాన్ఫరెన్స్‌కు సంబందించి వీడియో తొలుత ఓ లోకల్ బ్లాగ్‌లో ప్రచారం కాగా.. ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెర పడింది. (చదవండి: జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్ ) ప్రభుత్వంపై విమర్శలతో వివాదం.. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది. -
జాక్ మా ఎక్కడ?
న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో ఆయన అదృశ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తన సొంత టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ కార్యక్రమం తుది ఎపిసోడ్లో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. కార్యక్రమానికి మా హాజరు కాకపోవడం, షో వెబ్సైట్ నుంచి ఆయన ఫొటోలను కూడా తొలగించడం వంటి అంశాలన్నీ చూస్తే దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో వివాదం.. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది. -
షాకింగ్.. జాక్ మా మిస్సింగ్?!
బీజింగ్: చైనీస్ బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కనిపించడం లేదట. చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన కనిపించడం లేదని సమాచారం. రెండు నెలల క్రితం జాక్ మా తన స్వంత టాలెంట్ షో ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత నుంచి పబ్లిక్‌గా కనిపించడం లేదని తెలిసింది. గతేడాది అక్టోబర్ 24న జాక్ మా షాంగైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ పని తీరు వల్ల దేశంలో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నాడు జాక్ మా తన ప్రసంగంలో ‘నేటి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక యుగం నాటి పరిస్థితులకు వారసత్వంగా నిలుస్తుంది. భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త వ్యవస్థను రూపొందించుకోవాలి. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించాలి. యువతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి’ అన్నారు. (చదవండి: అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్) జాక్ మా వ్యాఖ్యలు బీజింగ్ పాలనా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదాస్పద ప్రసంగం అనంతరం యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన సొంత టాలెంట్ షో చివరి ఏపిసోడ్ తర్వాత జాక్ మా బహిరంగంగా కనిపించలేదు. దాంతో ప్రస్తుతం అతడి భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక టాలెంట్ షో అధికారిక వెబ్సైట్ నుంచి జాక్ మా ఫోటోని తొలగించారు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇక జాక్ మా కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఆ సంస్థ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలని కొట్టి పారేయడం గమనార్హం. (చదవండి: జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్) ఈ సందర్భంగా అలీబాబా గ్రూపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జాక్ మా మిస్సయ్యారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం. షెడ్యూల్లో ఏర్పడిన గందరగోళం వల్ల ఆయన ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ షోలో కనిపించడం లేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం జాక్ మా స్థానంలో అలీబాబా గ్రూపు ఎగ్జిక్యూటివ్, లూసీ పెంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆఫ్రికాస్ బిజినేస్ హీరోస్ షో కంటెస్టెంట్ ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘జాక్ మాకు సంబంధించి చైనాలో ఏదో జరుగుతుంది. త్వరలోనే ఆ విషయాలు వెలుగులోకి వస్తాయి’ అన్నారు. -
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్
హాంకాంగ్, షాంఘై: ఇటీవల పతన బాటలో సాగుతున్న చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో హాంకాంగ్‌లో లిస్టయిన అలీబాబా షేరు 9 శాతం పతనమైంది. తద్వారా జూన్ తదుపరి కనిష్టానికి చేరింది. గత రెండు రోజుల్లో షేరు భారీగా తిరోగమించడంతో కంపెనీ మార్కెట్ విలువలో 116 బిలియన్ డాలర్లమేర ఆవిరైనట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లోనూ షేరు ఇంట్రాడేలో 15 శాతం వరకూ పతనంకావడం గమనార్హం! నిజానికి కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. అయినప్పటికీ చైనీస్ నియంత్రణ సంస్థలు కంపెనీ ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టనుండటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. (యాంట్ గ్రూప్ ఐపీవోకు చైనీస్ షాక్) దర్యాప్తు ఎఫెక్ట్ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మాతోపాటు.. అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యంపై ఇటీవల కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అలీబాబాపై గుత్తాధిపత్య నిబంధనలకింద చైనీస్ నియంత్రణ సంస్థలు దర్యాప్తునకు ఆదేశించాయి. యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపైనా దర్యాప్తునకు శ్రీకారం చుట్టాయి. యాంటీట్రస్ట్ చట్ట ప్రకారం అలీబాబా గ్రూప్‌పై భారీ స్థాయిలో జరిమానాలు విధించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. తొలుత ప్రతిపాదించిన 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022వరకూ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. అయినప్పటికీ సోమవారం షేరు 222 డాలర్ల వద్ద ముగిసింది. (యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్) కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వారాంతాన యాంట్ గ్రూప్‌నకు చెందిన రుణ వ్యాపారం, కన్జూమర్ ఫైనాన్స్ వివరాలపై ఆరా తీసింది. ఇప్పటికే అంటే గత నెలలో 37 బిలియన్ డాలర్ల విలువైన యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూని చైనా నియంత్రణ సంస్థలు నిషేధించాయి. తద్వారా హాంకాంగ్, షాంఘైలలో లిస్టింగ్ చేపట్టేందుకు యాంట్ గ్రూప్ చేసుకున్న సన్నాహాలకు సరిగ్గా రెండు రోజుల ముందు చెక్ పెట్టాయి. కొద్ది రోజుల క్రితం జాక్ మా ఒక ఇంటర్వ్యూలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ నిబంధనలు తదితర అంశాలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు టెన్సెంట్ తదితర టెక్ దిగ్గజాలకు సైతం సమస్యలు సృష్టించవచ్చని ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
అలీబాబాకు మరో ఎదురుదెబ్బ
బీజింగ్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్, చైనాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి.ఐపీఓ నిలిపివేత ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్ దాని చెల్లింపుల మూలానికి తిరిగి రావాలని, లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు చెప్పారు. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో (37 బిలియన్ డాలర్ల) ప్లాన్ చేసింది కంపెనీ. షాంఘైతో పాటు, హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లలో డెబ్యూ లిస్టింగ్‌కు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే యాంట్ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించారు. తాజా నిర్ణయంతో కంపెనీ షేరు 6శాతం పడిపోయింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా మోనోపలిగా కంపెనీ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు అలీబాబా మాతృ సంస్థ యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్
సరిగ్గా రెండు రోజుల ముందు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. గురువారం అటు హాంకాంగ్, ఇటు షాంఘైలలో ఒకేసారి లిస్టింగ్ చేసే యోచనలో యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. అయితే మంగళవారం రాత్రి షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ ఇందుకు బ్రేక్ వేసింది. ఈ వార్తల ఫలితంగా మంగళవారం యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం పతనంకావడం గమనార్హం! అన్లైన్ లెండింగ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంట్ గ్రూప్ ప్రమోటర్ జాక్ మా చైనీస్ బ్యాంకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభావం చూపినట్లు యాంట్ గ్రూప్ తాజాగా అభిప్రాయపడింది. యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. ఆన్లైన్లో మైక్రోరుణాలందించే యాంట్ గ్రూప్‌ను జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ ప్రమోట్ చేసింది. ఆన్లైన్ లెండింగ్పై సవరించిన ఫిన్‌టెక్ నిబంధనలు, లిస్టింగ్‌కు సంబంధించిన వివరాల వెల్లడిలో వైఫల్యం తదితర కారణాలతో యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు చైనీస్ నియంత్రణ సంస్థలు మోకాలడ్డినట్లు అక్కడి మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థల అధికారులు సోమవారం యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్‌తోపాటు.. సీఈవో సైమన్ హును ఆన్లైన్ లెండింగ్ బిజినెస్‌పై ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. చదవండి: యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్ -
జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్
బీజింగ్ : అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మాకు వ్యాక్సిన్ టైకూన్, వాటర్ బాటిళ్ల వ్యాపారవేత్త భారీ షాక్ ఇచ్చాడు. రీటైల్ పెట్టుబడిదారుడైన జాంగ్ షాన్షాన్ చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ నికర విలువ బుధవారం 58.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది జాక్ మా కంటే రెండు బిలియన్ డాలర్లు ఎక్కువ. దీంతో ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత ఆసియాలో రెండవ ధనవంతుడిగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో 17 వ సంపన్నుడుగా జాంగ్ ఘనత దక్కించుకున్నారు. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లో ఐటీ నష్టాలతో ప్రపంచంలోని 500 ధనవంతుల సంపద భారీగా తుడుచు పెట్టుకుపోయింది. ప్రధానంగా బ్యాటరీ ఈవెంట్ అంచనాలను అందుకోకపోవడంతో మస్క్ 10 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బెజోస్ 7.1 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఫలితంగా మస్క్ సంపద 93.2 బిలియన్ డాలర్లకు చేరగా, బెజోస్ నికర సంపద 178 బిలియన్ డాలర్లుగా ఉంది. జాంగ్ బుధవారం ఒక్క రోజు 4 బిలియన్ల డాలర్లు సాధించడం విశేషం. "లోన్ వోల్ఫ్" గా పేరొందిన షాన్షాన్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరువాత ప్రపంచంలో మరెవ్వరూ సాధించని ఆదాయాన్ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో అతని సంపద 51.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వాటర్ బాటిల్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ కంపెనీ ఐపీవో ద్వారా హాంకాంగ్ లో అతిపెద్ద రీటైల్ పెట్టుబడిదారుడిగా షాన్షాన్ అవతరించాడు. ఆ తరువాత బీజింగ్ వంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ కంపెనీ లిస్టింగ్ ద్వారా ఆగస్టు నాటికి ఆయన నికర విలువ ఏకంగా 20 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే త్వరలోనే జాక్ మా మళ్లీ టాప్ ప్లేస్ కు చేరుకుంటాడని అంచనా. -
అలీబాబా అధినేత జాక్ మాకు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : అలీబాబా వ్యవస్ధాపకుడు జాక్ మాతో పాటు దిగ్గజ ఈకామర్స్ సంస్థకు భారత కోర్టు సమన్లు జారీ చేసింది. కంపెనీ యాప్‌లు, డాక్యుమెంట్లలో సెన్సార్షిప్, ఫేక్ న్యూస్‌లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగం నుంచి తొలగించారని భారత్‌లో కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాలు చూపుతూ అలీబాబాకు చెందిన యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ సహా 57 చైనా యాప్‌లను భారత్ నిషేధించిన క్రమంలో ఈ కేసు వెలుగుచూసింది. అలీబాబా, జాక్ మా సహా కంపెనీకి చెందిన 12 మంది అధికారులను ఈనెల 29న కోర్టు ఎదుట హాజరుకావాలని గురుగ్రాం జిల్లా కోర్టు సివిల్ జడ్జి సోనియా షికండ్ నోటీసులు జారీ చేశారు. చైనాతో పాటు డ్రాగన్ యాప్స్ యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్‌ను కంపెనీ సెన్సార్ చేసేదని, వీటిని సామాజిక, రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా చూపేవని అలీబాబాకు చెందిన యూసీ వెబ్ మాజీ ఉద్యోగి పుష్పేంద్ర సింగ్ పర్మార్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. వీటిపై ప్రశ్నించినందుకు తనను అకారణంగా తొలగించారని ఆ పత్రాల్లో వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై సమన్లలో పేర్కొన్న విధంగా 30 రోజుల్లోగా తమ స్పందనను లిఖితపూర్వకంగా తెలియచేయాలని న్యాయమూర్తి అలీబాబా కంపెనీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను కోరారు. కాగా, భారత్‌లో పనిచేసే స్ధానిక ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడిఉన్నామని, స్ధానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని యూసీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత వివాదంపై తాము ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానించే పరిస్థితిలో లేమని తెలిపింది. చదవండి : జాక్ మాను వెనక్కినెట్టి.. ఇక 2017 అక్టోబర్ వరకూ గురుగ్రాంలోని యూసీ వెబ్ కార్యాలయంలో పార్మర్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారంగా 2,68,000 డాలర్లు చెల్లించాలని పర్మార్ కోరుతున్నారని రాయ్‌టర్స్ పేర్కొంది. కాగా, దీనిపై పర్మార్ న్యాయవాది అతుల్ అహ్లావత్‌ను సంప్రదించంగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ వ్యాఖ్యానించనని పేర్కొనట్టు తెలిపింది. యూసీ వెబ్ భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించిన మీదట చైనా యాప్‌ల నిషేధం నిర్ణయంతో తాజా కోర్టు కేసు భారత్ మార్కెట్లో అలీబాబాకు అవరోధంగా మారింది. కాగా భారత సమగ్రతకు ఆయా చైనా యాప్‌లు ముప్పుగా పరిణమించాయని విశ్వసనీయ సమాచారం అందడంతోనే వాటిని నిషేధించామని భారత్ చెబుతోంది. -
అలీబాబా అధినేతను వెనక్కినెట్టి..
బీజింగ్ : కరోనా మహమ్మారి ప్రభావంతో అత్యంత సంపన్నుల జాబితాలూ తారుమారవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లో టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు అనూహ్యంగా పెరగడం, షాపింగ్ యాప్ పిండుడువో దూకుడు చైనా బిలియనీర్ల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి. అతిపెద్ద గేమ్ డెవలపర్ టెన్సెంట్ హోల్డింగ్స్ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను అధిగమించి ఆసియాలోనే అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది. దీంతో చైనాలో అత్యంత సంపన్నుడు జాక్ మా (48 బిలియన్ డాలర్లు)ను టెన్సెంట్కు చెందిన పోనీ మా (50 బిలియన్ డాలర్ల) అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పిడిడికి చెందిన కోలిన్ హువాంగ్ 43 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్ 3 సంపన్నుల్లో మూడవ స్ధానంలో నిలిచారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం హుయ్ కా యాన్ నాలుగో స్ధానానికి పడిపోయారు. కరోనా మహమ్మారితో వినియోగదారుల అలవాట్లు మారడంతో పలు ఇంటర్నెట్ కంపెనీల షేర్లు నింగికెగిశాయి. దీంతో చైనా సంపన్నుల ర్యాంకుల్లో టెక్ దిగ్గజాలు అనూహ్యంగా దూసుకొచ్చాయి. తొలి టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు టెక్నాలజీ దిగ్గజాలే కావడం గమనార్హం. చదవండి : ‘అలీబాబా’ జాక్ మా కీలక నిర్ణయం! -
‘అలీబాబా’ జాక్ మా కీలక నిర్ణయం!
