న్యూఢిల్లీ: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత చైనా కుబేరుడు జాక్ మా స్వదేశంలో అడుగుపెట్టారు. తన సొంత నగరం హాంగ్‌జౌలోతాను స్థాపించిన పాఠశాలను సందర్శించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సోమవారం నివేదించింది. ఈ సందర్బంగా పాఠశాల విద్య, చాట్‌జీపీటీ సాంకేతికత గురించి చర్చించినట్లు పేర్కొంది.
ఒకపుడు ఇంగ్లీష్ టీచర్ కేడా అయిన జాక్ మా హాంకాంగ్‌లో కొద్దిసేపు స్నేహితులతో ముచ్చటించాడని ఆ తరువాత ఆర్ట్ బాసెల్‌ను సందర్శించాడని కూడా నివేదించింది. ఈ వార్తలతో అలీబాబా షేర్లు 4శాతానికి పైగా పెరిగా పుంజుకున్నాయి.
మరోవైపు జాక్‌మా, రాకతో రెండు సంవత్సరాల రెగ్యులేటరీ ఆంక్షలతో కునారిల్లిన దేశంలోని ప్రైవేట్ బిజినెస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల కోవిడ్ సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి నాయకుల ప్రయత్నాలకు తోడు తాజాగా మా ప్రత్యక్షంకావడం ప్రైవేట్ రంగ పునరుజ్జీవనం పట్ల ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేస్తోందని భావిస్తున్నారు. ఇ-కామర్స్ దిగ్గజం సొంత నగరమైన హాంగ్‌జౌలో ఇతర అలీబాబా వ్యవస్థాపకులతో కలిసి 2017లో స్థాపించారు.
అలీబాబా గ్రూప్ స్థాపనతో దేశంలోనే టాప్ బిలియనీర్‌గా అవతరించిన జాక్‌మా, అనూహ్యంగా అక్కడి ప్రభుత్వాన్ని, రెగ్యులేటరీని బహిరంగంగా విమర్శించి 2020లో ఇబ్బందుల్లో పడ్డాడు. జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులతో ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అధికారు. ఈ పరిణామాల నేపథ్యంలోఅలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. దీంతో 2021 చివర్లో చైనాను వీడారు. అయితే అపుడపుడూ జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో కనిపించి వార్తల్లో నిలుస్తూ వచ్చారు.
మరోవైపు జాక్‌మాను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌కు సన్నిహిత మిత్రుడైన లీ ప్రయత్నాల వల్లే మా తిరిగి వచ్చాడా లేదా అనేది స్పష్టత లేదు. అయితే తమ ప్రభుత్వం బీజింగ్ అన్ని సంస్థలను సమానంగా చూస్తుందని ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించ నుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment