బీజింగ్: అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు జాక్ మా తన పదవికి రాజీనామా చేస్తున్నారని సదరు సంస్థ సోమవారం తెలిపింది. అదే విధంగా ముగ్గురు కొత్త సభ్యులను బోర్డులోకి ఆహ్వానించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. జూన్ 25న జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని కొత్త నియామకాలతో బోర్డు సభ్యుల సంఖ్య 13కు చేరుకుంటుందని వెల్లడించింది. (రెండో స్థానంలోకి ఆలీబాబా జాక్ మా)
ఈ క్రమంలో కాడెన్స్ డిజైన్స్ సిస్టమ్స్ సీఈఓ లిప్- బూ టన్, వెసెడా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ యుకో కవామోటో కొత్త సభ్యులుగా చేరనున్నట్లు పేర్కొంది. కవామోటో నియామకం ఖరారైన నేపథ్యంలో బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలిగా ఆమె ప్రత్యేకత సంతరించుకోనున్నారు. కాగా చైనీస్ ఇ- కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం కో ఫౌండర్, టెక్ బిలియనీర్ జాక్ మా గతేడాది తన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన వైదొలగనున్నారు. ఇదిలా ఉండగా... షేర్ల కొనుగోలుకై దాదాపు 4.7 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. కాగా అలీబాబాలో పెద్ద మొత్తంలో వాటాలు దక్కించుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.(జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)
Comments
Please login to add a commentAdd a comment