బీజింగ్: అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు జాక్ మా తన పదవికి రాజీనామా చేస్తున్నారని సదరు సంస్థ సోమవారం తెలిపింది. అదే విధంగా ముగ్గురు కొత్త సభ్యులను బోర్డులోకి ఆహ్వానించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. జూన్ 25న జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని కొత్త నియామకాలతో బోర్డు సభ్యుల సంఖ్య 13కు చేరుకుంటుందని వెల్లడించింది. (రెండో స్థానంలోకి ఆలీబాబా జాక్ మా) ఈ క్రమంలో కాడెన్స్ డిజైన్స్ సిస్టమ్స్ సీఈఓ లిప్- బూ టన్, వెసెడా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ యుకో కవామోటో కొత్త సభ్యులుగా చేరనున్నట్లు పేర్కొంది. కవామోటో నియామకం ఖరారైన నేపథ్యంలో బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలిగా ఆమె ప్రత్యేకత సంతరించుకోనున్నారు. కాగా చైనీస్ ఇ- కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం కో ఫౌండర్, టెక్ బిలియనీర్ జాక్ మా గతేడాది తన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన వైదొలగనున్నారు. ఇదిలా ఉండగా... షేర్ల కొనుగోలుకై దాదాపు 4.7 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. కాగా అలీబాబాలో పెద్ద మొత్తంలో వాటాలు దక్కించుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.(జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌తో డీల్ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. డీల్ వార్తల కారణంగా రిలయన్స్ షేరు ఒక్కసారిగా ఎగియడంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో చైనా దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అధిగమించి అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. జాక్ మా కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. సంపన్నుల సంపదకు కొలమానంగా పరిగణించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ సుమారు 10 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ముందు ఈ ఏడాది ఇప్పటిదాకా అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. డాలర్ల మారకంలో చూస్తే ఆసియాలో అత్యధికంగా నష్టపోయినది ముకేశ్ అంబానీయే. కానీ, ఫేస్బుక్ డీల్ కలిసి వచ్చి రిలయన్స్ షేరు పుంజుకోవడంతో మళ్లీ ఆసియా కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ
సాక్షి, ముంబై : ఫేస్బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) రిలయన్స్ అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే ఫేస్బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 సంవత్సరాలలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్ తగ్గడంతో అలీబాబా హోల్డింగ్స్ నష్టాలను చవి చూస్తోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది -
రెండో స్థానానికి తగ్గిన ముకేశ్ అంబానీ
-
ఆసియా అపర కుబేరుడు జాక్ మా!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది. ‘చమురు’ వదులుతోంది... ముడి చమురు రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో రిలయన్స్ నిర్దేశించుకున్నట్లుగా 2021 నాటికి రుణరహిత సంస్థగా మారే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీకి రిలయన్స్ చమురు, పెట్రోకెమికల్స్ విభాగంలో వాటాల విక్రయ డీల్ సజావుగా జరగడంపైనే ఇదంతా ఆధారపడనుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మరోవైపు, కరోనా వైరస్ దెబ్బతో జాక్ మా ఆలీబాబా వ్యాపారం కాస్త దెబ్బతిన్నా.. ఆ గ్రూప్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్‌కి డిమాండ్ పెరగడంతో పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. సోమవారం స్టాక్ మార్కెట్ పతనంలో రిలయన్స్ షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. -
ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా
న్యూఢిల్లీ : ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది. ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయారు. షేర్‌మార్కెట్ కుదేలవడంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా ఆక్రమించారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ముఖేష్ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారని పేర్కొంది. కరోనా వైరస్ భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్న క్రమంలో 30 ఏళ్ల కనిష్టస్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. రిలయన్స్ షేర్లు సైతం ఏకంగా 12 శాతం పతనమయ్యాయి. అయితే ప్రతికూల పరిణామాలు తాత్కాలికమేనని ముఖేష్ అంబానీ (62) తిరిగి సత్తా చాటుతారని ఈక్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు చెందిన హరీష్ హెచ్వీ అన్నారు. అంబానీ టెలికాం బిజినెస్ రానున్న సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు. చదవండి : కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే? -
కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళం
బీజింగ్ : చైనాలోని వుహన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ చైనీయుల ప్రాణాలను కబలిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌కు పోరాటానికి తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు. దీంతో పాటు టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా మెడికల్ వర్కర్స్, పేషెంట్లకు ఉచిత రవాణా సాయం చేస్తోంది. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి. కాగా, చైనాలో కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 213 మంది మృతి చెందగా, 7వేల మందికి పైగా కరోనా బారీన పడి చికిత్స తీసుకుంటున్నారు. -
అలీబాబాకు జాక్ మా అల్విదా
చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ (ఒలింపిక్-పరిమాణ) స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన అలీబాబా పార్ట్నర్షిప్లో సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. జాక్ స్థానంలో సంస్థ సీఈవో డేనియల్ జాంగ్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ముఖ్యంగా 1999లో స్థాపించిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా కంపెనీ ఎదుగలలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని టాప్ టెన్ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దిన జాక్ మా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య వేగంగా మారుతున్న పరిణామాలు, అనిశ్చితినెదుర్కొంటున్న తరుణంలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాను - ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు, నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక బహిరంగ లేఖ ద్వారా తన రిటైర్మెంట్ గురించి జాక్ మా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ వ్యాపారాలు 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో 66 శాతం వాటాను కలిగి ఉంది అలీ బాబా సంస్థ. -
ముకేశ్ అంబానీ మరో ఘనత
-
ముకేశ్ అంబానీ ‘గ్లోబల్ థింకర్’!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్బుక్, గూగుల్‌లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా చోటు లభించింది. -
‘స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు’
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఈ ఏడాది టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ గ్లోబల్ మ్యాగజీన్ ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఈ జాబితాలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టీన్ లాగ్రడేలకు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌లో కొంతమంది పేర్లను మాత్రమే ప్రచురించిన ఫారిన్ పాలసీ జనవరి 22 నాటికి పూర్తి జాబితాను వెల్లడించనుంది. ‘44. 3 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ.. జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయిల్, గ్యాస్, రిటైయిల్ రంగాల్లో తనదైన ముద్రవేసిన అంబానీ.. జియోతో భారత టెలికాం రంగంలో సంచనాలు నమోదు చేశారు. జియోను ప్రారంభించిన ఆరు నెలల్లోపే వంద మిలియన్ కస్టమర్లను ఆకర్షించి స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు. ఇకపై డిజిటల్ ఎయిర్‌వేవ్స్ ద్వారా లైఫ్‌స్టైల్ ప్రాడక్ట్‌ను అమ్మి గూగుల్, ఫేస్‌బుక్‌లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు’ అని ఫారిన్ పాలసీ వెల్లడించింది. అంతేకాకుండా 2019తో గ్లోబల్ థింకర్స్ జాబితా ప్రచురణ పదేళ్ల వసంతంలోకి అడుగుపెడుతోందని ఫారిన్ పాలసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతూ, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల జాబితా ప్రకటిస్తున్నామని తెలిపింది. వంద మంది గ్లోబల్ థింకర్స్‌లో మొత్తం 10 కేటగిరీలు ఉంటాయని, ముఖేష్ అంబానీ టాప్ 10 టెక్నాలజీ థింకర్స్‌లో చోటు దక్కించుకున్నారని వెల్లడించింది. -
‘జాక్ మా’ వారసుడొచ్చాడు!
బీజింగ్: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్ మా వెల్లడించారు. 420 బిలియన్ డాలర్ల (రూ.30,43,131 కోట్లు) ఈ–కామర్స్ దిగ్గజానికి తన తరువాత వారసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్ డే సేల్’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్ మా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపడతారని తెలియజేశారు. 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. ఇక నుంచి భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. -
అమెరికా, చైనాకు ట్రేడ్ వార్ తప్పదా?
బీజింగ్ : ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, డ్రాగన్ దేశానికి పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఏర్పడగా.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో జాక్ మా మాత్రం స్వదేశానికి గట్టి హెచ్చరికలే జారీచేస్తున్నారు. వివాదాలను సరైన స్థాయిలో పరిష్కరించుకోలేకపోతే, ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికాకు, చైనాకు ''బిగ్ ట్రేడ్ వార్'' తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పటికే చైనీస్ ఎకానమీ తిరుగమన స్థాయిలో ఉందని, అంచనావేసిన దానికంటే క్లిష్టతరంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడు లేదా ఐదేళ్లు తమ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు. జనరల్ అసోసియేషన్ ఆఫ్ జెజియాంగ్ ఎంటర్‌ప్రిన్యూర్స్ సదస్సులో జాక్‌మా తన స్వదేశాన్ని తూర్పారా పట్టారు. గత రెండు దశాబ్దాల్లో కల్లా అత్యంత కనిష్ట స్థాయిలో గతేడాది చైనీస్ ఆర్థికవృద్ధి నమోదైంది. కేవలం 6.7 శాతం మాత్రమే ఈ దేశం వృద్ధిని నమోదుచేసింది. గత మూడు దశాబ్దాల క్రితం కొనసాగిన అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును ఇక మనం చూడలేమని ఆయన చెప్పారు. మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రిని అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వృద్ధిపై దృష్టిసారించాలని చెప్పారు. అమెరికాతో సమస్యలను సరైన స్థాయిలో పరిష్కరించుకోవాలని సూచించారు. తమ ఉద్యోగాలను చైనీసులు కొట్టుకుని పోతున్నారంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి చైనాపై విరుచుకుపడుతున్న ట్రంప్, గెలవగానే తైవాన్ అధ్యక్షురాలితో సంభాషణలు జరిపారు. వన్ చైనా పాలసీపై విమర్శలు సంధించారు. దీనిపై చైనా ఇప్పటికే గుర్రుగా ఉంది. ట్రంప్ ట్రేడ్ వార్కి దిగితే, తాము చూస్తూ ఊరుకోబోమని చైనా సైతం హెచ్చరించింది. ఈ ప్రత్యారోపణ సమయంలోనే డ్రాగన్ దేశ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో మాత్రం అమెరికా అధ్యక్షుడితో భేటీఅయ్యారు. ఈ భేటీలో అమెరికాకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు చైనాకు మరింత కోపం తెప్పించేలా తన స్వదేశానికే జాక్ మా హెచ్చరికలు జారీచేశారు. -
'ఆ తప్పే అమెరికాను కుదేలు చేసింది'
బీజింగ్: అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణం ఆ దేశమేనని అలీబాబా డాట్ కామ్ అధినేత జాక్ మా ఆరోపించారు. యుద్ధాల కోసం ఆ దేశం చేసిన ఖర్చుల కారణంగానే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్లకాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు. చైనా అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలించలేదని అన్నారు. అమెరికా స్వయంకృత అపరాధాల కారణంగా అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితం మేథోసంపత్తిపై హక్కులను మాత్రం ఉంచుకొని కార్మిక ఉద్యోగాలను మిగిలిన ప్రపంచానికి వదిలేసిందని జాక్‌మా అన్నారు. ఆ కారణంగానే ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు భారీగా ఆదాయాన్ని సాధించాయని పేర్కొన్నారు. వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ ముగించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలని అన్నారు. సాధారణంగా వ్యాపారం వల్ల ప్రజల ఆలోచనలు , సంస్కృతులను పంచుకుంటారని అన్నారు. 1979లో చైనా అమెరికా వ్యాపార విలువ 2.5 బిలియన్ డాలర్లు అని అది 2016 నాటికి 211 రెట్లు పెరిగి 519 బిలియన్ డాలర్లు అయిందని వెల్లడించారు. -
'నాడు హార్వార్డ్ నన్ను పదిసార్లు వద్దంది'
చైనా: ప్రముఖ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మరోసారి ఆన్లైన్లో దూసుకుపోతోంది. రెండుసార్లు ఎంత వైరల్ అయిందో ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. దావోస్‌లో అలీబాబా వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈ ఎఫ్) సంస్థకు 2015లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత అంశాలతోపాటు తన కంపెనీ విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించారు. ఆ వీడియోను మరోసారి డబ్ల్యూఈఎఫ్ ఫేస్బుక్లో పబ్లిష్ చేయగా మూడు నిమిషాల నిడివి ఉన్న ఇది కాస్త ఇప్పటికే దాదాపు 17.4మిలియన్లమందిని ఆకట్టుకుంది. ఇందులో జాక్ మా ఏం చెప్పారంటే.. 'నేను హర్వార్డ్ యూనివర్సిటీకి పదిసార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారు. చైనాలోని మా నగరానికి అప్పుడే కేఎఫ్‌సీ వచ్చింది. అందులో ఇంటర్వ్యూకు 24మంది వెళ్లాం. 23మందిని తీసుకొని ఒకరిని తిరస్కరించారు. ఆ ఒక్కడిని నేనే. నేను పెట్టిన అలీబాబా కంపెనీ విజయానికి కారణం మహిళలే. నా కంపెనీలో 47శాతంమంది మహిళలే ఉన్నారు. నాకు తొలుత ఈ ప్రపంచాన్ని మార్చాలి అనిపించేది. కానీ తర్వాత తెలుసుకున్నాను ముందు మారాల్సింది నేనే అని. అలాగే మారాను. ఈ రోజు నీ దగ్గర కొన్ని మిలియన్ల డాలర్ల డబ్బు ఉండొచ్చు. కానీ, ఆ డబ్బు ఈ సమాజమే ఇచ్చిందనే విషయం మర్చిపోవద్దు' అంటూ ఇలా ఎన్నో విషయాలు పంచుకున్న వీడియో ఇప్పుడు ఆన్లైన్లో తెగ హల్చల్ చేస్తోంది. -
మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్‌గా వస్తారా..
అలీబాబా గ్రూపు హోల్డింగ్ చైర్మన్ జాక్ మాకు ఇండోనేషియా ప్రభుత్వం నుంచి సరికొత్త పిలుపు అందింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ-కామర్స్ పరిశ్రమ అభివృద్ధికి అడ్వైజర్‌గా రావాలని కోరుకుంటూ ఓ వీడియాను ప్రభుత్వం విడుదల చేసింది. యువత ఎక్కువగా ఉన్న ఇండోనేషియా, ప్రపంచ జనాభాలోనే నాలుగో అతిపెద్ద దేశం. ఈ-కామర్స్ పరిశ్రమకు ఇండోనేషియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కావడంతో, గ్లోబల్ పెట్టుబడిదారులను ఈ దేశం ఎక్కువగానే ఆకర్షిస్తోంది. ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధిని మరింత పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం 10 మంది మంత్రులతో ఓ స్ట్రీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీకి అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అడ్వైజరీగా రావాలని కోరినట్టు కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి రూడియన్తారా వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్‌లో ఇండోనేషియా స్థానాన్ని మరింత ప్రముఖంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశ కార్యదర్శి ఈ వీడియోను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఇండోనేషియా ఈ-కామర్స్ స్ట్రీరింగ్ కమిటీకి అడ్వైజర్ గా నిర్వర్తించాలని జాక్ మాను కోరినట్టు అలీబాబా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే జాక్ మా ఈ ఆఫర్‌ను అంగీకరించారా.. అనే దానిపై మాట్లాడటానికి మాత్రం ఆయన తిరస్కరించారు. ఈ ఏడాది మొదట్లో ఆగ్నేయాసియా ఆన్లైన్ రీటైలర్ లజాడా గ్రూప్‌ను సుమారు 1 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసింది. -
'30 ఇంటర్వ్యూల్లో ఫెయిల్'
ప్రయత్నం లేకుండా ఎవరూ ప్రయోజకులు కాలేరు. ప్రయత్నాల్లో పరాజితులైతే కుంగిపోకుండా పదే పదే ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు పైకి రావచ్చని వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన కొంత మంది ఇప్పటికే నిరూపించారు. అలాంటి కోవకు చెందిన వారే ఆలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లూజీ నికోల్సన్ జ్యాక్ మా. ప్రపంచ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా, చైనాలోకెల్లా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన జ్యాక్ మాకు చెందిన ఈ కామర్స్ కంపెనీ ‘ఆలీబాబా’ రోజుకు పదికోట్ల షాపర్స్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఎక్కడా ఉద్యోగం లభించక నానా అగచాట్లు పడిన జ్యాక్ మా ఆస్తి విలువ ఇప్పుడు అక్షరాల 20.4 బిలియన్ డాలర్లంటే ఆశ్చర్యమూ కలగకమానదు. చార్లీ రోజ్ అనే రాయిటర్స్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సక్సెస్ స్టోరీ గురించి వివరించారు. 'కాలేజీ ప్రవేశ పరీక్షలో మూడు సార్లు ఫెయిలయ్యాను. ఇక కాలేజీ వదిలేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. 30 రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. ప్రతీచోట కాదనిపించుకున్నాను. పోలీసు ఉద్యోగానికీ ప్రయత్నించాను. అక్కడా పనికిరావు పొమ్మన్నారు. చివరకు మా నగరంలోనే వెలిసిన కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) రెస్టారెంట్‌కు జాబ్ కోసం దరఖాస్తు చేశాను. అక్కడా జాబ్ కోసం 24 మంది పోటీ పడ్డారు. వారిలో 23 మంది సెలక్టయ్యారు ఒక్క నేను తప్ప' అని జ్యాక్ మా వివరించారు. ఇక అప్పుడు ఆయన తనకెవరూ ఉద్యోగం ఇచ్చేలా లేరనుకొని స్వయంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే 1998లో ఆలీబాబా కంపెనీని ఏర్పాటు చేశారు. అలా కూడా అగచాట్లు తప్పలేదు. తొలి మూడేళ్లు నయాపైసా లాభం రాలేదు. చెల్లింపులకు చేతిలో చిల్లిగవ్వా లేదు. బ్యాంకులు కూడా చేయూతనివ్వలేదు. అక్కడే ఈ చెల్లింపులకు సంబంధించి ఓ కొత్త ఆలోచన మెరుపులా మెరిసింది. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య కరెన్సీ మార్పిడీ చేస్తే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. ఇంతకు మించి మూర్ఖ ఆలోచన మరోటి ఉండదని కూడా ఆయన ఆలోచన విన్నవారు అప్పట్లో తిట్టిపోశారట. ప్రజలు వినియోగించుకున్నంత కాలం అది మూర్ఖ ఆలోచన అయినా ఫర్వాలేదనుకొని ఆ ఆలోచనను ‘ఆలీపే’ పేరిట కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఈ రోజున 80 కోట్ల మంది ఆలీపేను ఉపయోగిస్తున్నారంటే ఆయన విజయం ఎంత ఘనమైనదో అంచనా వేయవచ్చు. -
భారత్ పై అలీబాబా కన్ను..!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో జగజ్జేతగా దూసుకెళ్తున్న చైనా దిగ్గజం అలీబాబా... భారత్ ఆన్లైన్ మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడంతోపాటు టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పనిచేస్తామని అలీబాబా వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ జాక్ మా పేర్కొన్నారు. భారత్‌లో తొలి పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలీబాబా కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో రికార్డు సృష్టించి 25 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. చిన్న వ్యాపారులకు అండదండలు... ‘ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అపార అవకాశాలున్న నవ వ్యాపారం. అంతేకాదు ఇది యువత నైపుణ్యంతో దూసుకెళ్తున్న వ్యాపారం కూడా. కోట్లాది మంది యువశక్తితో తొణికిసలాడుతున్న గొప్ప దేశం భారత్. నేను పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేశా. ఇంటర్నెట్ అనేది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భారత్ రూపురేఖలను కూడా ఇదే ఇంటర్నెట్ సమూలంగా మార్చేయగలదని నేను కచ్చితంగా చెప్పగలను. అందుకే ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నేను కట్టుబడి ఉన్నా. భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తలు(ఎంట్రప్రెన్యూర్స్), టెక్నాలజీ సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేస్తా’ అని జాక్ మా పేర్కొన్నారు. అనేక భారతీయ వ్యాపార సంస్థలు తమ వెబ్సైట్లలో సెల్లర్లుగా నమోదై ఉన్నారని.. భారత్‌కు చెందిన చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాలు, టీ ఇతరత్రా ఉత్పత్తులను 4 లక్షలకు పైచిలుకు చైనా కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మరిన్ని అద్భుత ఉత్పత్తులను చైనాకు విక్రయించే సత్తా భారత్ ఉందని కూడా జాక్ మా అభిప్రాయపడ్డారు. స్నాప్‌డీల్‌లో వాటాపై కన్ను! భారత్ పర్యటనలో ఇక్కడి స్థానిక వ్యాపారులతో జాక్ మా భేటీ కానున్నారు. తద్వారా మరిన్ని భారతీయ ఉత్పత్తులను అలీబాబా ద్వారా విక్రయించేందుకు వీలుకల్పించనున్నారు. అదేవిధంగా దేశీ ఈ-కామర్స్ మార్కెట్లోకి కూడా అడుపెట్టే సన్నాహాల్లో అలీబాబా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఆన్లైన్ పరిశ్రమ జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీ కంపెనీ అయిన స్నాప్‌డీల్‌లో అలీబాబా ఇన్వెస్ట్‌చేసే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. చైనా అపర కుబేరుడు... 50 ఏళ్ల జాక్ మా.. కంపెనీ పబ్లిక్ ఇష్యూ తర్వాత చైనా అపర కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద విలువ 24.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.1,50,000 కోట్లు)గా అంచనా. 1999లో అలీబాబాను చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని అయిన హోంగ్ఝూలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఆయన నెలకొల్పారు. రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అలీబాబా ప్రపంచలోనే అతిపెద్ద ఆన్లైన్, మొబైల్ కామర్స్ కంపెనీగా అవతరించింది. 2013 సంవత్సరంలో కంపెనీ స్థూల లావాదేవీల విలువ(జీఎంవీ) ఆధారంగా దీన్ని నిర్ణయించారు. కాగా, చైనా రిటైల్ మార్కెట్లో ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదికి అలీబాబా గ్రూప్ వెబ్సైట్లకు 30.7 కోట్ల మంది వార్షిక యాక్టివ్ కొనుగోలుదారులు నమోదయ్యారు. నెలవారీ యాక్టివ్ కస్టమర్లు కూడా 21.7 కోట్లకు పెరిగినట్లు ఐడీసీ అంచనా. అలీబాబా పేరు వెనుక... అలీబాబా.. అరేబియన్ జానపద కథల్లో సుప్రసిద్ధమైన ఈ పేరును ఒక చైనా కంపెనీ వాడుకోవడమేంటి? దీని వెనుక పెద్ద కథే ఉంది. పేరు గురించి జాక్ మా ఏమన్నారంటే... ‘అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కాఫీ షాపులో ఉండగా.. ఈ పేరును నా కంపెనీకి పెడితే చాలా బాగుంటుందని భావించా. వెంటనే అక్కడ వెయిట్రెస్‌ను పిలిచి అలీబాబా ఎవరో నీకు తెలుసా అంటే వెంటనే అవునని సమాధానం చెప్పింది. ఏం తెలుసని అడిగా. ‘ఓపెన్ సెసేమ్(అలీబాబా నలభై దొంగలు కథలో నిధి ఉన్న గుహను తెరిచేందుకు వాడే మంత్రం)’ అని చెప్పింది. అప్పుడే అనుకున్నా ఇదే సరైన పేరని. ఆతర్వాత ఆ వీధిలోని మరో 30 మందిని కూడా ఈ పేరు గురించి వాకబు చేశా. ఇందులో జర్మన్లు, భారతీయులు, జపనీస్, చైనీస్ ఇలా అన్ని దేశాలవారూ ఉన్నారు. వాళ్లంతా కూడా తమకు తెలుసనే చెప్పారు. ఇది సులభంగా పలికేందుకు వీలుండటమేకాకుండా.. ప్రపంచమంతటికీ పరిచయం ఉన్న పేరు కాబట్టే మా వెబ్‌సైట్‌కు దీన్ని ఖాయం చేశాను. మా దృష్టిలో అలీబాబా... ఓపెన్ సెసేమ్ అంటే.. చిన్న వ్యాపార సంస్థలకు ఇదో నిధి, గేట్‌వే లాంటిదని అర్థం.’ అని వివరించారు. మోదీపై ప్రశంసల జల్లు... భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై జాక్ మా ప్రశంసలు కురిపించారు. ‘మోదీ ప్రసంగాన్ని నేను విన్నా. చాలా ఉత్తేజభరితంగా, స్ఫూర్తినింపేలా ఉంది. ఒక వ్యాపారవేత్తగా నేను కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. గొప్ప దేశాలైన భారత్, చైనా కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అందుకు ఇదే సరైన సమయం. ఇరు దేశాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు కూడా ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.